Friday, 22 December 2017

భ్రుగు మహర్షి,భరద్వాజ మహర్షి మధ్య మొక్కలలో ప్రాణముందన్న విషయముపై జరిగిన సంవాదము

మనం మన పుస్తకాలలో 'వృక్ష శాస్త్ర(Botany) పితామహునిగా గ్రీకు దేశ తత్వవేత్త,వృక్ష శాస్త్రవేత్త అయిన 'థియోఫ్రాస్టస్' అని చదువుకున్నాము.

కానీ 'మహా భారతం లోని శాంతి పర్వం 184 వ అధ్యాయం' లో ఉన్న భ్రుగు మహర్షి,భరద్వాజ మహర్షి మధ్య మొక్కలలో ప్రాణముందన్న విషయముపై జరిగిన సంవాదము మాత్రం మన సిలబస్ లలో ఉండదు.ఇంకా ఒక ఆనందించదగ్గ విషయమేమిటంటే 'ఆధునిక కాలములో మొక్కలలో ప్రాణముందని నిరూపించిన "జగదీశ్ చంద్రబోసు' కు మాత్రం 'నోబెల్' బహుమతినివ్వటం,ఇది పురస్కరించుకొని మన సిలబస్ లలో చేర్చటo.

చాలామంది మొక్కలు నిర్జీవ పదార్ధాలని,అవి మనుష్యుల లాగ జ్ఞానముతో కూడిన కర్మలు చేయలేవని అనుకుంటూ ఉంటారు.ఇదిగో మహాభారతములో ఉన్న ఈ సంభాషణ చూసి మీరే నిర్ణయించండి.

మహా భారతం లోని శాంతి పర్వం 184 వ అధ్యాయం' లో భ్రుగు,భరద్వాజ మహర్షుల సంవాదముంది.ఇందులో "భరద్వాజుడిలా అడుగుతాడు.:

"వృక్షములు చూడవు,వినవు,రస గంథాలను అనుభవించవు,స్పర్శ లేదు కదా అయినా అవి కూడా "పాంచభౌతిక చేతన పదార్తములే " అని ఎందుకంటారో సెలవివ్వుడి అనగా..

భ్రుగు మహర్షి ఇలా సమాధానమిచ్చాడు.

"ఓ భరద్వాజ ! వృక్షములెంత గట్టిగ కనిపించినను వానిలోనూ ఆకాశమున్నది.దీనివలననే నిత్యం పుష్ప ఫలముల ఉత్పత్తి సాధ్యమగుచున్నది. - 10

వృక్షములలో వేడి ఉంటుంది.దాని వలననే దాని ఆకులు,బెరళ్ళు,పూలు,కాయలు,పళ్ళు వాడిపోతూ ఉంటాయి.రాలిపోతూ ఉంటాయి.దీనివలన మొక్కలలో స్పర్శ జ్ఞానముందని తెలుస్తున్నది. - 11

వాయువు,అగ్ని,విద్యుత్ యొక్క ఫెళ ఫెళ శబ్దాలకు చెట్లనుండి ఆకులు,పూలు,పళ్ళు రాలి పడుతాయి.
దీనివలన చెట్లకు వినికిడి జ్ఞానం ఉన్నట్లు ఋజువగుచున్నది.- 12

తీగ చెట్టును నలువైపులా చుట్టుకొని దాని శీర్షము పైకి ప్రాకిపోతుంది.చూడకుండానే ఎవరికైనా తాను ముందుకెళ్ళే మార్గం ఎలా తెలుస్తుంది? దీనివలన మొక్కలకు చూపుడు జ్ఞానం కూడా ఉందని తెలియుచున్నది. -13

సువాసన - దుర్వాసనల వలన ,అట్లే అనేక రకాల పొగ వాసనల వలన,అగరు వత్తుల వాసన వలన వృక్షములు రోగరహితములగుచున్నవి మరియు పుష్పించుచున్నవి.దీనివలన వృక్షాలు వాసన చూస్తాయని కూడా తెలియుచున్నది. - 14

వృక్షములు తమ వేళ్ళ తో నీరు త్రాగుతాయి.చెట్టుకు ఏదేని రోగము వస్తే నీళ్ళలో మందు కలిపి చికిత్స చేసే పద్ధతి ఉంది.దీనివలన వృక్షాలకు రుచికి సంభందించిన జ్ఞానం ఉందని తెలియుచున్నది.-15

మనం కమలపు తూడు (కాండం) నోటిలో పెట్టుకొని నీటిని పీల్చుకోగలుగుతాము.అదే విధముగా వృక్షములు గాలి ఒత్తిడి వలన వృక్షములు వేళ్ళ ద్వారా నీటిని పైకి పీల్చుకుంటున్నాయి. -16

వృక్షము తెగిన చోట క్రొత్త పిలక పుడుతుంది.అవి సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి కనుక వృక్షములలో ప్రాణమున్నది.అవి అచేతనాలు కావు.- 17

వృక్షములు వేళ్ళ ద్వారా పీల్చిన నీటిని చెట్టులోని వాయువు,అగ్ని ఉడికిస్తాయి.ఆహారం పరిపక్వమైనప్పుడు వృక్షము నిగనిగలాడుతూ ఉంటుంది. -18

ఇలా భ్రుగు మహర్షి అనేక ఋజువులు చూపిస్తూ నిజమైన 'వృక్ష పితామహుడు' అని అనిపించుకున్నారు
Copied from Ragi Shivanand

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

*భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌*

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

డిసెంబర్‌ 22 జాతీయ గణిత దినోత్సవ ప్రత్యేకం

శ్రీనివాస రామానుజన్‌..

భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు.

నిజానికి గణితశాస్త్ర చరిత్ర భారతదేశంలో వేదకాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాల కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే.

భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు ఆప్రతిహతంగా సాగింది. భాస్కరాచార్యుని తరువాతి కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వలన కాబోలు గణితం కళా విహీనమైంది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏదీ ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మరల భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన వాడు శ్రీనివాస రామానుజన్‌.

ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్‌, కోయల అయ్యంగార్‌ దంపతులకు మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్‌ పాఠశాల విద్య కుంభకోణం లోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు.

శ్రీనివాస రామానుజన్‌ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్‌ గణితముపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.

ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ‘ఒక సంఖ్యను అదే సంఖ్యచో భాగిస్తే ఒకటి వస్తుంద’ని చెప్పినప్పుడు ‘సున్నను సున్నతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించాడు రామానుజన్‌.

ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు రామానుజన్‌. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు.

శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్‌ వ్రాసిన ‘సినాప్సిస్‌’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాసరామానుజన్‌ తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.

10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో F.A.లో చేరాడు. కాని కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. ఒక సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.

విద్యాభ్యాసము కుంటుపడుతున్నా రామానుజన్‌ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నెల్లూరు కలెక్టరు రామస్వామి అయ్యంగార్‌ గారికి తన నోట్‌బుక్‌ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు.

కొన్నాళ్ళ తరువాత రామానుజన్‌కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సిలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్‌కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డా||వాకర్‌ రామానుజన్‌కు మద్రాసు యూనివర్సిటీ నుండి రూ|| 75/- పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు.

మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్‌. హార్దికి రామానుజన్‌ స్వయంగా, తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్‌ హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు. రామానుజన్‌ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు హార్డి. 1914 మార్చి 17న రామానుజన్‌ మద్రాసు నుండి షిప్‌లో బయలుదేరి, 20 రోజుల ప్రయాణం తరువాత ఏప్రిల్‌ 7న లండన్‌ చేరాడు.

లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.

srinivasaశుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి (Theory of Numbers) చెందినవి. 1918లో రాయల్‌ సోసైటీ ఆఫ్‌ ఇంగ్లాండు శ్రీనివాస రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సోసైటి” బిరుదునిచ్చి గౌరవించింది. 1918 లో రామానుజన్‌ కేంబ్రిడ్జి ట్రినిటి కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు.

శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హర్డీ టాక్సీ నెంబరు 1729. రామానుజన్‌ అనారోగ్యంగా వున్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కారు నెంబరు. శ్రీనివాస రామానుజన్‌ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని రెండు ఘనాల మొత్తమని చెప్పారు. దానిని రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్‌. 1729=10³+9³=12³+1³. రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼గా చెప్పారు.

2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్దాలు రామానుజన్‌ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్‌ యిచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. రామానుజన్‌ ”సమున్నత సంయుక్త సంఖ్య” అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్‌ ప్రతిపాదించిన ‘మాక్‌ తీటా ఫంక్షన్స్‌’ ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. 1903-1910 సంవత్సరాల మధ్య కాలంలో రామానుజన్‌ కనుగొన్న తరువాత రోగర్‌-రామానుజన్‌ సర్వ సమీకరణంగా పేరుపొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. రామానుజన్‌ 3⇒√9⇒√1+2×4…..⇒…  మ్యాజిక్‌ స్వ్కేర్స్‌, కంటిన్యూస్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌పై చాల పరిశోధనలు చేశారు.

వీటిని చిన్నసైజు కాగితాలపై రాసి, ప్రొఫెసర్‌ వి.రామస్వామికి చూపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్‌ మాక్‌-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్‌ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్‌ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్‌ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే.

రామానుజన్‌ మాపన సమీకరణలు ఎంత పరిమాణము వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. జార్జిషూ బ్రిడ్జికార్‌ రచించిన “Synopsis of Elementary Results in Pure and Applied Mathematics” అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు రామానుజన్‌. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్‌కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్‌ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలికిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి మూడు నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్‌ ”ఫ్రేయడ్‌ నోట్‌ బుక్స్‌” అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి” బిరుదు రామానుజన్‌ను వరించింది. రామానుజన్‌ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు.

గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న స్వర్గస్తులయ్యారు.

శ్రీనివాస రామానుజన్‌లో అసాధరణంగా దాగియున్న అంతర్‌దృష్టి, అతణ్ణి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు.

గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌

డిసెంబర్‌ 22 జాతీయ గణిత దినోత్సవ ప్రత్యేకం

శ్రీనివాస రామానుజన్‌..

భారతదేశ ఆధునిక గణిత శాస్త్రవేత్తలలో ఒకరు.

నిజానికి గణితశాస్త్ర చరిత్ర భారతదేశంలో వేదకాలం నుండే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయులు గణితంలో ఎన్నో విషయాలు కనుగొన్నారు. సంఖ్యలను కనుగొనడంలో చాల కృషి చేశారు. దశాంశ పద్ధతిని గుర్తించిన మొదటివారు భారతీయులే.

భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలంలో స్వర్ణయుగం నుండి భాస్కరాచార్యుని వరకు ఆప్రతిహతంగా సాగింది. భాస్కరాచార్యుని తరువాతి కాలంలో బహుళ విదేశీ దండయాత్రల వలన కాబోలు గణితం కళా విహీనమైంది. అనువాదాలు, వ్యాఖ్యానాలు తప్ప పెద్దగా స్వతంత్ర గణిత సారస్వతం ఏదీ ఆవిష్కరణ కాలేదు. ఆ స్థితిలో మరల భారతీయ గణిత చరిత్రకు వన్నెలద్దిన వాడు శ్రీనివాస రామానుజన్‌.

ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్‌, కోయల అయ్యంగార్‌ దంపతులకు మద్రాసు (తమిళనాడు) రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ కుంభకోణంలో చిన్న బట్టల కొట్టులో గుమాస్తాగా పనిచేసేవారు. అందువల్ల శ్రీనివాస రామానుజన్‌ పాఠశాల విద్య కుంభకోణం లోనే జరిగింది. చిన్ననాటి నుండి రామానుజన్‌ అసాధారణ తెలివితేటలు చూపేవాడు.

శ్రీనివాస రామానుజన్‌ బాల్యం నుంచి గణితం అంటే అభిరుచి కనబరుస్తూ తన ప్రతిభతో ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచేవాడు. అయితే శ్రీనివాస రామానుజన్‌ గణితముపై మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపేవాడు. ఇతర అంశాలలో అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు. అందువల్ల ఇంటర్మీడియట్‌ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయాడు.

ఒకసారి తరగతి గదిలో గణిత ఉపాధ్యాయుడు ‘ఒక సంఖ్యను అదే సంఖ్యచో భాగిస్తే ఒకటి వస్తుంద’ని చెప్పినప్పుడు ‘సున్నను సున్నతో భాగించినప్పుడు ఒకటి ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించాడు రామానుజన్‌.

ప్రాథమిక విద్యకు సంబంధించిన పరీక్షలలో జిల్లాలో ప్రథముడిగా ఉత్తీర్ణుడైనాడు రామానుజన్‌. ఉపకార వేతనం పొందాడు. 10వ తరగతి చదివే రోజులలో అతడు బీజగణితము, త్రికోణమితి, కలన గణితము, వైశ్లేషిక రేఖాగణితము మొదలగు వానిని అధ్యయనం చేశాడు. త్రికోణమితిని తన 12 సంవత్సరాల వయసులోనే పూర్తి చేశాడు.

శ్రీనివాస రామానుజన్‌ను ఎక్కువగా ప్రభావితం చేసినది కార్‌ వ్రాసిన ‘సినాప్సిస్‌’. దానిలో 6 వేలకు పైగా నిరూపణలు చేసిన సిద్ధాంతాలున్నాయి. అనేక సిద్ధాంతాలను తనకు తానుగా నిరూపించి శ్రీనివాసరామానుజన్‌ తన ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు.

10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన తరువాత కుంభకోణం ప్రభుత్వ కళాశాలలో F.A.లో చేరాడు. కాని కృతార్థుడు కాలేకపోయాడు. అందువల్ల కళాశాల విద్యలో రాణించలేకపోయాడు. ఒక సంవత్సరం తరువాత తిరిగి కళాశాలలో చేరినా లాభం లేకపోయింది. డిగ్రీ పొందకుండానే ఇంటికి తిరిగి వచ్చాడు.

విద్యాభ్యాసము కుంటుపడుతున్నా రామానుజన్‌ గణిత పరిశోధనలకు ఆటంకం కలుగనీయలేదు. నెల్లూరు కలెక్టరు రామస్వామి అయ్యంగార్‌ గారికి తన నోట్‌బుక్‌ చూపించి ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనం పొందుతూ పరిశోధనలు చేశాడు.

కొన్నాళ్ళ తరువాత రామానుజన్‌కు జానకితో వివాహం అయింది. సంపాదన కోసం మద్రాసు ప్రెసిడెన్సిలో చిన్న గుమాస్తాగా చేరాడు. గణిత పరిశోధనలపై శ్రీనివాస రామానుజన్‌కు ఉన్న శ్రద్ధ, అతని శాంత స్వభావం చూసి డా||వాకర్‌ రామానుజన్‌కు మద్రాసు యూనివర్సిటీ నుండి రూ|| 75/- పరిశోధన ఉపకార వేతనం ఇప్పించాడు.

మొదటిసారిగా 1913 జనవరి 16 మకర సంక్రాంతి నాడు ప్రొఫెసర్‌. హార్దికి రామానుజన్‌ స్వయంగా, తన అర్హతలు, గణితంలో గల ప్రావీణ్యత, సామర్థ్యాలను గురించి ఉత్తరం వ్రాశాడు. అది చూసి ప్రొఫెసర్‌ హార్డి రామానుజన్‌ను కేంబ్రిడ్డికి ఆహ్వానించారు. రామానుజన్‌ పరిశోధనలు చూసి ఆశ్చర్యపోయాడు హార్డి. 1914 మార్చి 17న రామానుజన్‌ మద్రాసు నుండి షిప్‌లో బయలుదేరి, 20 రోజుల ప్రయాణం తరువాత ఏప్రిల్‌ 7న లండన్‌ చేరాడు.

లండన్‌లో కేంబ్రిడ్జిలో గల ట్రినిటి కాలేజిలో ప్రవేశించి, 1917 వరకు గణిత పరిశోధనలు చేశాడు. వీటి గురించి ప్రపంచ పత్రికల్లో వ్యాసాలు ప్రచురితమయ్యాయి. దీనివలన ప్రపంచ వ్యాప్తంగా రామానుజన్‌ ప్రతిభ వెల్లడైంది. 1914 నుండి 1919 వరకు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కఠోరంగా పరిశ్రమిస్తూ 32 పరిశోధనా పత్రాలు సమర్పించారు రామానుజన్‌.

srinivasaశుద్ధ గణిత శాస్త్రజ్ఞుల్లో శ్రీనివాస రామానుజన్‌ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. ఈయన గణిత పరిశోధనలు ముఖ్యంగా సంఖ్యావాదానికి (Theory of Numbers) చెందినవి. 1918లో రాయల్‌ సోసైటీ ఆఫ్‌ ఇంగ్లాండు శ్రీనివాస రామానుజన్‌కు అత్యంత ప్రతిష్టాకరమైన ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సోసైటి” బిరుదునిచ్చి గౌరవించింది. 1918 లో రామానుజన్‌ కేంబ్రిడ్జి ట్రినిటి కళాశాల ఫెలోగా ఎన్నికయ్యాడు.

శ్రీనివాస రామానుజన్‌ సంఖ్య 1729 అని అంటారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆచార్య హర్డీ టాక్సీ నెంబరు 1729. రామానుజన్‌ అనారోగ్యంగా వున్నప్పుడు పరామర్శించడానికి వెళ్లిన కారు నెంబరు. శ్రీనివాస రామానుజన్‌ 1729 యొక్క ప్రాముఖ్యత హార్డీకి వివరించారు. దానిని రెండు ఘనాల మొత్తమని చెప్పారు. దానిని రెండు రకాలుగా రాయగల మిక్కిలి చిన్న సంఖ్య అని గుర్తించిన మేధావి శ్రీనివాస రామానుజన్‌. 1729=10³+9³=12³+1³. రామానుజన్‌ π విలువను 3.14159265262= (9²+19²/22)¼గా చెప్పారు.

2తో ప్రారంభించి వరుస ప్రధాన సంఖ్యల లబ్దాలు రామానుజన్‌ రాశారు. ప్రధాన సంఖ్యలపై రామానుజన్‌ యిచ్చిన వివరాలు ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. రామానుజన్‌ ”సమున్నత సంయుక్త సంఖ్య” అనే భావనను ప్రవేశపెట్టారు. రామానుజన్‌ ప్రతిపాదించిన ‘మాక్‌ తీటా ఫంక్షన్స్‌’ ప్రపంచ ప్రసిద్ధి గాంచినవి. 1903-1910 సంవత్సరాల మధ్య కాలంలో రామానుజన్‌ కనుగొన్న తరువాత రోగర్‌-రామానుజన్‌ సర్వ సమీకరణంగా పేరుపొందింది. సంఖ్యల సర్వ సమానత్వాలు, సౌష్టవాలు, వాటి మధ్య సంబంధాలు అనే వాటిపై ఆయనకు గల జ్ఞానం మరో శాస్త్రవేత్తకు లేదని చెప్పవచ్చు. రామానుజన్‌ 3⇒√9⇒√1+2×4…..⇒…  మ్యాజిక్‌ స్వ్కేర్స్‌, కంటిన్యూస్‌ ఫ్రాక్షన్స్‌, ప్రధాన సంఖ్యలు, ఎలిప్టిక్‌ ఇంటిగ్రల్స్‌పై చాల పరిశోధనలు చేశారు.

వీటిని చిన్నసైజు కాగితాలపై రాసి, ప్రొఫెసర్‌ వి.రామస్వామికి చూపారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన చివరి రోజులలో రామానుజన్‌ మాక్‌-తీటా ఫంక్షన్ల్‌పై చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. 1916లో రామానుజన్‌ ప్రతిపాదించిన గణిత సూత్రాలు 1974లో డెల్జిన్‌ అనే ఫ్రెంచి గణిత శాస్త్రవేత్త నిరూపించాడు. ఇది రామానుజన్‌ ఉహాశక్తికి ఒక ఉదాహరణ మాత్రమే.

