Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

Sunday, 14 January 2018

అరుంధతి నక్షత్రం

అరుంధతి నక్షత్రం
💮💮💮💮💮💮💮
అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.

అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతి
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం

        అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది - ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.
అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు.

             ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి

అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా

- అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలమనే అయిదు బాణాలను ఇచ్చాడు.
         మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్యాను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా,ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, పరిస్థితిని చక్కదిద్దాడు.రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపం ఇచ్చాడు.

            తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ట మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాలిందిగా కోరాడు.

          వశిష్టుడు ఆమెకు శివా మంత్రానుష్టానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు.
          'ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాద'నే వరాన్ని ఆమె కోరుకుంది. శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు. అపుడు సంధ్య 'నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ, అంతేకాక, తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాల'ని కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ, 'మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండంనుంచి నీవు జన్మిస్తావు.
నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడ'ని చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండంనుంచి తిరిగి జన్మించింది.
సంస్కృత భాషలో 'అరుం' అంటే అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. 'ధతీ' అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె 'అరుంధతి' అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి, వశిష్టునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోకపూజ్యురాలైంది.

         అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతా రు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరుల కు చెబుతారు. మాఘ మాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు.
రాత్రి పూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది.

           అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి.? గాలిపటం ఆకారంలో 7 నక్షత్రాలు ఉంటాయి. అవే సప్తషులు. తోక భాగంలో క్రిందినుండి రెండవది వశిష్ఠుడు. వశిష్ఠుని ప్రక్కనే అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.

             అరుంధతి పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం అరుంధతి (అయోమయ నివృత్తి) చూడండి.
అరుంధతి భారత పురాణాలలో వశిష్ట మహాముని భార్య మరియు మహా పతివ్రత. భారతీయుల వివాహములో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ముఖ్యవిధి.

        అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్లి సమయంలో చూపించి చెబుతారు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరులకు చెబు తారు. మాఘమాసాది పంచ మాసాల కాల మందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు.

         రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షి మండలంలో ఉండే చిన్న నక్షత్రం, శిశిర, వసంత, గ్రీష్మ రుతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుజామున కనిపిస్తుంది.

        అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి. '?' మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. కచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్న పిల్లాడిని ? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది

Monday, 4 December 2017

భీష్మ నిర్యాణం

Take time & read. It’s not about Mahabharata, this is about our pride & Asset as an Indian.
Bhisma Ekadasi

💥⚡💥❄💥   

ఆధునిక ప్రపంచ వైద్యులను విస్మయ పరిచే అంశం భీష్మ నిర్యాణంలో ఉంది. ప్రపంచంలో మొదటి ఆధునిక అంత్యదశసేవాశ్రమం అనే హాస్పీస్ ను 1967లో ఇంగ్లండుకు చెందిన నర్సు ఏర్పాటు చేసిందని అంటున్నారు. దీనికి ముందర క్రీస్తు శకం 11వ శతాబ్దంలో క్రైస్తవంలోని రోమన్ కేథలిక్కు వర్గానికి చెందినవారు ఏర్పాటు చేశారనే వారు కూడా ఉన్నారు. కానీ వీటన్నింటికన్నా ముందర మహాభారతంలో భీష్మనిర్యాణ ఘట్టంలో అంత్యదశసేవల గురించి అద్భుతమైన వివరణ ఉంది.

భీష్ముడు కురుక్షేత్ర యుద్ధంలో 10 రోజులు పోరాడి ఒళ్ళు అంతా బాణాలు గుచ్చుకోగా నేలకు ఒరిగాడు. అయితే ఆయన వెంటనే చనిపోలేదు.  58 రోజులు బాణశయ్య మీద బ్రతికారు. ఆ 58 రోజుల్లో భీష్ముడిని పాండవులు చూసుకున్న తీరులో ఆధునికులు కూడా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నింటినో తెలుపుతోంది.

భీష్మ నిర్యాణంపై ఆంధ్రవ్యాసుల వారు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘మనం చాలా తప్పు చేస్తున్నాము. సీనియర్ సిటిజన్ల పేరుతో 60 ఏళ్ళ ముద్రవేసి వారిని  పట్టించుకోవడంలేదు. కానీ విదేశాల్లో వృద్ధుల నుంచీ ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నారు. జీవితంలో వారు గడించిన అనుభవాలను విదేశీయులు సేకరించి వారివారి రంగాలకు మెరుగులు దిద్దుకుంటున్నారు. మనం పనికి మాలిన వాళ్ళలాగా మారిపోతున్నాం. ముసలాళ్ళు ఒక బరువు అనుకుంటున్నాము. ఎంతో విలువైన అనుభవసారాన్ని కోల్పోతున్నాము.

ప్రతీ వృద్ధుని దగ్గరా తాను పనిచేసిన రంగంలో విశేషమైన అనుభవజ్ఞానం ఉంటుంది. దాన్ని సేకరించే విభాగం ఒకటి రావాలి. నిజానికి దీనివల్ల వృద్ధులకు కూడా తమను సమాజం నిర్లక్ష్యం చేస్తోంది అనే భావన పోతుంది. మనకు దాని వల్ల వివిధరంగాలకు కావలసిన అనుభవజ్ఞానం వస్తుంది. ఈ విజ్ఞానం ఎన్ని కోట్ల రూపాయల పరిశోధనలు చేసినా దొరకదు. కేవలం వృద్ధుల దగ్గర మాత్రమే ఉంటుంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ మహాభారతంలో ఉంది.

18 రోజుల యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం నాశనం అయ్యాక, దుర్యోధనుడు కూడా చనిపోయాక, ధర్మరాజు పట్టాభిషేకం ద్వారా చక్రవర్తి అయ్యాడు. ఈ సమయంలో వ్యాసుడు, కృష్ణుడు అద్భుతమైన సలహా ధర్మరాజుకు ఇస్తాడు. అప్పటికి భీష్ముడు ఇంకా జీవించే ఉన్నాడని ధర్మరాజుకు గుర్తు చేస్తూ అపారమైన జ్ఞాన సంపద ఆ కురువృద్ధుడి దగ్గర ఉందని ఆయన గతిస్తే ఆయనతో పాటే ఆ మహావిజ్ఞానం అంతరిస్తుందని, కనుక వెళ్ళి తాతను సేవించి తెలుసుకోమని వ్యాసుడు, కృష్ణుడు సలహా ఇస్తారు.

