*మనం యోగా ఎందుకు నేర్చుకోవాలి?*
మనం యోగాను “ఆరోగ్యం” కోసం నేర్చుకుందాము అనుకుంటున్నాము . యోగా యొక్క అంతిమ లక్ష్యం ఆరోగ్యం కాదు . అంతిమ లక్ష్యం “భగవస్సాక్షాత్కారం” . అయితే మనకు ముందుగా భగవంతుడు గురించిన ఆలోచన కన్నా మన శరీరానికి సంబంధించిన ఆలోచనలూ , మనమూ .. మన జీవిత భాగస్వామి .. మన పిల్లలూ .. మన కుటుంబం ఇదే రకమయిన ఆలోచనలు తో సతమతం అవుతూ ఉంటాము . ఈ ఆలోచనలనుండి బయట పడడం చాలా కష్ట సాధ్యం అయిన పని . అందుకు ఎంతో సాధన కావాలి , ఎంతో కాలం , పట్టుదల కావాలి . ఆదిశగా మనలను నడిపించేదే యోగం . యోగా ద్వారా మనం ముందుగా మన శారీరక సమస్యలనుండి బయట పడడం జరిగితే మన మనసులో ఒక పరివర్తన వస్తుంది . ఆ పరివర్తన కలగడమే “యోగం”
.
*యోగం అంటే కలయిక*
మన శరీరం మన మనసుతో కలవాలి
మన మనసు మన బుద్ధితో కలవాలి
మన బుద్ది మన ఆత్మతో కలవాలి
మన ఆత్మ మన పరమాత్మ తో కలవాలి
ఇది ఎలా సాధ్యపడుతుంది ? అందుకు మనం చెయ్యవలసినది “ప్రాణాయామం”
యోగం అనేది ఒక ప్రక్రియ కాదు ఒక జీవన శైలి . మన పూర్వీకులు యోగాకు ఎనిమిది అంగములు ఉన్నాయి అంటారు .
అవి 1. యమము 2. నియమము 3. ఆసనము 4.
ప్రాణాయామము 5. ప్రత్యాహారం
6. ధారణ 7. ధ్యానం8. సమాధి
ఇవి అన్నీ ఆచరించినవాడు దైవసమానుడు . దైవ దర్శనం చేసిన అనుభూతిని ప్రతి క్షణం అనుభవించగలడు. ఈ విషయాలను నేను అధికంగా ఇక్కడ పేర్కొనడం లేదు .
*1.యమము* అనగా ఇంద్రియ నిగ్రహము
అహింసా సత్యాస్తేయా బ్రహ్మచర్యా పరిగ్రహా యమాః
1. అహింస 2. సత్యము 3. అస్తేయము (మనో వాక్కాయ కర్మలచేత పర ద్రవ్యమునందు కోరిక లేకుండా ఉండుట) 4. దొంగిలింపకుండుట 5. బ్రహ్మ చర్యము
.
*2. నియమము:*
శౌచ సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః
.
నియమము 1. శౌచం 2. సంతోషము 3. తపస్సు 4. స్వాధ్యాయము 5. ఈశ్వర ప్రణిధానము నియమములు
.
*3.ఆసనం:*
పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఇవి ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు .
*4. ప్రాణాయామం:*
శ్వాసను క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. బాబా రామ్ దేవ్ గారు శరీర ఆరోగ్యం దృష్ట్యా ఎనిమిది రకాల ప్రాణాయామాలు అందరూ చెయ్యాలని చెబుతున్నారు
.
*5. ప్రత్యాహారం:*
ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
.
*6. ధారణ:*
ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట.
.
*7. ధ్యానము:*
ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము.
.
*8. సమాధి*
అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.
*యోగసాధనకు ఉపక్రమించడం ఎలాగో తెలుసుకుందాం*
ప్రాణాయామం ఖాళీ కడుపుతో చెయ్యండి . ఉదయం చాలా మంచిది . అలా కుదరని వారు భోజనం చేసిన నాలుగు అయిదు గంటల తర్వాత చెయ్యండి . మన మనసు ఎప్పుడో ఎదో ఒక విషయం ఆలోచిస్తూనే ఉంటుంది . మన ఆలోచనల ఫలితమే మన వ్యక్తిత్వం . ఒక మనిషిని మంచివాడుగా , దొంగగా ఉగ్రవాదిగా , సాత్వికుడుగా , ఋషిగా రూపొందించేవి అతని ఆలోచనలే . దీనికి మూలకారణం మనస్సు . దీనినే చిత్తం అంటారు . చిట్టా వృత్తి నిరోధానికి మనం చేసేదే ప్రాణాయామం . చిత్తాన్ని మంచి వైపుకు మళ్ళించేది యోగం
.
మనం జీవించి ఉన్నంత కాలం జరిగే ప్రకియ శ్వాసక్రియ . శ్వాస ఆగితే ప్రాణం పోయింది అంటాము . అంటే మనం పీల్చే గాలిలో మన ప్రాణం ఉంది అన్నమాట . ఈ ప్రాణం యొక్క ఆయామమే ప్రాణాయామం .
.
ప్రాణాయామానికి ముందు సంసిద్ధత
1. స్థిర సుఖమపి ఆసనం ( స్థిరంగా , సుఖంగా కూర్చోవాలి )
2. శరీరం నెలకు తగలకుండా విద్యుద్వాహకం కాని దుప్పటి గాని , బొంత కానీ , రబ్బరు మేట్ గానీ వేసుకోండి
3. గాలి ధారాళంగా వీచే చోటును చూసుకోండి (కిటికీలు తెరచి ఉంచండి . ఆరుబయట చెయ్యండి )
4. ఒక్కరు ఎక్కువ సేపు చెయ్యడం కష్టం కనుక కనీసం అయిదారుగురు కలిసి చెయ్యండి
5. ప్రశాంతమైన మ్యూజిక్ వింటూ ( ఆధ్యాత్మిక విషయాలు గానీ , భక్తి పాటలు గానీ వింటూ ) ప్రాణాయామం చెయ్యండి
6. శక్తికి మించి చెయ్యకండి . రోజు రోజుకూ శక్తి పెరుగుతుంది .
7. శ్వాస క్రియను ముక్కుతో మాత్రమె చెయ్యండి .
8. కళ్ళను మూసుకుని ప్రాణాయామం చెయ్యండి
9. మనసును చేస్తున్న ప్రాణాయామం మీద పెట్టండి . వేరే ఆలోచనలను వదిలివేస్తూ ప్రాణాయామం మీదకు తిరిగి తిరిగి తీసుకు వస్తూ ఉండండి .
.
ఇపుడు మనం స్థిరంగా సుఖంగా కూర్చోవాలి అందుకు అనుకూలమైన ఆసనాలు పద్మాసనం , సిద్ధాసనం , వజ్రాసనం , స్వస్తికాసనం , సుఖాసనం . ఈ ఆసనాలు ఏవీ నా వల్ల కాదు అని మీరు అనుకుంటే కాళ్ళు చాపుకుని కూర్చోవచ్చు . అది దండాసనం . అది కూడా వీలు కాదు అనుకుంటే కుర్చీలో కూర్చుని కూడా మీరు “ప్రాణాయామం” చేయవచ్చు.

No comments:
Post a Comment