Thursday, 9 November 2017

మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా

*మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను    చదివారా?*
-----------------------------------------
 *లేకపొతే చదవండి*
అందరికి తెలియచేయండి

-----
1. *లియో టాల్స్టాయ్ (1828-1910)*
హిందువులు మరియు హిందుత్వo ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఎందుకంటే ఇది జ్ఞానం మరియు వివేకం యొక్కకలయిక.

2. *హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):*
హిందూత్వ ప్రభావాన్ని పునరుద్ధరించే వరకూ ఎన్నో తరాలు దురాక్రమణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు ప్రపంచo ఆకర్షించబడుతుంది. ఆ రోజున ప్రపంచం ప్రశాంతంగా నివసించనుంది.

3. *ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955):*
తన మేధస్సు మరియు అవగాహన ద్వారా యూదులు ఏమి చేయలేరనేది నేను గ్రహించాను. హిందూత్వంలో శాంతికి దారితీసే శక్తి ఉంది.

4. *హుస్టన్ స్మిత్ (1919):*
నాకు తెలుసు.. ఒక హిందువు తన తెలివి మరియు అవగాహన బయటపెడితే, హిందూత్వం లో ఉన్న శక్తి శాంతికి దారితీస్తుంది.

5. *మైఖేల్ నోస్ట్రాడమస్ (1503 - 1566):*
ఐరోపాలో హిందుత్వo.. పాలించే మతం అవుతుంది. మరియూ ఐరోపా ప్రసిద్ధ నగరం "హిందూ మతం" రాజధానిగా అవుతుంది.

6. *బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):*
నేను హిందూత్వం గురించి చదివాక గ్రహించాను..  ప్రపంచమంతటి మరియు మొత్తం మానవాళి యొక్క మతం అని తెలుసుకున్నాను. హిందూత్వo ఐరోపా అంతటా మరియు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది, హిందూ మతం యొక్క గొప్ప ఆలోచనాపరులు ఆవిర్భవిస్తారు. ఒకరోజు హిందువులు ప్రపంచం యొక్క నిజమైన ఉద్దీపనకు వస్తారు. .

7. *గోస్టా లోబోన్ (1841 - 1931):*
హిందువులు శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడతారు. వారి సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి నేను క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను.

8. *బెర్నార్డ్ షా (1856 - 1950):*
మొత్తం ప్రపంచం అంతా ఏదో ఒకరోజు  హిందూత్వాన్ని అంగీకరిస్తుంది. అసలు పేరును కూడా అంగీకరించకపోతే అది ఏ "పేరు"తో అయినా అంగీకరించబడుతుంది. హిందూత్వాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాలి, హిందూ మతం ప్రపంచంలో "అధ్యయనం" చేసుకునే వారి మతం.

9. *జోహన్ గీత్ (1749 - 1832):*
మనమందరం ఇప్పుడు లేదా తరువాత అయినా సరే హిందూమతాన్ని అంగీకరించాలి మరియు ఇదే నిజమైన మతం.

భారతదేశం లో పుట్టీ, పెరిగీ, ఈ గాలి పీలుస్తూ, ఈ మట్టి నుండి వస్తున్న అన్నo తింటూ కూడా మన గొప్పదనాన్ని మనమే గ్రహించక పనికి రాని చెత్త అంతా గొప్పదనుకుంటూ తిరుగుతున్నాం !!!

*జనులారా... ఇది మన "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం.  ఏనాడో ఉన్న lఆంగ్లేయులు మన హైందవం గురించి ఎంత గొప్పగా చెప్పారో చూసారా! :)*