వారి సలహా వల్ల భారతంలోనే అతి పెద్ద పర్వం శాంతి పర్వం పుట్టింది. అందులో భీష్ముడు చెప్పిన విషయాలు సకల శాస్త్ర సారాలు. విష్ణుసహస్ర నామం కూడా అందులోదే. కనుక వృద్ధులను సేవించడం వలన సమాజానికి ఎం ప్రయోజనం ఉంటుందో భారతం తెలుపుతోంది‘‘ అని అన్నారు. ఆంధ్రవ్యాసుల వారి మార్గదర్శకత్వంలో    మరింత లోతుగా పరిశోధన చేస్తే అద్భుతమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

1) భీష్ముడు క్రింద పడగానే వేలాది కన్యలు (నర్సుల) వచ్చి ఆప్రదేశాన్ని శుభ్రంచేసి గంధపు పొడి, పేలాలుచల్లి, పూవులతో అలంకరించారు.

2) భీష్ముడి దగ్గరకు ఎవరెవరు వచ్చారో వ్యాసుడు వివరంగా చెప్పాడు. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది.
తూర్యాణి శతసంఖ్యాని తథైవ నటనర్తకాః।
శిల్పినశ్చ తథాఽఽజగ్ముః కురువృద్ధం పితామహం ॥
భీష్ముడి దగ్గరకు సంగీత వాయిద్యాలు వందల సంఖ్యలో తీసుకొని గాయకులు, నటులు, నర్తకులు, శిల్పులు (ఇంజనీరింగు విభాగంవారు) వచ్చారని వ్యాసుడు చెప్పాడు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం.

రోగి వేరు అంత్యకాలంలోని వ్యక్తి వేరు. చికిత్స ఉన్నంత కాలమే ఒక వ్యక్తి రోగి అవుతాడు. చికిత్స లేనప్పుడు అతడు పేషంటు కాడు. అతడికి చేయాల్సిన వైద్యం అంత్యకాల సేవ. అది వేరే ఉంటుంది. అదే ఆరోజున భీష్ముడికి చేశారు. అంత్యకాలంలో ఉన్న భీష్ముడికి ఆనందం కలిగించడం కోసం నటులు, నర్తకులు, గాయకులు, సంగీతకారులు వచ్చారు. నేడు కూడా ఆసుపత్రులలో సైతం టివిలు, మ్యూజిక్ సిస్టంలు ఉంచుతున్నారు. ఇక పాలియేటివ్ కేర్ సెంటర్లలో అయితే అంత్యకాలంలో వారు ఆడుకోవడానికి ఆటవస్తువులు కూడా ఉంచుతున్నారు.

ఇక్కడ అతిముఖ్యమైన అంశం ఏమిటంటే భీష్ముడి దగ్గరకు వారంతా వచ్చారు. అంతేకానీ వారు ఎవరు సంగీత వాయిద్యాలను వాయించారని కానీ, నటులు, నాట్యకారులు నాట్యం చేశారని కానీ చెప్పలేదు. దీనికి కారణం భీష్ముడు తాను మానవ భోగాలకు అతీతుడను అయ్యాను అనినందువల్ల.
అయితే వేల సంవత్సరాల క్రితం భారతంలో పాలియేటివ్ కేర్ పురుడుపోసుకుందని చెప్పడానికి ఇది రెండో అతి ముఖ్యమైన శ్లోకం భీష్మపర్వంలో ఉంది.

3) దీని తరువాత అతి ముఖ్యమైంది శాంతిపర్వంలో ఉంది. ‘‘భీష్ముడి మరణశయ్య దగ్గరకు భూమి మీదే కాక ముల్లోకాల్లో ఉన్న మహర్షులు, యతులు, పరమహంసలు, దేవతలు వచ్చారు. వారిలో నారదాది సంగీతవిద్వాంసులు ఉన్నారు. శ్రీకృష్ణుడు చూడడానికి వచ్చి భీష్ముడి బాధలు పోగొట్టగానే  వ్యాస మహర్షితో కూడిన సమస్త రుషి గణాలూ రుగ్, యజుస్, సామగానాలు చేశారు. అన్ని రుతువులకు చెందిన పుష్పాలు ఏక కాలంలో కురిశాయి. దేవతలు, అప్సరసలు వచ్చి సంగీత వాయిద్యాలు మ్రోగించి గానం చేశారు. పవిత్రమైన, ప్రశాంతమైన, స్వచ్ఛమైన చల్లటి గాలి వీచింది. ఆ ప్రాంతంలో ఉన్న సమస్త జంతు పక్షిజాతి సుఖాన్ని ఆనందాన్ని అనుభవించాయి. భీష్మునికి అత్యంత ఆనందదాయకమైన వాతావరణం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుడు సూర్యాస్తమయం చూసి రేపు వస్తానని వెళ్ళాడు.‘‘

ఇక్కడ ఇచ్చిన ప్రతి వర్ణన అంత్యదశసేవల్లో చాలా ముఖ్యమైంది.
దీనిలో, రెలిజియస్ హీలింగ్, యోగా, మ్యూజిక్ థెరపీ, పుష్పవైద్యం వంటివి ఉన్నాయి.

తతస్తే వ్యాససహితాః సర్వ ఏవ మహర్షయః।
ఋగ్యజుఃసామసహితైర్వచోభిః కృష్ణమార్చయన్॥
తతః సర్వార్తవం దివ్యం పుష్పవర్షం న భస్తలాత్।
పపాత యత్ర వార్ష్ణేయః సగాంగేయః సపాండవః॥
వాదిత్రాణి చ సర్వాణి జగుశ్చాప్సరసాం గణాః।
న చాహితమనిష్టం చ కించిత్తత్ర వ్యదృశ్యత॥

అన్నిటికీ మించి పేషంటుకు ఉన్న విజిటర్స్ సమయాన్ని మహర్షులు కూడా గౌరవించి అస్తమయం అవుతుండడంతో మరలా రేపు వస్తానని కృష్ణుడు, ధర్మరాజు, భీష్ముడు వద్ద శలవు తీసుకొని  వెళ్ళిపోయారు. ధర్మరాజు, కృష్ణుడు కూడా వెళ్ళిపోయారు.

4) ఇక్కడ అతి ముఖ్యమైన వర్ణన వ్యాసుడు చేస్తాడు. పాండవుల రథాలు వెళ్ళిన తీరు మహానదిని తలపించిందని చెప్పాడు.

