Wednesday, 17 January 2018

మనం మరిచిపోయిన మహానుభావుడు !
==========×××××===========

పేరు : ఎల్లాప్రగడ సుబ్బారావు
ఊరు: భీమవరం, ఆంద్రప్రదేశ్
పుట్టిన రోజు: జనవరి 12, 1895
వృత్తి: Biochemist (జీవరసాయన శాస్త్రవేత్త)

ఈయన గూర్చి మనం ఏమి తెలుసుకోవాలి?
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఒక మాములు మధ్యతరగతి కుటుంబం లో జన్మించిన ఓ వైద్య శాస్త్ర అద్భుతం !

Miracle man of medicine అని పిలిపించుకున్నాడు !

నోబెల్ బహుమతి గ్రహీత  GH  Hitchings ఎల్లాప్రగడ గూర్చి మాట్లాడతూ ఇలా అన్నారు " మేము కనిపెట్టిన చాలా న్యూక్లియోటైడ్స్ ఇంతకు ముందే ఎల్లాప్రగడ సుబ్బారావు కనిపెట్టేశారు... దానినే మేము మళ్ళీ కనిపెట్టాము.. సుబ్బారావు తో పనిచేసిన ఆతని సాటి శాస్త్రవేత్తల అసూయ, ద్వేషం కారణంగా సుబ్బారావు చాలా ఆవిష్కరణలు ప్రపంచానికి తెలీదు !!

ఆయన జీవితం
౼౼౼౼౼౼౼౼౼

జనవరి 12, 1895 న భీమవరం లో పుట్టారు. స్కూల్ చదువులు రాజమండ్రి లో పూర్తి చేసుకుని, మద్రాస్ లో ఇంటర్ పూర్తి చేసి మద్రాస్ మెడికల్ కాలేజ్ లో LMS డిగ్రీ సంపాదించారు !

ఎల్లాప్రగడ వారికి ఆయుర్వేదమ్ పైన ఉన్న మక్కువ చేత, ఆయుర్వేదం ని ఆధునిక పద్ధతుల్లో బాగా వాడొచ్చని మద్రాస్ ఆయుర్వేద కాలేజ్ లో టీచర్ గా జాయిన్ అయ్యారు !

ఆయుర్వేదాన్ని సాటి భారతీయులే హేళన చేస్తున్న ఆ రోజుల్లో ఎల్లాప్రగడకి అమెరికా నుండి పిలుపు వచ్చింది ! అమెరికా లో Harvard university లో
PhD కూడా పూర్తిచేసి, ledral company తో కలిసి పనిచేసారు !

ఎల్లాప్రగడ ఆవిష్కరణలు (కొన్ని)
========×××=========

* ఫాలీక్ ఆసిడ్ తయారీ (రక్తహీనతకి మందు)
* మిటోట్రెకసెట్ (కాన్సర్ కి మందు)
* టెట్రా సైక్లిన్ (ప్లేగు, మలేరియా, కలరా etc  కి మందు
* అరియొమైసిన్ (పెన్సిలిన్, స్టెప్ట్రోమైసిన్ కంటే బాగా పనిచేసే antibiotics)
* రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాకి వైద్య సేవలు
*  మనిషి లో శక్తికి మూలం ATP
* Polymyxin ( పశువుల మేత)
* విటమిన్ B9 తయారీ

ఇలా ఎన్నో గొప్పగొప్ప విషయాలు ఆయన కనిపెట్టిన సరే, ఆయనికి ఎలాంటి గుర్తింపు రాలేదు.. నోబెల్ బహుమతి గాని, భారతరత్న గాని లేదు !

ఎందుకంటే ఆయన ఏదో ఆశించి ఇవన్నీ కనిపెట్టలేదు ! ప్రపంచ క్షేమం కోసం కనిపెట్టారు !

కానీ అతని తోటి శాస్త్రవేత్తలు, అక్కడి అమెరికన్లు భారతీయిడికి ఇంత పేరు, ప్రతిష్ట రాకూడదు అని అతని పరిశోధనలని వాళ్ళ పరిశోదనలుగా చెప్పుకున్నారు !