*అందరికీ తెలిసేలా గర్వంగా చెప్పండి*⛳⛳⛳🙏

మనం యోగా ఎందుకు నేర్చుకోవాలి

*మనం  యోగా  ఎందుకు  నేర్చుకోవాలి?*

మనం   యోగాను   “ఆరోగ్యం”  కోసం   నేర్చుకుందాము   అనుకుంటున్నాము  .   యోగా  యొక్క అంతిమ  లక్ష్యం    ఆరోగ్యం  కాదు   .  అంతిమ  లక్ష్యం    “భగవస్సాక్షాత్కారం”   .  అయితే   మనకు   ముందుగా  భగవంతుడు   గురించిన  ఆలోచన  కన్నా   మన  శరీరానికి   సంబంధించిన   ఆలోచనలూ   ,  మనమూ ..  మన  జీవిత  భాగస్వామి ..  మన  పిల్లలూ   ..  మన  కుటుంబం   ఇదే  రకమయిన  ఆలోచనలు   తో  సతమతం   అవుతూ  ఉంటాము   .  ఈ  ఆలోచనలనుండి   బయట  పడడం  చాలా  కష్ట  సాధ్యం  అయిన  పని   .  అందుకు  ఎంతో   సాధన  కావాలి  ,  ఎంతో  కాలం ,  పట్టుదల   కావాలి  .   ఆదిశగా    మనలను  నడిపించేదే   యోగం .  యోగా   ద్వారా   మనం  ముందుగా   మన  శారీరక  సమస్యలనుండి   బయట  పడడం  జరిగితే   మన   మనసులో   ఒక  పరివర్తన   వస్తుంది  .   ఆ  పరివర్తన   కలగడమే  “యోగం” 
.

*యోగం   అంటే   కలయిక*
మన  శరీరం   మన  మనసుతో   కలవాలి
మన  మనసు   మన  బుద్ధితో   కలవాలి
మన  బుద్ది   మన  ఆత్మతో   కలవాలి
మన  ఆత్మ  మన పరమాత్మ  తో  కలవాలి
ఇది   ఎలా   సాధ్యపడుతుంది ?  అందుకు  మనం  చెయ్యవలసినది “ప్రాణాయామం”

యోగం  అనేది   ఒక  ప్రక్రియ  కాదు  ఒక   జీవన  శైలి . మన  పూర్వీకులు యోగాకు  ఎనిమిది అంగములు  ఉన్నాయి అంటారు . 
అవి 1.  యమము 2.  నియమము  3. ఆసనము 4.
ప్రాణాయామము 5. ప్రత్యాహారం
6. ధారణ 7. ధ్యానం8.  సమాధి
ఇవి  అన్నీ   ఆచరించినవాడు   దైవసమానుడు .  దైవ  దర్శనం   చేసిన  అనుభూతిని   ప్రతి క్షణం  అనుభవించగలడు.  ఈ  విషయాలను  నేను  అధికంగా  ఇక్కడ     పేర్కొనడం  లేదు .


*1.యమము* అనగా ఇంద్రియ నిగ్రహము
అహింసా సత్యాస్తేయా బ్రహ్మచర్యా పరిగ్రహా  యమాః

 1. అహింస 2. సత్యము 3. అస్తేయము (మనో వాక్కాయ కర్మలచేత పర ద్రవ్యమునందు కోరిక లేకుండా ఉండుట) 4. దొంగిలింపకుండుట 5. బ్రహ్మ చర్యము
.

*2.  నియమము:*

శౌచ  సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః
.

నియమము 1. శౌచం 2. సంతోషము 3. తపస్సు 4. స్వాధ్యాయము 5. ఈశ్వర ప్రణిధానము నియమములు
.

*3.ఆసనం:*

పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు.  ఇవి  ఎన్ని  అనే  విషయాన్ని   ఒక్కొక్కరు  ఒక్కొక్క  రకంగా  చెప్పారు .

*4. ప్రాణాయామం:*

శ్వాసను  క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. బాబా  రామ్  దేవ్  గారు   శరీర ఆరోగ్యం  దృష్ట్యా   ఎనిమిది  రకాల   ప్రాణాయామాలు  అందరూ  చెయ్యాలని  చెబుతున్నారు
.

*5. ప్రత్యాహారం:*

ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
.

*6. ధారణ:*

ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట.
.

*7. ధ్యానము:*

ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము.
.

*8. సమాధి*

అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.

 *యోగసాధనకు   ఉపక్రమించడం  ఎలాగో   తెలుసుకుందాం*

ప్రాణాయామం   ఖాళీ  కడుపుతో చెయ్యండి . ఉదయం  చాలా  మంచిది . అలా  కుదరని  వారు  భోజనం  చేసిన  నాలుగు  అయిదు  గంటల  తర్వాత  చెయ్యండి . మన  మనసు  ఎప్పుడో  ఎదో  ఒక  విషయం  ఆలోచిస్తూనే  ఉంటుంది .  మన  ఆలోచనల  ఫలితమే  మన  వ్యక్తిత్వం . ఒక  మనిషిని  మంచివాడుగా  , దొంగగా ఉగ్రవాదిగా ,  సాత్వికుడుగా , ఋషిగా  రూపొందించేవి అతని  ఆలోచనలే .  దీనికి  మూలకారణం  మనస్సు . దీనినే  చిత్తం  అంటారు . చిట్టా  వృత్తి నిరోధానికి  మనం  చేసేదే  ప్రాణాయామం  .  చిత్తాన్ని  మంచి  వైపుకు  మళ్ళించేది యోగం 
.