రామానుజన్‌ మాపన సమీకరణలు ఎంత పరిమాణము వరకైనా గుణకారాలు చేయడానికి ఉపయోగపడుతాయి. జార్జిషూ బ్రిడ్జికార్‌ రచించిన “Synopsis of Elementary Results in Pure and Applied Mathematics” అనే గ్రంథాన్ని సంపాదించి 6000 సమస్యలు సాధించారు రామానుజన్‌. ఈ ప్రతిభ శ్రీనివాస రామానుజన్‌కు మాత్రమే దక్కుతుంది. శ్రీనివాస రామానుజన్‌ ప్రధాన సంఖ్యలు, భిన్నములు, అనంత పరంపరలు, శృంఖలికిత భిన్నములు, నిశ్చిత శయనములు మొదలగు వాటిలోని సమస్యలు సాధించి మూడు నోటు పుస్తకాలలో నింపారు. వీటినే శ్రీనివాస రామానుజన్‌ ”ఫ్రేయడ్‌ నోట్‌ బుక్స్‌” అంటారు. ఈ విధంగా గణిత శాస్త్రానికి సేవ చేసినందుకు, అభివృద్ధి చేసినందుకు ”ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటి” బిరుదు రామానుజన్‌ను వరించింది. రామానుజన్‌ చివరలో మద్రాసు విశ్వవిద్యాలయంలో పరిశోధనాచార్య పదవి స్వీకరించారు.

గణిత పరిశోధనలపై అవిశ్రాంతంగా పనిచేయడంతో శ్రీనివాస రామానుజన్‌ 32 సంవత్సరాల అతి చిన్న వయసులోనే 26 ఏప్రిల్‌ 1920న స్వర్గస్తులయ్యారు.

శ్రీనివాస రామానుజన్‌లో అసాధరణంగా దాగియున్న అంతర్‌దృష్టి, అతణ్ణి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా నిలబెట్టింది. ఏ గణిత సూత్రాన్ని నిరూపణలు లేకుండా ఆయన ఆవిష్కరించలేదు.

గణిత సూత్రాలు, గణిత ప్రవచనాలు, సిద్ధాంతాలు, నంబర్‌ థీరమ్స్‌ మొదలైన గణిత సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం శ్రీనివాస రామానుజన్‌ పేర తపాల బిళ్లను విడుదల చేసింది. ఆయన జన్మించిన డిశంబర్‌ 22 వ తేదీని జాతీయ గణిత దినోత్సవముగా నిర్ణయించింది.

Thursday, 21 December 2017

విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక

హిందూ శాస్త్ర విజ్ఞానం
*********************
విశ్వ వర్ణన - ఆధునిక పరిశోధనలకి విష్ణు సహస్ర నామ వర్ణనకి పోలిక
గెలాక్టిక్ సెంటర్
విశ్వంలో నక్షత్ర మండలాలు అనబడే గేలాక్సీలుఎన్నో ఉన్నాయి. సూర్యుడూ గ్రహాలూ కలిసిన మన సౌరకుటుంబం ఉన్నది పాలపుంత అనబడే ఒకగెలాక్సీలో అని మనకు తెలుసు. ఈ పాలపుంతలో మనవంటి సౌరకుటుంబాలు ఎన్నున్నాయో లెక్కేలేదు. సూర్యులు ఎందరున్నారో లెక్కే లేదు. ఈపాలపుంతకు ఒక కేంద్రం ఉంది. దానిని గేలాక్టిక్సెంటర్ అంటారు. ఈ గెలాక్టిక్ సెంటర్ అనేది ఊహించనలవి గాని శక్తికి కేంద్రం. అది ప్రస్తుతం ధనూరాశిలో ఉంది. ఈ ధనూ రాశిలోనే గేలాక్టిక్సెంటర్ దగ్గరగా మూలా నక్షత్రం ఉంది. ఈప్రాంతంలో ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉన్నదని సైన్సు అంచనా వేసింది. ఆ బ్లాక్ హోల్ ఒక పెద్ద నక్షత్రంసైజులో ఉండి, కొన్ని మిలియన్ల సూర్యులసాంద్రతను కలిగి ఉంది. ఇది ఊహించ నలవి గానంత రేడియో తరంగాలనువేదజల్లగల శక్తిని కలిగి ఉంది. మన సూర్యునినుంచి ఇది దాదాపు 30,000 కాంతి సంవత్సరాలదూరంలో ఉంది. మన సూర్యుడు తన సౌరమండలగ్రహాలతో సహా ఈ గెలాక్టిక్ సెంటర్ చుట్టూతా 200మిలియన్ సంవత్సరాలలో ఒకసారి ప్రదక్షిణంచేస్తాడు. దీనికోసం ఆయన శూన్యంలో సెకనుకు 200 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇంకొక విచిత్రం ఏమిటంటే- ఈ విష్ణు నాభి అనేప్రాంతం ఒక ఎక్కుపెట్టబడిన విల్లువంటి ఆకారంలో,ధనుస్సులాగా ఉండి ధనూ రాశి అనే పేరుకు సరిగ్గాసరిపోతూ ఉంటుంది.
విష్ణు నాభి
మన పురాణాలు విశ్వం మొత్తాన్నీ విష్ణుస్వరూపంగా వర్ణించాయి. విశ్వం విష్ణు: అంటూ విష్ణు సహస్ర నామం కూడా చెప్పింది. విష్ణునాబి నుంచి ఉద్భవించిన కమలంలో సృష్టి మూలమైన బ్రహ్మ జననం జరిగిందని పురాణాలుచెప్పాయి. మన గెలాక్సీకి కేంద్ర స్థానం అయిన ఈసెంటర్ ను మన భాషలో నాభి అనవచ్చు. నాభి అనగా కుదురు, కేంద్రం అని అర్ధాలున్నాయి. అంటే విష్ణునాభి అయిన గెలాక్టిక్ సెంటర్ సృష్టికి మూలం అవడానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.
ఇక్కడే ఉన్నటువంటి "మూలా" నక్షత్రమండలం ఈ ఊహకు ఆధారాన్ని కలిగిస్తున్నది. ఇందులో చాలా రహస్యాలు దాగి ఉన్నవి. సృష్టి మూలమైన మహాశక్తి ఇక్కడే ఉన్నదని మనకు సూచన ప్రాయంగాతెలుస్తున్నది. ఇదే ప్రాంతంలో ఉన్నదని సైన్స్ఊహిస్తున్న బ్లాక్ హోల్ ఆ శక్తి స్వరూపం కావచ్చునా? ఈ విషయం పురాణాలు వ్రాసిన మహర్షులకు ఎలా తెలిసి ఉండవచ్చొ, ఈనాడు రేడియో టెలిస్కోపులకు కూడా లీలగా మాత్రమే అందుతున్న ఈ రాశికి వాళ్ళు ఆనాడే కళ్లతోచూచినట్లు "ధనూరాశి" అని ఎలా నామకరణంచేశారో, అందులో బ్లాక్ హోల్ సమీపంలోనినక్షత్రానికి "మూలా నక్షత్ర మండలం" అని ఎలాపేరు పెట్టారో మన ఊహకు అందదు.
రాహుకేతువులు- సృష్టి క్రమం- ఒక అంతుబట్టనిరహస్యం
ధనూ రాశి బాణం ఎక్కుపెట్టిన ఒక విలుకాని రూపంలో ఉంటుంది. ఆ బాణం సరాసరి ఎదురుగాఉన్న మిధున రాశి వైపు గురి పెట్టి ఉంటుంది. ఈవిధంగా ధనూ రాశి నుంచి మిధున రాశి వరకు ఒకగీత గీస్తే, అది జ్యోతిశ్చక్రాన్ని రెండుగా విభజిస్తుంది. మిధున రాశిలో రాహువుదైన ఆర్ద్రా నక్షత్రం ఉన్నది. ధనూ రాశిలో కేతువుదైన మూలా నక్షత్రం ఉన్నది. మిధున రాశి జంట మిధునానికి సూచిక. అనగా స్త్రీపురుషులు జంటగా ఉన్న బొమ్మ ఈ రాశినిసూచిస్తుంది.
దీన్ని బట్టి ఏం అర్ధం అవుతున్నది? మూలానక్షత్రం ఉన్న ధనూ రాశి నుంచి స్త్రీ పురుషుల సృష్టిజరిగడానికి అవసరమైన శక్తి ప్రసారం మిధున రాశివైపు జరుగుతున్నది అని తెలుస్తున్నది. అంటే ప్రధమంగా విశ్వంలో జీవావిర్భావానికి మూలం అయిన శక్తి ప్రసారం ధనూ రాశిలో ఉన్న మూలా నక్షత్ర ప్రాంతం నుంచి మిధున రాశి వైపుగా జరిగిఉండవచ్చు.
ఇక్కడే ఇంకొక విచిత్రం ఉన్నది. ఈ నాటికీ శిశుజననం జరిగినప్పుడు బొడ్డు కోయడం జరుగుతుంది. గర్భస్ఘ శిశువుకు బొడ్డు ( నాభి) ద్వారానే తల్లి నుంచి పోషణ అందుతుంది. అలాగే విశ్వం మొత్తానికీ శక్తిప్రసారం విశ్వ నాభి అయిన గెలాక్టిక్ సెంటర్లో ఉన్నమూలా నక్షత్రం నుంచి జరుగుతూ ఉండవచ్చు. ఆశక్తి కేంద్రంతో బంధం తెగిన మరుక్షణం జీవి మాయామోహాలకు లోబడి మానవ జన్మలోకి ఆడుగు పెట్టటం జరుగుతుండవచ్చు.
శిశు జననానికి పట్టే తొమ్మిది నెలలు-ఇంకో రహస్యం
శిశు జననానికి తొమ్మిది నెలలు పడుతుంది. అలాగే రాశి చక్రంలో ధనూ రాశి తొమ్మిదవది. అంటేమేష రాశిలో తలతో మొదలైన శిశువు రూపంతొమ్మిది నెలలు నిండిన తరువాత ధనూరాశి చివరలో ఈ భూమ్మీదకు వస్తున్నది. తొమ్మిదిరాశులను అధిగమించి, పదవ రాశి మరియు కర్మస్థానం అయిన మకర రాశిలోకి అడుగు పెడుతూ మకరం వలె పాకుతూ ఈ కర్మల లోకంలోకి ఆడుగుపెడుతున్నది.
మూడో నెలలో పిండంలోనికి ఆత్మ ప్రవేశంజరుగుతుందని యోగవిదులు చెబుతారు. మూడోనెలలో పిండం ఆడో మగో స్ఫుటంగా తెలుస్తుంది.అందుకనేనేమో, మూడవ రాశి అయిన మిధునంయొక్క గుర్తు- స్త్రీ, పురుషులుగా ఉంటుంది. అంటే లింగ నిర్ధారణ ఆ సమయంలో జరుగుతుంది అనిరహస్య సంకేతంగా సూచితం అవుతున్నది
మూడో రాశి అయిన మిధునం లో ఉన్నపుడు,మూడవ నెలలో, దానికి సూటిగా ఎదురుగా ఉన్న ధనూ రాశినుంచి, బాణం లాగా ఆత్మ వచ్చి

విద్యుత్ అగస్త్యమహర్షి

విద్యుత్ ను గురించి
అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలు ఇప్పుడు లభిస్తున్నాయి. వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
“సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్మృతమ్I
ఛాదయే ఛ్ఛిఖిగ్రీవేన చార్థ్రాభిః కాష్ఠపాంసుభిఃII
దస్తాలోప్టో నిథాతవ్యః పారదాఛ్ఛాది దస్తతఃI
సంయోగా జ్ఞాయతే తేజో మిత్రావరుణ సజ్ఞ్గితమ్II”
దీని భావం - ఒక మట్టి కుండను తీసుకుని దానిలో రాగి పలక పెట్టాలి. తరువాత దానిలో మైలు తుత్తం వేయాలి. తర్వాత మద్యలో తడిసిన ఱంపపు పొట్టువేయాలి. పైన పాదరసము మరియు యశదము (జింక్) వేయాలి తర్వాత తీగలను కలపాలి అప్పుడు దాని నుండి మిత్రావరుణ శక్తి ఉద్భవిస్తుంది.
మరో శ్లోకం చూడండి
“అనేన జలభంగోస్తి ప్రాణోదానేషు వాయుషుI
ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతఃII
వాయు బంధక వస్త్రేణ నిబద్దో యానమస్తకేI
ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్II”
దీని భావం - ఒక వంద కుండల యెక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే, నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు, ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
1. తడిత్ – పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
2. సౌదామిని – రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
3. విద్యుత్ – మేఘముల ద్వారా పుట్టునది.
4. శతకుంభి – వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
5. హృదని – స్టోర్ చేయబడిన విద్యుత్తు.
6. అశని – కర్రల రాపిడి నుండి పుట్టునది.
ఇంత వివరంగా ఇచ్చిన సమాచారం ఉంటే కొందరు ఆంగ్లమానస పుత్రులు అన్నీ మన శాస్త్రాలలో ఉన్నాయిష అని వ్యంగ్యంగా అంటూఉంటారు. వీరి కళ్ళకున్న ఇంగ్లీషు కళ్ళజోడు, ఎర్ర కళ్ళద్దాలు తొలిగిస్తే కనబడతాయి. ఆంగ్లేయులు వ్రాసిన చరిత్ర చదువుతారు. భారత దేశం మీద ప్రేమ ఎక్కువ ఉంటే అంటూ సలహాఇస్తారు. సంస్కృతం రాదు. చదవడానికి, వెదకడానికి వీరికి సమయం దొరకదు, ఎవరో చేప్పిన ఎంగిలి మాటలు నాలుగు పట్టుకుని మనని, మన శాస్త్రాలను విమర్శిస్తు తిరుగుతుంటారు. వారు అభ్యుదయభావాలు కల వారిగా ఊహాలోకాల్లో ఉంటారు. అటువంటి వారికి మనం చెప్పేదేమీలేదు.

మయాన్‌ మూలాలు మనవే

మయాన్‌ మూలాలు మనవే..!
సనాతన ధర్మం.. దాని మూలాల సమస్తవిశ్వమంతా విస్తరించానేది వాదన కాదు.. నిర్హేతుక వాస్తవం. ఇందుకు ఎన్నో ఉదాహరణలు.. నిదర్శనాలు తాజాగా కనిపిస్తున్నాయి. సముద్రగర్భంలోని ఇండియన్‌ ప్లేట్‌ కదలికల ఆధారంగా దక్షిణ భారతం నుంచి ప్రస్తుతం కొన్ని దేశాలు విడిపోయాయి. ఇందుకు సముద్ర గర్భంలో కలిసిపోయిన కుమారి కాండం.. ఈ మధ్యే మడగాస్కర్‌ దగ్గర కనుగొనడం విశేషం.
దక్షిణ అమెరికా పిరమిడ్లు, మయాన్‌ నాగరికత ఇంచుమించుగా చాలా దగ్గరగా ఉంటాయి. ఈజిఫ్షియన్లు మిగిలిన వారికి ప్రేరణగా నిలిచారని చెప్పవచ్చు. ఇదే నేపథ్యంలో ఈజిఫ్షియన్లు పూర్వ దక్షిణ భారత దేశానికి చెందినవారని చెప్పాలి. ఈజిఫ్షియన్లుకు సనాతన ధర్మం, పూర్వ దక్షిణ భారతంలో అనేక అంశాల మధ్య సారూపత్యలు ఉన్నాయి.
సోమ-వంగ వంశంలో మొదటి చక్రవర్తి అయిన విశ్వామిత్రడు.. మను-వినా చక్రవర్తుల మధ్య జరిగిన యుద్ధం.. అనంతర పరిణామాలతో బ్రాహ్మణులను ప్రస్తుత ఈజిఫ్టు రాజధాని కైరో (అప్పట్లో మార్సా అని పిలిచేవారు) వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన చారిత్రక ఆధారాలు ''కాలుక్క-భట్టా'' రచించిన భారత చరిత్రలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈజిఫ్షియన్‌ మొదటి చక్రవర్తి చక్రవర్తిగా మను-వినా వ్యవరించారని నిస్సందేహంగా చెప్పవచ్చు.
ప్రాంతాలు.. ఆధారాలు
ఇప్పుడు చారిత్రక నగరాలుగా ఉన్న అనేక పట్టణాల పేర్లను పరిశీలిస్తే.. ఆర్యా.. ప్రస్తుతం ఇరాన్‌ అని పిలుస్తున్నాం. గతంలో పర్షియా అని పిలిచేవాళ్లం. ఇక బారియాను సౌదీ అరేబియా అని, మార్సాను కైరో అని, మసుర్‌, మిసుర్‌లను మిస్రో అని పిలుస్తున్నాం. ఇక ఈజిఫ్టు చరిత్ర, న్యాయచట్టాలు, సామాజిక కట్టుబాట్లు, కళలు, సాహిత్యం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని పరిశీలిస్తే.. అవన్నీ భారతదేశంలో విలసిల్లిన పూర్వ వేదకాలం నాటివేనన్న విషయం అవగతం అవుతుంది. ఈజిఫ్టుకు చెందిన రెండో సబ్‌ రాస్‌ (పూర్వ ఈజిఫ్టు 5.2)లో భారతదేశంలోని ఆచార వ్యవహారాలకు దగ్గర సంబంధాలున్నట్లు ఉంటుంది.
ఆచారాలు - వ్యవహారాలు
మయాన్‌ నాగరికత విషయానికి వస్తే వారు పాటించే ఆచార వ్యవహారాలు, కర్మ సిద్ధాంతంపై నమ్మకాలు.. విశ్వాసాలు అన్నీ భారతదేశానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇదే భారతదేశంలోని పూర్వ వేద కాలానికి మయాన్‌ పూర్వీకులకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తోంది. ఇక మయాన్ల గురించి మహాభారతంలో ప్రస్తావన ఉంది. భౌగోలిక పరిస్థితులు, భూ కదలికల వల్ల వీరు భారత ఉప ఖండం నుంచి వేరు పడ్డారు. ఇక రామాయణంలో సైతం నాగ-మయా గిరిజనుల గురించి ప్రస్తావన ఉంది. నాగులను సనాతన ధర్మంలో దేవుళ్లుగా కొలుస్తారు. బాబిలోనియా సంస్కృతి సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
నాగుపాములు -- సంబంధం
'నాగ' అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. నాగ అంటే విషం ఉన్నది పాము అని అర్థం. ఇక విషయానికి వస్తే నాగుపామును శివపార్వుతుల తనయుడు సుబ్రహ్మణ్య స్వామిగా అరాధిస్తాం.. అదే విధంగా మయాన్లు సైతం కుకుల్కోన్‌ దేవుడుగా పూజిస్తారు. పూర్వ వేదకాలంలో భారతదేశం నాలుగు ప్రధాన భాగాలుగా విడిపోయింది. సింధూనదీ పరివాహక ప్రాంతంలో నివసించే వారిని అసురులు.. నాగులు, యక్షులు (కుబేరుడు, ఇతరులు), మయాలు. వీరినే ఇప్పుడు ద్రావిడులు అంటున్నారు. మయాలు అత్యంత ధైర్య వంతులు, మూఢనమ్మకాలను బలీయంగా విశ్వసించేవారు. పూర్వవేదకాలంలోనే అంతర్జాతీయస్థాయిలో నౌకా వ్యాపారాన్ని నిర్వహించేవారు. నౌకలను నిర్మించడంలోనూ వీరికి వీరే సాటి. ఈ నౌకల్లోనే కుబేరుడు వంటి యక్షులు ఇతర ప్రాంతాలకు ప్రయాణించేవారు. రావణలంకగా పేరొందిన సనుకేని (ప్రస్తుతం శ్రీలంక) దక్షిణ భారతదేశంతో కలిసిపోయి ఉండేది.
గ్రహాలు.. కాలగణన
సింధూ నాగరికులు బృహస్పతి గ్రహ కదలికల ఆధారంగా కాలగణన చేసేవారు. అదే మయాన్లు శుక్రగ్రహ గమనాన్ని కాలగణనకు తీసుకున్నారు. ఇక్కడే ఒక విషయాన్ని మనం గుర్తు చేసేకోవాలి.. దేవతలకు బృహస్పతి గురువు అయితే.. రాక్షసులకు శుక్రాచార్యుడు గురువు. దేవ రాక్షస గణాల మధ్య జరిగిన యుద్ధాలను గుర్తు చేసుకోవాలి. ఇదే విషయాన్ని హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ బీజీ సిద్ధార్థ్‌ విశ్లేషించారు. భారత్‌ - మెక్సికోలు ఒకే అక్షాంశంపై వ్యతిరేక దిశలో ఉంటాయి. హిందువుల చరిత్ర.. సముద్ర అంతర్భాగాల్లో నిక్షిప్తమై ఉంది. ఈ మధ్యే మెక్సికో సముద్ర తీరంలో హిందువుల శిల్పాలు వెలుగు చూశాయి. మయాన్ల దేవతగా కొలిచే తాబేలుపై ఉండే 12 స్థంభాలు భారతీయ శిల్ప కళకు సాక్ష్యంగా నిలుస్తుందని డాక్టర్‌ గణపతి స్థపతి పేర్కొన్నారు. మయాన్‌ శిల్ప కళను చూసిన పరిశీలిస్తే.. వారు పూర్వకాలంలో హిందువులే అన్న విషయం స్పష్టమవుతుందని గణపతి స్థపతి పేర్కొన్నారు