తతో రథైః కాంచనచిత్రకూబరై
ర్మహీధరాభైః సమదైశ్చ దంతిభిః।
హయైః సుపర్ణైరివ చాశుగామిభిః
పదాతిభిశ్చాత్తశరాసనాదిభిః॥

యయౌ రథానాం పురతో హి సా చమూ
స్తథైవ పశ్చాదతిమాత్రసారిణీ।
పురశ్చ పశ్చాచ్చ యథా మహానదీ
తమృక్షవంతం గిరిమేత్య నర్మదా॥

ఈ వర్ణన చదవకపోతే తరువాత ధర్మరాజుకు ఉన్న మహత్తరమైన విజ్ఞానం మనకు అర్థం కాదు.

5) మర్నాడు ధర్మరాజు ఉదయాన్నే భీష్ముని దర్శనానికి వెళుతూ అర్జునుడిని పిలుస్తాడు. పిలిచి ఇలా అంటాడు. ‘‘ అర్జునా ఈ రోజు ఏవిధమైన మందీ మార్బలం, సైన్యం లేకుండా నేను సోదరులతో మాత్రమే వెళ్లదలచాను. మన అశ్వగజరథ సైన్య పరివారం వెళ్ళివస్తూ ఉండడం వలన అంపశయ్యమీది భీష్ముడికి ఇబ్బంది కలుగకూడదు. కనుక సైన్యాన్ని, భటులను వద్దని చెప్పు. ఈ రోజు నుంచీ నేను భీష్ముడి దగ్గర ముఖ్యమైన రహస్యాలు తెలుసుకోబోతున్నాను. కనుక అనవసరమైనవారు అక్కడ జమకూడడం నాకు ఇష్టంలేదు‘‘ అన్నాడు.

న సైనికైశ్చ యాతవ్యం యాస్యామో వయమేవ హి।
న చ పీడయితవ్యో మే భీష్మో ధర్మభృతాం వరః

ఇది నేటికీ ఆచరించదగిన ముఖ్య విషయం. ఎవరైనా గొప్ప వ్యక్తి చనిపోవడమో, జబ్బుపడడమో జరిగితే ముందుగా ట్రాఫిక్కు పోలీసుల గుండెలు ఆరిపోతాయి. వచ్చేవారు పలకరించడానికి వస్తున్నారా? లేక తమ హోదాలు వెలగబెట్టుకోవడానికి వస్తున్నారో తెలియని సందర్భాలు కోకొల్లలు. భారీగా వాహనాలు రోడ్ల మీద పార్కుచేసి ట్రాఫిక్కు స్తంభింపచేయడంతో మొదలుపెడితే గన్ మెన్లు హోషు చూపించుకోవడం, బుగ్గకార్ల హడావుడి--- ఇదంతా చూస్తే ఎంత నీచంగా ఉంటుందో ఒక సారి ఎవరికి వారు గమనించుకుంటే మంచిది.

శ్రీకృష్ణుడు కూడా శైబ్య, సుగ్రీవ, వలాహక, మేఘపుష్ప అనే తన రథాశ్వాలను శబ్దం లేకుండా వెళ్ళమని ప్రార్థించాడట. ఆ పశువులైన ఆ గుర్రాలు మహావేగంతో పయనించినా భూమి మీద అతి సుకుమారంగా వెళ్ళాయని వ్యాసుడు చెప్పాడు. నేడు ఆసుత్రుల దగ్గరకు వాహానాలలో వెళ్ళేవాళ్ళు ఆ గుర్రాలను చూసి బుద్ధి తెచ్చుకుంటే మంచిది. ఆసుపత్రి ఏరియా దయచేసి హారన్ మ్రోగించవద్దు  అనే బోర్డు ఎవరూ పట్టించుకోరు. లోపల మరణావస్థలో ఉన్నపేషంట్ల వినికిడి అవయవాలు మహాబాధపెడతాయని ఎప్పటికి బుద్ధి వస్తుందో నేటి వాహన చోదకులకు?

ఆగచ్ఛత్స్వథ కృష్ణోఽపి పాండవేషు మహాత్మసు।
శైనేయసహితో ధీమాన్రథమేవాన్వపద్యత॥
రథస్థాః సంవిదం కృత్వా సుఖాం పృష్ట్వా చ శర్వరీం।
మేఘఘోషై రథవరైః ప్రయయుస్తే నరర్షభాః॥
బలాహకం మేఘపుష్పం శైబ్యం సుగ్రీవమేవచ।
దారుకశ్చోదయామాస వాసుదేవస్య వాజినః॥
తే హయా వాసుదేవస్య దారుకేణ ప్రచోదితాః।
గాం ఖురాగ్రైస్తథా రాజఁల్లిఖంతః ప్రయయుస్తదా॥
తే గ్రసంత ఇవాకాశం వేగవంతో మహాబలాః।
క్షేత్రం ధర్మస్య కృత్స్నస్య కురుక్షేత్రమవాతరన్॥

మహాభారతం నేడు కూడా ఎందుకు అనే ప్రశ్నకు ఈ శ్లోకాలు చాలు. ఎంత నిర్లజ్జగా మనం నేడు బ్రతుకుతున్నామో తెలియడానికి. వేల సంవత్సరాల క్రితం మరణశయ్యమీద వ్యక్తి దగ్గరకు ఎలా వెళ్ళాలో చెప్పిన మరో గ్రంథం ప్రపంచంలో మరొకటి లేదు. లక్షాపదివేల శ్లోకాల్లో ఏం ఉందో చదువుకుంటే మనిషిగా మనం ఎంత పశుప్రాయంతో జీవిస్తున్నామో తెలుస్తుంది. నేడు దౌర్భాగ్య ప్రభుత్వాల కారణంగా సంస్కృతం అడుగంటి భారతంలో ఏం ఉందో చదివి తెలుసుకోలేక  బ్రతుకుతున్నాము. ఏ అమెరికా, ఇంగ్లండు వారో హాస్పీస్ సేవలు మా దగ్గరే పుట్టాయి అంటే నిజమే కాబోలు అనుకునే జాతి తయారైంది.

------------------------

Wednesday, 18 October 2017

🙏🌼🍀🌅🍀🌼🙏
నిత్యపూజ చేయడం అనేది సాధారణముగా ఇంటి యజమాని అయిన పురుషుడు చేస్తాడు.
సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది.
అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి.
ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి.
 పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది.

వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం.

ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి.

చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు.

యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు.
ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి.

మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి.

‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు.

దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు.

పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.

సేకరించి పంపబడినది
పార్థసారథి నాయుడు దగ్గుపాటి
🙏🌼🍀🌅🍀🌼🙏

Thursday, 14 September 2017

సప్త ఋషులు

సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు....

