Wednesday, 7 February 2018

రవీంద్రనాధ్ కౌశిక్

23ఏళ్ళ ఒక బ్రాహ్మణుడు పూర్తిగా ముస్లీం గా మారాడు..
రవీంద్రనాధ్ కౌశిక్ " నబీ అహ్మద్ షకీర్ " అయ్యాడు..

దేనికోసం? దేశంకోసం..

ఆమహనీయుడు "బ్లాక్‌టైగర్"  వీరోచిత, విషాదాంతగాధతెలుసుకొందాం, నివాళులర్పిద్దాం..
....................

స్వాతంత్ర్య పోరాట సమయంలో, దేశం కోసం ప్రాణాల్ని అలవోకగా వదిలేసిన ఎంతో మంది వీరుల్ని మనం ఎప్పుడో ఒకప్పుడు తలుచుకుంటూ ఉంటాం. కానీ స్వతంత్ర్యానంతర భారతంలో సైతం, తన ప్రాణం కంటే దేశమే ఎక్కువ అని భావించి, మెల్లమెల్లగా ప్రాణాన్ని శత్రువులు తోడేస్తున్నా, క్రూరమైన చిత్రహింసలు నరకాన్ని చూపిస్తున్నా, స్వదేశ రహస్యాల గుట్టు విప్పకుండా, దేశం కోసం వీరమరణం పొందిన ఆ దేశభక్తుడి గురించి మనలో చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం.

రవీంద్రనాథ్ కౌశిక్. 1952, జూలై 26న రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ కౌశిక్ కు నాటకాలంటే ఇష్టం. దీంతో గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేలోపే, నటనలో అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా దేశభక్తి ఉన్న కథాంశాలను ఇతివృత్తంగా తీసుకుని రక్తి కట్టించడంలో కౌశిక్ కు మరెవరూ సాటిరాలేకపోయారు. అలా ఒక నాటకంలో చైనాకు రహస్యాలు చెప్పడానికి నిరాకరిస్తున్న భారతీయ ఏజెంట్ గా కౌశిక్ వేసిన పాత్ర, అది చూస్తున్న భారతీయ రహస్య నిఘా విభాగం (రా) అధికారుల్ని కట్టిపడేసింది. ఇతనికి ట్రైనింగ్ ఇస్తే, దేశంలో మునుపెన్నడూ లేని ఒక సీక్రెట్ ఏజెంట్ ను తయారుచేయగలమని వారికి అర్ధమైంది.

అప్పటికి 23 ఏళ్ల కుర్రాడు కౌశిక్. అతన్ని ఒప్పించగలమా లేదా అన్నది వారికి సందేహంగానే ఉంది. అయితే, ‘రా’ అధికారులు అడిగీ అడగ్గానే కౌశిక్ ఎగిరి గంతేశాడు. దేశం కోసం తన ప్రాణాలనైనా తీసేసుకోమంటూ కౌశిక్ ఆనందంగా ఒప్పుకున్నాడు. అతన్ని ఢిల్లీ తీసుకువెళ్లి, రెండేళ్ల పాటు అత్యంత తీవ్రమైన, కష్టమైన ట్రైనింగ్ ఇచ్చారు అధికారులు. శారీరకంగా, మానసికంగా అతన్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దింది రా. ఇక ఆ తర్వాత ఇస్లాం మత సంప్రదాయం, మూలాలు, ఖురాన్ గ్రంథం, పాకిస్థాన్ యాసలో ఉర్దూ, హిందీ భాషలు మాట్లాడటం లాంటివన్నీ కౌశిక్ వంటపట్టించుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొరక్కూడదని సున్తీ సైతం చేయించుకున్నాడు. ఒక ముస్లింగా తాను ఎలా మసులుకోవాలన్నదాంట్లో, రా అధికారులే ఆశ్చర్యపోయేంతగా తనను తాను మార్చేసుకున్నాడు 23 ఏళ్ల కౌశిక్.

ఇక 1975లో దేశాన్ని విడిచిపెట్టి, సౌదీ అరేబియాకు వెళ్లి, అక్కడి నుంచి దుబాయ్ కు, అటు నుంచి పాకిస్థాన్ కు ప్రణాళిక ప్రకారం చేరుకున్నాడు కౌశిక్. “నబీ అహ్మద్ షకీర్”గా పేరు మార్చుకుని అక్కడే రెండేళ్ల పాటు లా కాలేజీలో చదివి, గ్రాడ్యుయేట్ పట్టా పొందాడు. పట్టా చేతికి వచ్చిన తర్వాత, పాకిస్థాన్ ఆర్మీలో చిన్న స్థాయిలో ఉద్యోగంలో చేరాడు. తన తెలివితో, చురుకైన వ్యక్తిత్వంతో అంచెలంచెలుగా ఎదిగి, పాకిస్థాన్ ఆర్మీ మేజర్ స్థాయికి చేరిపోయాడు. స్థానికంగా పాకిస్థాన్ లో మమేకమవ్వడానికి, అమానత్ అనే పాకిస్థాన్ అమ్మాయిని పెళ్లాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చాడు. పూర్తిగా పాకిస్థాన్ సైన్యంలో కలిసిపోయి, తనపై ఎవరికీ ఎలాంటి అనుమానం లేకుండా పాక్ సీక్రెట్స్ అన్నీ భారత ప్రభుత్వానికి నిరంతరం చేరవేస్తూ వచ్చాడు.

1979 నుంచి 1983 మధ్యలో పాకిస్థాన్ ప్లాన్ చేసిన ఎన్నో అత్యున్నత స్థాయి రహస్యాల్ని ఛేదించి, వాటిని భారత రక్షణ శాఖకు సమర్ధవంతంగా అందించగలిగాడు. భారత ఇంటెలిజన్స్ వర్గాల్లో, కౌశిక్ ను ‘బ్లాక్ టైగర్’ అని పిలుచుకునేవారు. స్వయంగా ఇందిరాగాంథీయే కౌశిక్ కు ఆ పేరు పెట్టారని అంటారు. కౌశిక్ అందించిన సమాచారం కారణంగా, యుద్ధతంత్రాల్లో భారతదేశం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉండి పాకిస్థాన్ ప్లాన్స్ కు చెక్ పెట్టేది. చాలా సార్లు పాకిస్థాన్ బోర్డర్ల వెంట యుద్ధానికి తెగబడి, ఆక్రమించాలని పాక్ ప్లాన్స్ వేసింది. కానీ వాటన్నింటినీ ముందుగానే భారత ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొని, ఊహించని ప్రమాదాల్ని అడ్డుకోగలిగింది. అంతా బ్లాక్ టైగర్ చలవే..!

