Saturday, 2 December 2017

శివాజి

#Leader_Of_The_Month
SIVAJI MAHARAJ

శివాజి...
(అసలైన హిందువు అసలైన సెక్యులర్)

తల్లి – జిజియా బాయి,
తండ్రి – షాహాజీ (షాహాజీ జననం – 1599. తండ్రి పేరు – మాలోజీ). భార్య- సయీ బాయీ.
జన్మ స్థలం – పూణే జిల్లాలోని జున్నార్ పట్టణంలో శివనేరి కోటలో.
పెద్ద కొడుకు – శంభాజీ,
గుఱ్ఱం పేరు-  కృష్ణా
పుట్టినది  1627 -30 (అంచనా)
రాజ్యాధికారం చేపట్టిన సంవత్సరం (16 సం. చిరు వయస్సులో) 1643
హైందవ రాజ్యస్థాపన 1674
మరణం 1680
మొత్తం రాజ్యపాలనా కాలం (1643 నుండి 1680) 37
హైందవ రాజ్యస్థాపన చేసి పాలించిన కాలం (1674-1680) 6

శివాజి వ్యక్తిత్వం ప్రముఖంగా నలుగురు గురువుల సాంగత్యంలో సాగింది. వీరందరి శిక్షణలో అత్యంత పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, మేథావి అయ్యాడు.

మొదటి గురువు జిజియా బాయి. బాల్యంలో ఆమె చెప్పిన కథలు శివాజీని పరాక్రమ వంతుడిగా తీర్చిదిద్దాయి.

రెండవ గురువు దాదాజీ కొండదేవ్. దగ్గర రాజకీయం, యుద్ద తంత్రం నేర్చుకున్నాడు.

మూడవ గురువు తుకారామ్. వీరి దగ్గర సామాజిక సమరసత నేర్చుకున్నాడు శివాజీ.

నాల్గవ గురువు సమర్థ రామదాసు. వీరి దగ్గర ఆధ్యాత్మికత, హైందవ పరిరక్షణనే జీవిత పరమార్థమనే విషయాన్ని నేర్చుకున్నాడు. ఈ విధంగా శివాజీ వ్యక్తిత్వం అన్ని రకాలుగా అత్యంత శ్రేష్ఠమైనదిగా తీర్చి దిద్ద బడింది.

నవాబు కి దండం పెట్టని శివాజి.

షాజీ, తన పని చేస్తున్న బీజాపూర్ సుల్తాన్ దర్బారుకి తీసుకి వెళ్ళాడు. 12 సం.ల శివాజిని కూడా తీసుకు వెళ్ళాడు తండ్రి. సుల్తాన్‌కి సలాము చేసిన తండ్రి కొడుకుని కూడా సలాము చేయమన్నాడు తండ్రి. “పరాయ రాజుకు ముందు వంగి సలాము చేయను” అన్నాడు శివాజి. తండ్రి శివాజీ ధైర్యాన్ని మనసులోనే అభినందించాడు. బాల్యం నుండి అంతడి దేశ భక్తి, జాతీయాభిమానం కలిగిన వాడిగా తీర్చిదిద్దింది ఆయన తల్లి జిజియా బాయి.

ఆవు – శివాజి

ఒక నాడు ఒక ముస్లిము ఒక ఆవుని వధించడానికి లాక్కుపోతుండగా చూసాడు శివాజి. 10 సం. కూడా నిండని శివాజి ఆ ముస్లిముతో ఆవుని విడిచేదాకా వాదులాడాడు. కబేళాకి తరలిపోతున్న ఆవుని విడిపించాడు.

శివాజి – తోరణ దుర్గ కోట విజయం

16 సం. ప్రాయంలోనే శివాడీ తోరణ్ కోట (దుర్గా)న్ని జయించాడు. ఈ విజయంతో శివాజీ రాజకీయ జీవితం ప్రారంభమైంది. కొండదేవ్ శిక్షణని అంత అద్భుతంగా ఒడిసి పట్టాడు శివాజి.