ఆఖరికి మన చరిత్రలో, మన పాఠ్యపుస్తకాలలో కూడా ఆ మహానుభావుడు కి చోటు లేదు !
ఎల్లాప్రగడా గూర్చి doron K Antrim అనే రచయిత ఇలా అంది " "Yet because he lived you may live longer".

ఎల్లాప్రగడ జీవితంలో జరిగిన  ఓ సంఘటన !
=============================

స్థలం: చెన్నై, మైలాపూర్,  కపాలీశ్వర దేవాలయం
సమయం: ఇంచుమించు 1922 సంవత్సరం  ఒక సాయంకాలం

దేవాలయం కోనేటి మెట్లపై ఓ ఐదారుగురు మిత్రులు కబుర్లాడుతున్నారు. వారంలో ఒకసారి అలా కలుసుకోవడం ఆనవాయితీ. ఆ గుంపులో మెడిసిన్ లో డిప్లమా తీసుకొని, చెన్నై ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్న ఒక డాక్టరూ ఉన్నాడు.

ఆయన నెల జీతం అరవై రూపాయలు.
డాక్టర్ : నాకేగనక ఓ పదివేలరూపాయలుంటే నా పరిశోధనలతో అద్భుతాలు చేసి చూపిస్తాను.

ఒకశ్రోత : సర్లేవయ్యా! నీ సోది ఎప్పుడూ ఉండేదేగదా!

డా: నిజం సర్, నామాట నమ్మండి. పెట్టుబడే ఉంటే, "సర్పగంధి "తో నేను దివ్యౌషధాలు చేసి చూపిస్తాను.

రెండవశ్రోత : ఇంకానయం. మృతసంజీవని చేస్తానన్నావుకాదు.

డా :పరిహాసాలు కాదు సర్. సర్పగంధితో చాలా రోగాలను నయం చేయవచ్చు. కావాలసిందంతా పరిశోధనలకు పెట్టుబడి. అంతే.

మొ.శ్రో.: పరిహాసం కాదు డాక్టరుగారూ! నిజంగానే అంటున్నాను. అంతపెట్టుబడి మనకెక్కడ? ఏ అమెరికావాడో పెడితే తప్ప.

ఇంతలో పెద్దవాన. కూర్చున్నవాళ్ళంతా లేచి బిరబిరా తలో మూలా వెళ్ళారు. మన మిత్రబృందం దేవాలయం సన్నిధిలో పూజాసామాగ్రి అమ్మే ఒక దుకాణం చూరుకింద నిల్చున్నారు.అక్కడా ఈ డాక్టరు గారు వదల్లేదు. సర్పగంధి గొప్పదనాన్ని గురించి ఆంగ్లంలో అనర్గళంగా దంచుతూనే ఉన్నాడు. ఇంతలో వెనుకనుంచి ఒకతను,

" నిజంగానే మీరు అలాంటి మందులను తయారు చేయగలరా?" అని ప్రశ్నించాడు ఆంగ్లంలో.

మిత్రులు ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూస్తే, అతనొక అమెరికన్.

డాక్టర్ అత్యుత్సాహంతో " కచ్చితంగా సర్. పెట్టుబడి పెట్టిచూడండి." అన్నాడు.

ఆ అమెరికన్ "సరే. నేను LEDERLE కంపెనీ ప్రతినిధిని. మాకంపెనీ డైరెక్టర్స్ తో మాట్లాడి, ఒకట్రెండు నెలల్లో మీకు తెలియపరుస్తాను." అంటూ డాక్టరుగారి చిరునామా తీసుకున్నాడు.

“ నిజం సర్. ఆరునెలలు గడువియ్యండి చాలు. నేను మాట నిలబెట్టుకోలేకపోతే ఇండియాకు తిప్పి పంపేయండి" అంటూ ఏదేదో పలవరించసాగాడు పాపమాడాక్టర్.

మర్నాటినుంచీ డాక్టర్ ఎదురు చూపులూ, మిత్రుల పరిహాసాలూ. ఆరువారాల తరువాత LEDERLE COMANY  నుంచి డాక్టరుగారికి ఒక ఉత్తరం వచ్చింది.

