Showing posts with label వేదాలు. Show all posts

Sunday, 14 January 2018

వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

*స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03*

*స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20*

*స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)*

*స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74*

*స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2*

*స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1*

*పరిపాలన విషయంలో స్త్రీలు*
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - *అధర్వణవేదం 7.38.4*

దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి-  *ఋగ్వేదం 10.85.46*

ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది-
*ఋగ్వేదం 3.31.1*

కుటుంబం
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- *అధర్వణవేదం 14.1.20*

స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- *అధర్వణవేదం 11.1.17*
(స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- *అధర్వణవేదం 7.46.3*

ఉద్యోగాల్లో
*స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2*

*స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి-యజుర్వేదం 16.44*(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.

స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా!
(శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి-
*ఋగ్వేదం 10.85.26*

విద్యా విషయాల్లో
ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక!  మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను-

*ఋగ్వేదం 10-191-3*

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్ప బడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినట్టుగా లేదు.

*వివాహం -విద్యాభ్యాసం*
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - *అధర్వణవేదం 14-1-64*
(ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).

Monday, 4 December 2017

శస్త్ర చికిత్సలు

ఋగ్వేదం విజ్ఞానం
ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని అశ్వినీసూక్తంలో అశ్వినీ దేవతలు చేసిన చికిత్సలు వర్ణించబడ్డాయి... ఖేలుడు అనే రాజు భార్య, యుద్ధంలో రెండు కాళ్ళు కోల్పోగా అగస్త్యముని సలహాతో వారు అశ్వినీ దేవతలను స్తుతిచేయగా వారు ఆమెకు ఇనుప కాళ్ళను అమర్చినట్లు వర్ణించ బడింది. దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేశింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు ముందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి 'ప్రవర్ణ' అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.
ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో విద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.శుదర్ణ లో శబ్ద ప్రయోగం ద్వారా ధ్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది. ఋగ్వేదంలో శ్రుధి శ్రుత్కర్ణ వహ్నిభిఃలో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను ఆధారిత వర్ణన ఉంది. మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం, వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది. క ఇమంవో నిణ్యమా చికేత, గర్భో యో అపాం గర్బో వనానాం గర్భశ్చ స్థాతాం అనే మంత్రం జలంలో విద్యుత్ దాగి ఉన్నట్లు వర్ణిస్తుంది. మేఘాల నిర్మాణం దానికి పట్టే సమయం ఋగ్వేదంలో వర్ణించ బడింది. పర్యావరణ సంబంధిత విషయాలు ఋగ్వేదంలో ఉన్నాయి. గణితానికి సంబంధించి వ్రాతం వ్రాతం గణం గణం" మొదలైన మంత్రాలలో వర్ణించబడింది. రేఖాగణిత విషయాలూ ప్రస్తావించబడ్డాయి.

Friday, 13 October 2017

హిందుత్వం శూద్రులకు వేదం నేర్పదని తప్పుడు కూతలు కూస్తూ మతమార్పిడీ మాఫియా పంజా విసురుతున్న నేపధ్యంలో వేదం నేర్చుకోవటానికి మనం ఎలా సిద్దమవ్వాలో తెలుసుకుందాం...పుట్టుకతో అందరూ శూద్రులే, ఇది వేదవాక్,ఆయాశూద్రుడే ఉపనయనం చేసుకొని,వేదం అభ్యసించాక వాడు బ్రాహ్మణుడు అవుతాడు...ఇందుకు నాటినుండి నేటి వరకూ అనేక ఉదాహరణలు ఉన్నాయ్...మోదీ గారు b c కానీ ఆయన సంధ్యావందనం చేస్తారు,శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానందగారు కూడా బ్రేహ్మిన్ కాదు,శ్రీ శ్రీ శ్రీ సుందరచెయ్ తన్య  b c వీళ్ళే కాదు చాలామంది శూద్రులు వేదం చదివి బ్రాహ్మణ అయ్యారు.ఇవి నేటి ఉదాహరణలు మాత్రమే...ఆనాడు కాలానుగమణంలో బ్రాహ్మణత్వం పొందిన వారి వంశీకులే వేదపఠనానికి ఎంతో త్యాగంచేసి  సిద్దమయ్యారు గనుకే బ్రాహ్మణులే వేదపఠనం చేసేవారు..శూద్రులనుండి వచ్చిన వారి వారసులు కూడా నిష్ఠ కలిగిన వారు అన్నితరాలలో ఉన్నారు..అందుకు నేటి ఉదాహరణలు పైన చెప్పుకున్నాం....హైదరాబాద్ లోని  వేదపాఠశాల అన్ని కులాలకు వేదం నేర్పి బ్రాహ్మణులను చేసేది..అయితే కొన్ని రోజులకు బ్రాహ్మణ కులంకాని కులాలవారు వారి పిల్లలను మధ్యలో ఆపేసి తీసుకెళ్ళేవారు..మరికొందరు వేదాద్యయణం పూర్తయ్యాక కూడా పౌరోహిత్యం బ్రాహ్మణ జీవనం నచ్చక వదిలేశారు...అన్నివదిలేసి ఓ 25 సంవత్సరాలు కేటాయించగలగితే మీరు బ్రాహ్మణులే...మరి సిద్దమా?అన్నికులాలకు వేదం నేర్పే పాఠశాలలు ఇప్పుడు చాలానే ఉన్నాయ్...అయితే బ్రాహ్మణ వారుసులు తప్ప మిగితాకులాల వారి వారసులం చేయగలుగుతున్నామా?చేయలేనపుడు బ్రాహ్మణులపై నిందలెందుకు?వేదం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేయండి...

అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది. 
వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి  వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును.  ఇది నమ్మబుద్ధి కావడం లేదా.

ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక  పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం

1. “ I” never said she stole my money – నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )

2.  I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )

3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)

4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను  అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )

5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)

6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)

7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)

చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.

ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు.

ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.

క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు.

జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో,

అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు.

 దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.
ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు  => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో  )  చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు.  మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం.

Forwarded as received...

Thursday, 14 September 2017

వేదం గోప్పదా

వేదం గోప్పదా ????అదిఏలా

ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు. ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.
క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు. జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో, అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు. దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.
ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు  => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో  )  చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు.  మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం.

Tuesday, 12 September 2017

దేవుడు కాలం

ఈ మధ్య కాలం లో దేవుడు కాలం లో కూడా ఉన్నాడు అందుకే ప్రపంచం మొత్తం క్రీస్తు కాలన్నే వాడుతున్నారు (2015) దాన్నే ప్రామాణికం చేసుకున్నారు అని చక్కటి కథలు అల్లెస్తూ జనాలని పిచ్చోల్లని చేయటానికి చూస్తున్నారు ! కాకపోతే అసలు విషయం ఏంటంటే యేసు కి ప్రస్తుతం ఉన్న సంవత్సరలకి అసలు సంభందం లేదు ! యేసు BCE 5 లో పుట్టాడు చనిపోయింది దాదాపు CE27-29 మద్యలో అని అందరికీ తెల్సు క్రైస్తవులు కూడా దీన్ని ఒప్పుకోక తప్పదు ! ఇక పోతే క్రీస్తు పుట్టుక కానీ చావు కానీ రెండు కూడా ప్రస్తుత కాలానికి ప్రామాణికం కాదు ! కావున ఆయన చావు పుట్టుకలకీ కాలానికి సంభందం పెట్టడం అతితెలివి అవుతుంది! ఇక పోతే బైబిల్ లో ప్రతి చిన్న విషయం గురించి ఉంటది దాదాపు కానీ ఆయనే కాలం లేదా కాలాన్ని వేరు చేస్తున్నట్టు ఎక్కడ కూడా ఉండదు ! ఇంకా అన్నిటికన్నా హాస్యాస్పదమైన విషయం ఏంటంటే ఈ క్రీస్తు శకం , క్రీస్తు పూర్వం అన్నవి మరియు ఆంగ్ల క్యాలండర్లు 532 CE లో మొదలవ్వగా 800 CE లో కాస్త ప్రాచుర్యం లోకి వచ్చాయి! సదరణంగా భూమి సూర్యుడిని చుట్టడానికి 365.24219 రోజుల సమయం తీసుకుంటాది , కానీ వీరు 365 రోజులకే కుదించారు ఆ .24 అనగా రోజులో 4 వంతుని వదిలేశారు దీనివల్ల దాదాపు ప్రతి సంవత్సరం మనము దాదాపు 6 గంటలు కోల్పోతున్నాం ప్రతి 4 సంవత్సరాలకు 1 రోజు కోల్పోతున్నాం అని గుర్తించి దానిని సరి దిద్దడానికి BCE 46 (దాదాపు) లో జూలియన్ కాలెండర్ ని కొన్ని మార్పులు చేసి గ్రెగొరియన్ కాలెండర్ ని నిర్మించారు దాని ఆదారంగా ప్రతి 4 సంవత్సరాలకి ఒక రోజుని ఫిబ్రవరి లో కలుపుతున్నారు(ప్రతి సంవత్సరం 6 గంటలు (దాదాపు) 4 సంవత్సరాలకి 24 గంటలు=ఒక రోజు)) ! కాక పోతే జూలియన్ కాలెండర్ ప్రకారం సంవత్సరానికి 365.25 రోజుల చొప్పున ఈస్టర్ దినం లెక్కించటం లో తేడా కనిపించి 1752 సెప్టంబర్ నెలలో దాదాపు 11 రోజులని లేకుండా మాయం చేశారు ఆ సంవత్సరం సెప్టెంబరు లో 2 వ తేదీ తర్వాత 14 వ తేదీ ఉంటుంది !!కానీ హిందూ కాలమానం ప్రకారం సూర్యమనం , లేదా చంద్రమానం అన్నవాటిని ఉపయోగిస్తూ ఒక్క క్షణ కాలం కూడా తప్పకుండ కాలెండరు ని అభివృద్ది చేశారు ! మనకి కలి యుగం అన్నది కృష్ణుడు మరణించిన రోజు నుంచి ప్రారంభం అవుతుంది ! అయితే మన దేశం లో ఎందుకు ఆంగ్ల కాలెండరు వాడుతున్నాం అంటే ఈ క్రైస్తవ సంస్థలు తమ బైబిల్ లో చెప్పినట్టే వారు అడుగుపెట్టిన ప్రతి చోట జాతిని జాతి చరిత్రని ద్వంశం చేసి తమ పద్దతులు ప్రవేశపెట్టేవారు ఈ బ్రిటీషు కుక్కలు రాకముందు మనకు ఈ తుచ్చమైన క్రీస్తు శకాలు లేవు , ప్రస్తుతం పెళ్ళిళ్ళకి అన్నిటికి కూడా సనాతన సంప్రదాయమైన తీతులు వారాల ద్వారానే గనిస్తున్నారు! వీరి కాలెండరు పుట్టింది కేవలం వీరు ఈస్టరు రోజు గణించుకోటం కోసమే అంతే కాక చరిత్రలో 11 రోజులని అజ్ఞాతం లో కలిపిన ముష్కరులు వీరే !ఇప్పుడు చెప్పండి క్రీస్తు కి కాలానికి ఏమన్నా సంభందం ఉందా??