ఇలా శత్రువు సైన్యంలోనే చేరి, ధైర్యంగా భారతదేశంకోసం పనిచేస్తున్న బ్లాక్ టైగర్, ఇన్యాత్ మాసీ అనే భారత అధికారి తెలివితక్కువతనం కారణంగా పట్టుబడ్డాడు. కౌశిక్ కు భారతదేశం తరపున కొన్ని విషయాల్ని చేరవేయాలని ఇన్యాత్ మాసీ అనే ఒక ఎంట్రీ లెవల్ ఏజంట్ ను ఇండియా పాకిస్థాన్ బోర్డర్ కు పంపించారు భారత అధికారులు. చాలా రహస్యంగా పని ముగించుకుని రావాల్సిన ఇన్యాత్, బోర్డర్లో పాక్ సైన్యానికి చిక్కాడు. అప్పటికైనా, కాస్త తెలివిగా వ్యవహరించి ఉంటే బాగానే ఉండేది. కానీ ఆర్మీ కాస్త బెదిరించగానే, బ్లాక్ టైగర్ గురించిన రహస్యాలన్నింటినీ ఇన్యాత్ కక్కేశాడు. అక్కడితో కౌశిక్ సాహసాలకు బ్రేక్ పడింది. అతని జీవితంలో నరకానికి తెర లేచింది. విషయం తెలియగానే కౌశిక్ ను అదుపులోకి తీసుకుంది పాక్ ప్రభుత్వం.

ఇన్నాళ్లుగా, తమ ప్లాన్స్ కు ఎక్కడ గండిపడుతుందో అర్ధం కాక వెర్రి కోపంతో ఉన్న పాక్ ప్రభుత్వం, అధికారులు, తమ కోపాన్నంతా బ్లాక్ టైగర్ పై తీర్చుకున్నారు. రెండేళ్ల పాటు, ప్రతిక్షణం నరకాన్ని చూపించారు. ఏ మనిషి కూడా బ్రతికుండగా తట్టుకోలేని టార్చర్ ను కౌశిక్ పై ప్రయోగించింది. అన్నింటినీ దేశం కోసం పంటిబిగువున బిగబట్టి, భరించాడే తప్ప, ఏనాడూ దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి నోరు విప్పలేదు.

కౌశిక్ ను టార్చర్ చేసి, భారత ప్రభుత్వాన్ని తప్పు ఒప్పుకునేలా చేసి, ప్రపంచదేశాల ముందు దోషిగా నిలబెట్టాలనుకుంది పాక్. ఆ కారణంగానే భారత ప్రభుత్వం కౌశిక్ ను కాపాడటానికి ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఒకవేళ కౌశిక్ మా వాడే అని ఒప్పుకుంటే, అతన్ని కాపాడవచ్చు కానీ, ప్రపంచదేశాలన్నీ వేలెత్తి చూపడమే కాక, కొత్త నిబంధనల్ని దేశంపై విధిస్తాయి. అది దేశ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలిపోతుంది. దీంతో వేరే దారిలేని ప్రభుత్వం, కౌశిక్ మా దేశం వాడు కాదు అని తేల్చి చెప్పేసింది.

కౌశిక్ ను బంధించి, సియాల్ కోట్ జైలులో ఉంచి తమ దారుణ శిక్షలకు తెరలేపారు. తాను భారతదేశం వాడినే అని ఒప్పుకోవాలని, అతనికి తెలిసిన భారతదేశ మిలిటరీ సీక్రెట్స్ అన్నీ తమకు చెప్పాలని పాక్ అధికారులు ఎన్ని సార్లు అడిగినా కౌశిక్ నోరు విప్పలేదు. గోళ్ల మధ్యలో బ్లేడు పెట్టి, అతని గోళ్లు పెకలించారు. ఒంటి నుంచి రక్తం కారేలా లాఠీలతో, ముళ్ల గదలతో చితకబాదారు. కొరడాతో వీపు చర్మం చీరిపోయేలా కొట్టారు. ఒళ్లంతా పుండ్లు పడి రక్తం కారుతుంటే, వాటిపై కారాన్ని అద్దేవారు. పురుగులు కలిపిన అన్నాన్ని బలవంతంగా తినిపించేవారు. రోజుల తరబడి తిండి పెట్టకుండా, అతని మలమూత్రాల్ని అతనే తినేలా చేశారు. చెప్పనలవి కాని, థర్డ్ డిగ్రీ శిక్షలు సైతం చిన్నబోయే ఎన్నో శిక్షల్ని అతి క్రూరాతిక్రూరంగా, బ్లాక్ టైగర్ పై ప్రయోగించారు. కానీ వాళ్లు ఎంత చేసినా, ఆ భారత పులి నోరు విప్పలేదు. అతని నిబ్బరాన్ని చూసి, పాక్ అధికారులే ఆశ్చర్యపోయారంటేనే అర్ధం చేసుకోవచ్చు టైగర్ అన్న పేరు కౌశిక్ కు ఎంత కరెక్ట్ గా సరిపోతుందో..!

ఎక్కడ భారత ప్రభుత్వం రహస్యంగా అతన్ని తప్పించుకుని తీసుకెళ్లిపోతుందోనని, రోజుకో జైలు మార్చేవారు. సియాల్ కోట్ నుంచి కోట్ లఖ్ పత్, అక్కడి నుంచి మియాన్ వాలీ, అక్కడి నుంచి ముల్తాన్ జైళ్లకు కౌశిక్ ను మారుస్తూ ఉండేవారు. అతన్ని టార్చర్ చేసీ చూసీ, ఇక చెప్పేలా లేడని, 1985లో కౌశిక్ కు ఉరిశిక్ష విధించింది. ఉరి పడినా కౌశిక్ కు ఈ నరకం నుంచి విముక్తి లభించేదేమో..అతనికి ఆ అదృష్టాన్ని కూడా దక్కనివ్వకుండా ఉరిశిక్షను రద్దు చేసి, యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. వారు అతనిపై చేసిన దారుణాలకు, అకృత్యాలకు, కౌశిక్ కు టీబీ, ఆస్తమా వచ్చింది. మందులు వాడితే బతికేస్తాడన్న భయంతో కనీసం టాబ్లెట్స్ వేయకుండా, డాక్టర్ కు చూపించకుండా నిర్లక్ష్యం వహించింది పాక్ ప్రభుత్వం. దీంతో జబ్బు బాగా ముదిరిపోయి, 1999లో తన పుట్టిన తేదీ అయిన జూలై 26నే కన్నుమూశాడు బ్లాక్ టైగర్.

అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ, భారతదేశపు గూఢాచారుల్లో అగ్రస్థానంలో ఉంటాడు రవీంద్ర కౌశిక్. అతని లాంటి మరొక గూఢచారి దొరుకుతాడా అంటే అనుమానమే. ఒకవేళ భారత రక్షణ శాఖ పంపిన ఇన్యాత్ మాసీ కనుక కౌశిక్ గురించి చెప్పకుండా ఉండి ఉంటే, నేటికీ పాకిస్థాన్ ఆర్మీలో మన టైగర్ మారువేషంలో తిరుగుతూనే ఉండేది. శత్రుదేశ రహస్యాలు సేకరిస్తూనే ఉండేది. కౌశిక్ మరణించి ఉండవచ్చు కానీ, అతని పేరు మాత్రం, భారతదేశ చరిత్రలో చిరకాలం నిలిచి ఉండిపోతుంది...... చివరిగా ఒక చిన్న మాట, మన దేశభక్తి ని నిరూపించుకోడానికి మనం అందరం మిలట్రీలో చేరక్కర్లేదు...కనీసం ఇలాంటి వాళ్ళ చరిత్ర చదివినా దేశభక్తి ఉన్నట్టే... ఇదీ మన జాతికున్న నిరూపమాన దేశభక్తి...జైహింద్..

కాంతివేగమును ఎవరు లెక్కించారు

కాంతివేగమును ఎవరు లెక్కించారు .?
భారతీయుల ఘనత .? విదేశీయుల ఘనత ..?

కానీ పాశ్చాత్య ప్రపంచం,
కాంతివేగాన్ని లేక్కించినది క్రీ.శ 1975లో “రోమార్” అనే ఘనుడు అంటుంది. ఇందులో నిజం లేదు.
1. ప్రసిద్ధ ప్రాచీన భాష్యకారులు కింది బుగ్వేద శ్లోకానికి
“తరణిర్విశ్వధర్శతో జ్యోతిష్క్రుదాసి సూర్య విశ్వమాభాసిరోచనమ్II (1.50.4-బుగ్వేదం)

2. భాష్యంగా సాయనాచార్యులు కాంతి వేగాన్ని వర్ణిస్తూ ఒక శ్లోకం రాశారు.
“యోఢజనానాం సహస్రం ద్వే ద్వేశాతే ద్వే చ యేజనేI
ఎకేక నిమిషార్దేన క్రమమాణ నమో స్తుతే II”

అనగా అరనిమిషానికి 2202 యేజనాల దురం ప్రయాణించు ఓ కాంతి కిరణమా నీకు నమస్కారము
అని భావం.
ఇక్కడ 1 యోజనము = 9 మైళ్ళ 160 గజాలు. ఇది 9.11 మైళ్ళకు సమానము.
భారతీయ కాలగమన ప్రకారం .. 1 పగలు, రాత్రి = 810000 అర్ద నిమిషాలు. అనగా 1 సెకనుకు 8.75 అర్ద నిమిషాలు. కనుక ప్రతి అరనిమిషమునకు.
2202 X 9.11 = 20060.22 మైళ్ళు అట్లే
20060 X 8.75 = 188064 మైళ్ళు ప్రతి సెకనుకు.
ఇది ఆధునికలు కనుగొన్న కాన్తివేగానికి దాదాపు సమీపముగానే ఉన్నదీ. 20వ శతాబ్దనికి చెందిన శాస్త్రజ్ఞులు, మేకీల్ సన్స్, మోర్లె కాంతి వేగం 1,86,300 మైళ్ళు – ఒక సెకను అని కనుగొని ఉన్నారు. ప్రస్తుతానికి అది ప్రమాణము.  సాయణాచార్యులు చెప్పిన విషయం 1890వ సంవత్సరంలో మాక్సు ముల్లర్ సంకలనం చేసిన “ఋగ్వేదం” అను ఆంగ్ల గ్రంధంలో కూడా ప్రస్తావించబడింది. మాక్సుముల్లర్ సాయణాచార్యులు క్రీ.పూ. 1395లో రచించిన బుగ్వేద భాష్యం నుంచి ఈ విషయాలు గ్రహించారు. దీని అసలు ప్రతి నేడు వడోదరాలోని కేంద్ర గ్రంధాలయంలో భద్రపరచబడి ఉంది.
గమనిక: యోజనం అనగా 9మైళ్ళు అని అర్ధ శాస్త్రంలో చెప్పబడింది. 9మైళ్ళు అనగా 8,000 ధనస్సుల దూరం. ఒక్కొక్క ధనువు పొడవు 6 అడుగులు. కానీ ఆర్యభట్టుడు, బ్రహ్మగుప్తుడు మొదలైన ఖగోళ శాస్త్రజ్ఞులు (500 ఎ.డి) అంచనా ప్రకారం ఒక యోజనం అంటే నాలుగు క్రోసులు. అనగా దాదాపు 8 మైళ్ళు.
భారతదేశంలో పుట్టినందుకు ఆనందపడు... భారతీయునిగా జీవిస్తునందుకు గర్వపడు....
Thotapalli Sridhar Sarma గారి వాల్ నుండి.

Sunday, 4 February 2018

విద్యుత్అగస్త్య మహర్షి

#విద్యుత్#   @..అగస్త్య మహర్షి..@

విద్యుత్ ను గురించి
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలు ఇప్పుడు లభిస్తున్నాయి.
వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.

“సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్I
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిఃII
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతఃI
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్II”

దీని భావం -
ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలక పెట్టాలి.
తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి.
పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది.

మరో శ్లోకం చూడండి

“అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషుI
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతఃII
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకేI
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్II”

దీని భావం -
ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,
ఉదజని వాయువులుగా విడిపోతుంది.
ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.

1. తడిత్ –
పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2. సౌదామిని –
రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3. విద్యుత్ –
మేఘముల ద్వారా పుట్టునది.
4. శతకుంభి –
వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5. హృదని –
స్టోర్ చేయబడిన విద్యుత్తు.
6. అశని –
కర్రల రాపిడి నుండి పుట్టునది.

ఇంత వివరంగా ఇచ్చిన సమాచారం ఉంటే కొందరు ఆంగ్లమానస పుత్రులు అన్నీ మన శాస్త్రాలలో ఉన్నాయిష అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు.
వీరి కళ్ళకున్న ఇంగ్లీషు కళ్ళజోడు, ఎర్ర కళ్ళద్దాలు తొలిగిస్తే కనబడతాయి.
ఆంగ్లేయులు వ్రాసిన చరిత్ర చదువుతారు.
భారత దేశం మీద ప్రేమ ఎక్కువ ఉంటే అంటూ సలహా ఇస్తారు.