 మనం  జీవించి  ఉన్నంత  కాలం  జరిగే  ప్రకియ   శ్వాసక్రియ  .  శ్వాస  ఆగితే  ప్రాణం  పోయింది  అంటాము . అంటే  మనం  పీల్చే  గాలిలో  మన  ప్రాణం  ఉంది  అన్నమాట  .  ఈ  ప్రాణం  యొక్క  ఆయామమే   ప్రాణాయామం .
.

   ప్రాణాయామానికి ముందు  సంసిద్ధత
1.  స్థిర  సుఖమపి  ఆసనం (  స్థిరంగా ,  సుఖంగా  కూర్చోవాలి )
2. శరీరం  నెలకు  తగలకుండా  విద్యుద్వాహకం   కాని  దుప్పటి  గాని  ,  బొంత  కానీ  ,  రబ్బరు  మేట్ గానీ  వేసుకోండి
3. గాలి  ధారాళంగా  వీచే  చోటును  చూసుకోండి (కిటికీలు  తెరచి  ఉంచండి .  ఆరుబయట  చెయ్యండి )
4. ఒక్కరు  ఎక్కువ  సేపు  చెయ్యడం  కష్టం  కనుక  కనీసం  అయిదారుగురు  కలిసి  చెయ్యండి
5. ప్రశాంతమైన   మ్యూజిక్   వింటూ (  ఆధ్యాత్మిక   విషయాలు  గానీ  ,  భక్తి  పాటలు  గానీ వింటూ ) ప్రాణాయామం చెయ్యండి
6. శక్తికి  మించి  చెయ్యకండి .  రోజు  రోజుకూ  శక్తి  పెరుగుతుంది .
7. శ్వాస  క్రియను   ముక్కుతో  మాత్రమె  చెయ్యండి .
8. కళ్ళను  మూసుకుని  ప్రాణాయామం  చెయ్యండి
9. మనసును  చేస్తున్న  ప్రాణాయామం  మీద  పెట్టండి .  వేరే  ఆలోచనలను   వదిలివేస్తూ   ప్రాణాయామం  మీదకు   తిరిగి తిరిగి   తీసుకు  వస్తూ  ఉండండి .
.
ఇపుడు మనం స్థిరంగా  సుఖంగా  కూర్చోవాలి   అందుకు  అనుకూలమైన  ఆసనాలు పద్మాసనం , సిద్ధాసనం , వజ్రాసనం ,  స్వస్తికాసనం , సుఖాసనం .  ఈ  ఆసనాలు  ఏవీ   నా  వల్ల కాదు  అని  మీరు  అనుకుంటే కాళ్ళు  చాపుకుని   కూర్చోవచ్చు  .  అది  దండాసనం .  అది  కూడా  వీలు  కాదు   అనుకుంటే  కుర్చీలో  కూర్చుని   కూడా   మీరు “ప్రాణాయామం”  చేయవచ్చు.
హిందు ధర్మం