Monday, 11 September 2017

హిందుత్వం శూద్రుల వేదం

హిందుత్వం శూద్రులకు వేదం నేర్పదని తప్పుడు కూతలు కూస్తూ మతమార్పిడీ మాఫియా పంజా విసురుతున్న నేపధ్యంలో వేదం నేర్చుకోవటానికి మనం ఎలా సిద్దమవ్వాలో తెలుసుకుందాం...పుట్టుకతో అందరూ శూద్రులే, ఇది వేదవాక్,ఆయాశూద్రుడే ఉపనయనం చేసుకొని,వేదం అభ్యసించాక వాడు బ్రాహ్మణుడు అవుతాడు...ఇందుకు నాటినుండి నేటి వరకూ అనేక ఉదాహరణలు ఉన్నాయ్...మోదీ గారు b c కానీ ఆయన సంధ్యావందనం చేస్తారు,శ్రీ శ్రీ శ్రీ పరిపూర్ణానందగారు కూడా బ్రేహ్మిన్ కాదు,శ్రీ శ్రీ శ్రీ సుందరచెయ్ తన్య  b c వీళ్ళే కాదు చాలామంది శూద్రులు వేదం చదివి బ్రాహ్మణ అయ్యారు.ఇవి నేటి ఉదాహరణలు మాత్రమే...ఆనాడు కాలానుగమణంలో బ్రాహ్మణత్వం పొందిన వారి వంశీకులే వేదపఠనానికి ఎంతో త్యాగంచేసి  సిద్దమయ్యారు గనుకే బ్రాహ్మణులే వేదపఠనం చేసేవారు..శూద్రులనుండి వచ్చిన వారి వారసులు కూడా నిష్ఠ కలిగిన వారు అన్నితరాలలో ఉన్నారు..అందుకు నేటి ఉదాహరణలు పైన చెప్పుకున్నాం....హైదరాబాద్ లోని  వేదపాఠశాల అన్ని కులాలకు వేదం నేర్పి బ్రాహ్మణులను చేసేది..అయితే కొన్ని రోజులకు బ్రాహ్మణ కులంకాని కులాలవారు వారి పిల్లలను మధ్యలో ఆపేసి తీసుకెళ్ళేవారు..మరికొందరు వేదాద్యయణం పూర్తయ్యాక కూడా పౌరోహిత్యం బ్రాహ్మణ జీవనం నచ్చక వదిలేశారు...అన్నివదిలేసి ఓ 25 సంవత్సరాలు కేటాయించగలగితే మీరు బ్రాహ్మణులే...మరి సిద్దమా?అన్నికులాలకు వేదం నేర్పే పాఠశాలలు ఇప్పుడు చాలానే ఉన్నాయ్...అయితే బ్రాహ్మణ వారుసులు తప్ప మిగితాకులాల వారి వారసులం చేయగలుగుతున్నామా?చేయలేనపుడు బ్రాహ్మణులపై నిందలెందుకు?వేదం ఎలాంటిదో తెలుసుకునే ప్రయత్నం చేయండి...