"మా ప్రతినిధి ద్వారా మీ ఉత్సాహం, ఓషధీజ్ఞానం మాకు తెలిసింది. ప్రజలకోసం కొత్తమందులు కనిపెట్టడమే మా లక్ష్యం. మీరుకనిపెట్టే వాటిల్లో ఏ ఒక్కటి ఫలప్రదమైనా సంతోషిస్తాం. మీరు ఢిల్లీలో మాసంస్థ కార్యాలయానికి వెళ్ళండి. మీప్రయాణ ఏర్పాట్లన్నీ వారు చూసుకుంటారు".
.
ఇదీ ఆ ఉత్తరం సారాంశం. డాక్టరుగారు ఆ ఉత్తరాన్ని ఓ వందసార్లయినా మిత్రులకు చదివి వినిపించుంటారు.
.
 తరువాత ఆయన అమెరికా వెళ్ళడం HETROGEN, TETRACYCLINE, METHOTREXATE(USEFUL IN CANCER TREATMENT) ,POLYMIXIN (Cattle Field )   లాంటి దివ్యౌషధాలు కనుక్కోవడం అంతా గొప్ప చరిత్ర.

ఆ మహానుభావుడే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావు గారు.

జనవరి 12 పూజ్య స్వామీ వివేకానంద జన్మదినం అని అందరికీ తెలుసు. ఆరోజే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావుగారి జన్మదినం కూడా.

LEDERLE COMPANY వారు తమ ప్రాంగణంలో సుబ్బారావు గారి విగ్రహం ప్రతిష్ఠించి ఆయనపై తమ గౌరవాన్ని చాటుకున్నారు.

భాస్కరుడు, చరఖులనుంచీ, శ్రీనివాసరామానుజం, యల్లాప్రగ్గడ సుబ్బారావు గారిదాకా వేలసంవత్సరాలుగా మన భారతీయ మేధ విశ్వవ్యాప్తం అవుతూనే ఉంది. మన యువతకే అది పనికిరానిదయింది.

నా రోజులో కొన్నీ నిమిషాలు ఆ మహానుభావుడి కోసం అందరికి తెలియజేయడానికి వెచ్చజించడమ్ నాకు ఈ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చింది!!

https://en.m.wikipedia.org/wiki/Yellapragada_Subbarow

http://www.ysubbarow.info/

కోడి రామ్మూర్తి నాయుడు



*కోడి రామ్మూర్తి నాయుడు గారు*


*'ఇండియన్ హెర్కులస్' గా బిరుదు గడించి, తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారి జయంతి జనవరి 16. క్లుప్తంగా ఆయన గురించి.....*

             


*ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. కోడి రామ్మూర్తి నాయుడు జనవరి 16, 1882 న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.*



*కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు.*



*21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు.*



*రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు.*



*కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. రొమ్ముపై పెద్ద ఏనుగును ఎక్కించు కునేవాడు.  5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు.*


*తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.*



*పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి 'మల్లమార్తాండ', 'మల్లరాజ తిలక్' బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.*



*హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి 'జగదేకవీర' బిరుదమిచ్చారు.*


*అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు.*



*రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది.*



*ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.*



      *పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.*



     *లండన్ లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు.*



*ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.*



*స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు.*



*అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ' సరే ' అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.*



*కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది.*



*ఆంధ్రరాష్ట్రానికి చెందిన వస్తాదు మరియు మల్లయోధులు ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు . ఈయన శాకాహారులు.*


*భారతీయ యోగశాస్త్రం. ప్రాణాయామం, జల, వాయుస్థంభన విద్యలను శారీరక బలప్రదర్శనలకు జోడించడం వల్లనే ఆయన జగదేక మల్లుడయ్యారు.*



*ఆయన శక్తి, కీర్తి కొందరికి అసూయ కలిగించడంతో కొన్ని హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి.*