మహా రాణా ప్రతాప్ గురించి మనకేవ్వరికి తెలియదు. కానీ ఒక్క సారి చదవండి.
ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి. విచిత్రంగా ప్రపంచంలోనే అత్యంత బలశాలి అయిన అమెరికా మెడలు వంచింది ఈ చిన్ని దేశం.
ఈ రెండు దేశాల నడుమ కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది వియత్నాం. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.
విలేకరి: ఇప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే,అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలవగలిగారు.?
విలేకరి అడిగిన ఆ ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం…
” అన్ని దేశాలలోకెల్ల అత్యంత శక్తివంతం అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టుడు అయిన గొప్ప దేశభక్తిగల ఒక భారతీయ రాజు చరిత్రను చదివాను.అతని వీరోచితగాథల నుండి, అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్దనీతి ,ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము.
విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?
విలేఖరి ఇలా అడగగానే వియత్నాం అద్యక్షుడు వెంటనే నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు.
” అతడే… రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్”
మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళు వీరత్వంతో వెలిగిపోయాయి.
అంతే కాదు అతను ఇంకా ఇలా అన్నాడు
“ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”
అని.
కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు. అయితే అతని సమాధి మీద ఇలా వ్రాసారు “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుని సమాధి ” అని .
కాల క్రమేణా కొద్ది సంవత్సరాల తర్వాత వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు.మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు. ఆ తరువాత ఎర్రకోట,ఇంకా ఇంకా ఇలా చూపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.
అప్పుడు ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికెడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు.ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు….”ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడు
మహారణా ప్రతాప్ సింహ్ గురించి మరి కొన్ని వివరాలు..
అతని పూర్తి పేరు..-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)
జన్మదినం-9 మే,1540
జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్
పుణ్యతిది-29 జనవరి,1597
తండ్రి – మహారాణా ఉదయ్ సింహ్ జి
తల్లి-రాణి జీవత్ కాంవర్ జి
రాజ్య సీమా-మేవాడ్
శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు)
వంశం –సూర్యవంశం
రాజవంశం-సిసోడియ రాజపుత్రులు
ధార్మికం-హిందూధర్మం
ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం
రాజధాని-ఉదయ్ పూర్
శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అతనికి అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.
అబ్రహం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి రావాల్సి ఉంది. అతను భారత్ కి బయలుదేరుతూ తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అడిగాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వాస పాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభ పెట్టినా తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట.కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో చదువ వచ్చు.
*మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు బరువు ఉంటుంది.చేతి కవచం,శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.
*డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహా రాణా ప్రతాప్ ని ఒకసారి ” తల దించి నా కాళ్ళ మీద పడితే సగం హిందూస్థాన్ కి రాజుని చేస్తా ” అని ప్రలోభపెట్టాడు. కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా భావించి తిరస్కరించాడు..
*హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి
* మహారాణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు ,ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.
* మహారాణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ల వాళ్ళ ఇళ్లను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు.వాళ్ల దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను.
* హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.
* మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్ర వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు.ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు
* మహారాణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
* హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు .వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు.మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపుత్ మరొక పక్క భీల్ ఉంటారు.
* రాణా గుర్రం అయిన చేతక్ మహారాణాను 26 అడుగుల కందకం మీద నుంచి దూకి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందు కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది.అది ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది.అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.
*చేతక్ ఎంత బలమైనదంటే తన ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది. అది కూడా మహారాణాతో పాటుగా
*మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.
*శ్రీ మహారాణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల పదును ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన వద్ద ఉంచుకునే వాడు.
*మిత్రులారా మహార ణా ప్రతాప్ ,అతని గుర్రం గురించి విన్నారు ,అంతే కాదు అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది.దాని పేరు రాంప్రసాద్.
*అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంధంలో రాసుకున్నాడు.
* అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే.
మహారాణా ప్రతాప్ తో పాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట.
* రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఒక్కత్తే మొఘలుల 13 ఏనుగులని చంపిందట.అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట అని అల్ బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు.
*బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగ దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు.ఆ ఏనుగు ఎంత స్వామి భక్తి కలదంటే 18 రోజులవరకు దాణా తినకుండా,నీళ్ళు తాగకుండా తన ప్రాణాలు కోల్పోయింది.తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్ ” ఈ ఏనుగుని వంచ లేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతాను “అని అన్నాడట.
* మన దేశంలో ఇలాంటి దేశభక్తుల్లో చేతక్,రాంప్రసాద్ లాంటి జంతువులు కూడా ఉన్నాయి.
Be proud to be INDIAN
"నా దేశం-దేశభక్తుల దేశం"

మీరు గమనిస్తే  భారత్ ఓ ప్రాచీన దేశం. అది ఎంత?

500సం...అంతక ముందు అమెరికా లేదు
కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి

2000సం... ముందు ఇజ్రాయేల్ లేదు...జీసస్ తెలిపాడు ప్రపంచానికి

5000సం...అంతకముందు చైనా లేదు
బోధిధర్ముడు తెలిపాడు ప్రంపంచానికి

మరీ భారత దేశం వయసు ఎంత?

ప్రపంచంలో  ప్రపంచ చరిత్ర కారుల,పరిశోధకుల కొలమానాలకు  అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం


ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....