Tuesday, 19 December 2017

అష్ఫాకుల్లా ఖాన్

👤👏🏻➖➖➖➖➖➖➖➖➖
*భారతీయ స్వంతంత్ర సమరయోధుడు. "అష్ఫాకుల్లా ఖాన్" వర్ధంతి నేడు..*✍
➖➖➖➖➖➖➖➖🌸🌸🍃
*☆"నామాతృభూమిని ఆంగ్లేయుల శృంఖలాల నుంచి విముక్తం చేయాలను కున్నాను. నా త్యాగం వృథా కాదు.*
*మరెందరో త్యాగధను లకు స్ఫూర్తినిస్తుంది. నా హిందూస్థాన్ స్వేచ్ఛా వాయు వులు పీలుస్తుంది. చాలా త్వరగా బానిస సంకెళ్ళు తెగి పోతాయి. దేశంలోని ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికం బాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతు న్నాను" అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడు ను ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు.*

*¤"నా దేశ సోదరులారా! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతాలవారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐక్యమ త్యం తో ఆంగ్లేయుల ను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి"*--

*¤ అష్ఫాఖుల్లా ఖాన్ భారతమాత స్వేచ్ఛ కోసం సర్దార్ భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌ల కంటే నాలుగు సంవత్స రాల ముందే ఉరిశిక్షపడిన దేశభక్తుడు అష్ఫాఖుల్లా ఖాన్.*

*🍄సహాయనిరాకరణోద్యమము..*

*¤ మహాత్మాగాంధీ, చౌరీ చౌరాఉదంతం తర్వాత సహాయనిరా కరణోద్యమ ము నిలిపివేయడము తో అనేకమంది  భారతీయ యువకులు నిరాశ చెందారు. అలాంటి యువకులలో అష్ఫాక్ ఒకడు. ఈయన భారతదేశాన్ని వీలయినంత త్వరగా పరాయి పాలన నుండి విముక్తము చేయాలన్న తపనతో, అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఈ సమయములోనే ఈయనకు షాజహాన్‌ పూర్ కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్ తో పరిచయమేర్పడింది.*

*🍄రాంప్రసాద్ బిస్మిల్ తో స్నేహము..*

*¤ హిందూ మతము యొక్క గొప్పతనము గురించి ఇతర మతస్థులకు బోధించడానికి వెనుకాడని ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్ తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ యొక్క స్నేహము కొంత విభిన్నమైనదే. అయినా వారిద్దరి సమష్టి లక్ష్యము ఒకటే, భారత స్వాతంత్ర్యము. దీనితో ఇద్దరు మంచి మిత్రులయ్యారు. ఇద్దరూ ఒకే రోజు, కాకపోతే వేర్వేరు జైళ్లలో భారతదేశ స్వాతంత్ర్యము కోసం ప్రాణాలు అర్పించారు*

*🍄కాకోరీ రైలు దోపిడి..*

*¤ తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వ డానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు  మరియు మందు గుండు సామగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు  1925, ఆగష్టు 8 న షాజహాన్‌పూర్లో ఒక సభను నిర్వహించారు. చాలా తర్జనబర్జన ల తర్వాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు. ఆగష్టు 9న అష్ఫాకుల్లా ఖాన్ మరియు రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్ మరియు మన్మధనాథ్ గుప్తలు కలిసి కాకోరీ గ్రామము వద్ద ప్రభుత్వ ధనమును తీసుకెళుతున్న రైలును దోచుకున్నారు.*

*¤ సెప్టెంబర్ 26, 1925 ఉదయాన పొలీసులు రాంప్రసాద్ బిస్మిల్ ను పట్టు కున్నారు. అష్ఫాక్ మాత్రము పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాత ములో బీహార్ నుండి బనారస్ కు వెళ్లి అక్కడ 10 నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతములో మరెంతో కాలము ఉండలేక దేశానికి ఉపయోగపడు తుందని విదేశాలకు వెళ్లి ఇంజనీరిం గు చదవాలని నిశ్చయించి, దేశాన్ని వదిలి వెల్లడానికి మార్గాలు అన్వేషిస్తూ  ఢిల్లీ చేరాడు. అక్కడ ఒక పఠాన్ స్నేహితున్ని ఆశ్రయించా డు. కానీ అదే స్నేహితుడు అష్ఫాక్ ను వెన్నుపోటు పొడిచి పోలీసుల కు ఆయన జాడ తెలియజేసాడు "*

*¤ అష్ఫాకుల్లా ఖాన్‌ను  ఫైజాబాద్  జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరఫు న్యాయవాదిగా వాదించాడు. జైలులో ఉండగా ఈయన ఖురాన్ పఠనము చేసేవాడు. కాకోరీ దోపిడి కేసు రాంప్రసాద్ బిస్మిల్, అస్ఫా కుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి మరియు రోషన్ లకు మరణ శిక్ష్, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడముతో ముగిసినది.*

*🍄మరణము..*

*¤ అష్ఫాకుల్లా ఖాన్ ను 1927, డిసెంబర్ 19 న ఉరితీశారు. షాజహాన్‌పూర్ లోని ఈయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలమైనది. కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖానే రాజద్రోహ నేరముపై ఉరితీయబడిన తొలి ముస్లిం అని భావిస్తారు.*

*¤ ఈయన దేశానికి తన చివరి సందేశములో "నా దేశ స్వాతంత్రం కోసం ఉరికంభమెక్కిన ప్రప్రధమ ముస్లింనైనందుకు నేను గర్వపడు తున్నాను" అని రాశాడు.*

 *¤ "ఓ నా మాతృదేశమా సదా నీకు సేవ చేస్తూనే వుంటాను ఉరిశిక్ష పడినా,జన్మఖైదు విధించినా, బేడీల దరువుతో నీనామ స్మరణ చేస్తూనే వుంటాను" అష్ఫాకుల్లా ఖాన్ (ఉరి వేదిక మీద నుండి)*

*🍄మీడియా చిత్రీకరణ.*

*¤ అష్ఫాకుల్లా ఖాన్ మరియు ఈయన సహచరులు చేసిన పనులను 2006లో విడుదలైన రంగ్‌దే బసంతీ అను హిందీ సినిమాలో చిత్రీకరించారు. ఈ చిత్రములో అష్ఫాకుల్లా ఖాన్ పాత్రను కునాల్ కపూర్ పోషించాడు.*

🌐సేకరణ:సురేష్ కట్టా నెల్లూర్ సోషల్ టీచర్
          🍃🌸🤗🌸🍃

Monday, 18 December 2017

పురాణాల్లో సైన్స్

పురాణాల్లో సైన్స్
                                                           రచన: పోలిశెట్టి బ్రదర్స్

34. మన ప్రాచీన అణువిజ్ఞానం :

సృష్టిలో ఉన్నవి రెండే రెండు.

                1. శక్తి

                2. పదార్థము

        ' శక్తి ' విషయం కాస్త ప్రక్కకు పెట్టి, ఇప్పుడు ' పదార్థం ' సంగతి చూద్దాం.

        ' పదార్థం ' రెండు రకాలు.

                1. జీవ పదార్థం

                2. జడపదార్థం (అనగా జీవం లేనిది).

        ఏది ఏమైనా, మొత్తం పదార్థాలన్నీ మాత్రం పరమాణువుల మయం. ఒక పదార్థాన్ని బాగా చిన్నభాగంగా విభజించుకుంటూ పోతే, చివరకు అది కంటికి కనిపించనంత సూక్ష్మరేణువుగా మిగులుతుంది. అదే ఆ పదార్థానికి చెందిన ' పరమాణువు '. కోట్లకొలదీ పరమాణువులు కూడడం వల్ల పదార్థాలు ఏర్పడుతున్నాయి. జీవులూ, నిర్జీవులూ మొత్తం అన్నీ కూడా పరమాణు నిర్మితాలే! అంటే మనుషులు, పశు పక్ష్యాదులు, సరీసృపాలు, కీటకాలు, సూక్ష్మక్రిములు, వృక్షజాతులు, పాడిపంటలు మొదలైనవే కాకుండా గాలి, అగ్ని, భూమి, నీరు ఇత్యాదులు సైతం పరమాణువులతోనే నిండివున్నాయి. చివరకు నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఏస్టరాయిడ్స్, తోకచుక్కలు మున్నగునవి కూడా పరమాణు సముదాయాలే! పరమాణువు లేనిది సృష్టి లేదని చెప్పవచ్చు.

        మనిషికీ, విశ్వానికీ, విశ్వకర్తకూ ఉన్న సంబంధ బాంధవ్యం ఎలాంటిదో తెలుసుకోవడానికి చిరకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పురాణకాలం నుండి ఎందరో దార్శనికులు విశ్వరహస్యాల గురించి తృప్తికరమైన సమాధానాలను ఇవ్వడానికి త్రికరణశుద్ధిగా ప్రయత్నాలు చేశారు. అట్టి ప్రయత్నాలలో కొంతవరకూ సఫలీకృతులైనవారిలో "కణాద మహర్షి" ఒకరు.

కణాదుడు :

        అణువిజ్ఞానాన్ని ప్రపంచంలో ప్రప్రథమంగా గ్రంథస్థం చేసిన మహావిజ్ఞాని "కణాద మహర్షి". ఈయన అసలుపేరు "కాశ్యపుడు". కణాల (అణువుల) గురించి వివరించిన మేధావి కాబట్టి ఈయనకు "కణాదుడు" అనే పేరు వచ్చింది. అణువులు, పరమాణువుల గురించి "వైశేషిక సూత్రం" అనే గ్రంథాన్ని ఈయన రచించాడు. ఆ గ్రంథంలో ఈయన చేసిన ప్రతిపాదనలు సమగ్రవంతంగా ఇప్పటికీ ఆమోదయోగ్యమై ఉండడం ఎంతో విశేషం. ఈయన తొలిసారిగా వాడిన ' పరమాణువు ' పదం ఈనాటికీ తిరుగులేకుండా ఉంది. గ్రీకు దార్శనికులైన "లూసీప్సన్, డెమోక్రిటన్" ల సిద్ధాంతాలు, కణాదుని పరమాణు తత్త్వవిజ్ఞానం ముందు వెలవెలపోతున్నాయి.

        "పదార్థాన్ని విడగొడితే అణువులు, అణువులను విడగొడితే పరమాణువులు ఏర్పడతాయి" అని కణాదుడు స్పష్టంగా చెప్పాడు. విభిన్నమైన పరమాణువులు ఎన్నో ఉన్నాయని, వాటి విలక్షణమైన కలయిక వల్లనే భూమ్యాకాశాలు, అగ్ని, గాలి, నీరు మొదలైనవన్నీ రూపొందాయని వివరించాడు. పదార్థాలు పరమాణువుల స్థాయికి వచ్చినప్పుడు, ఆ పరమాణువులు తమ విశిష్ట లక్షణాలతో అలరారుతాయని చెప్పాడు.

        పదార్థాలుగా రూపొందేటప్పుడు రకరకాల పరమాణువులు కలియడం వల్ల వాటికి ప్రత్యేకమైన ధర్మాలు ప్రాప్తిస్తాయనే సత్యాన్ని ఈ శాస్త్రవేత్త ఆనాడే ప్రకటించడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 2 పరమాణువులు కలిస్తే 'ద్వణుకం' అవుతుందనీ, 3 పరమాణువులు కలిస్తే 'త్రణుకం' అవుతుందనీ ఈయన వివరించాడు. ఈ సిద్ధాంత ప్రకారమే వైశేషిక దర్శన అనుయాయులైన శాస్త్రవేత్తలు లోహవిజ్ఞానాన్ని పరిపుష్ఠం చేశారు. సృష్టిలో పదార్థాలన్నీ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, కాలము, దిక్కు, ఆత్మ, మనస్సుల కలయికతో ఏర్పడుతున్నాయని వివరించి చెప్పాడు.

        పదార్థాలన్నింటికీ మూలమైన పరమాణువులు, సృష్టి నిర్మాణములో ఆధారం అయినందున అవి నిత్యములై ఉంటాయనీ, వాటికి నాశనం లేదనీ చెప్పాడు. తన గ్రంథంలో ఆత్మ, మనస్సుల గురించి కూడా కణాదుడు వివరణ ఇచ్చాడు. మొత్తం మీద ఈయన ' పరమాణువాదము, పరమాణు నిత్యత్వ వాదము, షట్ పదార్థ వాదము, సృష్టివాదము ' మున్నగు వాదాలను ప్రతిపాదించాడు.

 "భగవద్గీత" లో కృష్ణపరమాత్మ చెప్పిన కొన్ని మాటలు పరమాణు విజ్ఞానానికి సంబంధించినవే! "అనంతమైన తన ' శక్తి ' విశ్వంలోని ప్రతి అణువునా దాగి ఉన్నదనీ, అనూహ్యమైన రూపం కల తాను అణువుకన్నా అణువుననీ" ఆయన చెప్పడం జరిగింది. అణువుల్లో, పరమాణువుల్లో ' శక్తి ' దాగివున్న విషయాన్ని ఆధునిక శాస్త్రవేత్తల కంటే ముందుగా శ్రీకృష్ణుడే చెప్పాడు. పరమాణువులను విచ్ఛిన్నం చేస్తే అందులో నుండి బ్రహ్మాండమైన శక్తి విడుదలవుతుంది. ఆటంబాంబు ప్రయోగ ప్రక్రియ ఇదే మరి! ఆటంబాంబు కనుగొనని క్రితమే, పరమాణువులో అంతటి బృహత్తరమైన (తన) శక్తి ఉన్నదని శ్రీకృష్ణుడు చెప్పడం గమనించదగిన విషయం.

        నేడు పరమాణు విజ్ఞానం అనేక విధాల వికసించి మానవాళికి సేవ చేస్తున్నది. శాస్త్రప్రయోజనం సమాజశ్రేయస్సే కావాలని నిర్దేశించిన ఎంతోమంది భారతీయ శాస్త్రవేత్తల్లో కణాదమహర్షి ఒకరు.

        ప్రళయాన్ని సైతం సృష్టించగల పరమాణువుల విషయంలో మనిషికి ఎంతైనా సంయమనం అవసరం. పరమాణు విజ్ఞానాన్ని మానవాళి అభివృద్ధికి వినియోగించాలి గాని, వినాశనానికి వాడుకోకూడదు. ఇది ప్రపంచం గుర్తించవలసిన సత్యం.


Saturday, 16 December 2017

ఆయుర్వేదం నందు ఇంజక్షన్ ద్వారా వైద్యం చేసే ప్రాచీన విధానం

ఆయుర్వేదం నందు ఇంజక్షన్ ద్వారా వైద్యం చేసే ప్రాచీన విధానం  -


           మన ప్రాచీన ఆయుర్వేదం నందు ఔషధాలను నోటి ద్వారా కాకుండా ఒక సూది ద్వారా లొపలికి ఇచ్చే వైద్య విధానం ఒకటి ఉన్నది. కొన్ని పరిస్థితులలో రోగి నోటి ద్వారా ఔషధాన్ని గ్రహించలేకున్నప్పుడు అనగా అపస్మారము , మూర్చ , సన్నిపాతము , పాముకాటు , మెదడు వ్యాధి , యాక్సిడెంట్స్ , మెదడు ని తినే ensplosis ఉన్మాదము వంటి వ్యాధుల యందు , స్మృతి లేని పరిస్థితుల యందు (COMA) రోగి రక్తం నందు ఔషధము ను ప్రవేశింప చేయుట . 1906 వ సంవత్సరంలో మద్రాస్ గవర్నర్ గా ఉన్న జార్జ్ ఏప్రెల్ గారు భారతీయ మెడికల్ అసోసియేషన్ ముందు ఉపన్యాసం ఇస్తూ " టీకా "( వాక్సినేషన్) మరియు ఇంజక్షన్ విధానం మున్నగు పద్ధతులు డాక్టర్ జన్నర్ మహాశయుని కంటే పూర్వమే భారతీయులు వైదిక యుగము నుండియే టీకా విధానం వాడుచున్నారు అని డాక్టర్ కర్నల్ గారు నిరూపించారు అని సూచించిరి. డాక్టర్ కర్నల్ గారు ఋగ్వేదం , యజుర్వేదం , అధర్వణ వేదం నందలి ఒక మంత్రం ఈ విధంగా తెలియచేసారు .

   మస్త్వాజ్జః ప్రసర్పఖంగా మంగం పరుశ్పరూహ్
   తతో యక్షం వివాద్య స ఉగ్రో మధ్యమ శిఖి

        దీనిలో " ప్రసర్పన్ " " ప్రవిశ్యా " " అంతః " శిరాముఖ వ్యాపనోచి అంజనా గల శీలద్రవ్యం అంగ ప్రత్యంగం లో ప్రవేశించుగాక . ఈ భావమునే వైజ్ఞానికులు తెలుపుతున్న వాక్సినేషన్ మరియు ఇంజక్షన్ పద్దతులను తెలుపుతుంది.  ఈ సూచీ విధానం గురించి ఈ క్రింది గ్రంథాలలో వివరణ కనిపిస్తుంది.

        *  ధన్వంతరి సంహిత.
     
        *  రస కామధేనువు.

        *  రసరాజ వసంతము.

        *  బృహన్నిఘంటు రత్నాకరం .

        *  రసేంద్ర చింతామణి.

        *  యోగ చింతామణి.

        *  రసప్రకాశ సుధాకరము .

        *  శారంజ్గాధర సంహిత.

        *  బృహత్ యోగ తరంగిణి.

        *  రససైకత , కామ్కా ఉల్లాసం .

           రక్త భేషజ విధానం అనగా ఔషద విశేషమును రక్తం నందు ప్రవేశింప చేసి వ్యాధిని నిర్మూలించే విధానం . మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను .

 *  సన్నిపాత ( typoid ) రోగి సృహ తప్పి పళ్ళు బిగించుకు పొయిన దశలో ఔషధమును నోటి నుండి గాని ముక్కుపుటము నుండి కాని లొపలికి పంపుటకు వీలుకాని దశలో కపాలమును పదునైన కత్తితో చీరి సిద్ధ ఔషధములు ను సూదిమొనకు వచ్చినంత మాత్రమే అందులో వేసి రుద్ది రక్తంతో కలిసిన వెంటనే మస్తిష్క నాడీకేంద్రం చేతనం పొంది వారు లేచి మాట్లాడతారు.

 *  తేలు కుట్టిన వెంటనే ఆ విషం పైకి ఎక్కకుండా గట్టిగా బిగించి కట్టి కుట్టినచోట బ్లేడుతో కాని కత్తితో కాని చీరినప్పుడు రక్తంతో పాటు విషం కూడా కారిపోవును . రక్తం తీయలేని వారు పొటాషియం పర్మాన్గానేట్ ఆ చోట వేసి చింతపండు నీటిలో తడిపి ఆ గుజ్జుని దానిపైన వేసిన కుతకుతమని పొంగి విషముని కాల్చివేయును. లేదా తెల్ల ఉల్లిగడ్డ మెత్తగా దంచి దానిపై వేసి కట్టు కట్టాలి. లేదా ఉత్తరేణి ఆకు రసముని గంటె లొ వేసి ఆవిరి పట్టేది.

 *  ప్రాచీన కాలంలో కొన్ని రకాల చెట్ల పసర్లుని సూదులు గుంపుగా కట్టి మొండి కీళ్ల నొప్పుల పైన ముసలివాళ్లు పచ్చ పోడిపించుకునే వారు . అడివి జాతుల యందు ఈ విధానం ఇప్పటికి అలవాటు ఉంది.

 *  పాము కరిచినప్పుడు రావిఆకులు తో చికిత్స చేస్తారు . రావిఆకుల చిన్న మండ తీసుకొచ్చి ఆకులు తుంచిన పాలు వచ్చును. పాము కాటువేసిన వ్యక్తి యెక్క రెండు చేతులు వెనకకి విరిచి కట్టి పాలుకారే ఆకు యెక్క తోడిమని కదలకుండా ఒక చెవ్వు రంధ్రములో కొంతవరకే దూర్చవలెను . చెవిలొ కర్ణ బేరికి తగలకుండా ఉండునట్లు జాగ్రత్త వహించవలెను. రెండొవ ఆకు తోడిమని మరొక చెవి రంద్రములో జాగ్రత్త వహించవలెను. అలా ఆకులని దూర్చగానే రోగి మూర్చ నుండి లేచి భాధతో కేక వేయును.అతనికి పూర్తిగా విషం దిగినదా లేదా అని తెలుసుకొనుటకు వేపాకు రోగిచే నమిలి తినిపించవలెను . పూర్తిగా చేదు ఉన్నట్లయితే విషం దిగిపోయినట్లు గుర్తించవలెను. లేనిచో మరియొక సారి చేయవలెను .