*సంస్కృతం రాదు. చదవడానికి, వెదకడానికి వీరికి సమయం దొరకదు,
ఎవరో చేప్పిన ఎంగిలి మాటలు నాలుగు పట్టుకుని మనని, మన శాస్త్రాలను విమర్శిస్తు తిరుగుతుంటారు.
వారు అభ్యుదయభావాలు కల వారిగా ఊహాలోకాల్లో ఉంటారు.
అటువంటి వారికి మనం చెప్పేదేమీ లేదు*

సేకరణ మీ శ్రీశైల్
!..శుభోదయం..!

Wednesday, 17 January 2018

మనం మరిచిపోయిన మహానుభావుడు !
==========×××××===========

పేరు : ఎల్లాప్రగడ సుబ్బారావు
ఊరు: భీమవరం, ఆంద్రప్రదేశ్
పుట్టిన రోజు: జనవరి 12, 1895
వృత్తి: Biochemist (జీవరసాయన శాస్త్రవేత్త)

ఈయన గూర్చి మనం ఏమి తెలుసుకోవాలి?
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼

ఒక మాములు మధ్యతరగతి కుటుంబం లో జన్మించిన ఓ వైద్య శాస్త్ర అద్భుతం !

Miracle man of medicine అని పిలిపించుకున్నాడు !

నోబెల్ బహుమతి గ్రహీత  GH  Hitchings ఎల్లాప్రగడ గూర్చి మాట్లాడతూ ఇలా అన్నారు " మేము కనిపెట్టిన చాలా న్యూక్లియోటైడ్స్ ఇంతకు ముందే ఎల్లాప్రగడ సుబ్బారావు కనిపెట్టేశారు... దానినే మేము మళ్ళీ కనిపెట్టాము.. సుబ్బారావు తో పనిచేసిన ఆతని సాటి శాస్త్రవేత్తల అసూయ, ద్వేషం కారణంగా సుబ్బారావు చాలా ఆవిష్కరణలు ప్రపంచానికి తెలీదు !!

ఆయన జీవితం
౼౼౼౼౼౼౼౼౼

జనవరి 12, 1895 న భీమవరం లో పుట్టారు. స్కూల్ చదువులు రాజమండ్రి లో పూర్తి చేసుకుని, మద్రాస్ లో ఇంటర్ పూర్తి చేసి మద్రాస్ మెడికల్ కాలేజ్ లో LMS డిగ్రీ సంపాదించారు !

ఎల్లాప్రగడ వారికి ఆయుర్వేదమ్ పైన ఉన్న మక్కువ చేత, ఆయుర్వేదం ని ఆధునిక పద్ధతుల్లో బాగా వాడొచ్చని మద్రాస్ ఆయుర్వేద కాలేజ్ లో టీచర్ గా జాయిన్ అయ్యారు !

ఆయుర్వేదాన్ని సాటి భారతీయులే హేళన చేస్తున్న ఆ రోజుల్లో ఎల్లాప్రగడకి అమెరికా నుండి పిలుపు వచ్చింది ! అమెరికా లో Harvard university లో
PhD కూడా పూర్తిచేసి, ledral company తో కలిసి పనిచేసారు !

ఎల్లాప్రగడ ఆవిష్కరణలు (కొన్ని)
========×××=========

* ఫాలీక్ ఆసిడ్ తయారీ (రక్తహీనతకి మందు)
* మిటోట్రెకసెట్ (కాన్సర్ కి మందు)
* టెట్రా సైక్లిన్ (ప్లేగు, మలేరియా, కలరా etc  కి మందు
* అరియొమైసిన్ (పెన్సిలిన్, స్టెప్ట్రోమైసిన్ కంటే బాగా పనిచేసే antibiotics)
* రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాకి వైద్య సేవలు
*  మనిషి లో శక్తికి మూలం ATP
* Polymyxin ( పశువుల మేత)
* విటమిన్ B9 తయారీ

ఇలా ఎన్నో గొప్పగొప్ప విషయాలు ఆయన కనిపెట్టిన సరే, ఆయనికి ఎలాంటి గుర్తింపు రాలేదు.. నోబెల్ బహుమతి గాని, భారతరత్న గాని లేదు !

ఎందుకంటే ఆయన ఏదో ఆశించి ఇవన్నీ కనిపెట్టలేదు ! ప్రపంచ క్షేమం కోసం కనిపెట్టారు !

కానీ అతని తోటి శాస్త్రవేత్తలు, అక్కడి అమెరికన్లు భారతీయిడికి ఇంత పేరు, ప్రతిష్ట రాకూడదు అని అతని పరిశోధనలని వాళ్ళ పరిశోదనలుగా చెప్పుకున్నారు !

ఆఖరికి మన చరిత్రలో, మన పాఠ్యపుస్తకాలలో కూడా ఆ మహానుభావుడు కి చోటు లేదు !
ఎల్లాప్రగడా గూర్చి doron K Antrim అనే రచయిత ఇలా అంది " "Yet because he lived you may live longer".

ఎల్లాప్రగడ జీవితంలో జరిగిన  ఓ సంఘటన !
=============================

స్థలం: చెన్నై, మైలాపూర్,  కపాలీశ్వర దేవాలయం
సమయం: ఇంచుమించు 1922 సంవత్సరం  ఒక సాయంకాలం

దేవాలయం కోనేటి మెట్లపై ఓ ఐదారుగురు మిత్రులు కబుర్లాడుతున్నారు. వారంలో ఒకసారి అలా కలుసుకోవడం ఆనవాయితీ. ఆ గుంపులో మెడిసిన్ లో డిప్లమా తీసుకొని, చెన్నై ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్న ఒక డాక్టరూ ఉన్నాడు.

ఆయన నెల జీతం అరవై రూపాయలు.
డాక్టర్ : నాకేగనక ఓ పదివేలరూపాయలుంటే నా పరిశోధనలతో అద్భుతాలు చేసి చూపిస్తాను.

ఒకశ్రోత : సర్లేవయ్యా! నీ సోది ఎప్పుడూ ఉండేదేగదా!

డా: నిజం సర్, నామాట నమ్మండి. పెట్టుబడే ఉంటే, "సర్పగంధి "తో నేను దివ్యౌషధాలు చేసి చూపిస్తాను.