ప్రపంచంలోని 28ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం

హిందూ సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీ " మిగిలాయి

విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు

ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు

ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
 "నా దేశం-భారత దేశం"
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.

మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"

ఈజీప్ట్ మీద పాలస్తీనా,అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది

రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది

మరి మన సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
శకులు,తుష్కరులు,మొఘలులు,సుల్తానులు,నవాబులు,షేక్ లు,పఠాన్ లు,పోర్చుగీస్ వారు,ఫ్రెంచ్ వారు,డచ్ వారు,బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం!?

ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"

మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
3 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !

మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి

ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
         
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని  విమర్శిస్తారు.

జై భారత్  మాత
జై హిందూ'స్థాన్
🍁 ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది.

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి.
పశ్చాతాపులను క్షమించాలి.
 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.
   🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

Forwarded as received

నిజమైన చరిత్ర తెలసుకుందాం

☘☘☘☘☘☘..నిజమైన చరిత్ర తెలసుకుందాం..🌷🌹
☘☘☘☘☘☘☘☘

పురుషోత్తముడు గొప్ప అలేగ్జాండర్ గొప్ప ఎవ్వరు ఎవ్వరి దగ్గర శిరస్సు వంచారు .?
 భారతీయులను 'ఆంగ్ల మానస పుత్రులు'గా తయారుచేసే విద్యావిధానాన్ని రుద్దారు. అందులో బాగంగానే మ న చరిత్రని వక్రీకరించారు.

మనది పరాక్రమ చరిత్ర కాదు, పరాజయ చరిత్రే అని అసత్యాలను వ్యాపింపజేశారు.

బ్రిటిష్ వారు వెళ్లిపోయిన తరువాత కూడా ఈ దేశాన్ని విదేశీయ బుద్దులతో పరిపాలించిన వారు వక్రీకరించబడిన చరిత్ర పారాలనే కొనసాగిస్తూ వచ్చారు.
💥  శివాజీకి జిజియామాత బాల్యంలోనే రామాయణ, మహాభారత గాధలు, చరిత్రలోని స్పూర్తివంతమైన కధలు చెప్పింది కాబట్టే ఆయన అంత గొప్ప వాడయ్యాడు.

💥 శక్తి ఉన్నా మన సమాజంలో ఐక్యత లోపించినప్పటి నుండీ ఒకరి తరువాత ఒకరుగా మనదేశం మీదకి దండెత్తి వచ్చినవారి చేతిలో మనం ఓడిపోతూ వచ్చాం.
💥 మన దేశంలో అడుగుపెట్టిన అరబ్బులు, తురష్కు లు, మొఘలులు మొదలగువారంతా ఏనాడూ మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకోలేకపోయారు.

💥 దేశంలో ఏదో ఒక మూల ప్రతినిత్యం దురాక్రమణదారులకు ప్రతిఘటన ఎదురవుతునే ఉంది. హిందూ వీరుల నుండి తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం వారు కంటిమీద కునుకులేకుండా అవస్థలు పడ్డారు.

💥 మన ధర్మం, సంస్కృతులను నాశనం చేయడానికి విదేశీయులు ఎంతగా ప్రయత్నించిన ఈనాటికీ అవి చెక్కుచెరకుండా వున్నాయి. అందుకు కారణం హిందూధర్మర పరిక్షణకై ఎందరో వీరులు చేసిన బలిదానాలే.

💥 నిజానికి మనది పరాజిత చరిత్ర కాదు. పరాక్రమ చరిత్ర. ఈ దృష్టిలో కొన్ని ఉదాహరణలు చూద్దాం.

💥 క్రీ.పూ 327 సంవత్సరంలో జీలం నది ఒడ్డున జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ పురుషోత్తముని ఓడించినట్టుగా మన పాఠ్యపుస్తకాలలో ఉంది. ప్రొఫెసర్ హరిశ్చంద్ర సేథ్ (లండన్) 1938లో జరిగిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్లో సమర్పించిన "వాజ్ పోరస్ ది విక్టర్ ఆఫ్ ది బాటిల్ ఆఫ్ జీలం? అన్న వ్యాసంలో పురుషోత్తముడే అలెగ్జాండర్ని ఓడించాడని పేర్కొన్నాడు. ఇందుకు భారతదేశంలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఐరోపా చరిత్రకారుల వ్రాతల ఆధారంగానే ఈ విషయం స్పష్టం అవుతుందని సేద్ చెప్పారు.