 * తేనెటీగల కొండిలోని విషముతో కూడా వైద్యం చేయవచ్చు . శరీరాంగములు లో పొట్ట ఊది నీరు నిండి మెరుస్తూ ఉంటుంది. దానిలో పూర్తిగా నీరు నిండి ఉంటుంది. దీనినే జలోదరం అంటారు. ఇది చాలా కష్టసాద్యం అయిన వ్యాధి . శరీరం పై చర్మం మైనం లాగా అయిపొతుంది. మూత్ర పిండాలు పనిచేయవు . అట్టి సందర్భాలలో ఈ చికిత్స అధ్బుతంగా పనిచేస్తుంది . ఇది ప్రయోగించగానే మూత్రం అధికంగా వచ్చి శరీరం అంతా నీరు వాపు దిగి పొతుంది.

               చిన్నపిల్లలకు వచ్చు మెదడు క్షయ లొ పిల్లవాడు తెలియకుండానే పడిపోతాడు. తల అటుఇటు కదల్చ లేడు కేకలు పెడతాడు. లేచి పడతాడు , తలనొప్పితో ఏడుస్తాడు , శరీరం ఒక పార్శ్వం చచ్చు పడుతుంది. పక్షఘాతం అర్ద భాగం లొ కొట్టుకుంటాడు , కండ్లు తిరుగుతూ దృష్టి ఉండదు. నాడి వేగముగా కొట్టుకుంటుంది. మూత్రం తక్కువై మెదడులో నీరు చేరుట చేత తెలివిహీనుడు అగును. అట్టివారికి ఈ మందు పనిచేయును .

  తేనెటీగల కొండి చికిత్సా విధానం  -

         తేనెటీగల కొండి విషాన్ని ప్రత్యేకమైన సిరంజి ద్వారా చర్మము క్రింద ఇంజెక్ట్ చేస్తారు . మనకు కావలసినప్పుడు ప్రకృతి సిద్ధముగా తేనెటీగలు వచ్చి ఆయాభాగముల యందు కుట్టవు.కావున ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ విషమును సేకరించి ఈ సూచి చికిత్స ద్వారా పంపుదురు. దీనివలన బ్లడ్ ప్రెషర్ , గుండె , చర్మవ్యాదులు , కీళ్ళనొప్పులు , ముద్ద కీళ్ళనొప్పులు , ఉదరవాతం , గాయాలు మున్నగునవి నివారించ బడును.



              కాళహస్తి వెంకటేశ్వరరావు

                అనువంశిక ఆయుర్వేదం

                       9885030034

Thursday, 14 December 2017

వేద గణితం

పూర్వం, చదరంగం అంటే ప్రాణం సైతం ఇచ్చే ఒక రాజు వద్దకు ఒక ఘనపాటి యైన వేద పండితుడు వచ్చి, ఒక ఘన పనసతో రాజును ఆశీర్వదించాడు. చదరంగం పిచ్చిగల రాజు " వేదం నేనైనా నేర్చుకొని చెప్పగలను, కానీ నాతో చదరంగం  కేవలం 20 ఎత్తులైనా ఆడగలవా! అలా ఆడితే నువ్వు కోరింది ఇప్పిస్తానన్నాడు. 

 "రాజా, నాకు చదరంగం వస్తుంది.  కానీ, మిమ్మల్ని సంతోష పఱచడానికి మాత్రమే ఆడతానని, రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు విజయవంతంగా పూర్తి చేశాడు. ఎవరో ఒకరు గెలిచేదాకా ఆడమన్నాడు రాజు. కానీ అతడు, "మీతో 20 ఎత్తుల వరకు ఆడగలిగానని  గొప్పగా చెప్పుకోవచ్చని" సున్నితంగా తిరస్కరించాడు. "సరే, నీ ఇష్టం. నీకేం కావాలో కోరుకో, ఇప్పిస్తానన్నాడు" రాజు. 

దానికి ఘనపాటి, "రాజా, చదరంగంలో 64 గడులు వున్నాయి. మొదటి గడిలో ఒక గింజ, రెండవ గడిలో రెండు గింజలు, మూడవ గడిలో రెండవ గడికి రెట్టింపు అంటే 4 గింజలు ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని ఇప్పించి, పంపించండి చాలు" అంటూ ఒక పద్యం చెప్పాడు వేద ఘనపాటి యైన పండితవర్యుడు.

              చం. శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
                     ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుం
                     జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
                     స్తర మగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్.

పద్యం అర్థంగాని రాజు, ఆ ధాన్యమేదో ఇప్పించమని మంత్రికి అప్పజెప్పాడు. మంత్రి గారు, తన ఆస్థాన పండిత గణికులు ఉభయులూ కలిసి ఎంత ధాన్యం అవుతుందో  లెక్కించమన్నాడు. లెక్కించిన గణికులు వచ్చిన సంఖ్య చూసి దిమ్మతిరిగిపోయారు.  మంత్రికి వివరించారు. మంత్రి, ఘనపాటి మేధస్సుకు మనసులోనే సాష్టాంగ పడ్డాడు.

మంత్రి రాకను గమనిస్తున్న రాజుకు, వచ్చిన పిచ్చి బ్రాహ్మడి మీద జాలి కలిగింది. పిడికెడు గింజలకు ఆశ పడ్డాడు. కనీసం ఒక మంచి అగ్రహారం కోరుకుని వుంటే బాగు పడేవాడు. అయినా, నాతో 20 ఎత్తులు ఆడాడంటే ఒక అగ్రహారం ఇచ్చినా తప్పులేదనుకున్నాడు. మంత్రి వచ్చిన తర్వాత, " ఆ బ్రాహ్మడికి ధాన్యం ఇచ్చి పంపించారా"! అని చాలా తేలిగ్గా అడిగేశాడు.

"ఆ బ్రాహ్మణుడు సామాన్యుడు కాడు మహారాజా, అతను అడిగినంత ధాన్యం మన దగ్గర లేదు కదా!, మొత్తం భూప్రపంచంలో కూడా లభ్యం కాదు. ఎన్ని ధాన్యపు గింజలో మన పండితులు మరియు గణికులు గంటల కొద్ది లెక్కించిన పిదప చెప్పిన సంఖ్యను, ఆ వేద పండితుడు వేదగణితం ద్వారా ఒకే ఒక పద్యంలో క్షణంలో చెప్పేశాడు" అని దిక్కుతోచని స్థితిలో నిలబడ్డాడు.

ఆశ్చర్యపోయిన మహారాజు ఆ పద్యంలో ఏముందో చెప్పండి అని అడిగాడు. మహారాజా! మన దేశ పండితుల మేధ, సంక్షిప్తంగా చెప్పాలంటే అల్పాక్షరములతో అనల్పార్థ విషయంతో ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది. వివరణగా విన్న నాకు తల తిరిగి పోయింది. మీరూ వినండని అర్థాన్ని చెప్పడం ప్రారంభించాడు.

మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతిలో, వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు.
శర, సాయక, మన్మథుని బాణాలు = 5 (అమరకోశం)
గగన, వియత్ = 0 (ఆకాశం గగనం శూన్యం, అమరకోశం)
శశి, చంద్ర, తుహినాంశు = 1 (భూమికి ఒకే ఒక చంద్రుడు)
షట్కము =  6 (షట్ చక్రవర్తులు), రంధ్ర = 9 (నవ రంధ్రాలు)
నగ, గిరి, భూధర = 7 (సప్త కుల పర్వతాలు)
అగ్ని = 3 (త్రేతాగ్నులు: గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
అబ్ధి, పయోనిధి = 4 (సముద్రాలు), వేద = 4 ((చతుర్వేదములు)
తర్క = 6 (షట్ తర్కప్రమాణాలు, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి,
                                                                                              అనుపలబ్ధి)
పద్మజాస్య = 4 ( చతుర్ముఖుడు), కుంజర = 8 (అష్ట దిగ్గజములు)

పద్యంలోని అంకెల సంకేతాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సంఖ్యలను ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూద్దాం.
శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూధర
5     1     6         1    5     5        9       0         7            7

గగన అబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు
   0     4      4    7     6         4              4              8           1

 సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ విస్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు
 జగత్ప్రసిద్ధిగన్.

అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం "అంకానాం వామతో గతిః" అలా కుడి నుంచి ఎడమకు చదువుకుంటే

అలా మొత్తం చివరగా తేలిన సంఖ్య = 18 44 67 44 07 70 95 51 615.

ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం. ఇక అంత ధాన్యం నిలవచేయాలంటే, ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపుగా, ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే, 4 మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు సుమారుగా 12,000 ఘన కిలోమీటర్ల విస్తీర్ణ స్థలం కావాలి.

అన్ని గింజలను పేర్చుకుంటూ వెళితే 300,000,000 ముప్పై కోట్ల కిలోమీటర్లు అంటే, భూమికి సూర్యునికి వున్న దూరానికి రెట్టింపు కావాలి. ఒకవేళ  సెకనుకు ఒక్కగింజగా లెక్కపెడితే అన్నీ లెక్కించడానికి 58,495 కోట్ల సంవత్సరాలు కావాలి.

ఇది అసలు విషయం మహారాజా. వేదపండితులను తక్కువ అంచనా వేయలేము.  నిజానికి అతడు చదివిన ఘనపనస కూడా లెక్కలకు, ధారణా శక్తికి సంబంధించినదే. ఎంతో సాధన, ధారణా శక్తి, పాండిత్యం వుంటే తప్ప ఘనపాటి కాలేరు. అతడు ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచి అహంకరించారు. ఇప్పుడు ఏం చేయమంటారు? మాట తప్పిన దోషం మీకు సంక్రమిస్తుంది.

అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు. ఏం చేసి, ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితుడినే అడుగుదామని,  ఆ పండితుడిని మళ్లీ ఘనంగా పిలిపించి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పమన్నాడు.

ఆ పండితుడు రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టడం ఎవరి వల్లా సాధ్యం కాదు. ధాన్యం బదులుగా అవును ఇప్పించండి చాలు! అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు. అందరం ఆవులను రక్షించుకుందాం. వాటికి సేవ చేస్తూ, ఆవు పాలు త్రాగి, మేధో సంపత్తిని పెంపొందించుకుందాం.


Wednesday, 13 December 2017

పటాని సమంత్



పటాని సమంత్

🎂 భారతీయ ఖగోళ శాస్త్రవేత్త
పటాని సమంత్, పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మీ కోసం🎂

పాశ్చాత్య విజ్ఞాన మేధస్సుకు ప్రభావితం కాకుండా పూర్తిగా స్వయంకృషితో విజ్ఞాన తృష్ణతో ఖగోళ శాస్త్ర రంగానికి తమ కృషి ఫలాలు అందించిన పటాని సమంత్ పూర్తిపేరు మహామహోపాధ్యాయ చంద్రశేఖర్ సింగ్ హరిచందన్ మహాపాత్ర సమంత్. ఈయన పటాని సమంత్ చంద్రశేఖర్ గా కూడా ప్రసిద్ధి చెందారు.

🌺🌺బాల్యం🌺🌺

ఈయన 1835, డిసెంబర్ 13 న ఒడిషా రాష్ట్రంలోని ఖండాపర ప్రాంతంలో జన్మించారు. బాల్యం నుంచి విశ్వం, ఖగోళం, రాశులు మొదలైన అంసాల మిద ఆసక్తి పెంచుకొని సంస్కృతంలోని శాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేశారు. ప్రాచీనుల శస్త్రీయ పరిజ్ఞానాన్ని ఔపాశన పట్టారు. ఈయన జీవిత కాలంలో పాశ్చాత్య దేశాలలో ఖగోళ విజ్ఞాన పరిధిపెరుగుతున్నా, ఈయనకు ఏ మాత్రం తెలియడానికి అవకాశమూలేదు. ఆ ప్రభావానికి దరి చేరనేలేదు. అందుబాటులో ఉన్న సంస్కృత భాషలోని సంప్రదాయ సిద్ధాంత గ్రంథాలనే అధ్యయనం చేసి, ప్రయోగశీలిగా రూపొందారు.

💐ఖగోళ పరిశోధనలు💐

కంటితో చూడలేని ధనూరాశిని అయిదారు శతాబ్దాల క్రితమే మన పూర్వీకులు కనిపెట్టగలిగారు. ధనూరాశినే కాదు. మిగిలిన పదకొండు రాశులను వారు ఏ శాస్త్రీయ పరిజ్ఞానంతో గుర్తించగలిగిందీ ఈ రోజున మనం తెలుసుకోలేకపోతున్నాం. రవి (సూర్యుడు) సప్తశ్వరుఢుడని చెబుతూ సూర్యకాంతి వేరురంగుల కలయిక అని వేలాది సంవత్సరాల ఏ విధంగా గుర్తించగలిగారు.ప్రపంచ ప్రఖ్యాత ఖగోల శాస్త్రవేత్త "నెకల్షన్ మెర్లే" జీవిత కాలానికి కొన్ని వందల సంవత్సరాల పూర్వమే శ్రీనాధకవి తన "కాశీ ఖండం"లో కాంతివేగాన్ని ఎలా చెప్పగలిగాడు? దానికి ఆయన కనిపెట్టలే;దు. తన కాలం నాటికి తెలిసిన శాస్త్రీయ జ్ఞానాన్ని ఆయన తన పధ్యాలలో అవసరార్థం వాడుకున్నారు. ఈ కోవలోనే పటాని సమంత్ ఖగోళ శాస్త్రానికి సంబంధించి చేసిన పరిశీలనలు, గణింపులకు మూలాధారాలేమిటో అంతుపట్టడం లేదు. ఖగోళ విజ్ఞానంలో దృగ్గోచరమయ్యే ఘటనాల విలువలు గణించడానికి ప్రధానంగా రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి భూకేంద్రక సిద్ధాంతం, రెండవది సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాల ఆధారంగానే రోదసి మీద పరిశోధనలు, పరిశీలనలు గణింపులూ చేయవచును. ఖగోళంలో సంభవించే అపురూప సంఘటనల ఆధారంగా ఆయా గణింపులను, గణీంచిన విలువలను పరీక్షించి సరిచేసుకోవచ్చును. ఫక్తు సంప్రదాయ పండితుడైన పటాని సమంత్ 1874 లో జరుగబోయే శుక్ర గ్రహ సంక్రమణం (శుక్ర గ్రహం ప్రయాణ మార్గం - ట్రాన్సిల్ ఆఫ్ వీనస్) గూర్చి చాలా కాలం ముందుగానే ప్రకటించారు.

ఈయన పరిశీలనలకు జ్ఞాన ప్రపంచానికి కోపర్నికస్ తీసుకు వచ్చిన ఖగోళ శాస్త్ర విప్లవం గూర్చి పరిచయమే లేదు. అయినప్పటికీ 1874, డిసెంబరు 9 వ తేదీన శుక్ర గ్రహం సంక్రమణం ఈయన నిర్ధారించిన తేదీనే జరిగింది. ఎదిగీ ఎదగని ఆనాటి భారతీయ ఆధునిక ఖగోళ శాస్త్ర చరిత్రలో ఒక అధ్బుత పరిశోధనగా మిగిలి పోయింది. ఈ సంఘటన వ్య్వధి, సమయం ఆధారంగా భూమి - సూర్యుడి నడుమ దూరాన్ని గణన చేయతం ఎంతో ఆసక్తికరం. ఆనాడు దేశం లోని అనేకమందిని దిగ్భ్రాంతి పరిచిన ఆ సంఘటన బ్రిటిష్ పాలకులకు కూడా ఆసక్తిని కల్పించింది. ప్రభుత్వ అధ్వర్యంలో అబ్జర్వేటరీ సెంటర్లు ప్ర్రారంభమై పనిచేయడం ప్రారంభించేలా సమంత్ కృషి చేయగలిగాడు. అంతే కాదు, దేశంలో విద్యావంతులైన కొంతమంది జిజ్ఞానువులు, సంస్థానాధీశులు ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి పెంచుకొని, ఈ దిశగా కృషి ప్రారంభించారు.

పటాని సమంత్ పరిశీలించి గణింపులు చేసి, నిర్ధారించిన ఖగోళ సంఘటన తిరిగి 2004 జూన్ 8 న జరిగింది. 1874 తర్వాత తిరిగి శుక్రగ్రహం సంక్రమణం జరిగింది. ఈయన 1874 నాటి శుక్రగ్రహ సంక్రమణమునకు సంబంధించిన పరిశీలనలు, గణీంపులు పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు చేసిన కృషికి ఏమాత్రం తీసిపోవు. విశ్వాంతరాళంలోని ఘటనా ఘటనలను తాము స్వయంగా తయారుచేసుకున్న పరికరాల సాయంతో, నైపుణ్యంతో పరిశీలించారు. ఖగోళ రహస్యాలను ఛేదించడానికి అనేకానేక అంశాలను శోధించి తన జీవిత కాలాన్ని వ్యయపరచిన సమంత్ భవిషత్తరాల కోసం ఎన్నెన్నో అమూల్యమైన పరిశీలనలు, గణింపులు, నిర్దారణలు చేశారు. ఖగోళ శాస్త్ర అంశాలను అవిరామంగా శోధించి, పరిశోధించి, తమ కృషి యావత్తును సిద్ధాంతదర్పణ సంస్కృత గ్రంథంలో పొందుపరచారు. ఈ గ్రంథాన్ని ఒరియా లిపిలో తాళపత్రాల మీద రాయగా 1899 లో కలకత్తా యూనివర్సిటీ వారు ప్రచురించారు. ఈ గ్రంథం మొత్తం 2500 శ్లోకాలలో నిండి ఉంది.

🌹సిద్ధాంత దర్పణ🌹

సిద్ధాంత దర్పణలో ఖగోళ శాస్త్ర సంబంధమైన అనేక అద్భుత అంశాలు ఉన్నాయి. సూర్య, శుక్ర గ్రహాల బింబాల నిష్పత్తి 1:32 అని లెక్కించడం, పరమాద్భుతమేకాదు, విస్మయం కూడా ఇది 31 నిమిషాల 31 సెకన్లు అని లెక్కించడం మరింత గొప్ప విషయం. ఈయన రాసిన సిద్ధాంత దర్పన లోని అనేక ముఖ్యాంశాలను ఆంగ్లంలోనికి అరుణ్ కుమార్ ఉపాధ్యాయ అనువదించారు. అయినప్పటికీ పటాని సుమంత్ కృషి చరిత్ర గర్భంలోనే మిగిలిపోయింది. విశ్వాంతరాళంలో సంభవింపబోయే శుక్ర గ్రహ సంక్రమణం గురించి ఈయనకు ఎలా తెలిసిందో ఎవరూ ఊహించలేకపోయారు. స్వయంగా అధ్యయనం చేసి, గణించి, గుర్తించి పరిశీలనలు చేసి ఉండి ఉంటారని అందరూ భావిస్తారు.

💥అస్తమయం💥

ఖగోళశాస్త్ర విజ్ఞానంలో అనితర సాధ్యమైన కృషి చేసిన పటాని సుమంత్ 1904 లో మరణించాడు. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలలో మంత్ర రూపంలోనూ, శ్లోకాల రూపంలోనూ అనేకానేక వైజ్ఞానిక రహస్యాలు నిక్షిప్తమై ఉండేవి. ధృవుడు అనే కల్పిత పాత్రను సృష్టించి అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తిప్రత్యక్షమై "ఆకాశంలో అత్యున్నత స్థానాన్ని పొందిన నీ చుట్టూ సప్తర్షులు 26000 సంవత్సరాల అంతరాలలో ప్రకక్షిణలు చేస్తూ ఉంటారు" అని వరమిచ్చినట్లుగా భాగవత రచనలో ఉంది. విష్ణువచ్చల యనంలో ఒక వలయం పూర్తి కావడానికి 26000 సంవత్సరాలు పడుతుందని భాగవత రచయితకు హ్గిపార్చస్ (ఈ విషయాన్ని క్రీ.పూ 143 లో కనుగొన్నాడు) కంటే ఎంతో ముందుగా తెలియడం చాచా ఆశ్చర్యకరమే. ఇదే తరహాలో పటాని సమంత్ డాక్టరేట్లు, డాక్టర్ ఆఫ్ సైన్స్ పట్టాలు లేకుండానే అద్వితీయ కృషిచేసి ఖగోళ శాస్త్ర పరిశోధనలు వెలువరించారు. ఈయన ఖగోళ శాస్త్రపరమైన కృషి చిరస్మరణీయం. ఈయన చేసిన అపూర్వ పరిశోధనా కృషిని గుర్తించిన మన కేంద్ర ప్రభుత్వం (తపాలా శాఖ) 2001, జూన్ 11 వ తేదీన చంద్రశెఖర సుమంత్ పేరుమీదుగా ఒక పోస్టేజి స్టాంపును విడుదల చేసింది.

