Showing posts with label నదులు గొప్పతనం. Show all posts
Showing posts with label నదులు గొప్పతనం. Show all posts

Tuesday, 3 October 2017

డి. యస్. భార్గవ అనే భారతీయ environmental engineer/professor of hydrology తన జీవితకాలాన్ని మొత్తం గంగ యొక్క అద్భుతమైన శక్తిని గురించి పరిశోధించడానికే అంకితం చేశారు. గంగకు తనను తాను ప్రక్షాళణ చేసుకునే శక్తి మిగితా నదులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని తన 3 ఏళ్ళ పరిశోధనలో తేల్చారు. మిగితా నదులతో పోలిస్తే గంగ తన బయోకెమికల్ ఆక్సిజెన్ డిమాండ్ స్థాయిని అత్యంత వేగంగా తగ్గించగలదని, ఇతర నదులకంటే 15 నుంచి 20 రెట్ల వేగంగా తనలో కలిసిన వ్యర్ధాలను తొలగించుకోగలదని ఆయన పరిశోధనలో తేలింది.

న్యూడిల్లీ మలేరియా పరిశోధన కేంద్రం వారు ఇతర నది జలాలు దోమల పునరుత్పత్తికి దోహదపడతాయి. కాని గంగానది ఎగువజలాలు మాత్రం దోమల పునరుత్పత్తి ఉండదు. అక్కడ దోమలు పునరుత్పత్తి కాకుండా నిరోదిస్తుంది గంగమ్మ తల్లి జలం. అంతేకాదు! ఇతర జలాల్లో గంగా జలాలను కలిపితే ఆ నీరు కూడా దోమల పునరుత్పత్తిని నిరోదిస్తుంది.

ప్రధానంగా 2 చెబుతున్నారు పరిశోధకులు.

1) గంగలో బ్యాక్టీరియోఫేజ్ (Bacteriophage) ఉండడం వలన అది సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.

2) శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టని కారణం/ శక్తి గంగానదిలో ఉండడం వలన, అది వాతావరణంలో ఉన్న ఆక్సిజెన్ ను తీసుకునేందుకు అసాధారణమైన సామర్ధ్యాన్ని ఇస్తోంది. దీనినే Mystery Factor/Mystery X Factor అని పిలుస్తున్నారు.

బ్యాక్టీరియోఫేజ్ అంటే బ్యాక్టీరియను చంపే వైరసులు. ఏ విధంగానైతే పిల్లి ఎలుకను తింటుందో, అదే విధంగా ఈ వైరస్లు బ్యాక్టీరియాలని నాశనం చేస్తాయి. నిజానికి హాంకిన్, 1896 లో గంగ యొక్క యాంటి-బ్యాక్టీరియల్ లక్షణం గురించి ఒక నివేదిక ఇచ్చారు. అదే ఆధునికకాలంలో బ్యాక్టీరియోఫేజ్ గురించి చెప్పిన తొలి డాక్యుమెంటేషన్. హెరెల్ల్ గంగ యొక్క ఈ విశిష్టవంతమైన లక్షణాన్ని గమనించి, గంగలో ఉన్న ఈ వైరస్ బ్యాక్టీరియోఫేజే అని చెప్పారు.

గంగాజలంలో ఆక్సిజేన్ స్థాయులు అధికంగా ఉండడమే చేతనే గంగ నీరు సుదీర్ఘకాలం పాటు తాజాగా ఉంటాయి. గంగ నీటిని ఇతర జలాలకు తగినంత మోతాదులో కలిపినప్పుడు, ఇతర జలాల్లోకి ఈ బ్యాక్టీరియోఫేజ్ వ్యాపించి,ఆ నీటిని కూడా శుద్ధి చేస్తుంది. దానిలో ఉన్న క్రిములను సమూలంగా నాశనం చేస్తుంది. అందుకే పురాతన హిందువులు, గంగాజలాన్ని తమతో పాటు తమ స్వస్థలాలకు తీసుకువెళ్ళి, అక్కడ ఉన్న జలవనరులలో కలిపేవారు. అదే ఈరోజు కూడా ఆచరిస్తున్నాం కాని మనకు కారణం తెలియదు, అవి కలపడం వలన కలిగే ప్రయోజనం కూడా తెలియదు.