*లండన్లో ఏనుగు ఫీట్ చేస్తున్నప్పుడు ఒక ద్రోహి బలహీనమైన చెక్కను ఛాతిపై పెట్టాడు. ఏనుగు ఎక్కగానే, చెక్క విరిగి ఆయన పక్కటెముకల్లోకి దిగబడింది. శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు ఆయన లండన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.*



*మరోసారి రంగూన్లో హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులను చితకబాది, సురక్షితంగా బయటపడ్డారు.*


*మాల్కానగరంలో భారతంలో భీముడి మాదిరిగా విషప్రయోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఒక విందులో విషం కలిపిన పాలు తాగారు. అప్పుడు ఆయన్ని కాపాడింది యోగ విద్యే.*



*విషాన్ని జీర్ణించుకొని మూత్రం ద్వారా విసర్జించారు.*


*కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది.*



*సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.*



*1942 జనవరి భోగి పండుగ.. ఆ రోజు రాత్రి ఆయన వెంట ఉన్నది ఒకే శిష్యుడు.. ఆయన విజయనగరానికి చెందిన కాళ్ల పెదప్పన్న. ఆ రాత్రి కొంచెంసేపు తలపట్టమని శిష్యునికి చెప్పి, తాను లేచేవరకు లేపవద్దని చెప్పి పంపించారు రామ్మూర్తినాయుడు.*


*మరునాడు సంక్రాంతి.. కాని ఆయన నిద్ర లేవలేదు. అదే ఆయన శాశ్వతనిద్ర. సంక్రాంతితోనే జీవితానికి సమాప్తి. కాని ప్రపంచాన్ని జయించిన కీర్తి భారతదేశానికి మిగిల్చిన అమరజీవితమది.*



***********

Tuesday, 16 January 2018

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు -  వాటి గురించి విశేషాలు .


     మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను .


 *  బృహద్యంత్ర సర్వస్వము  -

         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు

                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.

                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు. 

          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.

 *  ఆగతత్వలహరీ  -

         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .

 *  అవతత్వ ప్రకరణం  -

          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు .

 *  అండ కౌస్తభం  -

           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర
జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.

 *  అంశు బోధిని -

           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.

 *  ఆకాశ తంత్రం  -

            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.

 *  ఋక్ హృదయ తంత్రం  -

            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.

 *   ఔషధీ కల్పం  -

            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.

 *  కరక ప్రకరణము  -

             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.

 *   కర్మాబ్దిసారము  -

             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.

 *   కౌముదీ  -

               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.

 *   ఖేట సర్వస్వము  -

              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.

 *  ధాతు సర్వస్వము  -

             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి
లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు .

 *  ధూమ ప్రకరణం  -

           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.

 *  నామార్థ కల్పం  -

           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.

 *  ప్రపంచ లహరీ  -

             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.

 *  బ్రహ్మాండ సారం  -

               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.

 *  మేఘోత్పత్తి ప్రకరణం  -

              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.

 *  లోక సంగ్రహము  -

              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.

 *  లోహ తంత్రము  -

              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.

 *  వాయుతత్వ ప్రకరణము  -

              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు.

 *  వైశ్వనర తంత్రము -

              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.

 *  శక్తి తంత్రము  -

            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా .

 *  శుద్ద విద్యాకల్పం  -

         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.

 *  సమరాంగణ సూత్రధారము  -

         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.


           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి.


                కాళహస్తి వెంకటేశ్వరరావు

                  అనువంశిక ఆయుర్వేదం

                         9885030034

Sunday, 14 January 2018

ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి

“ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి?

ఒక మగవాని వంశం కేవలం వారి తండ్రిదే, తల్లిది కాదు ఎందుకని?
ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchial society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది. మన ఋషులు ఎంతో ఆలోచించి ఈ విషయం నిర్ధారించి నిర్దేశించారు. నేటి శాస్త్ర సాంకేతిక విప్లవం ద్వారా కొన్ని మనం నిరూపించగలుగుతున్నాము నేడు. దీనిలో శాస్త్రీయత ఒకసారి పరిశీలిద్దాము.