Monday, 11 December 2017

వ్యాధి....ఆధ్యాత్మిక చికిత్స
****************************************
వ్యాధి రెండు రకాలు

1.వ్యసనం వల్లా వచ్చింది
2.కర్మ వల్లా వచ్చింది..

వ్యాధి రెండు స్థితులను కలిగివుంటుంది.

1.స్వభావ స్థితి
2.ప్రభావ స్థితి.

1.వ్యసనం వల్లా వచ్చింది ..

వ్యసనం వల్లా వచ్చింది ఆ వ్యసనాన్ని మానుకుంటే
సరిపోతుంది....నా మితృడు" మూర్తి "వున్నాడు.
వాడు రోజూ తాగుతాడు...దానివల్లా కడుపునొప్పి అంటాడు...మరి తాగడం మానెయ్యొచ్చు గదా ,,
అన్నాను..మానెయ్యొచ్చు కానీ నిన్న తాగానే అన్న భాధ తట్టుకోలేక ఇవ్వాళ తాగుతాను ..అంటాడు.
ఇతని కడుపునొప్పి ఎప్పుడు తగ్గుతుందంటారు..
ఇలాంటి వ్యసనపరుల గురించి ఈ సలహా నేను ఇవ్వలేను. నిజంగా వ్యసనం వల్లా వచ్చింది అంటే వ్యసనం మానుకుంటే సరి.... అంతే....ఈ రకమైన జబ్బులు మనిషిలో చాలా తక్కువ...నూటికి 10
శాతమే...

2.కర్మ వల్లా వచ్చిన వ్యాధులు...

మనిషిలో నూటికి 90 శాతము రోగాలు కర్మ వల్లా వచ్చినవే....ముఖ్య0గా మాంసాహారం తినడం అనే పాప కర్మ నుంచి వచ్చినవే...ఏదైనా ఒక జీవి ప్రాణ0 వదిలే ముందు తన శరీరంలో ఉన్న గ్రంధులనుంచి కోట్ల ""మైక్రో టెట్రియన్స్"" ను రక్తంలోకి రిలీజ్ చేస్తుంది..ఈ మైక్రో టెట్రియన్స్ ను సూర్యడు దగ్గర ఒక అడుగు దూరంలో వుంచినా నాశనం కావు...అలాంటిది మన కడుపులో ఎలా
అరుగుతాయి... ఒక జీవిని కోసేటప్పుడు అది విపరీతమైన ప్రాణ భయంతో గింజుకునేతప్పుడు
అది తన ప్రాణమయకోశంలోంచి భయానికి సంబంధించిన వైబ్రేషన్స్ ను తన క0డరాలలోకి
రక్తంలోకి వదులుతుంది...ఆ జీవి మాంసాహారం తినడం వల్లా ఆ వైబ్రేషన్స్ మన శరీరంలోకి ప్రవేశపెట్టుకుంటాము...ఆ వైబ్రేషన్స్ మన ప్రాణమయకోశంలోకి ( ethiric body ) ప్రవేశించి అక్కడ blacks ను ఏర్పరుస్తాయి...ఇవి మన మానసిక భావావేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి...మాంసాహారం తినే జంతువులకు (అందులో మనుషులను కూడా కలిపి)మానసిక
భావోద్వేగాల్లో సమతుల్యత ఉండదు...ఆ జంతువులకు భయము కూడా ఎక్కువే.....
అందుకే మాంసాహారం మనిషికి ఏ మాత్రం
శ్రేయస్కరం కాదు....కాదు గాక కాదు....

మరి తెలియకో తెలిసో...ఎన్నో జన్మలుగా తినడం
వల్లా మన eheric body లో ఏర్పడ్డ blacks వల్లా
ఆయా శరీర భాగాలలో వ్యాధి బయలుదేరుతుంది.
అది ముందు ప్రాణమయకోశంలో ethiric లో
నొప్పిగానూ,, ఇబ్బందిగానూ ,,మొదలవుతుంది..
అది ఏ blood test గానీ ఏ రకమైన భౌతికమైన
xrayకి గానీ,,scaninnig లకి గానీ అందదు...
కానీ నొప్పి,,ఇబ్బంది మాత్రం తగ్గదు...pain killers
మింగుతూనే వుంటారు...కానీ ఏ రకమైన మందుల
వల్లా కూడా ప్రాణమయకోశంలోకి blacks ను తొలగించలేదు...

ఎందుకంటే వ్యాధికి కారణమైన black ప్రాణమాయకోశంలో ఉంది చికిత్స భౌతిక శరీరంలో
జరుగుతోంది...అంటే మీరు కొమ్మలను ఆకులను నాశనం చేస్తున్నారు..కానీ వేరును కాదు .వేరును నాశనం చెయ్యనంతవరకూ మళ్లీ మళ్లీ ఆకులు కొమ్మలు వస్తూనే ఉంటాయి...

మందు సూదులతో పోదు....
మరి ఏంటి దారి.........ఇక్కడే ధ్యానం లేదా ఆధ్యాత్మిక చికిత్స మొదలవుతుంది...

ఎలా......

మైఖేల్ అనే meta physics శాస్త్రవేత్త ఒక
వినూత్నమైన అంశాన్ని ఆవిష్కరించాడు..
అదేంటంటే.....కాంతి ఏ వక్రీకరణ లేకుండా ప్రయాణించాలంటే దానికి eather అనే వాహకం
కావాలి అని నిరూపించాడు...దాన్నే ప్రాణా0 అంటాము...ఒక ప్రాణమయకోశంలో అంటే etheric body లో మాత్రమే వక్రీకరణలేకుండా ప్రయాణం చేస్తుంది...

ఇప్పుడు ఏథెరిక్ body ని కాంతి వంతం చేస్తే అది
etheric ని శక్తితో నింపుతుంది...చిన్నపైపులో ఏదైనా అడ్డంకి ఉంటే గట్టిగా ఊదినా,, లేదా force గా నీటిని పంపినా ఆ అడ్డంకి ఆ force ని తట్టుకోలేక బయటికి నెట్టబడుతుంది...అలాగే
etheric body లో శక్తియొక్క force ఎక్కువగా వుండేటప్పటికి దాని తాకిడికి తట్టుకోలేక మాంసాహారం తినడం వల్లా ఏర్పడ్డ blacks అన్నీ
కూడా etheric body నుండి బయటికి నెట్టబడతాయి...అప్పుడు భౌతికాశరీరంలో0చి
వ్యాధి నిర్మూలింపబడుతుంది......ఈ పద్ధతి కొమ్మలు ,,ఆకులు కొట్టడం లాంటిది కాదు..వేరుని
నాశనం చేసే పద్ధతి....

మరి ఎలా.....మరి ఎలా eheric body ని
కాంతితో నింపాలి...నింపితేనే ఆ కాంతి
etheric body ని శక్తివంతం చేస్తుంది...

ఇక్కడే మనస్సుకు శ్వాసను సంభంధం ఏర్పడుతోంది....మనస్సు శాంతిగా ఉంటే
కాంతి etheric body లోకి నేరుగా ప్రవేశిస్తుంది...
అది ఆలోచనలతో ఉంటే కాంతి సరిగా ప్రవేశించలేదు....కాబట్టి మనస్సుకు ఆలోచనారహితంగా చెయ్యాలి...అప్పుడే కాంతి
ఆవాహన జరిగి అది శక్తి రూపాంతరం చెందుతుంది..మనస్సును శూన్యం చేయాలి అంటే
శ్వాసను తన వేగాన్ని లయబద్దించాలి.. అందుకే
శ్వాస మీద మీ ధ్యాస ను ఉంచడం వల్లా ఆలోచన
చేసే మీ ధ్యాస అనబడే మనస్సు ఇప్పుడు ఆలోచించాలి అనే పని నుంచి తప్పుకుని గమనించాలి అనే పని పెట్టుకుంటుంది..అప్పుడు
ఆలోచించేవాడు ఎవ్వడు..?అప్పుడు మనస్సు
శాంతి అయినట్లే....అప్పుడు కాంతి ప్రవేశిస్తుంది..
etheric body శక్తితో ని0పబడుతుంది...blacks
తొలగించ బడతాయి...

ఎంత ధ్యానం చేసినా వ్యాధి నిర్మూలన కాలేదు..
అంటే ఇక్కడ వ్యాధి

స్వభావ స్థితి...
ప్రభావ స్థితి ....అని రే0డు రకాలుగా ఉంటుంది.

ధ్యానం చేస్తున్నా వ్యాధి నిర్మూలన కాలేదు అంటే
దానర్థం black తొలగించడానికి కావలసిన శక్తి సమీకరణ ఇంకా జరగలేదు అని అర్థం...సమీకరణ
కానంతవరకూ వ్యాధి స్వభావ స్థితిలో లోనే
ఉంటుంది ..అంటే రోగంగా మారదు... స్వభావాన్ని
మాత్రమే చూపిస్తూ ఉంటుంది..దీన్నే కర్మను కేవలం
స్వభావ స్థితిలో అనుభవించడం అంటారు...

అదే ధ్యానం చెయ్యలేదు అంటే అదే వ్యాధి స్వభావస్థితిలోనుండి ప్రభావస్తితిలోకి మారి
రోగంగా పరిణమించి బాధిస్తుంది......

ఈ ధ్యాన చికిత్స ప్రక్రియ చేస్తున్నప్పుడు
మాంసాహారం మానేయ్యాలి....మితాహారం
అదీ ఒక్కపూట మాత్రమే చెయ్యాలి.......
100 కి 10 మాటలే మాట్లాడాలి....అధికంగా
మౌనంగా ఉండాలి....క్రమం తప్పకుండా ధ్యానం
చెయ్యాలి...స్వాధ్యాయం,,,,సత్సంగం పాటించాలి......instumental సంగీతం బాగా వింటుండాలి...
..

Sunday, 10 December 2017

వృక్షాయుర్వేదం

వృక్షాయుర్వేదం అను అత్యంత ప్రాచీన గ్రంథ విశేషాలు  -

          ఈ వృక్షాయుర్వేద గ్రంధమును మొట్టమొదటిసారిగా "సురాపాలుడు " అనే అతను రాసాడు . ప్రస్తుత కాలంలో ఈ గ్రంథం యొక్క పూర్తి ప్రతులు దొరకడం లేదు . నాకు లభ్యం అయినంత వరకు మీకు తెలియచేస్తున్నాను . నాగర లిపిలో మాత్రం లండన్ లోని బాడ్లి యన్ గ్రంధాలయలంలో ఒక ప్రాచీన ప్రతి ఉన్నది. తెలుగులో కొన్ని బాగాలు మాత్రమే మిగిలాయి. అవే మీముందు ఉంచుతున్నాను.


 *    కొబ్బరి చెట్లకు ఎక్కువు గా కాయలు కాయలంటే ప్రతి రోజు " మరువం , పెసలు, మిణుములు" ఈ మూడింటి తో తయరు అయిన కషాయాన్ని చల్లార్చి పోస్తూ ఉండాలి. అప్పుడప్పుడు ఈ ముడింటి ముద్దను చెట్ల మొదళ్లకు పట్టించాలి. అలా చేయడం వలన కొబ్బరి చెట్టు కి విపరీతమైన బలం వస్తుంది. చాలా పెద్ద మొత్తం లొ కాయలు కాస్తూ యవ్వనం గా తయారు అవుతుంది.

 *    మల్లెపూలు తెల్లగా ఉంటాయని మనకు తెలుసు.వాటిని ఎరుపు రంగులో పూయించ వచ్చు. పారిజాతం ( పగడ మల్లె ) చెట్టు వేరుకు రంధ్రం చేసి ఆ రంద్రం లొ మల్లె తీగను తీసుకొచ్చి గుచ్చాలి.ఆ తరువాత దానిపై మట్టి కప్పాలి. రోజు నీళ్లు పొస్తూ ఉంటే పారిజాతం తో పాటు మల్లె చెట్టు కుడా కలిసిపోయి పెరుగుతుంది. ఆ తరువాత భూమిని తవ్వి మల్లె వేరుని పారిజాతం నుంచి వేరు చేసి విడిగా పాతి పెడితే కొద్ది రోజుల్లోనే తెల్ల మల్లె చెట్టు ఎర్ర మల్లె పూలు పూస్తుంది.మంచి సువాసన కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఏ చెట్టు విత్తనాలు అయినా నాటి వాటికి ఏ రంగు నీళ్లు అయితే పోస్తామో ఆ రంగు పువ్వులే పూస్తాయి.

 *   మునగ చెట్టుకి కాసిన మునగ కాయలు చెట్టు మీదే పండి ఎండిన తరువాత వాటిని సేకరించాలి. ఆ కాయలను సగం విప్పదీసి , అందులోని మునగ గింజలని తీసివేసి వాటి స్థానం లొ కాకర గింజల్ని పెట్టి , దారం తొ కాయని గట్టిగా చుట్టి భూమిలో పాతి పెట్టాలి. కొన్నాళ్ళకి చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టుకి ఒకవైపు మునగ కాయలు, మరోవైపు కాకరకాయలు పుడతాయి.

 *   విత్తనాలు లేని కాయలు కాయలంటే  వంకాయ,గుమ్మడి కాయ , పొట్ల కాయ మొదలయిన చెట్ల విత్తనలని వస రసం లొ నానబెట్టి భుమి లొ పాతి పెట్టాలి.చెట్లు మొలిచేవరకు ప్రతి రోజు వస నీళ్ళను పాదుల్లో పోయాలి.ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే చెట్లు ఆరోగ్యం గా పెరిగి గింజలు లేని పెద్ద కాయలు కాస్తాయి.

 *   కొన్ని పువ్వులు ఎంతో అందం గా ఉంటాయి.కాని వాటికి సువాసన ఉండదు.అలాంటి పూల చెట్టుకి ప్రతి రోజు " చెంగల్వ కోస్టు ,ఆకుపత్రి, సారాయి,తుంగ ముస్థలు , తగిరస, వట్టివేళ్ళు,"మొదలయిన ఔషధ చుర్ణముని నీళ్లలో కలిపి ఆ నీళ్లను చెట్ల పాదుల్లో పొస్తూ ఉంటే క్రమం గా ఆ చెట్లకి పూచే పూలకి అద్బుతమైన సుగంధం అబ్బుతుంది. ఒక నెల వరకు పూల సువాసనలు గుబాలిస్తునే ఉంటాయి.

 *   నేరేడు , పనస, మామిడి, దేవదారు, నిమ్మ  ఈ మొక్కల యెక్క బీజములను పాలలొ తడిపి నేయి , గోమయము, వాయు విడన్గాముల చూర్ణం వీటినన్నిటిని కలిపి బాగా మర్దన (పిసికి) నాటవలెను.

  *   పనస, అశోకము, అరటి, నేరేడు , దానిమ్మ,, జువ్వి , ఉశిరిక , మాదిఫలం, అడివి చేమంతి ఈ వృక్షములు గడ్డతో గాని , లేక వేరుతో గాని లేక కొమ్మలను గాని నాటినప్పుడు గోమయం పట్టించి నాటవలెను.

 *   అరిటి మొదలగు చెట్ల యెక్క గడ్డలకు గాని , తక్కిన చెట్ల వేళ్ళకు గాని వట్టివేళ్ళ చూర్ణం , నువ్వుల పొడి, తేనే , వాయు విడన్గాముల చూర్ణం , గోలిమిడి విత్తనాల చూర్ణం , నేయి , గోవు మలం వీనిని కలిపి పట్టించి నాటవలెను.

 *   బీజములకు వాయు విడంగాల కషాయం, నేయి చేర్చి పొగ వేసి , నేల ములక లేక వాకుడు చెట్టు సములంగా కాల్చిన బూడిదను , కురం అనెడి పక్షి మలమును కాల్చిన బూడిద ఈ రెంటిని పాలలొ కలిపి బీజములకి పట్టించి ఆ తరువాత 5 రోజులు ఎండబెట్టి అటు పిమ్మట ఆవు పెడ , ఆవు మూత్రం వీనితో పిసికి ఒక్క దినం నానబెట్టి నాటిన యెడల బీజములు త్వరగా వృద్దిని పొందును.

*   వాయు విడంగాల కషాయం, తేనే చేర్చి విత్తనాలకు పట్టించి నాటిన యెడల శీగ్రంగా మొలుచును. విత్తనములు వేసిన చోట గడ్డిచే కప్పి పాలును, నీళ్లను కలిపి చల్లుచుండ వలెను. విత్తనములు మొలచిన తరువాత ఆ గడ్డిని తీసివేసి ఎండ తగులు నట్టు చేయవలెను .

 *   వసుదేవి ! భవా ! పున్యదేవి ! వనే ! సుభగే ! అను మంత్రమును నమస్కార పూర్వకముగా జపించిన యెడల వృక్షములు వ్రుద్ధినొన్ధును .

 *   శాశాకరాయ ! ఇంద్ర ఈహ ! త్రయంబక అను మంత్రములలో నొక దానిచే మంత్రించిన బీజములును నాటిన యెడల చక్కగా ఫలించి మంగలమొసుగును .

 *   48 అంగుళముల లోతున, అంతే వెడల్పు గల పల్లమును ద్రవ్వి అందు ఇసుకను తీసివేసి అందులొ మెత్తని మన్ను వేసి చెట్ల మొదలలను నీటితో తడిపి నాటవలెను.

 *   చెట్లు నాటునప్పుడు ఒకదానికి ఒకటి ఉండవలసిన దూరం 20 మూరలు ఉత్తమం, 16 మూరలు మాధ్యమం, 12 మూరలు అధమం.అని తెలియును . ఈ విదంగా వృక్షములు నాటిన వ్రేళ్ళు,కొమ్మలు మొదలగునవి ఒకదానికి ఒకటి పెనవేసుకోకుండా చక్కగా పెరగడమే కాకుండ మంచి ఫలములు ఇచ్చును.

 *   దృవ నక్షత్రములు అనెడి రోహిణి , ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాబాధ్ర, మరియు మృదు నక్షత్రములు అనెడి చిత్త, రేవతి , మృగశిర, అనురాధ నక్షత్రములు, మూల , విశాఖ, పుష్యమి, శ్రవణం, అశ్విని, హస్త ఈ నక్షత్రాలు వ్రుక్షరోపనకి మంచివి. అనగా పంట వేయడానికి , మొక్కలు నాటుటకు మంచిది అని త్రికాలవేత్తలు ప్రవచించారు.

 *   మిడతలు, ఎలుకలు, పక్షులు , చీమలు మొదలగు వాని వలన చెట్లకు  నష్టం కలుగుతున్నప్పుడు పైన చెప్పిన మంత్రం 108 సార్లు జపించి ఆ చెట్లకు మంత్రం వ్రాయవలెను.

 *   పిడుగు పడి కాలిన చెట్టు యెక్క బూడిద లేక దావాగ్ని చేత కాలిన చెట్ల బూడిద నైనను చల్లినచో మంచు వల్ల ఎండిన చెట్ల దొషం నివృత్తి అగును.

 *   తెల్లని అన్నం లొ పెరుగు , ఉప్పు కలిపి చెట్లకు చల్లిన మనుజుల దృష్టి వలన కలిగిన దొషం నివృత్తి అగును.

 *   ఆషాడ, శ్రావణ, మాసముల యందు విత్తనములు వేయుటకు , చెట్లు నాటుటకు ప్రశస్తం .
గ్రీష్మ ఋతువు ( చైత్ర వైశాక మాసములు ) నందు తప్ప తక్కిన రుతువుల యందు లేత నారు నాటవచ్చు అని కొందరు చెప్పెదరు.

 *  మఖ, ఫాల్గుణ మాసములు యందు కొమ్మలు విడవని చెట్లు నాటవలెను. మార్గశిర, పుష్య మాసం యందు కొమ్మలు విడుచునట్టి నారు నాటవలెను. శ్రావణ , భాద్రపద మాసములు యందు పెద్ద చెట్లు నాటవలెను.