ఇంకా చెప్పాలంటే, బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులకు యాంటి-బ్యాక్టీరియల్ ఔషధం గంగాజలం. ఈ నీటిని వాడేవారు కనుకే పురాతన హిందువులు ఎటువంటి యాంటి-బయోటిక్ మందులు వాడకున్నా, ఏ రోగం లేకుండా జీవితాంతం సుఖంగా గడిపేవారు. అతి తక్కువ పరిశోధనలు జరుగునప్పటికి, ఈ నీటిని బ్యాక్టీరియోఫేజ్ థెరపికి ఉపయోగించవచ్చని పరిశోధకుల అంటున్నారు. ఇటువంటి పరిశోధనలు సోవియట్ యూనియన్ లో చాలా ఎక్కువగా జరిగాయి. ఎందుకంటే హెరెల్ల్ గంగానది యొక్క బ్యాక్టీరియోఫేజ్ నే ప్రపంచానికి పరిచయం చేశాక, రష్యాలో ఆయన పేరు మీద ఒక పరిశోధన సంస్థ కూడా ఏర్పడింది.

నేడు అనేక హానికారక బ్యాక్టీరియ యాంటి-బయోటిక్స్ ను తట్టుకుని నిలబడే సామర్ధ్యం పొందాయి.

ప్రపంచంలో చాలా యాంటి-బయోటిక్స్ విఫలమవుతున్నాయి. అందువల్ల ప్రజలలో రోగనిరోధకత క్షీణించి, వారి చికిత్స చేయడం కూడా వైద్యులకు చాలా సంక్లిష్టంగా మారుతోంది. మానవజాతి యాంటి-బయోటిక్స్ కి పూర్వం ఉన్న శకంలోనికి వెళ్ళిపోతోందనే ఆందోళన మొదలైంది. అత్యవసరంగా ప్రత్యామ్నాయ పద్ధతులను అభివృద్ధి చేయడమే అతి ముఖ్యమైన అంశాలుగా ఆధునిక వైద్యము, బయోటెక్నాలజి రంగాలు కృషి చేస్తున్నాయి...

ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులలో గంగ నీటితో యాంటి-బయోటిక్ ను తయారుచేసి ఔషధంగా కనుక ఇస్తే కనుక ప్రజలు ఏ రోగం లేకుండా, మందులు వాడకుండా హాయిగా బ్రతకవచ్చని గంగ నది మీద పరిశోధనలు చేసిన అనేక మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు తెగేసిచెప్తున్నారు. ఇంత గొప్పది మన గంగమ్మ. ఇన్ని విశిష్టవంతమైన లక్షణాలు మన గంగమ్మ తల్లికే సొంతం. ఇది హిందువులకు, భారతదేశానికి గర్వకారణం.

మన గంగమ్మ గురించి ఆధునికకాలంలో జరిగిన పరిశోధనలు ఏమి చెబుతున్నాయి?

గత 50 సంవత్సరాల క్రితం నమోదైన పరిశోధనా వివరాల ప్రకారం, కలుషిత జలాల్లో కేవలం కొన్ని చుక్కల గంగాజలం చేరిస్తే కలుషిత జలాలు పరిశుభ్రమై, రోగకారక క్రిములను నాశనం చేసేవి. అందుకే మన హిందువులు గంగాతీరంలో ఉన్న తీర్ధయాత్రలకు వెళ్ళినప్పుడు తప్పకుండా, గంగాజలం తీసుకువచ్చి నలుగురికి పంచుతారు. పురాణాల్లో కూడా మన అనేక కధలు కనిపిస్తాయి. ఎందరో రాజు ఎంతో ధనం ఖర్చు పెట్టి పట్టాభీషేకాలకు, ఇతర పూజా కార్యక్రమాలలో వాడడం కోసం గంగా జలం తెప్పించుకునేవారు. ఈరోజుకి కూడా అనేకమంది హిందువులు పవిత్రకార్యక్రమాల్లో వాడేందుకు గంగాజలం తెప్పించుకుంటున్నారు.మనవేవి మూడనమ్మకాలు కావు. మనకు తెలియనంత మాత్రాన మన ఆచారసంప్రదాయాలను కించపరచకండి.