రెండవశ్రోత : ఇంకానయం. మృతసంజీవని చేస్తానన్నావుకాదు.

డా :పరిహాసాలు కాదు సర్. సర్పగంధితో చాలా రోగాలను నయం చేయవచ్చు. కావాలసిందంతా పరిశోధనలకు పెట్టుబడి. అంతే.

మొ.శ్రో.: పరిహాసం కాదు డాక్టరుగారూ! నిజంగానే అంటున్నాను. అంతపెట్టుబడి మనకెక్కడ? ఏ అమెరికావాడో పెడితే తప్ప.

ఇంతలో పెద్దవాన. కూర్చున్నవాళ్ళంతా లేచి బిరబిరా తలో మూలా వెళ్ళారు. మన మిత్రబృందం దేవాలయం సన్నిధిలో పూజాసామాగ్రి అమ్మే ఒక దుకాణం చూరుకింద నిల్చున్నారు.అక్కడా ఈ డాక్టరు గారు వదల్లేదు. సర్పగంధి గొప్పదనాన్ని గురించి ఆంగ్లంలో అనర్గళంగా దంచుతూనే ఉన్నాడు. ఇంతలో వెనుకనుంచి ఒకతను,

" నిజంగానే మీరు అలాంటి మందులను తయారు చేయగలరా?" అని ప్రశ్నించాడు ఆంగ్లంలో.

మిత్రులు ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూస్తే, అతనొక అమెరికన్.

డాక్టర్ అత్యుత్సాహంతో " కచ్చితంగా సర్. పెట్టుబడి పెట్టిచూడండి." అన్నాడు.

ఆ అమెరికన్ "సరే. నేను LEDERLE కంపెనీ ప్రతినిధిని. మాకంపెనీ డైరెక్టర్స్ తో మాట్లాడి, ఒకట్రెండు నెలల్లో మీకు తెలియపరుస్తాను." అంటూ డాక్టరుగారి చిరునామా తీసుకున్నాడు.

“ నిజం సర్. ఆరునెలలు గడువియ్యండి చాలు. నేను మాట నిలబెట్టుకోలేకపోతే ఇండియాకు తిప్పి పంపేయండి" అంటూ ఏదేదో పలవరించసాగాడు పాపమాడాక్టర్.

మర్నాటినుంచీ డాక్టర్ ఎదురు చూపులూ, మిత్రుల పరిహాసాలూ. ఆరువారాల తరువాత LEDERLE COMANY  నుంచి డాక్టరుగారికి ఒక ఉత్తరం వచ్చింది.

"మా ప్రతినిధి ద్వారా మీ ఉత్సాహం, ఓషధీజ్ఞానం మాకు తెలిసింది. ప్రజలకోసం కొత్తమందులు కనిపెట్టడమే మా లక్ష్యం. మీరుకనిపెట్టే వాటిల్లో ఏ ఒక్కటి ఫలప్రదమైనా సంతోషిస్తాం. మీరు ఢిల్లీలో మాసంస్థ కార్యాలయానికి వెళ్ళండి. మీప్రయాణ ఏర్పాట్లన్నీ వారు చూసుకుంటారు".
.
ఇదీ ఆ ఉత్తరం సారాంశం. డాక్టరుగారు ఆ ఉత్తరాన్ని ఓ వందసార్లయినా మిత్రులకు చదివి వినిపించుంటారు.
.
 తరువాత ఆయన అమెరికా వెళ్ళడం HETROGEN, TETRACYCLINE, METHOTREXATE(USEFUL IN CANCER TREATMENT) ,POLYMIXIN (Cattle Field )   లాంటి దివ్యౌషధాలు కనుక్కోవడం అంతా గొప్ప చరిత్ర.

ఆ మహానుభావుడే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావు గారు.

జనవరి 12 పూజ్య స్వామీ వివేకానంద జన్మదినం అని అందరికీ తెలుసు. ఆరోజే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావుగారి జన్మదినం కూడా.

LEDERLE COMPANY వారు తమ ప్రాంగణంలో సుబ్బారావు గారి విగ్రహం ప్రతిష్ఠించి ఆయనపై తమ గౌరవాన్ని చాటుకున్నారు.

భాస్కరుడు, చరఖులనుంచీ, శ్రీనివాసరామానుజం, యల్లాప్రగ్గడ సుబ్బారావు గారిదాకా వేలసంవత్సరాలుగా మన భారతీయ మేధ విశ్వవ్యాప్తం అవుతూనే ఉంది. మన యువతకే అది పనికిరానిదయింది.

నా రోజులో కొన్నీ నిమిషాలు ఆ మహానుభావుడి కోసం అందరికి తెలియజేయడానికి వెచ్చజించడమ్ నాకు ఈ రోజు చాలా ఆనందాన్ని ఇచ్చింది!!

https://en.m.wikipedia.org/wiki/Yellapragada_Subbarow

http://www.ysubbarow.info/

కోడి రామ్మూర్తి నాయుడు



*కోడి రామ్మూర్తి నాయుడు గారు*


*'ఇండియన్ హెర్కులస్' గా బిరుదు గడించి, తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారి జయంతి జనవరి 16. క్లుప్తంగా ఆయన గురించి.....*

             


*ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు. ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు. కోడి రామ్మూర్తి నాయుడు జనవరి 16, 1882 న శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.*



*కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతో విజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు. అక్కడ ఒక వ్యాయమశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు.*



*21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు.*



*రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు.*



*కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. రొమ్ముపై పెద్ద ఏనుగును ఎక్కించు కునేవాడు.  5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు.*


*తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.*



*పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి 'మల్లమార్తాండ', 'మల్లరాజ తిలక్' బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.*



*హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి 'జగదేకవీర' బిరుదమిచ్చారు.*


*అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు.*



*రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని తన కారును ఆపవలసిందని కోరాడు. కారులో కూర్చుని లార్డ్ మింటో కారును నడపసాగాడు. త్రాళ్ళతో కారును తన భుజాలకు కట్టుకున్నాడు. అంతే, కారు ఒక సెంటీమీటర్ కూడా కదలక పోయింది.*



*ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.*



      *పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకున్నారు. విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు.*



     *లండన్ లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు.*



*ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.*



*స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు.*



*అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు ' సరే ' అన్నారు. రామమూర్తిగారు రంగంలో దుకారు. దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.*



*కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది.*



*ఆంధ్రరాష్ట్రానికి చెందిన వస్తాదు మరియు మల్లయోధులు ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు . ఈయన శాకాహారులు.*