 *  చెట్లు ఫలించు నట్టి కాలం యందు ఉలవలు, మిణుములు, పెసలు , యవలు, నువ్వులు వీనిని చేర్చి కషాయం పెట్టి చల్లర్చిపోసిన యెడల మంచి ఫలములు ఇచ్చును. బాగుగా వృద్ది చెందును.

             

                 కాళహస్తి వెంకటేశ్వరరావు

                  అనువంశిక ఆయుర్వేదం

                     9885030034

Saturday, 9 December 2017

మొలత్రాడు

మొలత్రాడు
*********
మొల ... మనిషి శరీరానికి మధ్యగల నడుముప్రాంతాన కట్టే తాడునే మొలతాడు లేదా మొలత్రాడు అంటారు.

హిందూ సాంప్రదాయంలో పాటించే పద్దతులలో ఎదో ఒక సైన్స్ అంతర్లీనంగా దాగి ఉంటుంది అన్ని వయసుల మగవారు నడుము భాగంలో ఈ మొలతాడు (మొలత్రాడు) ను ధరిస్తారు. మొలతాడును దారంతో తయారు చేస్తారు.

కొందరు వెండి తోను, బంగారంతోను, ప్లాటినమ్ తోను ఈ మొలతాడును తయారు చేయించుకుని ధరిస్తారు. మొలతాడు మార్చవలసినప్పుడు కొత్త దానిని ధరించిన తరువాత పాతదానిని తొలగిస్తారు.

మొలతాడు దిష్టి తాకకూడదని కూడా కడతారు .
మొలత్రాడు, పురుషుల నడుం చుట్టూ కట్టే ఒక దారం లేదా దారం రూపంలో ఉన్న అలంకార లోహం .

ఇది హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. యావత్ భారతదేశంలో ఈ సాంప్రదాయం ఉంది.

చిన్నపిల్లలకు మొలతాడు కడితే ,వాళ్ళు పెరుగుతున్న సమయంలో ... వాళ్ళ ఎముకలు ,కండరాలు సరియైన  పద్ధతిలో వృద్ధిచెందుతాయి. ముఖ్యంగా మగచిన్నపిల్లలు పెరిగే సమయంలో పిల్లల  పురుషాoగం ఎటువంటి అసమతుల్యానికి గురికాకుండా ఖచ్చితమైన పెరుగదలకు తోడ్పడుతుంది, గనుక మొలతాడు కడతారు. రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

శిశువు జన్మించిన తరువాత మనవారు  మొదట చేసే పని అదే ...

చిన్నతనంలో బాలబాలికలిరువురికీ కట్టిననూ, పెద్దవారైన తర్వాత స్త్రీలు మొలత్రాడు వాడరు.

పెళ్ళైన పురుషులు మాత్రం తప్పక వాడవలసిందే.ధరించకపోతే పెళ్ళాం చచ్చిందా? అంటారు

నీ "మొలత్రాడు తెగిపోను"  అని శాపనార్ధం లాంటి తిట్టు / మాట వాడుకలో ఉంది.
పురుషుడి భార్య ఒకవేళ కాలం చేస్తే ... మొలత్రాడు తీసివేయాలి అన్న నమ్మకం/ఆచారం ఇప్పటికీ ఉంది.

మగవారు చనిపోయిన తరువాత శరీరాన్ని చితిలో దహనం చేసేముందు ఈ మొలతాడుని తప్పనిసరి తెంపుతారు.

మొలత్రాడులు ప్రాథమికంగా ఎరుపు/నలుపు లలో లభిస్తుంది. నలుపు మంచిది కాదని కొందరి అనుమానం.

పురుషులు ధరించే లుంగీ, పంచె, వదులుగా ఉన్న నిక్కర్లు, ప్యాంటులు, పైజామా, లంగోటి లని (బెల్టు ఉపయోగించకుండా) బిగుతు చేసుకోవటానికి వాటిని మొలత్రాడు క్రిందకు (అంటే నడుము కు, మొలత్రాడుకి మధ్య వస్త్రం వచ్చేలా) కట్టుకొనే సౌలభ్య్ం ఉంది.

మగవారికి "హిర్నియా" అనే వ్యాధి రాకుండా కూడా మొలతాడు కాపాడుతుంది. దీనిని పలువురు శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు.

శరీరాన్ని మధ్యాగా బాహ్యరూపంలో విభజించి చూపుతుంది ,మొలత్రాడు కట్టిన పై భాగం అలంకారం,పూజా పునస్కారాలకు సంబంధించినది అని చెప్పడమే అంతరార్ధం

స్నానాల వలన నీళ్ళని పీల్చటం వలన మొలత్రాడు మెత్తబడి, లేక ఉదరభాగం పెరిగి మరీ బిగుతుగా ఉండటం మూలాన కొంత కాలానికి అది తెగిపోతుంది. అప్పుడు మరల క్రొత్తది కొనాలి.

ఒక చిన్న సూచన ... మొలత్రాడు కి పిన్నీసులు లాంటివి కట్టకూడదు .

సంపన్నులు వెండి/బంగారు మొలత్రాడులని వాడటం కూడా ఉంది. చిన్ని కృష్ణుడిని వివరించే ఒక పద్యంలో బంగారు మొలత్రాడు అనే పదాలు వస్తాయి.

ఈ క్రింది పద్యం రెండు దశాబ్దాలకింద అన్ని పాఠశాలలో చెప్పించేవారు,చదివించేవారు.

చేతవెన్నముద్ద చెంగల్వపూదండ
బంగారు మొలత్రాడు పట్టుదట్టీ
సందె తాయత్తులను, సరిమువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణా నిన్ను నే చేరి కొలుతు !!

... ..

Tuesday, 5 December 2017

TEA భారత దేశంలో గో వంశాన్ని ఎలా కసాయి పాలు చేసిందో.

మీకు తెలుసా..??
చాయి TEA భారత దేశంలో
గో వంశాన్ని ఎలా కసాయి పాలు చేసిందో...!!

✍ .....ఇది 100% సత్యం

బ్రిటీష్ వారు భారత దేశ వైభవాన్ని సంపదను, వనరులను, అభివృద్ధిని ఇక్కడి వైజ్ఞ్యానిక సంపదను భారతీయుల మేధా శక్తిని అధ్యయనం చేసి వీటిని అన్నింటికి మూలాధారం మరియు భారతీయుల సంస్కృతి జీవన విధానం మనుగడకు గోవె ప్రధాన కారణమని దేశ అభివృద్ధికి గోవే మూలమని అన్ని కోణాల్లోంచి  నిర్ధారించుకొని

భారతీయుల జీవన విధానం నుండి గోవును తప్పిస్తే తప్ప తమ లక్ష్యం సాధించలేము అని భావించి కొన్ని కుట్రలు చేసినారు అందులో ఒకటి టి

పథకం ప్రకారం దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లోని  చౌరస్తాల్లో ఉచిత చాయ్ పంపకం free tea centers ను ఏర్పాటు చేసి జనాలకు అలవాటయ్యే వరకు ఫ్రీ టి సెంటర్లను నడిపినారు ప్రజలు చాయ్ కి బానిసలూ అయ్యారని నిర్ధారించుకొని తరవాత చాయ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆపి కేవలం చాయ్ పత్తి పాకెట్స్ ఫ్రీగా పంచడం ప్రారంభించారు

ప్రజలు వాటిని  పట్టుకెళ్లి తమ తమ ఇళ్లల్లో టీ చేసి త్రాగితే దాని రుచి కోల్పోయి చాయ్ కుదరలేదు జనాలు పరుగెత్తి వారి వద్దకు వెళ్లి టీ బాగ లేదు అని అడుగగా అప్పుడు వారు అన్నారు మేము మీకు ఫ్రీగా పంచిన టీ బర్రె పాలతో చేసినాము టీ ఆవు పాలతో రుచిగా రాదు అన్నారు

అప్పటి వరకు దేశంలో ఇంటింటికి గోవులు ఉండేవి వెంటనే దేశంలో బలమైన మార్పు ప్రారంభమై

దేశ వ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లల్లోని కొట్టాల నుండి ఒక అవును బైటకు పంపి ఒక బర్రె ను కట్టడం మొదలు పెట్టినారు

సమాజంలో పాలు కొనేవారు సైతం ఆవు పాలు విడిచి బర్రె పాలు కొనడం ప్రారంభమైంది.. మెల్ల మెల్లగా దేశంలో బర్రె పాల డిమాండ్ ప్రారంభంమై వేగం పుంజుకుంది అప్పటి వరకు దేశం లోని పాడి పరిశ్రమ లో గోవులు ఉండేవి వాటి స్థానంను బర్రెలు   ఆక్రమించాయి

పెద్ద ఎత్తున గోవులు కబేళాల పాలవడం ప్రారంభమైంది తత్ కారణంగా వందలాది ఉత్తమ ప్రాచీన జాతులు నశించి పోయినాయి కోట్లాది గోసంతతి అంతరించి పోయింది ఇంటింటికి వర్ధిల్లె గోవులు 95%   పైగా ఇళ్లల్లో మాయమైనాయి

బ్రిటిష్ వారి అంచనా ప్రకారం భారతీయులు తరతరాలుగా ఆవు పాలు త్రాగడం వల్ల మంచి ఆరోగ్యం, మేధస్సు  కలిగి ఉన్నారు వారిని బర్రె పాలకు మార్చడం వళ్ళ వారిలో చురుకు ధనం మేదా శక్తి తగ్గిపోతుంది తత్ద్వార అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి మెల్లమెల్లగా మనిషి బలహీనమవుతాడు మనకు బానిసలవుతారు అని అంచనా వేసి వారు పన్నిన కుట్ర సఫలమైది

భారతీయులు ఇంటి నుండి  గోవువులని సడాక్ లోకి తోసివేసిన పాపాన భారతీయుల ఆయుష్షు 100 సంవత్సరాల నుండి ఆయుప్రమానం 60--70  కి పడిపోయింది ప్రతి యిల్లు రోగాల కుప్పలాగా తయారైంది

ఇంట్లో గోవులు వున్నంతకాలం అనారోగ్యం, బద్ధకం, గ్రహాచార దోషం, అకాల మృత్యువు, శత్రు పీడ, వాస్తు దోషం, దరిద్రం, రసాయనిక ఎరువులు ఉండేవి కావు

ఒక చాయి మూలంగా వ్యక్తి, కుటుంభం, గ్రామం, దేశం అలాగే వ్యవసాయం, భూసారం, ఆరోగ్యం, ఉపాధి పతనమై పోయినాయి

చాయి పట్ల లోభం ఎంతో అనర్ధానికి దారి తీసింది
చాలా లోతుగా అలోచించి బ్రిటిష్ వాడు 16'th సెంచరీలో ఈస్ట్ ఇండియా కంపనీ చాయ్ పత్తి వ్యాపారం పేరుతో  ప్రవేశించి మనలను లక్షల సంవత్సరాల వెనక్కు నెట్టేసి అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోయారు

బ్రిటిష్ చాయ్ కి పూర్వం దేశంలో అందరూ కేవలం ఆవు పాలు త్రాగేవారు

బ్రిటిష్ దురాక్రమానకు పూర్వం దేశంలో పూరి గిడిసే మొదలుకొని ధనవంతుని భవంతులవరకు ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి అలా ఇళ్లల్లో గోవులు ఉన్నంత కాలం ప్రతి ఇల్లు దైవ శక్తితో నిండి ఉండేది ఆవు వ్యక్తి ఒక్క అనేక అవసరాలకు పెద్ద దిక్కుగా ఉండేది...

సమస్త జీవరాశులకు ఆరోగ్య ప్రదాత సూర్య నారాయణుడు సూర్యునినుండి కోన్ని అద్భుత బంగారు ఓషధీ శక్తులు విడుదలవుతాయి భూమి పైన వాటిని గ్రహించే శక్తి కేవలం గో మాతాకె వున్నది ఆవు ఎండలో మెతమేస్తూ తిరిగేటప్పుడు సూర్య రేష్మి ద్వారా అట్టి దివ్యమైన శక్తుల్ని తన కొమ్ములోవుండే  సూర్యకేతు నాడి ద్వారా గ్రహించి మూపురం వద్ద ప్రభావితమై తన పాలు  , పెడ  , మూత్రంలో వదులు తుంది. మిగిలిన శక్తి తన కాళ్ళ ద్వారా అక్కడి భూమిలోనికి వదులుతుంది...

దేశవాళీ ఆవుపాలల్లో సూర్యుని యొక్క శక్తివంతమైన స్వర్ణ క్రాంతి ఉంటుంది అది మానవ శరీరానికి అత్యంత శక్తివంతమైన ఓషధ భాన్డాగారము పైగా పాలు మానవ శరీరానికి కావాల్సిన అన్నిరకాల పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారము

ఇప్పుడు ట్రెండ్ మారింది మల్లి గ్రామాల్లో పట్టణాల్లో గోవు ప్రాముఖ్యతను గుర్తించి అన్ని సమస్యలకు రేడియేషన్ పొల్యూషన్ పాలిథిన్ కెమికల్స్ విష రసాయనాల దుష్ప్రభావం  నుండి కేవలం గోవే కాపాడగలదని మరియ అంతే కాక గ్రహాచార దోషం వాస్తు దోషం అనేక అనారోగ్య సమస్యల నుండి గోవే కాపాడగలదని గ్రహించిన ఎందరో తమ తమ ఇళ్లల్లో ఫ్యాక్ట్రీలలో ఫామ్ హౌస్లలో వ్యవసాయ క్షేత్రాల్లో ఆసుపత్రుల్లో విద్యా సంస్థల్లో ఇండస్ట్రిస్ లలో గోవులు పెట్టుకోవడం ప్రారంభమైంది  మహానాగరాల్లో కొన్ని చోట్ల కొత్తగా కట్టే భవంతుల్లో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్స్ మధ్య గోసధనాలను రూపొందిస్తున్నారు

మన తల్లి గోవు పథనానికి కారణమైన చాయ్ త్రాగడం కన్నా మానవ శరీరానికి  కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా కలిగి ఉండి సంపూర్ణ ఆహారంగా లభించే దేశవాళీ గోవు పాలనే సేవిద్దాం తిరిగి శక్తివంతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం

     ✨వందే గో మాతరం✨ 

జై శ్రీ రామ్                 జైగోమాత

భారతీయ శ్లోకాల్లో సైన్స్

భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు…!!
భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో రెండంటే రెండు నీటి బిందువులు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.

1. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం
2. గాయత్రి మంత్రం...

ముందుగా తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…
“యుగ సహస్ర యోజన పర భానూ!
లీల్యోతాహి మధుర ఫల జానూ”!!
దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…
యుగ= 12,000 దివ్య సంవత్సరములు
సహస్ర=1000
యోజన్= 8 మైళ్ళు
యుగ x సహస్ర x యోజన= పర్ భాను
12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు
1 మైళు = 1.6 కిలో మీటర్లు
96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =
153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)

ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.

హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.

ఇప్పుడు గాయత్రీ మంత్ర మహిమ గురించి తెలుసుకుందాం. మహిమ అనంగానే అదేదో మ్యాజిక్కు, మాయ అని కాకుండా మహిమను ఙ్ఞానమార్గంగా తీసుకుందాం. అప్పుడే ఙ్ఞానాభివృధ్ధి కలుగుతుంది.

అమెరికన్ శాస్త్రవేత్త డా.హోవార్డ్ స్టెయిన్జెరిల్.. గాయత్రీ మంత్ర బీజాక్షరముల ధ్వనులపై తనయొక్క లేబొరేటరీలో పరిశోధన చేయగా అతడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు…

ఆయన తెలిపిన వివరాలు ఏంటంటే…

గాయత్రీ మంత్రం ఉఛ్ఛారణ జరుగుతున్నప్పుడు 1,10,000 ధ్వని తరంగాలు ఒక్క సెకనులోనే విడుదలయ్యాయని, ఈ ప్రపంచంలో మరే శ్లోకానికి గాని, పదాలకు గాని ఇంతటి శక్తి లేదని తేల్చి చెప్పాడు.

గాయత్రీ మంత్రోఛ్చారణ సమయంలో బీజాక్షర విస్ఫోటనం సంభవిస్తుంది. అది వినినా లేదా పఠించిన అయా వ్యక్తులకు మానసిక వికాసం పరిఢవిల్లుతుంది అని ఆ తర్వాత జరిపిన పరిశోధనల్లో కూడా అది స్పష్టమయింది.

ఈ విషయాన్ని గ్రహించిన ఎన్నో ఇతర దేశాలు గత రెండు సంవత్సరముల నుండి సూర్యోదయ సమయమందు పఠనం లేదా శ్రవణం చేయడం వారి జీవితాలలో ఒక భాగంగా చేసుకున్నారు.

వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!
ఇదీ మన భారత వైశిష్ట్యం…
ఇదీ మన వేద విఙ్ఞాన సారం…
ప్రతి భారతీయుడికి గర్వకారణం…
మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!!

Monday, 4 December 2017

శస్త్ర చికిత్సలు

ఋగ్వేదం విజ్ఞానం
ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వినీసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి... ఖేలుడు అనే రాజు భార్య, యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.
ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిఃలో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను ఆధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం" మొదలైన మంత్రాలలో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.

భీష్మ నిర్యాణం

Take time & read. It’s not about Mahabharata, this is about our pride & Asset as an Indian.
Bhisma Ekadasi

💥⚡💥❄💥   

ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది. ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.

భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు.  58 రోజులు బాణశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరులో ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది.

భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళ ముద్రవేసి వారిని  పట్టించుకోవడంలేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము.

ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధరంగాలకు కావలసిన అనుభవజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.

18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు. ఈ సమయంలో వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ధర్మరాజుకు ఇస్తాడు. అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురువృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని వ్యాసుడు, కృష్ణుడు సలహా ఇస్తారు.

వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు. విష్ణుసహస్ర నామం కూడా అందులోదే. కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఎం ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది‘‘ అని అన్నారు. ఆంధ్రవ్యాసుల వారి మార్గదర్శకత్వంలో    మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

1) భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు (నర్సుల) వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారు.

2) భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః।
శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥
భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలు వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.

రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషంటు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది. అదే ఆరోజున భీష్ముడికి చేశారు. అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు.

ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అనినందువల్ల.
అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది.

3) దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది. ‘‘భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీదే కాక ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు వచ్చారు. వారిలో నారదాది సంగీతవిద్వాంసులు ఉన్నారు. శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే  వ్యాస మహర్షితో కూడిన సమస్త రుషి గణాలూ రుగ్, యజుస్, సామగానాలు చేశారు. అన్ని రుతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో కురిశాయి. దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు.‘‘

ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది.
దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి.

తతస్తే వ్యాససహితాః సర్వ ఏవ మహర్షయః।
ఋగ్యజుఃసామసహితైర్వచోభిః కృష్ణమార్చయన్॥
తతః సర్వార్తవం దివ్యం పుష్పవర్షం న భస్తలాత్।
పపాత యత్ర వార్ష్ణేయః సగాంగేయః సపాండవః॥
వాదిత్రాణి చ సర్వాణి జగుశ్చాప్సరసాం గణాః।
న చాహితమనిష్టం చ కించిత్తత్ర వ్యదృశ్యత॥

అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని  వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.

4) ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు.

తతో రథైః కాంచనచిత్రకూబరై
ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః।
హయైః సుపర్ణైరివ చాశుగామిభిః
పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః॥

యయౌ రథానాం పురతో హి సా చమూ
స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ।
పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ
తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥

ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు.

5) మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు. ‘‘ అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడ జమకూడడం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు.

న సైనికైశ్చ యాతవ్యం యాస్యామో వయమేవ హి।
న చ పీడయితవ్యో మే భీష్మో ధర్మభృతాం వరః

ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆరిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింపచేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోషు చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి--- ఇదంతా చూస్తే ఎంత నీచంగా ఉంటుందో ఒక సారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది.

శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. ఆ పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. నేడు ఆసుత్రుల దగ్గరకు వాహానాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ఆసుపత్రి ఏరియా దయచేసి హారన్ మ్రోగించవద్దు  అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధపెడతాయని ఎప్పటికి బుద్ధి వస్తుందో నేటి వాహన చోదకులకు?