అసలు ఈ సాంకేతిక విప్లవం లేని రోజుల్లో పుస్తకాలు లేదా గ్రంధాలు కూడా లేని కాలం నుండి మన వేదం పదిలంగా గురు శిష్య పరంపర ద్వారా కొన్ని కోట్ల తరాలగా సాగుతూ వస్తోంది. అసలు తప్పులు లేకుండా ఎక్కడా కూడా ఒక ఒట్టు, పొల్లు పోకుండా ఎలా వస్తున్నది అని నిరుటి శాస్త్రజ్ఞులు పరిశోధించగా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మన పూర్వులు ఒక అద్భుతమైన శాస్త్రీయ పద్ధతిలో విద్యాబోధను చేసేవారు. ప్రతి పదం మెదడులో నిక్షిప్తమయి నోటి ద్వారా ఒకరినుండి మరొకరికి నేర్పబడుతోంది.
వేదాలను శృతి అని అంటారు. అంటే విని మరల మననం చేసి శిష్యులకు సాంప్రదాయంగా నేర్పుతారు. ఒక వేదమంత్రానికి  వర్ణం, స్వరం, మాత్ర(ఎంతసేపు పలకాలో), బలం(ఎక్కడ ఒత్తి పెట్టి పలకాలో), సమం(ఏక పద్ధతి) మరియు సంతాన (ఎక్కడ విరవాలో, ఎక్కడ పోడిగించాలో) అనే 6 ముఖ్య ప్రామాణిక సూత్రాలకు లోబడి వుంటుంది. వీటిలో ఏది మారినా ఆ మంత్రానికి మొత్తం అర్ధం మారిపోతుంది. వాటి వలన అనుకున్న దానికి వ్యతిరిక్త ఫలితాలు రావచ్చును.  ఇది నమ్మబుద్ధి కావడం లేదా.

ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిద్దాం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ తీసుకుని చర్చించుకుందాం
“ I never said she stole my money” - నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు
ఒక వేళ నేను ఒక  పదం మీద ఒత్తి పలికితే ఆ పదానికి వున్న అర్ధం మొత్తం మారిపోతుంది. ఈ పైన చెప్పిన వాక్యంలో ఒకొక్క పదం మీద బలం పెట్టి చూద్దాం

1. “ I” never said she stole my money – నేను   ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు. ( అంటే ఇంకెవరో అన్నారు )

2.  I “never” said she stole my money – నేను “ఎప్పుడూ” ఆ ఆమ్మాయి డబ్బు తీసింది అనలేదు ( ఇది సూటిగా అర్ధమయ్యే వాడుక )

3. I never “said” she stole my money – నేనెప్పుడూ ఆ అమ్మాయి డబ్బు తీసింది “అనలేదు” ( అనలేదు కానీ నాకు అనుమానం వుంది, లేదా నమ్మకం వుంది)

