Tuesday, 12 September 2017

దేవుడు కాలం

ఈ మధ్య కాలం లో దేవుడు కాలం లో కూడా ఉన్నాడు అందుకే ప్రపంచం మొత్తం క్రీస్తు కాలన్నే వాడుతున్నారు (2015) దాన్నే ప్రామాణికం చేసుకున్నారు అని చక్కటి కథలు అల్లెస్తూ జనాలని పిచ్చోల్లని చేయటానికి చూస్తున్నారు ! కాకపోతే అసలు విషయం ఏంటంటే యేసు కి ప్రస్తుతం ఉన్న సంవత్సరలకి అసలు సంభందం లేదు ! యేసు BCE 5 లో పుట్టాడు చనిపోయింది దాదాపు CE27-29 మద్యలో అని అందరికీ తెల్సు క్రైస్తవులు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదు ! ఇక పోతే క్రీస్తు పుట్టుక కానీ చావు కానీ రెండు కూడా ప్రస్తుత కాలానికి ప్రామాణికం కాదు ! కావున ఆయన చావు పుట్టుకలకీ కాలానికి సంభందం పెట్టడం అతితెలివి అవుతుంది! ఇక పోతే బైబిల్ లో ప్రతి చిన్న విషయం గురించి ఉంటది దాదాపు కానీ ఆయనే కాలం లేదా కాలాన్ని వేరు చేస్తున్నట్టు ఎక్కడ కూడా ఉండదు ! ఇంకా అన్నిటికన్నా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ క్రీస్తు శకం , క్రీస్తు పూర్వం అన్నవి మరియు ఆంగ్ల క్యాలండర్లు 532 CE లో మొదలవ్వగా 800 CE లో కాస్త ప్రాచుర్యం లోకి వచ్చాయి! సదరణంగా భూమి సూర్యుడిని చుట్టడానికి 365.24219 రోజుల సమయం తీసుకుంటాది , కానీ వీరు 365 రోజులకే కుదించారు ఆ .24 అనగా రోజులో 4 వంతుని వదిలేశారు దీనివల్ల దాదాపు ప్రతి సంవత్సరం మనము దాదాపు 6 గంటలు కోల్పోతున్నాం ప్రతి 4 సంవత్సరాలకు 1 రోజు కోల్పోతున్నాం అని గుర్తించి దానిని సరి దిద్దడానికి BCE 46 (దాదాపు) లో జూలియన్ కాలెండర్ ని కొన్ని మార్పులు చేసి గ్రెగొరియన్ కాలెండర్ ని నిర్మించారు దాని ఆదారంగా ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజుని ఫిబ్రవరి లో కలుపుతున్నారు(ప్రతి సంవత్సరం 6 గంటలు (దాదాపు) 4 సంవత్సరాలకి 24 గంటలు=ఒక రోజు)) ! కాక పోతే జూలియన్ కాలెండర్ ప్రకారం సంవత్సరానికి 365.25 రోజుల చొప్పున ఈస్టర్ దినం లెక్కించటం లో తేడా కనిపించి 1752 సెప్టంబర్ నెలలో దాదాపు 11 రోజులని లేకుండా మాయం చేశారు ఆ సంవత్సరం సెప్టెంబరు లో 2 వ తేదీ తర్వాత 14 వ తేదీ ఉంటుంది !!కానీ హిందూ కాలమానం ప్రకారం సూర్యమనం , లేదా చంద్రమానం అన్నవాటిని ఉపయోగిస్తూ ఒక్క క్షణ కాలం కూడా తప్పకుండ కాలెండరు ని అభివృద్ది చేశారు ! మనకి కలి యుగం అన్నది కృష్ణుడు మరణించిన రోజు నుంచి ప్రారంభం అవుతుంది ! అయితే మన దేశం లో ఎందుకు ఆంగ్ల కాలెండరు వాడుతున్నాం అంటే ఈ క్రైస్తవ సంస్థలు తమ బైబిల్ లో చెప్పినట్టే వారు అడుగుపెట్టిన ప్రతి చోట జాతిని జాతి చరిత్రని ద్వంశం చేసి తమ పద్దతులు ప్రవేశపెట్టేవారు ఈ బ్రిటీషు కుక్కలు రాకముందు మనకు ఈ తుచ్చమైన క్రీస్తు శకాలు లేవు , ప్రస్తుతం పెళ్ళిళ్ళకి అన్నిటికి కూడా సనాతన సంప్రదాయమైన తీతులు వారాల ద్వారానే గనిస్తున్నారు! వీరి కాలెండరు పుట్టింది కేవలం వీరు ఈస్టరు రోజు గణించుకోటం కోసమే అంతే కాక చరిత్రలో 11 రోజులని అజ్ఞాతం లో కలిపిన ముష్కరులు వీరే !ఇప్పుడు చెప్పండి క్రీస్తు కి కాలానికి ఏమన్నా సంభందం ఉందా??

1 comment:

  1. కనువిప్పుకలిగించే నిప్పులాంటి నిజాలు....

    ReplyDelete