ఆగచ్ఛత్స్వథ కృష్ణోఽపి పాండవేషు మహాత్మసు।
శైనేయసహితో ధీమాన్రథమేవాన్వపద్యత॥
రథస్థాః సంవిదం కృత్వా సుఖాం పృష్ట్వా చ శర్వరీం।
మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః॥
బలాహకం మేఘపుష్పం శైబ్యం సుగ్రీవమేవచ।
దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః॥
తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।
గాం ఖురాగ్రైస్తథా రాజఁల్లిఖంతః ప్రయయుస్తదా॥
తే గ్రసంత ఇవాకాశం వేగవంతో మహాబలాః।
క్షేత్రం ధర్మస్య కృత్స్నస్య కురుక్షేత్రమవాతరన్॥

మహాభారతం నేడు కూడా ఎందుకు అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు. ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి. వేల సంవత్సరాల క్రితం మరణశయ్యమీద వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. లక్షాపదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పశుప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. నేడు దౌర్భాగ్య ప్రభుత్వాల కారణంగా సంస్కృతం అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక  బ్రతుకుతున్నాము. ఏ అమెరికా, ఇంగ్లండు వారో హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి అంటే నిజమే కాబోలు అనుకునే జాతి తయారైంది.

------------------------

ఖుదీరామ్ బోస్

*ఖుదీరామ్ బోస్...*

గాంధీ, నెహ్రూల భజనతో మకిలి పట్టిన పాఠ్యపుస్తకాలను చదువుకుని అంతకు మించిన దేశభక్తులు కానీ, అంతకుమించిన చరిత్ర కానీ లేదనుకునే సగటు తెలుగువాడికుండే అజ్నానం లోంచి సమాధి చేయబడ్డ చరిత్రలను తవ్వుకుంటూ నిజాలను వెతుక్కుంటున్న రోజుల్లో ఒక ఆర్.ఎస్.ఎస్ కార్యాలయంలో మొట్ట మొదటిసారిగా చదివాను ఖుదీరామ్ బోస్ గురించి....!

" నేను పట్టుబడితే మహా అయితే నన్ను ఉరి తీయవచ్చును కానీ ఇది నాకు వరం , నాకు తల్లి , తండ్రి గురువు అన్నీ భరతమాతే... ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి నా ప్రాణాలను అర్పించడం నా అదృష్టంగా భావిస్తాను, నా కోరిక ఒక్కటే... మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకూ నేను మళ్ళీ మళ్ళీ ఈ గడ్డపైన పుట్టి నా జీవితాన్ని త్యాగం చేయాలని " అంటూ విప్లవవీరుల రహస్య సమావేశంలో సాయుధ పోరాటంలో రాటుదేలిన యోధులకి సైతం స్పూర్తినిస్తూ .... ముక్కుపచ్చలారని పసివాడు ఖుదీరామ్ బోస్ బాంబుదాడి చేయడానికి వెళుతూ చెప్పిన మాటలు  మర్చిపోలేo

భరతమాత దాస్య శృంఖలాలను తెంచడానికి, భారతీయుల బానిసత్వాన్ని నిర్మూలించడానికి , అంగ్లేయుల అక్రమాలను అంతమొందించడానికి సాయుధ పోరాటానికి నాంది పలుకుతూ బ్రిటీష్ వారిపై మొట్టమొదటిగా బాంబు విసిరిన విప్లవవీరుడు ఖుదీరామ్ బోస్,

వందేమాతర నినాదాన్నే ఊపిరిగా, తెల్ల దొరలను తరిమి కొట్టడమే ధ్యేయంగా , పాఠ్యపుస్తకాలను వదిలి పోరుబాట పట్టి స్వాతంత్ర్య కాంక్షతో అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన దేశభక్తుడు ఖుదీరామ్ బోస్ ,

పాలుగారే పసితనంలో పలక పుస్తకం పట్టి ఆటపాటలతో గడపాల్సిన సమయంలో ఆంగ్లేయుల చేతిలో హింసలకు బలౌతున్న భారతీయలను ఎలా కాపాడగలనని ఆలోచిస్తూ ప్రాణాలు ఇచ్చైనా పోరాటం చేయాలని విప్లవమార్గం పట్టిన దేశభక్తుడు ఖుదీరామ్ బోస్.

వందేమాతర గీతం యొక్క సారాన్ని నిరక్షరాస్యులైన ప్రజలకు అర్ధమయ్యేలా, విద్యావంతులకు స్పూర్తినిచ్చేలా కరపత్రాలను తయారు చేసి స్వయంగా పంచుతూ అడ్డగించిన బ్రిటీష్ సైనికులపై ప్రతిదాడి చేసి బ్రిటీష్ ప్రభుత్వానికి వణుకు పుట్టించిన భారత బెబ్బులి ఖుదీరామ్ బోస్.
.

అత్యంత క్రూరుడైన కింగ్ ఫోర్ట్ పై మొట్ట మొదటి బాంబుదాడి చేసి బ్రిటీష్ దొరలకు ప్రాణభయాన్ని రుచి చూపించిన మొట్టమొదటి భారతీయుడు ఖుదీరామ్ బోస్.

బ్రిటీష్ వారిచ్చే బహుమతికి కక్కుర్తిపడి సాటి భారతీయుడే తనని పట్టిస్తే, ఉరిశిక్ష విధించిన జడ్జీ నీ చివరికోరిక ఏంటని ప్రశ్నించినపుడు ఖుదీరామ్ బోస్ చెప్పిన సమాధానం " మీరు గనుక అనుమతిస్తే ఇక్కడున్న నా భారతీయ సోదరులకు కూడా బాంబుల తయారీ గురించీ, దాని మెళుకువల గురించీ చెప్పాలనుకుంటున్నాను " అని. కోర్టు దానికి అనుమతించకపోవడంతో తన స్పూర్తిని ప్రజల్లో నింపుతూ వందేమాతర నినాదం చేస్తూ, భరతమాతకు జై కొడుతూ భగవద్గీత చేత్తో పట్టుకుని ఉరికంబానికి వేలాడి తన దేశభక్తిని చాటుకున్న గొప్ప దేశభక్తుడు ఖుదీరామ్ బోస్....!!!

ఇలాంటి దేశభక్తుల చరిత్రలు తెలియని మీ మిత్రులకూ, పిల్లలకూ ఇలాంటి వారిని గురించి తెలియచేసి మీ దేశభక్తిని చాటుకుంటారని ఆశిస్తూ.... ఈరోజు ఎందరికో స్పూర్తి నింపి మరెందరికో ఆరాద్యనీయుడైన సుప్రసిద్ద స్వతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి (3/12/1889) సందర్భంగా నివాళులు అర్పిస్తున్న...

*భరతమాత సేవలో*...
*స్వామి వివేకానంద యువగణ సేవా సమితి*

Sunday, 3 December 2017

"భగవత్గీత మీద నేను నిన్న పెడతా అన్న భారీ పోస్టు"

ఈమధ్య ఒక యువతి మాట్లాడుతూ – “నాకు ‘భగవద్గీత’ పేరు విన్నా, అందులో శ్లోకాలు విన్నా, భయం వేస్తుంది. ఒళ్ళు వణుకుతుంది’ అన్నది.
ఎందువల్లనమ్మా?’ అని ఆశ్చర్యంతో అడిగితే, ఆమె చెప్పిన సమాధానం మరీ దిగ్భ్రమను కలిగించింది – ‘ఎవరైనా చనిపోయినప్పుడు, శవవాహన సమయంలో దీని రికార్డు వేస్తారు. అదే నా మనసులో ముద్రించుకు పోయింది. పెద్దలు ఎవరైనా మరణిస్తే సంతాపంగా దీనిని వినిపిస్తారు. ఇందువల్లనే నాకు గీతా శ్లోకాలన్నా గానమన్నా భయం పట్టుకుంది.”.
మరొకచోట మరొక సంఘటన – ఒక సభా ప్రారంభంలో ఎవరో భగవద్గీత శ్లోకాలు చదివారు. అందులో ఒక రాజకీయ నాయకుడు లేచి – ‘శుభమా అని సభ పెట్టుకుంటే గీత పాడతారేంటి?’ అని వాపోయాడు.
ఇంచుమించు చాలామంది వద్ద ఇలాంటి అభిప్రాయాలే వినబడ్డాయి.
దీనిని బట్టి – హిందువులు తమ ధర్మవిషయంలో ఎంతగా భ్రష్టమయ్యారో, పశుప్రాయులయ్యారో తెలుస్తోంది.
దీనికి కారణమేంటి?
‘భగవద్గీత’ను కేవలం మరణ సందర్భంలో రికార్డులద్వారా వినిపించడం! ఇది అసంగతమైన విషయం. అసలు భగవద్గీతకీ మరణ సంస్కారాలకీ సంబంధమే లేదు. ఆ సమయంలో భగవద్గీత, విష్ణుసహస్రనామాలు, శివనామాలు – వంటి వాటి అవసరం లేదు.
ఇతరులకైతే ‘పిండికీ, పిడుగుకీ ఒకటే మంత్రం’ అన్న చందంగా పెళ్ళికీ, చావుకీ, పుట్టుకకీ అన్నిటికీ ఒకటే గ్రంథపఠనం!
సనాతనధర్మం పరిస్థితి అటువంటిది కాదు. జన్మ ప్రభ్రుతి మరణపర్యంతం ‘షోడశసంస్కారాలు’ ఉన్నాయి. ఆయా సందర్భాలలో చేయవలసిన కర్మలు, మంత్రాలు ఉన్నాయి. అంతేగానీ అప్పుడు గీతాపఠనం చేయరు.
జ్ఞానం కోసం భగవద్గీత. అంతేకానీ – ఔర్ధ్వదైహిక క్రియలకోసం కాదు. మన సంస్కృతిలో ఆ క్రియలు సంస్కారాలు చక్కని విజ్ఞానంతో కూడి ఉన్నాయి. వాటికి భగవద్గీతతో పొంతన లేదు. గీత బ్రతికి ఉన్నవారు, చక్కగా బ్రతకదలచుకున్న వారు అధ్యయనం చేయవలసిన జ్ఞానశాస్త్రం.
ఈ విషయం మరచి కేవలం మరణ సమయగానంగా దానిని వినిపించడం మహాపరాధం. వెంటనే బాధ్యతగల పెద్దలు పూనుకొని వల్లకాట్లలో, శవవాహనాలలో, సంతాపాలలో గీతాపాఠాన్ని నిషేధించాలి.
మరో విషయం – ఇతరమతస్థులు వారి మరణవేళల్లో వారి మతగ్రంతాలనే చదువుతారు. కానీ దానిపై ఆ మతస్థులకి భయం, హీన దృష్టి లేవు. కానీ మనవారికి ఆ రెండూ ఏర్పడ్డాయి.
బాల్యంనుండే ఇంట్లో పిల్లలకి ఆ గ్రంథాల గురించి తెలియజేయని పెద్దలది ప్రథమాపరాధం! ఇంట్లో ఆ పుస్తకాలనుంచడం లేదు. శ్లోకాలు నేర్పడం లేదు. అసలు వాటి అర్థాలు కూడా తెలియవు.
ముస్లిం సోదరులు ఉర్దూ నేర్చుకుని ఖురాన్ ని చిన్నతనం నుంచే అధ్యయనం చేస్తారు. మతాచారాలను అనుసరిస్తారు.
కానీ మన ఇళ్ళల్లో సంస్కృతం నేర్పరు. కనీసం తెలుసు పద్యాలు తెలుసుకోరు.
అందుకే గీతా జ్ఞానం లేదు సరికదా – ఏ సందర్భానికి ఏది చేయాలో కూడా తెలియని దయనీయ స్థితి.
దీని కారణం గానే స్వధర్మ నిష్ఠ కలగడం లేదు. ఆఖరికి ‘గోవింద’ నామమన్నా కొందరికి శవయాత్రయే గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. మానవుని కర్తవ్యోన్ముఖుని చేసి, వ్యక్తిత్వాన్ని వికసింపజేసి, తనలోని అంతశ్శక్తులను జాగృతపరచి వినియోగింపజేసే శక్తి గీతా బోధలలో ఉంది. ఈ విషయం ఎందఱో విదేశీ మేధావులు అంగీకరించి విజయ సూత్రాలుగా, వ్యక్తిత్వ వికాస పాఠాలుగా అధ్యయనం చేస్తున్నారు. మనం మాత్రం అసలు పట్టించుకోని స్థితిలో ఉన్నాం.
మరొకవైపు మార్పిడి మతాలు ఎరజూపే బిస్కట్ల కోసం ప్రలోభపడి దాస్యం చేసే గ్రామసింహాలవంటి భారత మేధావులు – గీతవంటి సద్గ్రంథాలకు లేని అర్థాలు చూపించి, కువ్యాఖ్యలు చేస్తుంటే – ‘భావస్వేచ్ఛ’ క్రింద దానిని భరిస్తూ, వాటిని ఖండించలేని స్థితిలో నిద్రిస్తున్నారు గీతాభిమానులు.
ఒక్క గీతనే కాదు. వేదాలను కూడా ఏవో అనువాద గ్రంథాలు చదివి – బట్టతలకీ, మోకాలికీ ముడిపెడుతూ వికృత వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ మతంలో గొప్పదేదో చెప్పుకు వెలగబెడితే చాలు. ఇతరుల మతాల గురించి మాట్లాడే హక్కు అవగాహన వారికి లేవు. చట్టరీత్యా నేరం కూడా.
మనవారిలో ఉన్న అవగాహనా రాహిత్యం, ఇతరుల దుర్మార్గపూరిత వంచన కలిసి హిందూమతంలో లేనిపోని అనర్థధోరణులు కలుగుతున్నాయి. హిందూ సమాజం తమ సంప్రదాయాలేమిటో, ధర్మజ్ఞానాలేమిటో గ్రహించే ప్రయత్నం చేయాలి. వాటిని నిలుపుకోవాలి.
దీనికి సాధికారకంగా చెప్పగలిగే పెద్దలు పూనుకొని ఉద్యమించి, జాగరణ కలిగించాలి.
.ఉపనిషత్తులు గోవులయొక్క క్షీరమే భగవద్గ్గీత
సర్వోపనిషదో గావో దోగ్దా గోఫాలనన్దనః
పార్ధోవత్సః సుధీర్భోక్తా దుగ్దం గీతామృతం మహత్
ఉపనిషత్తులన్నీ గోవులే
అందులో శ్రీ కృష్ణుదు పాలు పితుకువాడు
అర్జనుడు దూడ వంటివాడు
మహత్తరమగు గీతామృతమే పాలు
సద్బుద్ది గలవాడే ఆ పాల ను త్రాగుతాడు
.......... అని పై శ్లోకార్దం
ఈ పై విషయాలు మీకు నచ్చితే షేర్ చెయ్యండి

గీతా శ్లోకం - ప్రశ్నోత్తరములు

 పార్దాయ ప్రతిబోదితాం భగవతా నారాయణేవస్వయం
 వ్యాసేవ గ్రధితాం పురాణ మువివామ్ మధ్యే మహాభారతమ్
                                       అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీమ్
                                       ఆంబ త్వా మమవందధామి భగవద్గీతే భవద్వేషిణీమ్

1. భగవద్గీత ఏ పవిత్ర గ్రంధంలోనిది ?

జ.  మహా భారతమునందలి భీష్మ పర్వంలో గీత వివరింప బడినది.

2. గీతలో ఎన్ని శ్లోకములు గలవు?

జ. గీతలో 700 శ్లోకములు కలవు.

3. గీతలో ఎన్ని అధ్యాయములు కలవు ?

జ. గీతలో 18 అధ్యాయములు కలవు.

4. ప్రతి అధ్యాయమునకు యివ్వబడిన ప్రత్యేక నామము ఏది?

జ. ప్రతి అధ్యాయమును యోగము అందురు.

5. గీత  ఎక్కడ, ఎప్పుడు , ఎవరికి చెప్పబడినది?

జ. గీత కురుక్షేత్రంలో కౌరవ, పాండవుల యుద్దారంభంలో అర్జునునికి శ్రీ కృష్ణపరమాత్మచే చెప్పబడినది.

6. గీత ఎందుకు చెప్పబడినది?

జ. నావారు అనే మమకారం, నాచే చంపబడుతున్నారనే మోహం అర్జునుని ఆవరించి విషాదాన్ని కలుగచేయగా విషాదయోగాన్ని పోగొట్టి జ్ఞానాన్ని కలుగచేయడానికి శ్రీ కృష్ణునిచే గీతాబోధ చేయబడినది.

7. గీత దీనుడైన అర్జునుని ఏవిధంగా మార్చినది?

జ. గీత దీనుడైన అర్జునుని ధీరునిగా మార్చింది.

8. గీత శ్లోకాలు మానవునిలోని దేనిని దూరం చేస్తాయి?

జ. గీత శ్లోకాలు మానవునిలోని శోకాన్నిదూరం చేస్తాయి.

9. గీత ధృతరాష్ట్రునికి  ఎవరు చెప్పారు?

జ. గీతను ధృతరాష్ట్రునికి సంజయుడు వివరించెను.

10. గీతను ఆసమయంలో ఎందరు విన్నారు?

జ. అర్జునుడు, సంజయుడు, ధృతరాష్ట్రుడు మరియు ఆంజనేయస్వామి.

11. గీతలో గల అధ్యాయముల పేర్లేమి?

జ. 1) అర్జున విషాద యోగము 2) సాంఖ్య యోగము 3) కర్మ యోగము 4) జ్ఞాన యోగము 5) కర్మసన్యాస యోగము 6) ఆత్మ సంయమ యోగము 7) విజ్ఞాన యోగము 8) అక్షర పరబ్రహ్మ యోగము 9. రాజ విద్యారాజగుహ్య యోగము 10) విభూతి యోగము 11) విశ్వరూప సందర్శన యోగము 12) భక్తి యోగము 13) క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము 14) గుణత్రయ విభాగ యోగము 15) పురుషోత్తమ ప్రాప్తి యోగము 16) దైవాసుర సంపద్విభాగ యోగము 17) శ్రద్దాత్రయ విభాగ యోగము 18) మోక్ష సన్యాస యోగము 

12. గీత ధర్మరాజుకిగాని, భీష్మునికిగాని బోధింపక అర్జునునికే ఏల బోధించెను?

జ. శ్రీ కృష్ణుడు అర్జునునికే గీతాబోధ చేసెను. భీష్మునికి చేయక పోవటానికి కారణం ఏమిటంటే న్యాయం, ధర్మం, పాండవుల పక్షాన ఉందని చెప్తూ అధర్మపరులైన కౌరవుల పక్షాన యుద్దం చేసారు. అలోచనకు, చెప్పేమాటకి, చేసే క్రియకి భేదం ఉన్నది. అనగా త్రికరణశుద్ది లేదు. అట్టివారు జ్ఞానబోధకు అర్హులు కారు. ధర్మరాజు ధర్మవర్తనుడే కాని అతని పశ్చాత్తాపమేకాని పూర్వతాపం లేదు. ఒక పనిచేసే ముందుగానే దాని మంచి చెడ్డలు విచారించేవాడు పూర్వతాపం కలవాడు. జూదం ఆడి ఓడిపోయి అడవులు పాలయ్యాక జరిగిన దానికి  పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ప్రారంభించాడు. ముందుగా దాని పర్యావసానం ఏమిటో ఆలోచించలేదు. పూర్వతాపం లేనివారు గీతాబోధకు అర్హులు కారు. అర్జునుడు యుద్దభూమిలోకి ప్రవేశించి, తనవారినందరిని చూచి యింతమందిని చంపి ఈ రాజ్యాన్ని అనుభవించే కంటే భిక్షాటన మేలు. అందరూ చనిపోయాక ఈ రాజ్యాన్ని పాలించి ఏమి ఆనందం అనుభవించగలము? త్రిలోకాధిపత్యం యిచ్చినా నేను యుద్ధం చెయ్యలేను అని ముందుగానే విచారించాడు. తనను శిష్యునిగా చేసుకుని కర్తవ్యం బోధించమని శ్రీ కృష్ణ భగవానుని ప్రార్థించాడు. అందువలన అర్జునునికే గీతా బోధ చేయబడింది. పూర్వతాపం పరిశుద్ద హృదయమున్న వారికే కలుగును. పరిశుద్ద హృదయుడే జ్ఞానబోధకు అర్హుడు. 

13. అర్జునుని శ్రీ కృష్ణుడు అనేక నామాలతో గీతలో సంబోదించాడు.  అవి ఏవి? వాని భావమేమి?