కశ్యప అత్రి భరద్వాజ
విశ్వామిత్రోథ గౌతమః!
వశిష్టో జమదగ్నిశ్చ
సప్తైతే ఋషయః స్మృతాః!!

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.
ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు... వీరు ఏడుగురు పూజ్యనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు.

 1. కశ్యప మహర్షి:- సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. అత్రి మహర్షి:-
 సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజ మహర్షి:-
భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

 4. విశ్వామిత్ర మహర్షి:-
విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. గౌతమ మహర్షి:-
తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. వశిష్ఠ మహర్షి:-
ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.

 7. జమదగ్ని మహర్షి:-
జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు.

Tuesday, 12 September 2017

ఈ మధ్య Whatsapp లో తెగ హల్చల్ చేసిన ఒక ఆర్టికల్ రావణుడి లాంటి తమ్ముడు కావాలి అని.

రావణుని లాంటి తమ్ముడు అయితే ??
( Whatsapp ఆర్టికల్ యధాతధంగా )

ఒక గర్భవతి అయిన స్త్రీ తన కూతురుకి తమ్ముడు కావాలా ? చెల్లి కావాలా ? అని అడిగింది

కూతురు: తమ్ముడు కావాలి

తల్లి: ఎలాంటివాడు కావాలి

కూతురు: రావణుడి లాంటి వాడు కావాలి

తల్లి: ఏంటి నువ్వు మాట్లాడుతుంది ? నీకు ఏమైనా మతి పోయిందా ?

 కూతురు: రావణుడి లాంటి వాడు అయితే ఏమైందమ్మా ?
అతడు తన చెల్లిని అగౌరపరిచారని బంధాల్ని,చివరకి రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు.
శత్రువు భార్యని  ఎత్తుకొచ్చాడు,కానీ కనీసం తాకలేదు
నేను రావణుడి లాంటి తమ్ముడిని ఎందుకు కోరుకోకూడదు

పోనీ రాముడి లాంటి తమ్ముడిని ఎందుకు కోరుకోవాలి
ఎప్పుడూ తన నీడలా పక్కనే ఉండే భార్యని గర్భవతి అని కూడా చూడకుండా ఒక రజకుడి మాట విని అగ్ని పరీక్ష పెట్టాడు

14 సంవత్సరాలు వనవాసానికి తీసుకెళ్లి అష్టకష్టాలు పడేటట్లు చేశాడు

అందుకా…?

ఇప్పుడు చెప్పు అమ్మ నీకు రాముడు కావాలా? రావణుడు కావాలా?
రాముడికి భార్యగా ఉంటావా ? రావణుడికి చెల్లిగా ఉంటావా ?

ఇప్పటికీ రాముడే కొడుకుగా పుట్టాలి అనుకుంటున్నావా ?

తల్లి కళ్ళల్లో నీళ్ళు చెమర్చాయి...!!

*పై ఆర్టికల్ పై హిందూ ధర్మచక్రం వివరణ :*

అతడు తన చెల్లిని అగౌరపరిచారని బంధాల్ని,చివరకి రాజ్యాన్ని కూడా వదులుకున్నాడు.
⭕  చెల్లి ( శూర్పణఖ )   కోరిక కామంతో కూడుకున్నది. ముందుగా రాముడిని తన కోరిక తీర్చమంది, ఆనక లక్షమనుడిని కోరింది.ఇది పాపం.  రాక్షస స్త్రీ అయినా చంపకుండా ముక్కు చెవులు కోసి దండించి వదిలేసారు. దీనిని చెల్లికి పరాభవం అనుకోవడం రావణుడి సహజ గుణం (రాక్షసుడు  కనుక) చెల్లి విషయంలో రావణుడు ఉత్తముడిలా ఆలోచించి ఉంటే చివరాఖరికి రాముడి చేతిలో చచ్చేవాడే కాదు.

ఇక్కడ జరిగిన విషయం అంతా వివరంగా తెలుసుకొని చెల్లిని మందలించాల్సింది పోయి కొరివితో తల గోక్కున్నాడు రావణుడు.

రావణుడు బంధాల్ని రాజ్యాన్ని వదులుకోలేదు  "పోగొట్టుకున్నాడు"  అని గమనించాలి.

2. శత్రువు భార్యని  ఎత్తుకొచ్చాడు,కానీ కనీసం తాకలేదు.

⭕  ఛి …. దరిద్రం కాకపొతే మరెంటండి… ఇందులో నీతి ఎక్కడ ఏడ్చింది??

రావణుడు నిజంగా దమ్మునవాడు అయితే వనవాసంలోనే.. సితని పరాభవంచేసి ప్రతీకారం తీర్చుకోవాల్సింది. లేదా

అక్కడే రామునితో యద్ధం చేసి రామ లక్ష్మణులను ఓడించి  సీతని గెలిచి తెచ్చుకోవాల్సింది.

అలాకాకుండా .. మారీచునితో నాటకం ఆడించడం ఏంటి ? రామ లక్ష్మణులు లేని టైం లో రావడం ఏంటి ? అందునా దర్జాగా రావనుడిలా కాకుండా బిచ్చగాడిలా రావడం ఏంటి ? ఇందులో ఎక్కడ రావణుడి గొప్పతనం కనబడింది ???

ఎంటేంటి ??? ఎత్తుకొచ్చాడు కానీ కనీసం తాకలేడా ?

కిడ్నాప్ చేయడం నీకు తప్పు అనిపించలేదా ??? పర స్త్రీలను ఎవరైనా అలా ఎత్తుకురావచ్చా ?? అందులో మీకు దోషం కనబడలేదా ??

ఎందుకు తాకలేదో తెలుసా ?? రావణుని శాపం ఉంది ఇంకో స్త్రీ ని కనుక బలాత్కరిస్తే … తల పగిలి చస్తాడు అని ….  వాడూ సీతమ్మని  తాక కపోవడానికి కారణం అది.

3 ) ఎప్పుడూ తన నీడలా పక్కనే ఉండే భార్యని గర్భవతి అని కూడా చూడకుండా ఒక రజకుడి మాట విని అడవుల్లో వదిలి పెట్టాడు .

⭕  ”నూటికి 99 మంది సీత పతివ్రత అని అనడం కాదు,  నూటికి నూరు మంది సీత పతివ్రత అనాలి ” అని అంతటి కటిన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అర్ధం అయ్యిందా ??