గంగకు ప్రత్యేకతకు కారణం దానిలో ఉన్న బ్యాక్టీరియోఫేజ్. అది ఎంతో శక్తివంతమైనది. గంగోత్రిలో మొదలై, గంగాసాగరం వరకు ఇది గంగలో చేరిన మొత్తం క్రిములను సమూలంగా నాశనం చేసి, గంగను శుద్ధి చేస్తుంది. అది కూడా కేవలం 24 గంటల్లోనే 2525 కిలోమీటర్ల గంగ పరిశుద్ధమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలా శుద్ధి చేశాక ఈ బ్యాక్టీరియోఫేజ్ ఆనవాళ్ళు కూడా గంగలో కనిపించవు. కాని ఇదంతా 50 ఏళ్ళ క్రితం మాట అంటారు గంగ మీద పరిశోధన చేసిన రమేష్ చంద్ర గారు.

అందుకంటే గంగా ప్రవాహాన్ని అడ్డుకునే డ్యాములు వంటి వాటి వలన ఈ బ్యాక్టీరియోఫేజ్ క్రింది ప్రాంతానికి అంత వేగం వ్యాపించటంలేదు. ఈ ప్రైక్రియా కాస్త నెమ్మదించింది. మరి ఇన్ని కోట్లమంది గంగలో స్నానం చేస్తుంటే గంగ కలుషితం కాదా? గంగలో స్నానం చేయడం వలన అంటువ్యాధులు రావా?

ఈ పవిత్ర కుంభమేళా సమయంలో 10 కోట్ల మంది భక్తజనం త్రివేణిసంగమంలో పవిత్రస్నానం చేస్తారని అంచనా. ఇన్ని కోట్ల మంది త్రివేణి సంగమమనే ఒక చిన్న ప్రదేశంలో స్నానం చేస్తే కొత్త రోగాలు వ్యాపించవా?
మనం గతభాగాలలో చెప్పుకున్నాం. గంగలో బ్యాక్టీరియోఫేజ్ ఉందని. దాని ప్రభావాల గురించి విపులంగా తెలుసుకున్నాం. బ్యాక్టీరియోఫేజ్ మానవ వ్యర్ధాలు, వారి శరీరం నుండి వచ్చే క్రిముల మీద ఆధారపడి జీవిస్తాయి. మానవులు నదిలో స్నానం చేసినప్పుడు వారి శరీరం నుండి నదిలో కలిసే క్రిములు వీటికి ఆహరం. ఎంత ఎక్కువమంది స్నానం చేస్తే అంత ఎక్కువగా ఈ బ్యాక్టీరియోఫేజ్ ఉద్భవిస్తాయి. అందుకే కుంభమేళా, పవిత్ర దినాలు, పండుగ రోజుల్లో కోట్లాది మంది గంగలో స్నానం చేసినా ఒక్క అంటువ్యాధి కూడా వ్యాపించదు. ఆ నీరు కూడా కలుషితం కాదు. వినడానికి వింతగానే ఉన్నా ఎంత ఎక్కువమంది స్నానం చేస్తే గంగ అంత పరిశుద్ధమవుతోంది అని గంగ మీద పరిశోధనలు జరిపిన వారు చెప్పే మాట.

అంతేకాదు మరొక ఆసక్తికరమైన అంశం, ఈ మధ్యే బ్రిటిష్ వారి పరిశోధనలలో తెలింది. ఈ పవిత్ర కుంభమేళా సమయంలో పవిత్రస్నానం చేసినవారికి మానసిక రోగాలనుండి విముక్తి లభించిందట. చాలా శారీరిక రోగాలు తగ్గిపోతున్నాయట.. ఎంత గొప్పది మన గంగమ్మ తల్లి. నదిలో మునిగితే ఏం వస్తుంది అనేవారికి ఇది సమాధానం కూడా.

Monday, 11 September 2017

పుణ్యనదుల గూర్చి

భారతీయం

ఈ దేశంలో చదువు రానివాడికి సైతం కాశీ నుంచి రామేశ్వరం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల గురించి, పుణ్యనదుల గూర్చి, వాటి వెనుక కథల్ని గూర్చి తెలుసు. అయితే దేశ స్వాతంత్య్రం తర్వాత మన సంస్కృతికి దూరమైన ఆధునిక మేధావులు, అందులోనూ ముఖ్యంగా వామపక్ష మేధావులు.. వలసవాదుల ప్రచారాన్నే ఇంకా నమ్ముతూ ఉండడం విడ్డూరం.

భారతదేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలనూ, వాటి చరిత్రనూ విశ్లేషిస్తూ దేశమంతటికీ యాత్రా మార్గదర్శిలాంటి పుస్తకం ఇటీవల ఆంగ్లభాషలో వచ్చింది. పుస్తక రచయిత్రి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ డయానా ఈక్‌. ఈవిడ మన దేశంలో పలుమార్లు పర్యటించి "India–A Sacred Geography '' అనే పుస్తకాన్ని రాసింది. పాశ్చాత్య రచయిత్రి రచించడం వల్ల ఇది ప్రధాన బుక్‌ స్టాళ్లలో లభిస్తోంది. ప్రస్తుత యువతలో మన పురాణాల పట్ల, మన పుణ్యస్థలాల పట్ల కొత్త ఆసక్తిని కలిగిస్తుంది.

19వ శతాబ్దంలో బ్రిటిష్‌ పాలకులు ఒక సిద్ధాంతాన్ని నూరిపోయడానికి ప్రయత్నం చేశారు. ‘భారతదేశానికి ఒకే సంస్కృతి అంటూ లేదు, భారతజాతి అనే భావన లేదు, భరతఖండమంతా అనేక దేశాలుగా విభజించబడి ఉండేది. బ్రిటిష్‌ పాలన వల్లనే ఇదంతా ఒక జాతిగా ఏర్పడింది’ అని బ్రిటిష్‌ రచయితలు చెబుతూ వచ్చారు. దీన్ని ఆనాటి స్వతంత్ర పోరాట నాయకులందరూ తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా వివేకానందుడు లాంటివారు భారతీయ సంస్కృతి ప్రాచీనతను గట్టిగా నొక్కిచెప్పారు. ఈ దేశంలో చదువు రానివాడికి సైతం కాశీ నుంచి రామేశ్వరం వరకు ఉన్న పుణ్యక్షేత్రాల గురించి, పుణ్యనదుల గూర్చి, వాటి వెనుక కథల్ని గూర్చి తెలుసు. అయితే దేశ స్వాతంత్య్రం తర్వాత మన సంస్కృతికి దూరమైన ఆధునిక మేధావులు, అందులోనూ ముఖ్యంగా వామపక్ష మేధావులు.. వలసవాదుల ప్రచారాన్నే ఇంకా నమ్ముతూ ఉండటం విడ్డూరం. పై పుస్తక రచయిత్రి ఈ వాదాన్ని ఖండించింది. భారతీయ సంస్కృతికి, జాతీయతా భావానికి కొన్నివేల సంవత్సరాల చరిత్ర ఉందని పుస్తకంలో పేర్కొంది. ఇటీవల జైపూర్‌ లిటరరీ ఫెస్టివల్‌లో ఆమె తన ప్రసంగంలో ఈ మాటను స్పష్టంగా చెప్పింది. ఈ ప్రసంగాన్ని యూట్యూబ్‌లో వినగలం.



జాతీయ భావన పాశ్చాత్య దేశాల్లో ఇటీవల కాలంలో వచ్చింది. Nationalism అనే భావనను 18వ శతాబ్దం తర్వాతే చూస్తాం. ఇంగ్లండ్‌ 1702లో ఒక దేశంగా ఏర్పడింది. అమెరికా 18వ శతాబ్దం చివరి వరకూ ఒక జాతిగా లేదు. మన దేశంలో గుప్తుల కాలం నుంచి విశాలమైన రాజ్యాలు పలుమార్లు ఏర్పడ్డాయి. ఇతిహాసాల్ని చూస్తే మహాభారతంలోనే ప్రస్తుతమున్న రాషా్ట్రలన్నీ వర్ణించబడి ఉండటం చూస్తాం. ధర్మరాజు నలుగురు సోదరులు నాలుగు దిక్కులకూ వెళ్లి భారతాన్నంతా జయించినట్లు భారతం చెబుతుంది. దక్షిణ దేశాన్నంతా సహదేవుడు జయించాడట. మహాభారత యుద్ధంలో ప్రస్తుతం మనం చూస్తున్న రాషా్ట్రలన్నింటి నుంచి సైన్యాలు పాల్గొన్నట్లు కనిపిస్తుంది. శ్రీరాముడు అయోధ్య నుంచి శ్రీలంక వరకూ వెళ్లిన ప్రాంతాల్ని, అలాగే వానరులు సీతను వెతకడానికి వెళ్లినప్పుడు దేవంలోని వివిధ ప్రాంతాల్ని వర్ణించడం రామాయణంలో కనిపిస్తుంది. శ్రీకృష్ణుడి నగరమైన ద్వారక సముద్రంలో ముగినిపోవడాన్ని భాగవతంలో శ్రీకృష్ణుడే ప్రస్తావించాడు. ఎస్‌ఆర్‌ రావు అనే పురాతత్వ శాస్త్రవేత్త నేతృత్వంలో 1985 నుంచి 1989 వరకు గుజరాత ప్రాంతంలో సముద్రగర్భంలో జరిగిన పరిశోధనల్లో శ్రీకృష్ణుడి ద్వారకానగరం బయటపడటం మన చరిత్రకు ఒక కోణాన్నిస్తుంది. ఈ నగరం సుమారు 13వేల సంవత్సరాల కిందటిదని శాస్త్రవేత్తల అంచనా.