💥కుర్టిదయస్, జస్టిన్, డయోడరస్, అరియన్, ఫ్లూటార్క్ అన్న చరికారుల వివరణలు జాగ్రత్తగా పరిశీలిస్తే అలెగ్జాండర్ పురుషోత్తముని చేతిలో ఓడిపోయి అతనితో సంధి చేసుకుని ఈ దేశాన్ని వడిచిపెట్టి పారిపోయాడన్న విషయం స్పష్టమవుతుంది.

💥 ప్లూటార్క్ కధనం ప్రకారం- "ఒకలక్షా ఇరవై వేల మంది పదాతిదళంతో 15వేల మంది అశ్విక దళంతో మన దేశం మీదకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు. పురుషోత్తముని పట్ల శత్రుత్వం వహించిన తక్షశిల రాజు అంభి సహాయం కూడా అతనికి ఉంది. పురుషోత్తముని వద్ద 20వేల మందితో కూడిన పదాతిదళం, 2వేల మంది గల అశ్విక దళం మాత్రమే ఉంది.

 💥 పురుషోత్తముని సైనికులు సాటిలేని మేటి వీరులు. వారితో పోరాడి గెలవడం అసాధ్యమని యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ సైనికులు గ్రహించారు.

💥 కుర్టియస్ ఇలా వ్రాస్తాడు. జీలం నదిలో ఒక దీవిలో విడిది చేసిన అలెగ్జాండర్ సైనికుల మీదకి పురుప్లోముడు దాడి చేస్తాడు. ఆ దాడిలో చాలామంది గ్రీకు సైనికులు మరణిస్తారు. పురుషోత్తముని ధాటికి తాళలేక చాలామంది గ్రీకు సైనికులు తప్పించుకునేందుకు జీలం నదిలోకి దూకి జలసమాధి అయిపోయారు.

💥 జస్టిన్ కధనం ప్రకారం- "యుద్ధం ప్రారంభంలోనే పురుషోత్తముడు అలెగ్జాండర్తో ఒంటరిగా పోరాడాలనే కోరికను వెలిబుచ్చుతాడు. దీని ద్వారా రక్తపాతం జరగకుండా చూడవచ్చని అతని ఆలోచన. దీనిని అ లెగ్జాండర్ అంగీకరించడు.
💥 యుద్ధం ప్రారంభంలోనే అలెగ్జాండర్ గుర్రం చనిపోతుంది. కిందపడిన అతడిని గ్రీకుసైనికులు తీసుకుపోతారు.

💥 కుర్టియస్, డయోడరస్ కధనం ప్రకారం- "పురుషోత్తమునికి అతని ఏనుగులు చాలా ఉపకరించాయి. అలెగ్జాండర్ సైనికులలో అత్యధిక భాగం పురుషోత్తముని ఏనుగుల చేత క్రూరంగా చంపబడ్డారు."

 💥 ఇధియోపియూక్తి చెదిన ఇ.ఎ.డబ్ల్యుట్యాడ్జ్ తన 'ది లైఫ్ అండ్ ఎక్స్ప్లాయిట్స్ ఆఫ్ అలెగ్జాండర్" అన్న పుస్తకంలో ఇలా వ్రాస్తాడు.

💥'జీలం యుద్ధంలో అలేగ్జాండర్కు చెందిన అశ్విక దళంలో అధిక భాగం హతమైంది. ఒక సందర్భంలో యుద్ధం చేయటోమని అలెగ్జాండర్ సైనికులు ఎదురు తిరుగుతారు. యుద్ధం కొనసాగితే తనకు కూడా చావు తప్పదని గ్రహించిన అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి చేసుకుని తన రాజ్యంలోని కొన్ని భాగాలను పురుషోత్తమునికి అప్పచెప్తాడు."

💥 అలెగ్జాండర్ పురుషోత్తమునితో సంధి ప్రయత్నాలు చేసినట్టు చాలామంది ఐరోపా చరిత్రకారులు రాయగా మన పాఠ్యపుస్తకాలలో మాత్రం పురుషోత్తముడే అలెగ్జాండర్తో సంధి చేసుకున్నాడని ఉంది.