ప్రతీ జీవిలోనూ DNA లో ఎన్నో chromosomes ఉంటాయి. కానీ మానవులలో ఉన్న 23 జతల chromosomes లో  సదరు స్త్రీకి X chromosomes అలాగే పురుషునికి Y chromosomes వుండడం సహజం. XX chromosome ఉంటె అమ్మాయి లింగ నిర్ధారణ అని, XY ఉంటె పురుష లింగ నిర్ధారణ చేస్తారు chromosome ఆధారంగా. పిండం ప్రాణం పోసుకుంటూ ఉండగా ఈ Y chromosome ఆడ లక్షణాలను అడగదోక్కి పురుష లక్షణాలను పెంపొందిస్తుంది. ఈ Y chromosome అన్నది తల్లికి ఉండదు అందుకు కేవలం తండ్రి వలన మాత్రమె సంక్రమిస్తుంది ఆ పుత్రునికి. అదే అమ్మాయికి XX chromosome pair తల్లి నుండి తండ్రి నుండి సిద్ధిస్తాయి. ఈ XX chromosome కలిసినప్పుడు ఇద్దరి లక్షణాలను పుణికిపుచ్చుకుంటాయి. కానీ XY కలిగినప్పుడు Y అన్నది కేవలం తండ్రి నుండి మాత్రమె అందునా పెద్దగా మార్పు లేకుండా సంక్రమిస్తుంది.

అందుకే మన వేదం లో చెప్పారు “ ఆత్మావై పుత్ర నామాసి” అని. అంటే తండ్రే అదే రూపంలో కొడుకు అవుతున్నాడు అని. అదే లక్షణాలు మనవడి దగ్గరకు, అలా వారి వంశం అంతా కేవలం వారి తండ్రి, తాత, ముత్తాతల దగ్గరనుండి వస్తుంది. అందుకే మగవారిని వంశోద్ధారకుడు అనేది.  మన గోత్ర, ప్రవర పద్ధతి ఇదే విషయాన్ని చాలా అందంగా శాస్త్రాన్ని తనలో ఇముడ్చుకుంది. ప్రవరలో మన వంశంలో ఉన్న ముఖ్య ప్రముఖులైన మహర్షుల గురించి ఉంటుంది. ఉదాహరణకు
భార్గవస  గోత్రానికి ప్రవర భ్రుగు, చ్యవన, ఆప్లువాన, ఔరవ, జామదగ్ని  పంచార్షయము అని చెబుతాము. అంటే భ్రుగుమహర్షి నుండి ఆ lineage లో జమదగ్ని వరకు ఉన్న మహర్షుల సంతానం ఆ గోత్రీకులది అని తెలుస్తోంది. అంటే ఈ గోత్రీకులకు సంబంధించిన Y chromosome భ్రుగు మహర్షి వద్దనుండి వస్తున్నది అన్న అర్ధము. అదే ఆడవారికి రెండు chromosomes ఉండడం వల్ల వారి వంశం పెళ్లి చేసుకున్నాక భర్త వంశం అవుతోంది.