4 )  14 సంవత్సరాలు వనవాసానికి తీసుకెళ్లి అష్టకష్టాలు పడేటట్లు చేశాడు.

⭕  అవునా ?? అలా అని మీకు సీతమ్మ  చెప్పిందా?
వనవాసంలో రావణుడు వచ్చే క్షణం ముందు వరకూ సీతమ్మ రాముడితో చాలా సంతోషంగా  ఉంది. రాముడి ఎడబాటే ఆ తల్లికి నరకం. రాముడు వెంట ఉంటే ఎక్కడ ఉన్నా తను సంతోషంగా ఉంటుంది.

ఆ తల్లి కష్టాలు పడింది అంతా లంకలోనే … ఈ విషయం మీరు బాగా గమనించాలి .

ఇలాంటి కుహనా పండితులు రాసే ముందు పురాణాల గురించి అవగాహన  లేకపొతే రాయడం మానేయాలి.

రావణుడు ….  కుబేరునుకి బ్రహ్మ ఇచ్చిన విమానం పైన ఆశతో విమానం కోసం కుబేరునితో యుద్ధం చేసిన అత్యాశ పరుడు.

ఒకసారి పరమేశ్వరుని దర్శనం కోసం వెళ్లి తల్లి సమానమైన పార్వతి దేవిని కోరుకున్న కామాంధుడు.

ఫలితంగా శివుడు మంచి గునపాటమే చెబుతాడు.

పై ఆర్టికల్ లో అమ్మాయి రావణుడి లాంటి తమ్ముడిని కోరుతుంది అంటే ..తను కూడా శూర్పణఖలా ఆలోచిస్తుంది అనిపిస్తుంది. తనుకూడా ధర్మ హీనంగా పర పురుషుడిని కోరుకుంటే తన తమ్ముడు రావనుడిలా ప్రవర్తించాలి అని ఆలోచిస్తుంది అనుకోవచ్చు.

కూతురికి పురాణాల పైన అవగాహనలేదు అనుకోడానికి వీలు లేదు , ఎందుకంటే అన్ని పాత్రల గురించి చెప్పింది.

అంటే ..అవగాహన మాత్రమే ఉంది కానీ వివేకము లేదు అని కూడా మనం అర్ధం చేసుకోవాలి.

కూతురి మాటలకు తల్లి కళ్ళల్లో నీళ్ళు తిరగడం అనేది మరీ దారుణంగా ఉంది. కూతురికి తెలియకపోతే తల్లి అర్ధం అయ్యేలా చెప్పాలి. అలా చెప్పకుండా తల్లి  కూతురి మాటలకు సంతోషించింది అనుకుంటే తల్లికి కూడా పరిపక్వత రాలేదు అనుకోవాలి ( రాసిన వ్యక్తికి లేదు కనుక పాత్రలకు కూడా  ఉండవు )

అనవసరంగా పురాణాల్లో ఋషులు చెప్పిన వాటికి భిన్నంగా ఆలోచించి రావణాదులను హీరో లను చేయకండి.

మొన్నీమద్యే … O U Campus లో రావణుడు మా తెగవాడు అని పండుగలు చేసారు…ఇలాంటి పైత్యపు రాతల వల్ల వారికి ఊతం ఇచ్చిన వారు అవుతారు జాగ్రత్త.

ఒకవైపు హిందూ ధర్మం పైన ఇతర మతాల దాడులు మార్పిడీలు జరుగుతుంటే మనం ఇంకా పటిష్టం కావాల్సింది పోయి మన మతం గురించి మనమే  విష ప్రచారం  చేస్తున్నాము. ఇది కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే అవుతుంది.

చేతనైతే హిందూ ధర్మం అభివృద్ధికి కృషి చేయండి.
✨✨✨✨✨✨✨✨
www.ayurgreen.com

Monday, 11 September 2017

భగవద్గీత చావుమేళం కాదు

 *భగవద్గీత చావుమేళం కాదు ... కారాదు.*

*దయచేసి చనిపోయిన శవాల వద్ద భగవద్గీతను పెట్టకండి ..*

*వినాశకాలే విపరీత బుద్ధి.*

భగవద్గీతను “శవ” సంకేతానికి , “శవయాత్రలకు” మొట్టమొదట ప్రారంబించిన.... చవట/సన్నాసి/నీచ/నికృష్ట వెధవ ఎవడోగానీ ....

ఏం దరిద్రం ఇది ?
పవిత్రమైన, జ్ఞానప్రదాయని అయిన భగవద్గీతను
 “పీనుగ లేచింది” అనే సంకేతంగా మార్చిన పైత్యం ఎవరు నేర్పినారు?
ఇంట్లో భగవద్గీత పెట్టుకోవాలంటేనే భయపడే స్తితికి తీసుకొచ్చారు .

ఒకప్పుడు భ్రంహ్మముహూర్త కాలంలో ,
ప్రభాత వేళలో గుడి మైకులనుండి వినబడే
ఆతీ మధురమైన ఘంటసాల గారి భగవద్గీత మనోల్లాసాన్ని కలిగించేది ,
అనంత కాలగమనంలో మనిషి జీవితం ఎంతచిన్నదో  కాలస్వరూపమైన దైవం ఎంత విస్తృతమో
నిత్యం గుర్తుచేస్తూ ఉండేది .
పండితుడైనా పామరుడైనా ఒక విధమైన ట్రాన్స్ లో కి తీసుకెళ్ళేది
ఎదో తెలియని ఆధ్యాత్మిక భావన అనిర్వచనీయమైన హృదయ వైశాల్యాన్ని కలిగించేది .

అటువంటి భగవద్గీతకు ఎంత భ్రష్టత్వం ఆపాదిస్తున్నాము.

కలికాల ప్రభావమా ..? దైవ ఉపాసనలకు బదులు పిచాచ ఉపాసనలు ? ఏం ఖర్మ ఇది ?

ఈ దిక్కుమాలిన ప్రాక్టిస్ తెలుగు రాస్త్రాలలోనేనా ?
దేశం మొత్తం భూత ప్రేతాలు ఆవహించాయా ??

ఇప్పటికైనా మారండి.. పాపం మూటగట్టుకోకండి... నాయనా ...

ఆలోచించండి ఈ నీచ సంస్కృతినుండి బయటపడండి . తెలుగు రాష్ట్రాల్లో ఒక ఉద్యమంలా
చైతన్యం కలిగించండి.......
ఇప్పటినుండి చావుల దగ్గర, భగవద్గీత వేయకుండా
ఆపండి .