జ. 1) అర్జున: - పవిత్రమైన, నిర్మలమైన మనసు గలవాడు.
    2) పార్థ: - పృధివి (భూమి యొక్క) పుత్రుడు. పృధి అను పేరు కుంతీదేవికి కలదు. అంతే కాక భూమి
        యొక్క పుత్రుడు అంటే   ప్రపంచ మానవులందరికీ ప్రతినిధి పార్ధుడు. 
    3) కౌంతేయ - సావధానంగా దైవబోధను వినగలిగేవాడు.
    4) అనసూయ - అసూయ లేనివాడు.
    5) కురునందన - కార్యమును చేయుటలో ఆనందమును అనుభవించువాడు.
    6) పరంతప - యుద్దములో శత్రువులను తపింప చేయువాడు.
    7) విజయ - ఎల్లప్పుడూ జయమునే పొందువాడు.
    8) గుడాకేశ -  యింద్రియ నిగ్రహం గలవాడు.
    9) ధనంజయ - జ్ఞాన ధనమును పొందినవాడు.
    10) పాండవ - పాండవరాజు కుమారుడు (తెల్లదనము) సాత్వికగుణము , నిర్మలతత్వం గలిగి పరిశుద్దమైనవాడు .

14.  భోజనానికి ముందుగా రెండు శ్లోకాలు పఠించి భుజించాలని స్వామి చెప్పారు. ఆ శ్లోకాలేవి? ఎందుకు అవి పఠించాలి?

                                    బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతమ్
                                    బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మ సమాధినా
                                    అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ్ దేహమాశ్రిత:
                                    ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విదమ్
ఈ శ్లోకాలు రెండు చదివి భోజనం చేస్తే అది ప్రసాదంగా మారిపోతుంది. ఆహారానికి పాత్రశుద్ది, పాకశుద్ది,పదార్థశుద్ది ఉండాలని స్వామి చెప్పారు. పాత్రశుద్ది మనంచేయగలం. పాకశుద్ది అంటే ఎలాంటి తలపులతో వంట చేస్తున్నారో, పదార్థశుద్ది అనగా మనం తెచ్చుకున్న పదార్ధములు మోసము చేసి తెచ్చినవో, దొంగిలించినవో మనకు తెలియదు. అన్యాయార్జన పదార్ధము అనారోగ్యాన్ని, దుర్భుద్దులను పెంచుతాయి. అందువలన ఆహారం భుజించేముందు ఆహారాన్ని దైవానికి సమర్పించి  భుజిస్తే అది ప్రసాదంగా మారి దోషరహితం అయిపోతుంది. ఎట్టి తిండియో అట్టి త్రేపు. ఆహారాన్ని బట్టి ఆలోచనలు వుంటాయి. అందువలన రజో, తమో  గుణ సంబంధమైన ఆహారాన్ని త్యజించి సాత్వికాహారము దైవానికి అర్పించి భుజిస్తే సత్ప్రవర్తన, సద్బుద్ది, సదాలోచనలు కలుగుతాయి. అన్ని యింద్రియాలకు సాత్వికాహారం యివ్వాలని స్వామి చెప్పారు.   

15. గీత నిత్య జీవితంలో ఏవిధంగా మనకు ఉపకరిస్తుంది?

జ. స్వామి ముఖ్యంగా 'శ్రద్దావాన్ లభతే జ్ఞానం' - 'సంశయాత్మ వినశ్యతి ' అని గీతలోని రెండు శ్లోకాల గురించి చెప్ప్తూ ఉంటారు. శ్రద్దగలవాడు తప్పక జ్ఞానాన్ని పొందుతాడు. అధ్యాత్మిక జ్ఞానానికైనా  , లౌకిక జ్ఞానానికైనా శ్రద్ద చాలా అవసరం. అందువలన శ్రద్దతో ఏదైనా సాధించవచ్చని గీత బోధిస్తుంది. శ్రద్దతో నచికేతుడు ఆత్మ జ్ఞానాన్ని , ఏకలవ్యుడు ధనుర్విద్యను సాధించగలిగారు. 'సంశయాత్మా వినశ్యతి ' సందేహాలు కలవారు ఎప్పటికీ అభివృద్ది సాధించలేడు. గురువాక్యంపైన, దైవం పైన నమ్మకం, శ్రద్ద గలవాడే ఏదైనా సాధించగలడు. అందువలన సంశయాలు, సందేహాలు వదిలిపెట్టాలి. యింతేకాక 'అద్వైష్టా సర్వభూతానాం' ఏ ప్రాణినీ ద్వేషించవద్దు. 'అనుద్వేగకరం వాక్యం' ఎవరినీ మాటలతో హింసించవద్దు. సంతుష్టస్పతతం' ఎల్లప్పుడు సంతృప్తిగా ఉండాలి. సమశ్చత్రౌ చ మిత్రేచ, శత్రువులను, మిత్రులను ఒకేవిధంగా చూడాలి. గౌరవా గౌరవాలకు, సుఖదు:ఖాలకు పొంగిపోక, కుంగిపోక ఉండాలి. యిలాంటి లక్షణాలు కలవాడు నాకు ప్రియమైన భక్తుడు అని శ్రీ కృష్ణ భగవానుడు బోధించాడు.  అంటే మానవులంతా తమ నిత్య జీవితంలో ఈ లక్షణాలు అలవర్చుకుంటే భగవంతుని అనుగ్రహానికి పాత్రులవుతారు. వంట చెయ్యటానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. అలాగే ఒక్క గీతా శ్లోకాన్ని మనం ఆచరించడానికి ప్రారంభించినా క్రమేపి అన్ని సద్గుణాలు మనలో ప్రవేశించి భగవంతునికి ప్రియమైన భక్తులం కాగలము.   

16. స్వామి గీతా సారాంశాన్ని రెండు పదాల్లో వివరించారు? అవి ఏవి?వాని వివరణ ఏమి?

జ.                               "ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవ:
                                   మామకాకి పాండవాశ్చైవ  కీమ కుర్వత సంజయ:  "
                   శ్లోకములోని మొదటి పదము ధర్మ, గీతలోని చివరి శ్లోకము
                                  "యత్ర యోగీశ్వర: కృష్ణా యత్ర పార్థ ధనుర్థర:
                                   శ్రీ ర్విజయో భూతి: ధ్రువా నీతిర్మతిర్మమ "
              చివరి శ్లోకములోని చివరి పదము మమ. మొదటి ధర్మ, చివరిది మమ. ఈ రెండూ చేరిస్తే 'మమధర్మ' అని గీత బోదించింది. ఎవరి కర్తవ్యాన్ని, ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించమని గీత ముఖ్యంగా బోధిస్తుంది. విద్యార్దులు వారికర్తవ్యాన్ని, బ్రహ్మచారులు వారికర్తవ్యాన్ని, గృహష్దులు వారి కర్తవ్యాన్ని, నవ్యానులు వారికర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఎవరిమార్గాన్నివారికి బోధించేదే గీత.

17. భగవత్గీతలో పేర్కొనబడిన నాలుగు విధములైన భక్తులెవరు?

జ.  ఆర్తి, అర్దార్ది, జిజ్ఞాసు, జ్ఞాని
        1. ఆర్తభక్తుడు బాధలు కలిగినపుడు తనను ఆదుకొని రక్షించమని ఆర్తితో భగవంతుని ప్రార్దిస్తాడు. 
        2. ధన కనక వస్తు వాహనముల కోరకు, పదవి పేరు ప్రతిష్టల కోరకు, పుత్ర పౌత్రాభివృద్ది కొరకు పరితపించుచూ
            ప్రార్దించువారు అర్దార్దులు.
        3. జిజ్ఞాసువు: ఆత్మస్వరూపమైన పరమాత్మమ తెలుసుకోనగోరి అనేక సద్ర్గంధములతో, సదాలోచనలతో,   
            సద్బావములతో విచారణ నల్పుచూ సాన్నిధ్యప్రాప్తిని పొందగోరును.     
        4. జ్ఞాని: నిరంతరం బ్రహ్మతత్త్వమున మునిగియుండును.

18. గీత దైవ లక్షణాలను, అసుర లక్షణాలను ఏ విధంగా వివరించింది?

జ. దైవ లక్షణాలు: 1. అభయము 2. చిత్తశుద్ది 3. జ్ఞానయోగమునందుందుట  4. దానము 5. ఇంద్రియనిగ్రహం
    6. యజ్ఞము 7. అధ్యయనము 8. తపస్సు 9. కపటములేకుండుట 10. అహింస 11. సత్యము 
   12. క్రోధములేకుండుట 13. త్యాగము 14. శాంతి 15. కౌండెములుచెప్పకుండుట 16. సమస్తప్రాణులయడల కరుణ
   17.విషయములపై మనస్సు పోనీయకుండుట 18. తేజస్సు 19. క్షమ 20. ఆపత్కాలమందు దైర్యమును 
   వీడకుండుట  21. శుచి, శుభ్రతలు కల్గియుండుట 22. పరులకు ద్రోహముచేయకుండుట 23. మృదుస్వభావము
   24. ధర్మవిరుద్ద కార్యములలో ప్రవేశింపకుండుట 25. తననుతాను పొగడుకోనకుండుట     
   26.తంతుల స్వభావము లేకుండుట   
   అసుర లక్షణాలు : డంభము, గర్వము, దురభిమానము,కోపము,పరులను పిడించునట్లు మాట్లాడుట, వివేక
   జ్ఞానహినత, తాను గొప్ప అను అహంకారము, హింస.
              ప్రతి మానవుడు తనలోని అసుర లక్షణాలు గుర్తించి వానిని ప్రయత్నపూర్వకంగా దూరంచేసుకొని దైవ లక్షణాలు అలవర్చుకొని భగవంతునిచే ప్రేమించబడే భక్తులుగా తమను తాము తీర్చిదిద్దుకొనవలెను.

19. యోగమనగా నేమి?

జ.              యోగమనగా జీవాత్మ పరమాత్మలో లీనమగుట
                  యోగమనగా దైవాన్ని చేర్చుమార్గము
                  యోగమనగా ఆనందం
                  సమత్వమే యోగము
                  చిత్త వృత్తిని విరోధించునదే యోగము

20. యింద్రియాలకు వైరాగ్యమును అలవరచాలని స్వామి చెప్పారు. కారణం ఏమిటి?

జ. గీతలో శరీరమునుండి జీవాత్మ మరొక శరీరములోనికి ప్రవేశించినపుడు తన సత్కర్మ, దుష్కర్మలను తప్ప మరేమి తీసుకొని వెళ్ళలేదు. వాయువు ఏవిధంగా ఒక ప్రదేశంలోని దుర్గంధాన్ని, సుగంధాన్ని తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్తుందో అదే విధంగా ఆత్మ కర్మఫలమునుతప్ప మరేదీ ఈ ప్రపంచం నుండిగాని, తన గృహము నుండిగాని తీసుకొని వెళ్ళలేదు. అందువలన ధన కనక వస్తువులయందు, భోగ భాగ్యముల నుండి మనసును సత్కర్మలవైపు, దైవముపైన మరల్చి ప్రాపంచిక భోగములపై వైరాగ్యమును అలవర్చుకొనవలెను. దీని ఉదాహరణకు స్వామి చిన్న కథ చెప్తారు.ఒక గృహస్దునకు ముగ్గురు మిత్రులు ఉంటారు. కోర్టులో అతనిపై కేసు విచారణ జరుగబోతుంది. తన మిత్రులను తనతో కోర్టుకువచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని కోరతాడు. మొదటి మిత్రుడు నేను ఇంట్లో నీకేమైనా సహాయం చేస్తాగాని ఇల్లుదాటి బయటకురాను అన్నాడు. రెండవ మిత్రుడు కోర్టువరకు నీకు తోడు వస్తానుగాని లోనికి మాత్రం రాను అన్నాడు. మూడవ మిత్రుడు నేను నీతో కోర్టులోనికి వచ్చి సాక్ష్యం చెప్తాను అన్నాడు. మొదటి మిత్రుడు ధనధాన్యాది సంపదలు. రెండవ మిత్రుడు భార్య,బంధు మిత్రులు. మూడవ మిత్రుడు మనం చేసిన సత్కర్మలు.

21.  స్వధర్మమంటే ఏమిటి?   పర ధర్మమంటే ఏమిటి?

జ. ఆత్మ సంబంధమైన ధర్మం స్వధర్మం, పర ధర్మమంటే దేహ సంబంధమైన ధర్మం.

22.  అర్జునుడి పేర్లు వల్ల వ్యక్తమయ్యే విలక్షణ వ్యక్తిత్వం ఏమిటి?

జ. గురువు వద్ద  నుండి విద్యకు శిష్యుడు ఏవిధంగా ఆదర్శంగా వుండాలో అర్జునుని పై పేర్ల ద్వారా  తెలుసుకోగలము.

23. "యోగం" అంటే అర్థం ఏమిటి?

జ. భగవంతునితో సం యోగము చెందుటే యోగం. అంతేకాకుండా భగవంతుని చేరే మార్గము (గమ్యము) .

24. భగవద్గీతలో యోగం ఏవిధంగా నిర్వచింపబడినది?

జ. "కర్మను కాశలమ్ యోగ:" అన్నది గీత. అంటే నిర్దేశించిన పనిని హృదయపూర్వకంగా , శక్తి వంచన లేకుండా చేయడమే యోగం. "యోగ: చిత్త వృత్తి నిరోద:"  అంటే బాహ్య అంతర ఇంద్రియములను నిగ్రహించి - బుద్దిని,మనస్సును నిలిపి వుంచేదే యోగం. 'సమత్వం యోగముచ్యతే" - అనగా అన్ని సమయాలలోనూ సమత్వ భావనను కలిగియుండటం యోగం. 

25. భగవద్గీతలో ప్రధానమైన యోగములు ఏవి?

జ. కర్మ యోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము , రాజ యోగము.

26. కర్మ యోగము అంటే ఏమిటి?

జ. కర్మ యోగము అంటే ప్రతి వ్యక్తీ తనకు నిర్దేశించిన పనిని నిస్వార్థముగా, ప్రతి ఫలాపేక్ష లేకుండా త్రికరణ శుద్దిగా చేయుట. 

27. కర్మ, వికర్మ , అకర్మలను స్వామి ఏవిదంగా విశదీకరించారు?

జ. స్వామి కర్మ, వికర్మ, అకర్మల గూర్చి చెపుతూ " దీపం వుంది. అది నిలకడగా వెలుగుతుంది - ఇది కర్మ. వికర్మ అంటే - ఆ దీపం నిలకడగా వుండక పరిసర ప్రభావాలకు లోనై వూగిసలడటం. ఇకపోతే అకర్మ - నిలకడగా వున్నా, లేక పోయినా జ్యోతి నుండి మనం పొందే వెలుగే అకర్మ. ఇదే ఆత్మ లక్షణం .

28. "కర్మణ్యే వ్యాధి కారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ: మాతే సంగో2స్త్వ కర్మణి"  శ్లోకార్థాన్ని తెలుపుము?

జ. "కర్మలాచరించుటకు  మాత్రమే స్వాతంత్ర్యము కలదు. కానీ ఆ కర్మలవల్ల లభించే ఫలములందు నీకేమియూ జోక్యము లేదు. అట్లాగని నీ కర్మలాచరించుటకు మానరాదు. పనిచేయుట యే నీధర్మం. ఫలము ఈశ్వరాధీనము ఫలాపేక్ష లేని వాడ వై కర్తవ్యమును ఆచరింపుము.

29. భక్తియోగము అంటే ఏమిటి?

జ. భక్తి యోగము అంటే "భగవంతునితో తనను తాను నిశ్చల, అనన్య భక్తితో అనుసంధానం చేసుకోవడమే. స్వలాభాపేక్షతో భగవంతుని ప్రార్థించకుండా నిశ్చల, నిర్మల మనస్సుతో భగవంతుని సేవిస్తూ మనసా, వాచా, కర్మణా భగవంతునికి తనను తాను అర్పణ చేసుకోవడమే భక్తి యోగము.

30. నిజమైన భక్తునికి వుండవలసిన లక్షణములు ఏమిటి?

జ. నిజమైన భక్తుడు సర్వప్రాణులయందు సమత్వం కలిగివుండటం మిత్రత్వము, దయార్ద్రహృదయము, అహంకార రహితము, సుఖ దుఖాలు యందు ఒకే విధంగా ప్రవర్తించడం అనే లక్షణాలను కలిగి వుంటాడు. అంతే కాకుండా సహనశీలత్వం సర్వదా అసంతృప్తి లేకుండా తృప్తుడై వుండటం కూడా నిజమైన భక్తుని గుణాలు. అనేకత్వంలోంచి ఏకత్వాన్ని దర్శించి దివ్యత్వాన్ని తెలుసుకొనువాడై  నిజమైన భక్తుడు.

31. ఎట్టివాడు భగవత్ప్రేమకు  పాత్రుడు కాగలడు ?

జ. అనా పేక్ష: శుచి: దక్ష: ఉదాసీనోగతవ్యధ:
సర్వా రమ్న పరిత్యాగి యోమద్భక్త: సమేప్రియ:
ఎట్టి ఆపేక్షలు (కోరికలు) లేనివాడు. అంతర్ , బహిర్ శుద్ది (పవిత్రత) కలవాడు. ఫలాపేక్ష రహితుడై కర్మల నాచరించేవాడు, గతమును గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రమూ విచారించనివాడు, ఆడంబరమైన కర్మలన్నింటినీ విడిచి పెట్టినవాడు నాకు యిష్టుడైన భక్తుడు" అని గీతాచార్యుడు పలికాడు. 

32. జ్ఞానయోగము అంటే ఏమిటి?

జ. జ్ఞానయోగమంటే "నేనెవరిని? నేనెక్కడ నుండి వచ్చాను? నేను ఎక్కడికి పోతాను? " అని విచారణ సలిపి తనను తాను తెలుసుకోవడమే ప్రతీదీ వ్యతిరేకముగా కనబడినా చూడగానే  తెలుసుకునే నేర్పు ఆత్మ సంబంధమైన వాస్తవం.

33. జ్ఞానము ఎన్ని రకములు?

 జ. జ్ఞానము - లౌకికము (భౌతికము) , ఆధ్యాత్మికము (దైవిక సంబంధమైన) అని రెండు రకములు.

34.  జ్ఞానము ఏవిధంగా పొందగలము?

 జ. జ్ఞాన సంపాదనకు ముఖ్యంగా కావలిసింది శ్రద్ధ మరియు అచంచల ఆత్మ విశ్వాసము.
అసక్తి, స్థిరత్వము , నిశ్చయము కలిసి రూపుదిద్దుకున్నదే శ్రద్ధ అంటే.

35. "రాజ యోగ" మనగా ఏమిటి?

జ. ధ్యానం వలన అనగా ప్రత్యక్షానుభూతి వలన దివ్యత్వానుభూతి పొందుటకు సంబంధించినది  రాజయోగము.

36. కర్మ, భక్తి , జ్ఞాన యోగముల సందేశముల మధ్యనున్న అవినాభావ సంబంధములను స్వామి ఏవిధంగా విశదీకరించారు?

జ. కర్మ అనేది చెట్టుకు పూచే పూవు వంటిదనీ, భక్తి ఆ పూవు నుండి ఉద్భవించే కాయవంటిదనీ , జ్ఞానము పండిన పండు వంటిదనీ స్వామి వర్ణించారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్రమముగా జరుగుతాయి.

37. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించాలనుకునే వారికి ఏది అడ్డుపడుతూ వుంటుంది?

జ. కర్మ, భక్తి, జ్ఞాన యోగముల ద్వారా దివ్యత్వాన్ని సాధించు కోవాలనుకునే వారికి సర్వదా మనస్సు అడ్డంకులు కలిగిస్తూ వుంటుంది.

38. మనస్సు అనగా ఏమిటి?

జ. సంకల్ప  వికల్పములతో , కోరికలతో కూడినది మనస్సు.

39. మనస్సును ఎందుకు అదుపులో నుంచుకోవాలి?

జ. మనస్సు మానవుని బంధమునకు ముక్తికి మూలం కాబట్టి  దీనిని అదుపులో వుంచుకోవలెను.

40. మనస్సును ఎలా నియంత్రించగలం?

జ. ఇంద్రియాలకు సేవకుడు కాకుండా ఇంద్రియాలకు అధిపతిగా బుద్ది ఉండాలి. బుద్దిని అనుసరించాలి మనస్సు.
హిందూ ధర్మ చక్రం