కొన్ని లక్షల, వేల సంవత్సరాల నుండి ఇలా వస్తున్న ఈ chromosomes ఎన్నో మార్పులకు లోనయ్యాయి. Y chromosome పరిమాణం కూడా X chromosome కి మూడవ వంతు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకే పరిమాణంలో ఉన్న ఇది రాను రాను చిన్నదయిందని శాస్త్రజ్ఞుల వాదన. XX chromosomes లో ఒక x కి  ఏమైనా లోపాలుంటే మరొక దానినుండి అది తెచ్చుకుంటుంది. దీన్ని క్రాస్ఓవర్ అంటారు. అదే XY కి ఈ అవకాశం లేదు ఎందుకంటె నిర్మాణ పరంగా ఇవి పూర్తిగా విభిన్నమైనవి. ఇవి మరింత క్షీణించకుండా ఉండాలంటే ఒకే గోత్రం/ప్రవర లో ఉన్న వారి మధ్య వివాహాలు జరపకూడదు అని చెప్పారు మన మహర్షులు.. అంతేకాక ఈ XX లో మరి XY లో X లలో ఉన్న ఏమైనా జన్యుపరమైన లోపాలు కానీ మరింత పెచ్చరిల్లే అవకాశం ఉండి, వీటిని పూర్తిగా నిషేధించారు. ఇలా దగ్గర దగ్గరలో ఉన్న XY XX లు కలుస్తూ పోతే మొత్తానికి ఆ వంశంలో y chromosome కనుమరుగయ్యే అవకాశం కూడా హెచ్చు.  మన మహర్షులు ఎంతో దూరదృష్టి ఉన్నందున వారు ఈ సగోత్రీకుల వివాహం వద్దన్న నియమం పెట్టారు. అది కూడా ఈ జనరేషన్ నుండి ఆరు తరాలు పూర్వం వరకు అలా కలిసి ఉండకూడదు అని. దానివల్ల ఆరోగ్యవంతమైన సంతానం, మరింత తెలివయిన వారు పుడతారు అని వారి విశ్లేషణ. నేడు మనకు సైన్సు వారు చెప్పిన విషయాన్ని ద్రువీకరిస్తోంది.

మన వేదవాంగ్మయం చెప్పిన విషయాలు నేటి శాస్త్రీయ విజ్ఞానం అందుకోవాలంటే మరి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు పట్టవచ్చు, అప్పుడు నిజమే ఈ విషయం కేవలం సనాతన ధర్మం చెప్పిందని అప్పటికి అనిపిస్తుంది. మనకు కావలసినది నమ్మకం. నేడు మనం నిరూపించగలిగే స్థాయిలో, పరిపక్వతలో లేము మనం అంత మాత్రాన పెద్దలు చెప్పిన శాసనాలను ధిక్కరించి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు?

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవేంకటేశ్వరార్పణమస్తు !!

అరుంధతి నక్షత్రం

అరుంధతి నక్షత్రం
💮💮💮💮💮💮💮
అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.

అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతి
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం

        అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది - ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.
అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు.

             ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి

అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా

- అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలమనే అయిదు బాణాలను ఇచ్చాడు.
         మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్యాను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా,ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, పరిస్థితిని చక్కదిద్దాడు.రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపం ఇచ్చాడు.

            తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ట మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాలిందిగా కోరాడు.

          వశిష్టుడు ఆమెకు శివా మంత్రానుష్టానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు.
          'ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాద'నే వరాన్ని ఆమె కోరుకుంది. శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు. అపుడు సంధ్య 'నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ, అంతేకాక, తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాల'ని కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ, 'మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండంనుంచి నీవు జన్మిస్తావు.
నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడ'ని చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండంనుంచి తిరిగి జన్మించింది.
సంస్కృత భాషలో 'అరుం' అంటే అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. 'ధతీ' అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె 'అరుంధతి' అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి, వశిష్టునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోకపూజ్యురాలైంది.

         అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతా రు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరుల కు చెబుతారు. మాఘ మాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు.
రాత్రి పూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది.

           అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి.? గాలిపటం ఆకారంలో 7 నక్షత్రాలు ఉంటాయి. అవే సప్తషులు. తోక భాగంలో క్రిందినుండి రెండవది వశిష్ఠుడు. వశిష్ఠుని ప్రక్కనే అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.

             అరుంధతి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం అరుంధతి (అయోమయ నివృత్తి) చూడండి.
అరుంధతి భారత పురాణాలలో వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత. భారతీయుల వివాహములో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్యవిధి.

        అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబు తారు. మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు.

         రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.

        అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. కచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది

ఆచారాలు -అంతరార్థం

*_ॐ_* *   ఆచారాలు -అంతరార్థం       *_ॐ_*

*ఆల‌యాల్లో గంట‌లు ఉండ‌డం…*

ఆల‌యాల్లో ఉండే గంట‌ను ఏడు సార్లు కొడితే మ‌న శ‌రీరంలో ఉన్న ఏడు చ‌క్రాలు ఉత్తేజం అవుతాయ‌ట‌. అంతేకాదు మెద‌డు కుడి, ఎడ‌మ భాగాలు రెండూ కొంత సేపు ఏక‌మ‌వుతాయ‌ట‌. దీంతోమ‌న మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంద‌ట‌. ఏకాగ్ర‌త పెరుగుతుంద‌ట‌. గంట‌ను మోగించ‌డం వ‌ల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశ‌న‌మ‌వుతాయ‌ట‌.

🍊 *ఆడ‌వారు గాజులు ధరించ‌డం వెనుక‌…*

ఆ గాజుల వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ట‌. గాజులు ఎల్ల‌ప్పుడూ చేతి న‌రాల‌కు తాకుతూ ఉండ‌డం వ‌ల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంద‌ట‌.

🍄 *పిల్ల‌ల‌కు చెవులు కుట్టించ‌డం…*

చిన్నారుల‌కు చెవులు కుట్టించ‌డం స‌హ‌జ‌మే. ప్ర‌ధానంగా ఆడ‌పిల్ల‌ల‌కు, ఆ మాట‌కొస్తే కొంత మంది మ‌గ పిల్ల‌ల‌కు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి దాంతో వారికి వ‌చ్చే అనారోగ్యాలు పోతాయ‌ట‌. ప్ర‌ధానంగా ఆస్త‌మా వంటి వ్యాధులు రావ‌ట‌.

🍄 *రావి చెట్టును పూజించ‌డం…*

హిందువుల్లో అధిక శాతం మంది రావి చెట్టుకు పూజ‌లు చేస్తారు. ఈ చెట్ల‌యితే ఎక్కువ‌గా దేవాల‌యాల్లోనే ఉంటాయి. అయితే సాధార‌ణంగా చెట్ల‌న్నీ ప‌గ‌టి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తే ఈ చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజ‌న్‌ను విడుద‌ల చేస్తుంద‌ట‌. దీంతోనే రావి చెట్టును పూజిస్తారు.

🍅 *కాలి వేళ్ల‌కు మెట్టెలు ధ‌రించ‌డం…*

హిందూ సాంప్ర‌దాయంలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు కాలికి మెట్టెల‌ను ధ‌రిస్తారు. ఇలా ధ‌రించ‌డం వ‌ల్ల ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి వారి గుండె నుంచి గ‌ర్భాశ‌యానికి ర‌క్త ప్ర‌స‌ర‌ణ బాగా జ‌రుగుతుంద‌ట‌. అయితే వెండి మెట్టెలు ధ‌రిస్తే ప్ర‌కృతిలో ఉన్న పాజిటివ్ ఎన‌ర్జీ వారి శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంద‌ట‌.

🌹 *నిద్రించేట‌ప్పుడు త‌ల‌ను ఉత్త‌రానికి పెట్ట‌క‌పోవ‌డం.*

భూమికి అయ‌స్కాంత క్షేత్రం ఉన్న‌ట్టుగానే మ‌న శ‌రీరానికి కూడా అయ‌స్కాంత క్షేత్రం ఉంటుంద‌ట‌. ఒక వేళ మ‌నం ఉత్త‌రం దిశ‌గా త‌ల‌ను పెట్టి ప‌డుకుంటే మ‌న శ‌రీరంలో ఉన్న ఐర‌న్ మెద‌డుకు ప్ర‌వ‌హించి బీపీ, గుండె సంబంధ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. త‌ల‌నొప్పి, అల్జీమ‌ర్స్‌, పార్కిన్‌స‌న్స్ డిసీజ్ వంటి వ్యాధులు వ‌స్తాయ‌ట‌. కాబ‌ట్టి త‌ల‌ను ఉత్త‌రం దిశ‌కు పెట్టి నిద్రించ‌కూడ‌ద‌ట‌.

🌸 *నుదుట‌న కుంకుమ బొట్టు ధ‌రించ‌డం…*

నుదుట‌న కుంకుమ బొట్టును ధ‌రిస్తే అక్క‌డి న‌రాలు ఉత్తేజిత‌మై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయ‌ట‌. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయ‌ట‌.