సంధి చేసుకున్న తరువాత అలెగ్జాండర్ సింద్, మర్మన్ గుండా తిరుగుప్రయాణం కడతాడు. అప్పటికే యుద్ధంలో తీవ్రంగా గాయపడిన అలెగ్జాండర్ క్రీ.పూ 323లో బాబిలోనియాలో మరణించాడు. పూటార్క్ ఇలా అంటాడు, "భారత్ లో అందరూ తనని అసహ్యించుకున్నారని అలెగ్జాండర్ అన్నాడు." అది నాటి కధ. మరి నేడో? అలెగ్జాండర్ని విశ్వవిజేతగా పొగుడుతూ మన పిల్లలకి చెప్తున్నాం. ఎంత అవమానకరమైన విషయమిది?

💥 అలెగ్జాండర్ తరువాత మన దేశం మీదకి దండెత్తి వచ్చిన సెల్యుకస్ని చంద్రగుప్తుడు ఓడించాడు.

💥 చంద్రగుప్తుని పరాక్రమానికి ఆశ్చర్యపోయిన సెల్యుకస్ అతనితో బంధుత్వం నెరపాడు.

💥 పవిత్ర మాతృభూమిపై విధర్మీయులైన యవనుల దురాక్రమణ తనకు దుస్సహం కాగా, నిస్వార్ధ దేశభక్తి ఆధారంగా వ్యక్తిగతమైన ప్రతిఫలం ఆశించని వీరులతో అపార సేనావాహినిని నిర్మించి, వ్యక్తిగత పూజ కన్నా జాతివ్రేయస్సు ప్రధానమనే సత్యాన్ని ప్రజల హృదయాల్లో ప్రతిష్టించి యవనులను సింధునది ఆవలకు పారదోలి, దేశ సమైక్య సాధనకై అశ్వమేధ యాగానన్ని చేసిన విరవ్రతధారి పుష్యమిత్రుడి జీవితగాధ మన జాతి మార్గదర్శనానికి ఒక మణిదీపిక,
💥 మట్టిబొమ్మలను మహావీరులుగా మలచి మన దేశంపైకి దండెత్తి  వచ్చిన వారిని తరిమికొట్టి నవశకానికి నాంది పలికిన శాతవాహనుడు, దేశ సమగ్రతను కాపాడడం కోసం విదేశీయులతో చేతులు కలపక వారినెదిరించిన ఖారవేలుడు, భారతదేశం వెలుపల హిందూ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేసిన శైలేంద్రుడు, మన దేశాన్ని ఆక్రమించిన హూణులను ఓడించి తరిమికొట్టిన యశోధర్ముడు, 8వ శతాబ్దంలో చైనానుండి వచ్చిన దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన కాశ్మీర్ చక్రవర్తి లలితాదిత్యుడు-వీరందరి సాహస గాధలను విన్నప్పుడు మన హృదయాలు ఉత్సాహంతో ఉరకలు వేసాయి.
💥 బాగ్దాద్ నుండి మన దేశం మీదకి దండెత్తి వచ్చిన మహ్మద్ బీన్ కాశింతో సింధ్ ప్రాంతంలోని దాహిర్ రాజులు పోరాడారు. ఒక్కరు కూడా వెన్ను చూపలేదు. దాహిర్ రాజు చనిపోతే దాహిర్ రాణి నాయకత్వంలో వేలాదిమంది మాతృమూర్తులు విదర్మీయులతో పోరాడి ధర్మరక్షణ కోసం ప్రాణత్యాగం చేసారు.
💥 గజనీ మహమ్మద్ బందేలుఖండ్ ని పాలిస్తున్న విద్యాధరుని చేతిలో ఘోరంగా ఓడిపోయి పలాయనం చిత్తగించాడు. అలాంటి విద్యాధరుని గురించి మన చరిత్రలో ఒక్క ముక్క కూడా చెప్పరు.
క్రీశ 1035లో గజనీ మేనల్లుడు సాలార్ మసూద్ లక్షా 50 వేల మందితో దండెత్తి వస్తే పాశీరాజులు ఇద్దరిని తప్ప మిగిలిన అందరినీ చంపేసారు. జరిగిన విషయం వాళ్ల రాజుకి చెప్పడం కోసం ఆ ఇద్దరినీ వదిలేసారు.
💥 బాగ్దాద్ వరకు కాషాయ ధ్వజ ఛాయలను వ్యాపింపచేసిన బాప్పారావల్ చౌర్యం మనకి స్పూర్తిదాయకం.
💥1178లో మహమ్మద్ పెూరీ గుజరాత్పై దండెత్తాడు. గుజరాత్ రాజు బాలుడైనందున అతని తల్లి నాయకీదేవి సైన్యానికి నాయకత్వం వహించి అబూ పర్వతం సమీపంలో పెూరీని ఓడించింది. మరి ఆ వీరవనిత నాయకీదేవి గురించి మన చరిత్రలో లేదు.
💥 మనం పిల్లలకి బోధించాల్సింది కల్పితాలతో కూడిన అక్బర్ గొప్పదనం గురించి కాదు. అతనికి ఏనాడూ తలవంచని రాణాప్రతాప్ స్వాభిమానాన్ని గురించి చిన్నారులకు చెప్పాలి.
💥పరమ క్రూరుడైన ఔరంగజేబుకు మహారాష్ట్రల్లో శివాజీ నుండి, అస్సాంలో లాచియ్ బడ్ పుకన్ (అస్సాం శివాజీ) నుండి, పంజాబ్లో గురు గోవింద్ సింగ్ నుండి నిరంతరం ఎదురుదెబ్బలు తగులుతునే ఉన్నాయి. 10, 11 ఏళ్ల పసిప్రాయంలోనే ధర్మం కోసం ప్రాణాలర్పించిన గురుగోవిందుని కుమారులు ఫతేసింగ్, జోరావర్సింగ్ల బలిదానం అత్యంత ప్రేరణదాయకం.
💥 మొఘలుల దురాక్రమణను ఎదిరించి నిలిచిన వీరవనిత, వింద్య ప్రాంతాలలో ఉన్న గడ్మల్ రాజ్యానికి రాణి అయిన దుర్గావతి, ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్, రాణి చెన్నమ్మ, రాణి రుద్రమదేవి మొదలైన మాతృమూర్తుల శౌర్యం మనకు చైతన్యాన్నిస్తాయి.
💥సుదీర్ఘకాలం మన దేశంలో అధికారం చెలాయించిన మొఘలులు దక్షిణ భారతదేశానికి తమ రాజ్యాన్ని విస్తరింపచేయలేక పోయారంటే దానికి కారణం దక్షిణ భారతంలో సువ్యవస్థితం, సురక్షితం అయిన విజయనగర సామ్రాజ్యం ఉండడమే.
💥 ఈ విధంగా అసంఖ్యాకంగా ఉన్న మన వీరుల గాధలు వింటుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. మనది సంఘర్షణ ప్రవృత్తి. మనం ఏనాడూ ఎవరికీ తలవంచలేదు. అటువంటి సాహసమయ సంఘర్షణ ప్రవృత్తి మన విద్యార్ధులలో నిర్మాణం కావాలి. ఇది జరగాలంటే మనదైన చరిత్ర బోధన జరగాలి. ఇందుకోసం మన విద్యావిధానంలో తగు మార్పులు చేయాలి.