 హైందవ జీవనవిధానం అనేది ఒక మార్గం అది ఒక ధర్మం అంటూ ఉంటాం. కాస్త చర్చించి విచక్షణతో ఆలోచిద్దాం. హిందూ ధర్మంపై, ఈ దేశంలో ఉన్న హిందువులనే మీరు వలస వచ్చారు అనేంత వరకూ విద్వేషం వక్రీకరణలు చేరుకుంటున్నాయి అంటే మనము ఎంత ప్రమాదంలో ఉన్నామో కూడా ఎవరికీ కళ్ళకు కనబడని పరిస్థితి. చార్వాక అనీ, హేతువాది అనీ, కమ్యూనిస్టు అని, శూన్యవాది అని, అంబెడ్కర్ వాదీ అనీ హిందువులకు కనబడని శత్రువుగా ఇంట్లో ఉండి మరీ వెన్నుపోటు పొడుస్తున్న హిందువులే మనకు ఈనాడు ప్రధమ శత్రువు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

తమ మిడిమిడి జ్ఞ్యానాలతో, వచ్చీరాని సంస్కృతాలతో, ఎక్కడలేని వక్రీకరణలు చదివి విద్వేషం విషం తమ కుహనా మెదళ్ళలో పేర్చుకుని వీళ్ళు చేసే సమాజ ద్రోహం ఆత్మద్రోహం అంతా ఇంతా కాదు.

మెకాలే వామపక్ష కుట్రపూరిత దూరాగతాలు ఒక ఎత్తైతే, మహోన్నతమైన మన సంస్కృతిలో మన ధర్మం, సంస్కృతి, సంస్కారం ఎలా మరచిపోయామో ఎలా మన జీవన విధానం మన ఈ పరిస్థితి కలుగజేసిందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

టూకీగా చెప్పాలంటే మన సంస్కృతి, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ, సత్యం అలాగే సకల జీవ జంతుజాలానికి మరియూ ఈ సృష్టి లోని ప్రతి కణానికి బ్రహ్మ పదార్ధ తత్వాన్ని అన్వయించి మసలుకోవడం .......
మన రోజూ వారీ హైందవ జీవితంలో ప్రధాన అంతర్భాగాలు.

మన హైందవ కుటుంబ ప్రక్రియ, జీవనవిధానం గురించి పరికిస్తే మనకి ఈ పై విషయాల గురించి ఏ ఒక్కరికీ ఏ రకమైన పరిజ్ఞ్యానం లేకపోయినా అసలు హైందవ జీవన విధానం గురించి లేదా వేదోపనిషత్తుల భక్తి సాహిత్య పరిజ్ఞ్యానం గురించి ఏ విధమైన Touch లేకపోయినా....
సూక్ష్మంలో ఈ తత్వబోధన మన జీవన విధానపు మార్గంలో దైనందిన జీవితంలో అంతర్భాగమని ప్రతివారికీ అర్ధం అవుతుంది.

పూర్వకాలం సంగతులు పక్కన పెడితే ఈనాటి మన పాశ్చాత్య పోకడ వంట బట్టిన జీవనశైలిలో చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలకి సంస్కృతి గూర్చి చెప్పే ఓపిక అవకాశం విజ్ఞానం వారికి లేవు ఉన్న తాతలు, అమ్మమ్మ నానమ్మలు ఇతర పెద్దలు చెప్పితే విని అర్ధం చేసుకునే ఓపిక అవకాశం జ్ఞానం ఈ నవ తరానికి లేదు.

మరి ఎలా.....

చిన్నప్పటి నుంచి ఒక భక్తి, ఒక జ్ఞ్యానం, పురాణేతిహాసాల పరిచయం ఏమాత్రం లేకపోగా పిల్లలు యుక్త వయస్సుకి వచ్చేసరికి అహంకార ప్రభావం వల్ల, వామపక్ష రుద్దుడు ఫలితంగా, హైందవ సంస్కృతి అనగానే చిన్నచూపు వ్యంగ్య అవహేళన కారణంగా
కొందరు Rebellious గా
కొందరు నాస్తిక గా
కొందరు హేతువాద దృక్పధంగా
కొందరు అహంకార జనీత వ్యక్తిత్వం తో
మిగతా సగం మంది నేను హిందువుని అని చెప్పుకోడానికి బజార్లో గుడ్డలు విప్పి నిలుచోబెట్టినంతగా సిగ్గుతో బిక్కచఛ్చి బతకడం
ఆ మిగిలిన సగం మంది SECULARISM అనే అనవసర రుద్దుడు భాగోతంలో మనలని ఒక మాట అనడమే కాదు ఒక చెంపపై ఎవడైనా కొడితే ఎందుకు కొట్టావురా బోసిడికే అని కాలర్ పట్టుకుని నాలుగు తన్నకుండా రెండో చెంప చూపడం ఏంటి లోపల ఉచ్చకార్చుకుంటూ పైకి మాత్రం హిందూ వ్యవస్థని నానా దుర్భాషలాడుతూ ఆస్తులు దేశం మొత్తం రాసిచ్ఛేసే చాతకాని చవటల నపుంసక బతుకు బతుకుతూ...
దిక్కుమాలిన వారిగా తయారు అవుతున్నారన్నది మనం దాచలేని దుర్భర సత్యం.

మరి ఇలాంటి వారు కన్నతల్లి రొమ్ముపాలు తాగి అదే రొమ్ము గుద్దే PRAKSHAL, Shabbir, కూరపాటి, దుర్గం, గోగినేని, ఉయ్యాల, INDUS Martin, సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్ ల లాగాతయారు కాకుండా ఎలా ఉంటారు.

మన దైనందిక జీవన గమ్యంలో తల్లిదండ్రుల పెద్దల పట్ల భక్తి,  సకల జీవరాశుల చెట్టూ పుట్టల పట్ల అభిమానం, ఆత్మ ప్రభోదాన్ని అనుసరిస్తూ సంస్కృతి ధర్మాన్ని కాపాడటం, భక్తి జ్ఞ్యాన యోగ ఆధ్యాత్మిక సమ్మిళిత జీవనం ఇవే మన దైనందిన హైందవ జీవితం.....