దేశమంతటా సామాన్య సంస్కృతి ఏర్పడడానికి ఒక ముఖ్య కారణం మనదేశం యొక్క భౌగోళిక పరి స్థితులు. ఒకవైపు హిమాలయాలు, మిగతా అన్ని వైపులా సముద్రం వ్యాపించి ఉన్న కారణంగా ఒక ప్రత్యేక ఉపఖండంగా ఉండి ఒకే సంస్కృతి వ్యాపించడానికి అవకాశం కలిగింది. అంగ, వంగ, కళింగ, కాశ్మీర మొదలైన అనేక రాజ్యాలు ఉన్నమాట నిజమే. అయినా వీటన్నిటి సంస్కృతీ ఒకటే. అందరికీ వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ప్రమాణాలు.



ఈ సంస్కృతి ఏర్పడడానికి భారతీయ రుషుల కృషి అద్భుతమైనదని చెప్పవచ్చు. అథర్వ వేదంలోనే భూమి సూక్తం అనే సూక్తంలో భరతభూమిని తల్లిగా భావించడాన్ని చూస్తాం. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఎవరు పూజకు సంకల్పం చెప్పినా ‘భరత వర్షే.. భరత ఖండే..’ అంటూ మొదలుపెట్టి తర్వాత తాము ఉన్న ప్రాంతాన్ని వర్ణిస్తారు. అలాగే కలశంలోకి పవిత్ర నదుల నీళ్లను ఆవాహన చేస్తూ ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి’ అంటూ భారతదేశంలోని ముఖ్య నదులను ప్రస్తావిస్తారు. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క ప్రాంతాన్ని ప్రత్యేకించి వర్ణించింది. మత్స్యపురాణం కాశీ, ప్రయాగలను ముఖ్యంగా చెబుతుంది. వామన పురాణం కురుక్షేత్రంలోని ప్రాంతాలను, వాయుపురాణం గయ మహత్యాన్ని, పద్మపురాణం రాజస్థాన్‌లోని పుష్కర తీర్థాన్ని గురించి చెబుతాయి. స్కంద పురాణం హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు అన్నింటినీ చెబుతుంది. దేశం మొత్తాన్ని సాంస్కృతికంగా ఏకం చేయడంలో స్కందపురాణం పాత్ర ఎక్కువగా ఉంది.



పురాణాలు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలను, విష్ణువుకు, శక్తికీ సంబంధించిన పుణ్యక్షేత్రాలను ప్రత్యేకంగా వివరించాయి. ఉదాహరణకు శివపురాణంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే భావన. సౌరాష్ట్రంలో సోమనాథుడు, శ్రీశైలంలో మల్లికార్జునుడు మొదలగు పేర్లతో ఈ జ్యోతిర్లింగాలు భరతఖండంలోని వివిధ భాగాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ తప్పనిసరిగా చూడాలని భక్తులందరూ భావిస్తుంటారు. అలాగే పద్దెనిమిది శక్తి పీఠాలు. శక్తి యొక్క శరీరం అనేక ముక్కలుగా వివిధ ప్రాంతాల్లో పడిందట. ఇవే శక్తి పీఠాలుగా నెలకొన్నాయి. జమ్మూలోని వైష్ణవదేవి మొదలుగా అసోం లోని కామాక్షి వరకు అలాగే దేశంలోని నాలుగు మూలల్లోనూ శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. వైష్ణవ పుణ్య

స్థలాలు కూడా దేశమంతటా కనిపిస్తాయి. ఇటీవల అపారమైన నిధులతో వార్తల్లోకి వచ్చిన కేరళలోని అనంత పద్మనాభస్వామి మొదలుగా హిమాలయాల్లోని బద్రీనాథ్‌ వరకూ దేశమంతటా వైష్ణవం వ్యాపించి ఉంది.