💐 *ఎదుటి వారికి రెండు చేతులతో న‌మ‌స్క‌రించ‌డం...*

ఎదురుగా ఉన్న వారికి రెండు చేతుల‌తో న‌మ‌స్క‌రిస్తే మ‌నం వారిని ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటామ‌ట‌. ఎలాగంటే రెండు చేతుల‌ను జోడించిన‌ప్పుడు చేతి వేళ్ల‌న్నీ క‌లిసిపోయి ఆక్యుప్రెష‌ర్ వైద్యం జ‌రిగి మ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచుతాయ‌ట‌. దీంతోపాటు మెద‌డు ప‌నితీరు కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌.

🌺 *నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం…*

నేల‌పై కూర్చుని భోజ‌నం చేయ‌డం వ‌ల్ల ప‌ద్మాస‌నం భంగిమ వ‌స్తుంది. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రిగి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయ‌ట‌.

కార‌మైన ఆహారం ముందు, స్వీట్లు త‌రువాత తిన‌డం…

భోజ‌నం చేసిన‌ప్పుడు ముందుగా కారంగా ఉండే ఆహారం తిన‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో జీర్ణ‌క్రియ‌కు అవ‌స‌ర‌మైన ఆమ్లాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయ‌ట‌. దీంతో జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా జ‌రుగుతుంద‌ట‌. అయితే భోజ‌నం మొదట్లోనే స్వీట్లు తింటే అది మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణంచేయ‌నీయ‌ద‌ట‌.

🍀 *న‌దుల్లో నాణేలు వేయ‌డం…*

ఒక‌ప్పుడు మ‌న ద‌గ్గ‌ర రాగితో చేసిన నాణేలు చ‌లామ‌ణీలో ఉండేవి. ఈ కార‌ణంగా ఆ నాణేల‌ను న‌దుల్లో వేస్తే ఆ రాగి అంతా ఆ నీటిని శుద్ధి చేసేద‌ట‌. దీంతో ఆ నీటిని తాగేవారికి ఎన్నో అనారోగ్యాలు దూర‌మ‌య్యేవ‌ట‌.

🌻 *ఉప‌వాసం ఉండ‌డం…*

హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉప‌వాసం ఉంటారు క‌దా.ఆయుర్వేద ప్ర‌కారం అలా ఉప‌వాసం ఉండ‌డం చాలా మంచిది. ఎందుకంటే ఉప‌వాస స‌మ‌యంలో మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థకు పూర్తిగా విశ్రాంతి ల‌భించి శ‌రీరంలో ఉన్న ప‌లు విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్ట‌ బ‌డ‌తాయ‌ట‌. దీంతోపాటు దేహం త‌న‌కు తాను మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంద‌ట‌. ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్‌, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్లు రావ‌ట‌!!!

🌿🍂🌱🌱🌾☘🌴🍁🌿🍂🍃🌱🌾☘🌴🍁🌹🎄🌿🍂🍃🌱🌾🌱

వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

*స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03*

*స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20*

*స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)*

*స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74*

*స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2*

*స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1*

*పరిపాలన విషయంలో స్త్రీలు*
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - *అధర్వణవేదం 7.38.4*

దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి-  *ఋగ్వేదం 10.85.46*

ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది-
*ఋగ్వేదం 3.31.1*

కుటుంబం
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- *అధర్వణవేదం 14.1.20*

స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- *అధర్వణవేదం 11.1.17*
(స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- *అధర్వణవేదం 7.46.3*

ఉద్యోగాల్లో
*స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2*

*స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి-యజుర్వేదం 16.44*(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.

స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా!
(శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి-
*ఋగ్వేదం 10.85.26*

విద్యా విషయాల్లో
ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక!  మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను-

*ఋగ్వేదం 10-191-3*

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్ప బడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినట్టుగా లేదు.

*వివాహం -విద్యాభ్యాసం*
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - *అధర్వణవేదం 14-1-64*
(ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).