నువ్వు హాదీస్ శవార్త ఎడారి నల్లట్ట పుస్తకాలు మాత్రమే బట్టీ పట్టి నా జీవితంలో ఇప్పటికి అబద్దాలు మాయోపాయాలు ఆడి, పైగా మా దుర్మార్గ ఎడారి మతం ప్రకారం ఇది ఒప్పు అనుకునే దిక్కుమాలిన దూరాగత చర్యలని సమర్థిస్తూ వాళ్లుండగా
పురాణాలు ధర్మం గురించి మనలకు ఏమీ విపులంగా కాకున్నా నామమాత్రంగానైనా తెలియకపోయినా, కులాల విభజన అనే అడ్డగోలు కుట్రల పరం కాకుండా అందరమూ ఈ పై విషయాలు తెలుసుకుని అర్ధం చేసుకుంటే హైందవ ధర్మ విశిష్టత అవగతం అవుతుంది. మన అఖండమైన సంస్కృతి, నీతిన్యాయ, సత్యధర్మాలు బోధపడతాయి.

ఈనాటి ఈ సమాజంలో బయట గానీ, గుళ్ళల్లో గానీ, సభలు పండగ పబ్బాల సమీకరణల్లో గానీ ఎవరూ కుల ప్రస్తావన తీసుకురారు. మరి తెచ్ఛేది ఎవరు ???
స్వార్ధానికి అవకాశవాదానికి నీతిమాలిన నీలిమంద, ఎర్రిమంద, నాస్తిక హేతువాద జన విజ్ఞాన ముసుగులో, మతం మారి బురద చల్లి పబ్బం గడపాలని చూసే రెండు ఎడారి సన్నాసులు ఒకవైపు,
ఇంకా నేను గొప్ప, నాకులం మాత్రమే గొప్ప అనుకునే అహంకారపూరిత కులవాదులు అనే చవటలు ఇంకోవైపు కుల ప్రస్తావన తీసుకు వస్తారు. దయచేసి గుర్తు పెట్టుకోండి మన సంస్కృతిలో ఎక్కడా బ్రాహ్మణుడైనా కులం అనేది ఏమాత్రం ప్రధానం కాదు కేవలం ధర్మం మాత్రమే.

బ్రాహ్మణులకు, ఋషులకు, ఆది శంకరుల వంటి మహనీయులకు కూడా చండాలుడు, మాలదాసరి, మాంసం కొట్టి జీవనం గడిపే వారు, పతియే ప్రత్యక్ష దైవంగా సేవచేసే సామాన్య గృహిణి లు సమాధానాలు ఇవ్వడం ధర్మం ఏంటో నేర్పడం మనకు తెలుసు. మనలో చాలామంది చదివి వినే ఉంటాం...
అందుకే ఈ పై అవకాశవాదులకు కుల చీలికలల్తో జబ్బలు చరుచుకుని సంకలు గుద్దే అవకాశం ఇవ్వకండి.
మచ్చుకు ఉదాహరణ చెప్పాలంటే ఏ వర్గంలో గానీ ఇప్పుడు నిజాయితీగా తమ తమ కుల ధర్మం నిర్వర్తిస్తున్న వారు మనల్లో ఈకాలంలో ఎంతమంది ఉన్నారు ?
బ్రాహ్మణుడు సంధ్యావందనం పూజలు చేయడం లేదు
వైశ్యుడు ధర్మబద్ధంగా వ్యాపారం చేయడం చూసామా
క్షత్రియుడు సమాజ ధర్మ రక్షణ చేపట్టడం భూతద్దంలో కనబడిందా
శూద్రుడు సమాజ ప్రక్రియలో పాలుపంచుకోవడం గమనించామా

ఈనాటి కాలంలో దేశమాన కాల పరిస్థితులకు అనుగుణంగా అందరూ అన్ని పనులూ చేస్తూ పాశ్చాత్య పోకడల్లో ఉద్యోగం, విలాసాలు, డబ్బే ప్రధానంగా గమనం సాగిస్తూంటే ఇంకా కులవ్యవస్థ అనే దుర్మర్గ పోకడలని సమాజంలో ఎత్తే chance ఇవ్వకండి.

పాతకాలంలో ధర్మం సంస్కృతి నియమ నిబధ్ధతలువంటి వాటికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్ఛేవాళ్ళమీ.
మన దర్భాగ్యం కొద్దీ కులాలు, వర్గాలు, ఉత్తర దక్షిణాలు, భాష, ఆర్యన్ ద్రవిడ తేడాలు ఇలా మన సమాజాన్ని సంస్కృతినిఎన్ని రకాలుగా దెబ్బ తీయవచ్చొ అన్ని రకాలుగా భయంకర దూరాగత దాడులు చేసారు.
మనకు తేలికగా అర్ధం కావాలంటే ఇప్పటిలా కాకుండా పూర్వం ఒక దక్షిణాది తిక్కవాడు ఉత్తరానికి కాశీకి వెళ్లినా, ఉత్తరాది దబాంగ్ వాడు దక్షిణాది కాలడికి వచ్చినా విభేదాలు కాదు చూసేది ఆలోచించి చర్చించేది, వాదించేది కేవలం సంస్కృతి ధర్మం న్యాయం గురించి మాత్రమే.
నన్ను దోచాడు నాకు అన్యాయం చేసాడు లాంటి తలతిక్క ఆలోచనలు ఏ ఏనాడూ వచ్చేవి కావు. స్వార్ద నిర్ణయాలు ఆలోచనలు కాకుండా దేశ రక్షణ, సమాజ ప్రగతి మాత్రమే ప్రయోజనాలుగా తత్వ విచారణ జరిగేది.

స్వార్ధం నేను నాది అనేవి మొగ్గలోనే మన సంస్కృతి, ఆచరణ పెద్దల మాటలు మన జీవనంలో తొలగించి మన దేశం, మన సమాజం, మన ధర్మం, మన పల్లె పట్టణం, మన కులం, మన కుటుంబం, మన ఇల్లు ఆ తరువాత మాత్రమే నేను అనేది వచ్చే విధంగా మనకు మార్గ దర్శనం చేసే దైనందిన జీవితపు ప్రక్రియలు మనం చూస్తూనే ఉంటాము.

చివరగా చెప్పొచ్ఛేది ఏంటంటే మన ఆత్మప్రభోదానికే తెలుసు ఏది ధర్మమో ఏది న్యాయమో ఏది మన సంస్కృతో...
మన ధర్మం సంస్కృతి సాహిత్యం అనేవి అనంతం. మనకి మన ఒక జీవిత కాలం మొత్తంలో తెలిసేదే సముద్రంలో ఒక చుక్కంత తెలియాల్సింది ఎన్ని జన్మలకూ మిగిలే ఉంటుంది.