Saturday, 4 November 2017

శకుంతలా దేవి



 ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిష శాస్త్రవేత్త.
*శకుంతలా దేవి* పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు మీ కోసం

శకుంతలా దేవి (1929 నవంబరు 4 – 2013 ఏప్రిల్ 21) ప్రపంచ ప్రసిద్ధ గణిత, ఖగోళ మరియు జ్యోతిషశాస్త్రవేత్త. ఈమెను అందరూ మానవ గణన యంత్రము అని పిలుస్తారు. ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణితావధానములు నిర్వహించి గణన యంత్రముకంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించింది. పలు పుస్తకాలను కూడా రచించింది. ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుటలో గిన్నిస్ వరల్డ్ రికార్డును స్వంతం చేసుకున్నది.

జీవితం

శకుంతలా దేవి బెంగళూరు నగరంలో కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఆలయ పూజారిఅగుటకు వ్యతిరేకించి ఒక సర్కస్ కంపెనీలో చేరి తాడుతో చేసే విన్యాసములు చేయుటకు నియమింపబడ్డాడు

ఘనతలు

1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తో శకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ను ఓడించేశారు. ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు. 76,86,36,97,74,870 అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నిస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలా దేవి మైసూరు విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు.ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు.గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

మరణము

తన 83వ ఏట 2013 ఏప్రిల్ నెలలో గుండె, మూత్రపిండాల సమస్యలతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.

రచనలు

ఆమె ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు.
*🙏శ్రీనివాసాచారి (గణితం)🙏*