*భారతీయ యోగశాస్త్రం. ప్రాణాయామం, జల, వాయుస్థంభన విద్యలను శారీరక బలప్రదర్శనలకు జోడించడం వల్లనే ఆయన జగదేక మల్లుడయ్యారు.*



*ఆయన శక్తి, కీర్తి కొందరికి అసూయ కలిగించడంతో కొన్ని హత్యాప్రయత్నాలు కూడా జరిగాయి.*



*లండన్లో ఏనుగు ఫీట్ చేస్తున్నప్పుడు ఒక ద్రోహి బలహీనమైన చెక్కను ఛాతిపై పెట్టాడు. ఏనుగు ఎక్కగానే, చెక్క విరిగి ఆయన పక్కటెముకల్లోకి దిగబడింది. శస్త్రచికిత్స చేయించుకొని రెండు నెలలపాటు ఆయన లండన్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.*



*మరోసారి రంగూన్లో హత్యాప్రయత్నం చేసిన వ్యక్తులను చితకబాది, సురక్షితంగా బయటపడ్డారు.*


*మాల్కానగరంలో భారతంలో భీముడి మాదిరిగా విషప్రయోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. ఒక విందులో విషం కలిపిన పాలు తాగారు. అప్పుడు ఆయన్ని కాపాడింది యోగ విద్యే.*



*విషాన్ని జీర్ణించుకొని మూత్రం ద్వారా విసర్జించారు.*


*కీ.శే. మేడేపల్లి వరాహనరసింహస్వామిగారు రచించిన దానిని బట్టి రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసివేయవలసి వచ్చింది.*



*సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోలేదు. ప్రాణాయామం చేసి నిబ్బరంగా వుండిపోయారు.*



*1942 జనవరి భోగి పండుగ.. ఆ రోజు రాత్రి ఆయన వెంట ఉన్నది ఒకే శిష్యుడు.. ఆయన విజయనగరానికి చెందిన కాళ్ల పెదప్పన్న. ఆ రాత్రి కొంచెంసేపు తలపట్టమని శిష్యునికి చెప్పి, తాను లేచేవరకు లేపవద్దని చెప్పి పంపించారు రామ్మూర్తినాయుడు.*


*మరునాడు సంక్రాంతి.. కాని ఆయన నిద్ర లేవలేదు. అదే ఆయన శాశ్వతనిద్ర. సంక్రాంతితోనే జీవితానికి సమాప్తి. కాని ప్రపంచాన్ని జయించిన కీర్తి భారతదేశానికి మిగిల్చిన అమరజీవితమది.*



***********

Tuesday, 16 January 2018

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు -  వాటి గురించి విశేషాలు .


     మన ప్రాచీన మహర్షులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానులు . వీరు తమయొక్క విజ్ఞానాన్ని గ్రంధరూపంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకటం లేదు .  నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను .


 *  బృహద్యంత్ర సర్వస్వము  -

         ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను . ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా " విమానాధికారణము" అను ఒక అధ్యాయం కలదు. ఇందు అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు . ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి , అమిత విద్యుత్ శక్తి నుండి , అత్యుష్ణము , అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు ( అద్దములు ) గురించి వివరించారు

                   ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ , సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడును.

                 ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియమ్ గ్లాసులు , పొటాషియం గ్లాసులు మాత్రమే . కాని మన ప్రాచీనులు అద్దం తయారుచేసేప్పుడు సువర్ణం , పాదరసం , అయస్కాంతం , ముత్యములు మొదలగునవి కలిపెదరు . అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషదాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు. 

          అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.

 *  ఆగతత్వలహరీ  -

         ఇందు వ్యవసాయం , అనేక వృక్షాల వర్ణనలు , వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను .

 *  అవతత్వ ప్రకరణం  -

          ఈ గ్రంథాన్ని కూడా అశ్వలాయన మహర్షి రచించారు . దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు .

 *  అండ కౌస్తభం  -

           ఇది పరాశర కృతం . బ్రహ్మాండ చరిత్ర
జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.

 *  అంశు బోధిని -

           ఇది భరద్వాజ మహర్షి రాశారు. ఇందు గ్రహములు వేధించు పద్దతులు  , ప్రకాశం ( light ) , ఉష్ణం ( heat ) , ధ్వని ( sound ) , తంత్రీ వార్తావిధి ( టెలిఫోనీ ) , విమాన నిర్మాణ విధి ,విద్యుతశక్తి ప్రయోగాలు కలవు.

 *  ఆకాశ తంత్రం  -

            ఇది భరద్వాజ మహర్షి రచించారు . ఇందు ఆకాశం యొక్క 7 విధములు , ఆకాశక్షేత్ర విభాగములు , ఆకాశంలోని శక్తి సంయోగ విధములు , ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహ కక్ష్యలు , భూములు , నదులు మొదలగు వాటి వివరణలు కలవు.

 *  ఋక్ హృదయ తంత్రం  -

            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు రోగములు , చికిత్సలు విశేషముగా వివరించబడి ఉన్నాయి.

 *   ఔషధీ కల్పం  -

            ఇది అత్రి మహర్షి కృతం . ఇందు ఔషధముల ప్రభావములు . చిరకాలం జీవించుటకు యోగాలు , గుళికా యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.

 *  కరక ప్రకరణము  -

             ఇది అంగీరస మహాముని రచించెను . ఇందు మేఘములలొని మార్పులు , జీవరాశుల ఉత్పతి విధానం , సూర్యరశ్మిలోని మార్పులు మేఘములకు సంబంధము , నవరత్నములు పుట్టుటకు సంబందించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.

 *   కర్మాబ్దిసారము  -

             ఇది ఆపస్తంబ మహర్షిచే రచించబడెను . ఇందు కర్మలు , చేయవలసిన విధులు , వాటి ప్రాముఖ్యత , వాటి ఫలములు , శారీరక , మానసిక ఫలములు మొదలైనవి కలవు.

 *   కౌముదీ  -

               ఇది సోమనాథ కృతం ఇందు బ్రహ్మాండం గురించి విపులంగా రాసి ఉన్నది.

 *   ఖేట సర్వస్వము  -

              ఇది జైమినీ మహర్షి చే రచించబడెను . ఇందు ఆకాశ విభాగములు , అందలి గ్రహకక్షలు మొదలగునవి కలవు.

 *  ధాతు సర్వస్వము  -

             ఇది బోధాయన మహర్షిచే రచించబడెను . ఇందు ధాతువులు , వాటి ఉత్పత్తులు , గనులు , గనుల నుండి
లోహములు తీయు పద్దతి , విషములు , విషహరణోపాయములు , భస్మములు , గంధకం , పాదరసం మొదలగువాటి వర్ణన కలదు .