4. I never said “she” stole my money – ఆ అమ్మాయి తీసిందని నేను  అనలేదు ( మరెవ్వరో తీసి వుండ వచ్చును )

5. I never said she “stole” my money – ఆ అమ్మాయి దొంగాలించింది అని నేను అనలేదు ( మామూలుగా తీసుకుని ఉండవచ్చును, చేబదులు లేక మరో రకంగా)

6. I never said she stole “my” money – ఆ అమ్మాయి నా డబ్బు తీసింది అని అనలేదు ( కానీ పక్క వాడి డబ్బు దొంగలించి ఉండవచ్చును, లేక ఆ డబ్బు నాది కాక పోవచ్చును)

7. I never said she stole my “money” – ఆ అమ్మాయి నా “డబ్బు” దొంగాలించలేదు ( కానీ మరోకటేదో దొంగలించి ఉండవచ్చు)

చూసారా ఒకొక్క పదం మీద ఒత్తి పలకడం వలన ఒకొక్క అర్ధం మామూలు మన మాటల్లోనే వస్తున్నది. వేద ప్రోక్తమైన మంత్రాలలో ఉచ్చారణ, స్వర, అనుస్వరం ఎంత ప్రాముఖ్యమో మీకు ఈ పాటికి అర్ధమయి వుంటుంది.

ఈ వేదం మంత్రరాశిని కాపాడుకోవడానికి ఎన్నో పద్ధతులను మన ఋషులు వాడారు” వాక్య, పద, క్రమ, జత, మాల, శిఖా, రేఖా, ధ్వజ, దండ, రథ, ఘన” పద్ధతులలో నేర్చుకునేవారు.

ఇవన్నీ అత్యంత గుహ్యమైన గొప్ప ఎర్రర్ కర్రెక్టింగ్ కోడ్స్.

క్రమ పాఠంలో 1-2; 2-3; 3-4; 4-5; పద్ధతిలో మంత్రాన్ని పఠిస్తారు.

జట లో 1-2-2-1-1-2; 2-3-3-2-2-3;3-4-4-3-3-4; పద్ధతిలో,

అదే ఘనంలో 1-2-2-1-1-2-3-3-2-1-1-2-3; 2-3-3-2-2-3-4-4-3-2-2-3-4 పద్ధతిలో పాఠం నేర్చుకుంటారు.

 దీని వలన ఎక్కడా కూడా ఏ అక్షరం, స్వరం పొల్లు పోకుండా కాపాదబడుతుంది.
ఒక ఘనాపాఠీ కృష్ణ యజుర్వేదం లో తైత్తరీయ సంహితను నేర్వాలంటే 2000 పైగా పంచశతి( 1 పంచశతి = 50 పాదాలు  => 109,308 పాదాలు. ప్రతి పాదానికి రమారమి 3 పదాలు => 3,30,000 పదాలు, 1 ఘనం 13 సార్లు ఉచ్చరించడం => 4,290,000 ఉచ్చారణలు పైన చెప్పిన 6 మూల సూత్రాలతో  )  చెప్పుకోవాలి. ఇది గురువుగారి దగ్గర శుశ్రూష చేసి నేర్చుకోవాలంటే రమారమి 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు చూడండి వారు ఎంత త్యాగం చేసి శ్రద్ధతో నేర్చుకుంటే వారు ఘనాపాఠీలు అవుతారు. ఇంత క్లిష్టమైన మన సాంప్రదాయాన్ని కొందరు అయోగ్యులు పిలక బ్రాహ్మణులను, వాళ్ళేమి చేసేది, మేము చదివేస్తాము అని డాంబికాలు పలుకుతారు. ముందుగా ఒకరి పని వారిని చేయ్యనివ్వాలి. పక్కవారిని అగౌరవ పరచకూడదు. అందరం ఎవరి పనులు వారు చేసుకుంటూ సమాజోద్ధారణకు పాటు పడాలి. ఒకరి మీద ఒకరికి అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టిపోయారు తెల్లవాళ్ళు.  మనం మన సంస్కృతిని కాపాడుకోవాలి. వేదం నిత్యం బ్రతికి వుండాలి. ఇది మన అందరి కర్తవ్యం.
Rajya lakshmi.yadavalli  గారి సౌజన్యంతో