Showing posts with label పండగలు. Show all posts
Showing posts with label పండగలు. Show all posts

Thursday, 14 September 2017

ఐరాసలో తొలిసారి దీపావళి వేడుక

*🚩ఐరాసలో తొలిసారి దీపావళి వేడుక🌴*
ఐక్యరాజ్యసమితి:
🌹భారతీయుల సమున్నత సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే దివ్వెల పండుగ దీపావళి తొలిసారి ఐక్యరాజ్యసమితిలో వెలుగులు నింపింది.
 దీపావళిని పురస్కరించుకుని ఐరాస కార్యాలయంలో ఈ పండుగ ఘనంగా జరిగింది. ప్రధాన కార్యాలయాన్ని దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. 'హ్యాపీ దీపావళి' సందేశం దీపకాంతులతో వెలుగులు విరజిమ్ముతూ కార్యాలయ శోభను మరింత పెంచింది. 'ఐరాసలో దీపావళి పండుగ జరుపుకోవడం ఇదే తొలిసారి' అని *యూఎన్‌లో భారత రాయబారి సైయద్ అక్బరుద్దీన్ తన సంతోషాన్ని ఓ ట్వీట్‌లో అందరితో పంచుకున్నారు*. ఇందుకు చొరవ తీసుకున్న *జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ పీటర్ థామ్సన్‌కు ధన్యవాదాలు తెలిపారు*.
ఐరాస ప్రధాన కార్యాలయం మీదుగా వెళ్లేవారు కార్యాలయంపై వెలుగుజిలుగులు వెదజల్లుతున్న దీపావళి సందేశాన్ని, ఆ శోభను తమ కెమెరాల్లో క్లిక్ మనిపిస్తున్న ఫోటోలను కూడా అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. చీకటిని తరిమికొట్టి మానవాళి జీవితాల్లో సరికొత్త ఆశలు, వెలుగులు నింపే పండుగ దీపావళి అని, చెడుపై మంచి సాధించే విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. దీపావళి ప్రాధాన్యత గుర్తిస్తూ 2014 డిసెంబర్‌లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితిలోని పలు సభ్యదేశాలు కూడా దీపావళి పండుగ జరుపుకొంటున్నాయి.

♦అధికారికంగా ఆ రోజు యూఎన్‌కు సంబంధించిన ఎలాంటి సమావేశాలు ఉండవు.