 *  ధూమ ప్రకరణం  -

           ఇది నారద మహర్షి కృతం . ఇందు వివిద ధూమములు , వాటిని కొన్ని రకాల అద్దములచే పట్టుట వాటిని కొన్నిరకాల ఆమ్లములచే పరిశోధించుట . ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాలలోని విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరాన్ని , బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.

 *  నామార్థ కల్పం  -

           ఇది అత్రి మహర్షిచే రచించబడెను. ఇందు 84 లక్షల శక్తులు వాటి నామాలు , నామార్థాలు కలవు.

 *  ప్రపంచ లహరీ  -

             ఇది వశిష్ట మహర్షి చే రచించబడెను . ఇందు అణువుల వలన బ్రహ్మండా నిర్మాణమా లేక బ్రహ్మతత్వం వలనా ? అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.

 *  బ్రహ్మాండ సారం  -

               ఇది వ్యాస మహర్షిచే రచించబడెను . ఇందు బ్రహ్మాండ చరిత్ర కలదు.

 *  మేఘోత్పత్తి ప్రకరణం  -

              ఇది అంగీరస మహర్షి కృతం . ఇందు మేఘములు , మెరుపులు , పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణణలు కలవు.

 *  లోక సంగ్రహము  -

              ఇది వివరణాచార్య కృతం . ఇందు 1714 భాషలు , జీవజాతులు , వాటి పుట్టుక , ఆహార నియమాలు , మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం కలదు.

 *  లోహ తంత్రము  -

              ఇది శాక్త్యాయన మహార్షి చే రచించబడెను . ఇందులో లోహోత్పత్తి మొదలగు విషయాలు కలవు.

 *  వాయుతత్వ ప్రకరణము  -

              ఇది శాక్త్యాయన మహర్షి కృతం . ఇందులో 84 వేల రకాల వాయువులు , వాటి పొరలు , భూమి మీద  ఆయా వాయువుల యొక్క ప్రభావములు , అవి వృక్ష సంపద పైన ఎట్లు పనిచేయుచున్నవి ? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు.

 *  వైశ్వనర తంత్రము -

              ఇది నారద మహర్షి కృతం . ఇందు 128 రకాల అగ్నులు , వాటి రంగులు , గుణములు , ఉపయోగములు , కొలతలు తరతమ బేధములు కలవు.

 *  శక్తి తంత్రము  -

            ఇది అగస్త్య మహార్షి చే రచించబడినది. ఇందు విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము , రూపాకర్షని , రసాకర్షిణి , గంధాకర్షిణి , స్పర్శాకర్షిణి , శబ్దాకర్షిణి , ధైర్యాకర్షిణి , శరీరాకర్షిణి , ప్రాణా కర్షిణీ  మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణనం , సెకనుకు 1 , 86 ,000 మైళ్ళ వేగముతో ఇప్పుడు టెలివిజన్ , రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదే విధముగా విధ్యుత్ శక్తి సహాయముతో రసము , గంధకం , స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముతో ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను . బహుశా వాయువేగంతో మనిషి ఎలా ప్రయాణించాలో తెలియచేశారు అనుకుంటా .

 *  శుద్ద విద్యాకల్పం  -

         ఇది అశ్వలాయన మహర్షి కృతం . ఇందు ప్రపంచోత్పత్తి నిర్ణయము కలదు.

 *  సమరాంగణ సూత్రధారము  -

         ఇది భోజమహారాజుచే రాయబడినది. ఇందు అనేక యంత్రములు కలవు. ఈ యంత్రములు యందు ఉపయోగించు పంచభూత బీజముల విధానములు , విమాన నిర్మాణ విధానములు , ద్వని ( సైరన్ ) యంత్రము చేయు పద్ధతులు , బొమ్మలచే యుద్ధము , నాట్యము , సంగీతము , ద్వార రక్షణము మొదలగు విచిత్రములు కలవు.


           పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన శాస్త్రంలో అశని కల్పం , అంశుమ తంత్రం , ఉద్బిజ్జతత్వ సారాయణము , దర్పణకల్పము , దర్పణశాస్త్రం , దర్పణ ప్రకరణం , ద్రావక ప్రకరణం , మణికల్ప ప్రదీపిక , మణి ప్రకరణము , మణి రత్నాకరం , ముకుర కల్పము , యంత్ర కల్పము ,  యంత్ర కల్పతరువు , లోహతత్వ ప్రకరణం , లోహ ప్రకరణం , లోహ రత్నాకరం , లోహ రహస్యము , లోహ శాస్త్రం , విమాన చంద్రిక , విష నిర్ణయాధికారం , వ్యోమయాన తంత్రం , శక్తి తంత్రము , శక్తి బీజము , శక్తి కౌస్తుభం , సమ్మోహన క్రియాకాండం , సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. అదియే కాక  అగస్త్య, అత్రి , అంగీర, ఆపస్తంబ , ఈశ్వర , కపర్ది , గర్గ, గాలవ,  గోభిల , గౌతమ, నారద , పరాశర, భరద్వాజ , వశిష్ట , వాల్మీకి , వ్యాస , శౌనక , సిద్ధనాధ  మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసుకుని మూలన  కూర్చుని తపస్సు చేసుకునే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు .భారతదేశంలో అధికారంలో ఉన్న వారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాము. కాని మన ప్రాచీన విఙ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు. దీనిపై మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో  1936 వ సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితా ని                 "రసరత్న సముచ్ఛయ" అనే పేరుతో ముద్రించారు . ఒక కేటలాగ్ లాగా అది మనదేశంలో దాని విలువ 1 రూపాయి . జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్ముడు అయినది.  ఇది మన భారతీయ వైఙ్ఞానిక విలువ కాని అది మరుగున పడుతుంది. మనం అయినా కాపాడుకొని మన తరవాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి.


                కాళహస్తి వెంకటేశ్వరరావు

                  అనువంశిక ఆయుర్వేదం

                         9885030034

Sunday, 14 January 2018

ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి

“ఆత్మావైపుత్రనామాసి “ శాస్త్రీయత ఏమిటి?