కావున ఎవరూ ఏ కులస్తులూ అయినా కూడా హిందూ ధర్మం గురించి అంతా తెలియాలని లేదు ఎవరైనా అడిగితే సిగ్గుపడాల్సింది ఏమాత్రం లేదు. ధైర్యంగా జవాబివ్వండి. మహా మహా పండితులే నాకు ఇంకా ఏం తెలియదు......
చదవాల్సింది తెలుసుకోవాల్సింది జ్ఞ్యానం సంపాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది అని అణిగిమనిగి ఉండి ఆలోచించే మహోన్నతమైన సంస్కృతి మనది.

ధర్మో రక్షతి రక్షితః
జై హింద్
జై శ్రీరాం
భారత్ మాతా కీ జై.

అష్టాదశ పురాణాలు

🌸ఓంనమో నారాయణాయ 🌸అష్టాదశ పురాణాలు – అందలి విషయాలు –వ్యాసభగవానుడు రచించిన 18 పురాణాల పేర్లను ఈ క్రింది శ్లోకమందు కూర్చబడినది.

🌷శ్లో!! మద్వయం భద్వయం చైవ
బ్రత్రయం వచతుషటయం
అనాపలింగ కూస్కానీ
పురాణాని పృధక్ పృధక్ !!
🌷మద్వయం: మ కారంతో 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం.
🌷భద్వయం: భ కారంతో 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం.
🌷బ్రత్రయం: బ్ర కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
🌷వచుతష్టయం: వకారంతో 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
🌷అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి.
🐋1. మత్స్య పురాణం: దీనొలో 14000 శ్లోకములన్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహత్మ్యములు చెప్పబడినవి.
2. మార్కండేయ పురాణము: ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహత్మ్యములు మరియు సప్తపతి (లేక దేవి మహత్మ్యము) చెప్పబడినవి. చండీ హోమము, శతచండీ సహస్ర చండీ హోమ విధానమునకు ఆధారమయినది ఈ సప్తశతియే.
3. భాగవత పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శుకునకు, శుకుని వలన పరీక్షత్ మహారాజునకు 12 స్కందములులో మహా విష్ణు అవతారలు శ్రీ కౄష్ణ జనన, లీలాచరితాలు వివరించబడినవి.
4. భవిష్య పురాణము: దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్Yఓపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరించబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం. భవిష్యత్తులో జరుగబోవు విషయాల వివరణ ఇందు తెలుపబడినది.
5. బ్రహ్మపురాణము: దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లోకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీ కౄష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ – నరకాలను గూర్చి వవరించబడినవి.
6. బ్రహ్మాండ పురాణము: దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకౄష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు. శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకౄష్ణ సోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.
7. బ్రహ్మ వైవర్త పురాణము: దీనిలో 18,000 శ్లోకాలు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకౄష్ణుల వైభవములు, సౄష్టికర్త బ్రహ్మ, సౄష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకౄతి) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది.
8. వరాహ పురాణము:  దీనిలో 24,000 శ్లోకములు కలవు. వరాహ అవతార మొత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణూమూర్తి ఉపాసనా విధానము ఎక్కువగా కలదు. ప్రమేశ్వరీ, ప్రమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు.
9. వామన పురాణము: దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్వ ౠషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కళ్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ౠతు వర్ణనలు వివరించబడినవి.
10. వాయు పురాణము: దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది.
11. విష్ణు పురాణము: ఇందు 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడయిన మైత్రేయునికి బోధించినది. విష్ణుమహాత్మ్యము, శ్రీ కౄష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి.
12. అగ్ని పురాణము: దీనిలో 15,400 శ్లోకాలు కలవు. అగ్ని భగవానునిచే వశిష్ణునకు శివ, గణేస, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, చంధస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాము, జ్యొతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.
13. నారద పురాణము: ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతరన్ అను నలుగురు బ్రహ్మామానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ధి చెందిన వేదపాదస్తవము  (శివస్తోత్రము) ఇందు కలదు వేదాంగములు, వ్రతములు, బదరీ ప్రయాగ,  వారణాసి క్షేత్ర వర్ణనలు ఇందు కలవు.
14. స్కంద పురాణము:  దీనిలో 81,000 శ్లోకములు కలవు.  ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణనలు, స్కందుని మహాత్యము, ప్రదోష  స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాధ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము) బ్రహోత్తర ఖండము. (గోకర్ణక్షేత్రము, ప్రదోషపూజ), అవంతికాఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు.
15. లింగ పురాణము: ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు. ఖగోళ జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి.
16. గరుడ పురాణము: ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి.
17. కూర్మ పురాణము: ఇందులో 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసిమ్హ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భూగోళముతో వారణాసి, ప్రయోగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి.
18. పద్మపురాణము: ఇందులో జన్మాంతరాల నుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పొగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక పొగొట్టగలిగేది ఈ పద్మ పురాణము. 85,000  శ్లోకములలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది విశేషాలను మనుకు తెలియజేస్తుంది. మరియు మదుకైటభవధ, బ్రహ్మసౄష్టికార్యము, గీతార్థసారం – పఠనమహాత్య్మం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివౄక్షమహిమ, విభూతి మహాత్మ్యం, పూజావిధులు – విధాణం, భగవంతుని సన్నిథిలో ఏ విధంగా ప్రవర్తించాలో  పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడింది.
🌷ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేద వ్యాస పీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్ధములైయున్నవి.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸

ధర్మ సూత్రాలు

*ధర్మ సూత్రాలు*

1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.
2. వినాశ కాలం వచ్చినవారు వివేకమును కోల్పోయి ధర్మవిరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.
3. ఎవరిపాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.
4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.
5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.
6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలంకి వ్రాసిరి.
7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగావిదేహముక్తుడవుతాడు.
8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.
9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.
10. నవగ్రహ స్తోత్ర పఠనంవల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.
11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధలవల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.
12. జమ్మి చాల  పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.
13. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రంచేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంతవరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.
14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించకూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించకూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.
15. భగవంతుని త్రికరణశుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానముగానీ, అహంకారముగానీ ఏమాత్రము వుండకూడదు.
16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.
17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళపైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.
18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.
19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం  పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.
20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.
21. జగమెరిగినవాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.
22. రాధ గోకులమునందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.
23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.
24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.
25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.
26. భక్తివల్ల జ్ఞానము, రక్తివల్ల అజ్ఞానము కలుగును.
27. కృతయుగమునందు తప్పస్సు, త్రేతాయుగమునందు జ్ఞానము, ద్వాపరయుగమునందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.
28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమినాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం. ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.
29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.
30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