పుణ్యనదులకు కూడా ప్రత్యేకంగా కథలు ఉన్నాయి. వాల్మీకి రామాయణంలోని బాలకాండలో గంగానది అవతరణం ఒక ముఖ్య అంశం. భగీరథుడు తపస్సు ఫలితంగా గంగానది భూమికి రావడం అందంగా వర్ణించబడింది. కశ్యప ముని తపస్సు వల్ల సబర్మతి నది ఏర్పడిందట. అలాగే ప్రతి నదికీ ఒక పురాణగాథ ఉంది. ఒకప్పుడు పరిశుద్ధ జలాలతో ప్రవహించిన మన మూసీనది కూడా ముచుకుంద మహర్షి తపస్సు వల్ల ఏర్పడిందట.



పుణ్యనదుల్లో స్నానం చేయడం, పుణ్యతీర్థాలకు వెళ్లడం ఇతిహాసకాలం నుంచి చూడగలం. బహుశా తీర్థయాత్రలు చేసిన మొదటి ప్రముఖుడు భారతంలోని అర్జునుడు. ధర్మరాజు, ద్రౌపది ఏకాంతంలో ఉన్న సమయంలో ఆయన సమయ భంగం చేసినందువల్ల సంవత్సరం పాటు అనేక తీర్థాల్ని సేవించాడట. తీర్థయాత్రల్లో కూడా ఆయనకు శృంగారం లభించడం వేరు విషయం. ఏ దేశానికైనా స్వతంత్రం వస్తే జాతీయ భావాలు బలపడతాయి. కానీ మనదేశంలో మాత్రం స్వతంత్రం తర్వాత ప్రాంతీయ తత్వం, సంకుచితమైన ప్రాంతీయ వాదాలు లాంటి పరిణామాలు ఏర్పడ్డాయి. చరిత్రపట్ల అవగాహన లోపం, మన సంస్కృతి పట్ల ప్రేమ లేకపోవడం ఇందుకు కారణాలు కావచ్చు. (

కావేరి నది పుష్కరాలు

కావేరి నది పుష్కరాలు


గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్‌ 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు. 23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.

ఎక్కడ పుట్టింది?
పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.

అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది. ఆమే కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి. పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు.

వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది. దాంతో ఆయా ప్రదేశాలన్నీ ససస్యశ్యామలమయ్యాయి. కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలాకావేరి అనే ప్రదేశంలో పుట్టిన కావేరి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ప్రవహిస్తుంది. హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నొయ్యల్, అమరావతి నదులు కావేరికి ఉపనదులు.

తలకావేరి, కుషల్‌ నగర్, శ్రీరంగపట్టణ, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్‌ నగరాల గుండా ప్రవహిస్తుంది. చందనపు అడవులకు, ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరైన కూర్గ్‌ కావేరీనది వరప్రసాదమే. బెంగళూరు పులి టిప్పుసుల్తాన్‌ రాజధాని శ్రీరంగపట్టణం కావేరీ నది ఒడ్డునే ఉంది.  తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, కుంభకోణం, అందాలకు నెలవైన బృందావన్‌ గార్డెన్స్‌... కావేరీనది ఒడ్డునే ఉన్నాయి.

పుణ్యతీర్థాలు
చెన్నకేశవ స్వామి ఆలయం: 12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నాన భక్తులకు అవశ్య సందర్శనీయం. భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది తలమానికమైనది. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం కూడా తప్పక చూడదగ్గవి.

పుష్కర స్నాన విధి
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.

ఏమిటీ పుష్కరం?
పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ సమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.

పుష్కర ఘాట్ :

కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం, మైసూరు, శ్రావణబెల్ గోల, ధర్మస్థలం, వర్నాడు, కొక్కిసుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలు.

తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం వంటి పుణ్యక్షేత్రాలు.