ఒక మగవాని వంశం కేవలం వారి తండ్రిదే, తల్లిది కాదు ఎందుకని?
ఈ ప్రశ్న చాలా సరళంగా అనిపించినా, లేదు మనది patriarchial society అని కొందరు పనికిమాలిన లాజిక్ తీసుకువచ్చినా, లేక హైందవంలో ఇలా చెప్పి మహిళాసాధికారతను తోక్కేసారని సదరు మహిళాసంఘాలు గగ్గోలు పెట్టినా, దీనిలో చాలా శాస్త్రీయత ఉంది. మన ఋషులు ఎంతో ఆలోచించి ఈ విషయం నిర్ధారించి నిర్దేశించారు. నేటి శాస్త్ర సాంకేతిక విప్లవం ద్వారా కొన్ని మనం నిరూపించగలుగుతున్నాము నేడు. దీనిలో శాస్త్రీయత ఒకసారి పరిశీలిద్దాము.

ప్రతీ జీవిలోనూ DNA లో ఎన్నో chromosomes ఉంటాయి. కానీ మానవులలో ఉన్న 23 జతల chromosomes లో  సదరు స్త్రీకి X chromosomes అలాగే పురుషునికి Y chromosomes వుండడం సహజం. XX chromosome ఉంటె అమ్మాయి లింగ నిర్ధారణ అని, XY ఉంటె పురుష లింగ నిర్ధారణ చేస్తారు chromosome ఆధారంగా. పిండం ప్రాణం పోసుకుంటూ ఉండగా ఈ Y chromosome ఆడ లక్షణాలను అడగదోక్కి పురుష లక్షణాలను పెంపొందిస్తుంది. ఈ Y chromosome అన్నది తల్లికి ఉండదు అందుకు కేవలం తండ్రి వలన మాత్రమె సంక్రమిస్తుంది ఆ పుత్రునికి. అదే అమ్మాయికి XX chromosome pair తల్లి నుండి తండ్రి నుండి సిద్ధిస్తాయి. ఈ XX chromosome కలిసినప్పుడు ఇద్దరి లక్షణాలను పుణికిపుచ్చుకుంటాయి. కానీ XY కలిగినప్పుడు Y అన్నది కేవలం తండ్రి నుండి మాత్రమె అందునా పెద్దగా మార్పు లేకుండా సంక్రమిస్తుంది.

అందుకే మన వేదం లో చెప్పారు “ ఆత్మావై పుత్ర నామాసి” అని. అంటే తండ్రే అదే రూపంలో కొడుకు అవుతున్నాడు అని. అదే లక్షణాలు మనవడి దగ్గరకు, అలా వారి వంశం అంతా కేవలం వారి తండ్రి, తాత, ముత్తాతల దగ్గరనుండి వస్తుంది. అందుకే మగవారిని వంశోద్ధారకుడు అనేది.  మన గోత్ర, ప్రవర పద్ధతి ఇదే విషయాన్ని చాలా అందంగా శాస్త్రాన్ని తనలో ఇముడ్చుకుంది. ప్రవరలో మన వంశంలో ఉన్న ముఖ్య ప్రముఖులైన మహర్షుల గురించి ఉంటుంది. ఉదాహరణకు
భార్గవస  గోత్రానికి ప్రవర భ్రుగు, చ్యవన, ఆప్లువాన, ఔరవ, జామదగ్ని  పంచార్షయము అని చెబుతాము. అంటే భ్రుగుమహర్షి నుండి ఆ lineage లో జమదగ్ని వరకు ఉన్న మహర్షుల సంతానం ఆ గోత్రీకులది అని తెలుస్తోంది. అంటే ఈ గోత్రీకులకు సంబంధించిన Y chromosome భ్రుగు మహర్షి వద్దనుండి వస్తున్నది అన్న అర్ధము. అదే ఆడవారికి రెండు chromosomes ఉండడం వల్ల వారి వంశం పెళ్లి చేసుకున్నాక భర్త వంశం అవుతోంది.

కొన్ని లక్షల, వేల సంవత్సరాల నుండి ఇలా వస్తున్న ఈ chromosomes ఎన్నో మార్పులకు లోనయ్యాయి. Y chromosome పరిమాణం కూడా X chromosome కి మూడవ వంతు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకే పరిమాణంలో ఉన్న ఇది రాను రాను చిన్నదయిందని శాస్త్రజ్ఞుల వాదన. XX chromosomes లో ఒక x కి  ఏమైనా లోపాలుంటే మరొక దానినుండి అది తెచ్చుకుంటుంది. దీన్ని క్రాస్ఓవర్ అంటారు. అదే XY కి ఈ అవకాశం లేదు ఎందుకంటె నిర్మాణ పరంగా ఇవి పూర్తిగా విభిన్నమైనవి. ఇవి మరింత క్షీణించకుండా ఉండాలంటే ఒకే గోత్రం/ప్రవర లో ఉన్న వారి మధ్య వివాహాలు జరపకూడదు అని చెప్పారు మన మహర్షులు.. అంతేకాక ఈ XX లో మరి XY లో X లలో ఉన్న ఏమైనా జన్యుపరమైన లోపాలు కానీ మరింత పెచ్చరిల్లే అవకాశం ఉండి, వీటిని పూర్తిగా నిషేధించారు. ఇలా దగ్గర దగ్గరలో ఉన్న XY XX లు కలుస్తూ పోతే మొత్తానికి ఆ వంశంలో y chromosome కనుమరుగయ్యే అవకాశం కూడా హెచ్చు.  మన మహర్షులు ఎంతో దూరదృష్టి ఉన్నందున వారు ఈ సగోత్రీకుల వివాహం వద్దన్న నియమం పెట్టారు. అది కూడా ఈ జనరేషన్ నుండి ఆరు తరాలు పూర్వం వరకు అలా కలిసి ఉండకూడదు అని. దానివల్ల ఆరోగ్యవంతమైన సంతానం, మరింత తెలివయిన వారు పుడతారు అని వారి విశ్లేషణ. నేడు మనకు సైన్సు వారు చెప్పిన విషయాన్ని ద్రువీకరిస్తోంది.

మన వేదవాంగ్మయం చెప్పిన విషయాలు నేటి శాస్త్రీయ విజ్ఞానం అందుకోవాలంటే మరి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు పట్టవచ్చు, అప్పుడు నిజమే ఈ విషయం కేవలం సనాతన ధర్మం చెప్పిందని అప్పటికి అనిపిస్తుంది. మనకు కావలసినది నమ్మకం. నేడు మనం నిరూపించగలిగే స్థాయిలో, పరిపక్వతలో లేము మనం అంత మాత్రాన పెద్దలు చెప్పిన శాసనాలను ధిక్కరించి కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకు?

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీవేంకటేశ్వరార్పణమస్తు !!