శివాజి – తల్లి కొరిక శింహ ఘడ్

చదరంగంలో ఓడిపోయిన శివాజీని ముస్లిముల ఆధిపత్యంలో ఉన్న సింహ ఘడ్‌ని బహుమతిగా ఇమ్మంది తల్లి. పుత్రుడి పెళ్ళి పనిలో నిమగ్నమైన తానాజీని పిలిపించాడు. తల్లి కొరికని చెప్పాడు. వెంటనే సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు తానాజీ. భయంకర యుద్దం చేసి కోటని స్వాధీనం చేసుకున్నారు సైనికులు. తానాజీ వీరమరణం పొందాడు. “సింహ గడ్ లభించించి కాని సింహం పోయింది” అన్నాడు శివాజి. కొడుకు పెళ్ళిని కూడా లెక్క చేయాక శివాజీ ఆజ్ఞని సిరసావహించి, వీరమరణం పొందిన ఈ ఉదంతం శివాజీ మాటకి అతడి సైనికులో ఎంతటి విలువ ఉందో తెలియ జేస్తుంది.

శివాజి – ఆంధ్ర పర్యటన

1677 లో భాగ్యనగర్ వచ్చిన శివాజి, అక్కడ నుండి శ్రీశైలం వెళ్ళి అష్టాదశ పీఠాలలో ఒకటైన బ్రమరాంబ దేవిని దర్శించాడు. ఆమెకి తన శిరస్సుని బలిగా ఇద్దామని ప్రయస్తున్న శివాజికీ అమ్మ ప్రత్యక్షమై- నీ శిరస్సుని నా కెందుకు. నీ అవసరం దేశానికి చాలు ఉంది. నీ మెధస్సుని, క్షాత్రాన్ని, ధర్మ రక్షణకై వినియోగించు అని పలికిన అంబ శివాజీకి ఒక ఖడ్గాన్ని కానుకగా ఇచ్చింది. శివాజి శేష జీవితాన్ని ధర్మ రక్షణకై వినియోగించారు. ఈ ఉదంతంతో, హైందవ పరిరక్షణ బాధ్యతని దైవమే స్వయంగా శివాజీకి ఇచ్చిందని తెలుస్తుంది.

శివాజీ రాజ్యం – ఇతర ఎన్నో రాజ్యాలు

విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ దేవరాయలు, హరి-హర, బుక్కరాయలులాంటి వారు సామ్రాజ్యాన్ని స్థాపించి వ్యాపించిన తరువాతనే ప్రసిద్ధి పొందారు. శివాజీ స్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా, శివాజి రాజ్య విస్తరణకు పూర్వమే శివాజీ పేరు విన్నంతనే ముస్లిము రాజులకు వణుకు పుట్టేది. శివాజి స్వయంగా ప్రతిసైనికుణ్ణి భర్తీ చేసి తన రాజ్యాన్ని బరహన్ పూర్ (నేడు భుసావల్, జలగావ్) నుండి బెంగుళూరు వరకూ, బీజాపూర్ నుండి పశ్చిమ సముద్రం వరకూ వ్యాపింపచేసాడు. రాజ్యపాలన సౌలభ్యం కొరకు నలుగురు గవర్నర్లను నియమించాడు. సతారాలో పీష్వా (పధాన మంత్రి) పూణేలో ఉండేవారు.

క్రమంగా 28 సంవత్సరాలు వచ్చే సరికి కోండాణా, పురందర్, ప్రతాప్ ఘర్, రాజ ఘర్, చాకణ్ తో పాటు మరోక 40 కొటలపై విజయం సాధించి విజయపతాన్ని ఎగురవేసాడి శివాజి.
మరోక పక్క ఆంగ్లేయులు, పోర్చుగీసువారు, అప్పటికే దేశంలో ఉన్న ముస్లిములు, మొగలులు దేశాన్ని మరింత ఆక్రమించుకునే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

శివాజీ - రాజ్యపాలన

ఈ నాడు మనం సామ్యవాదం, సోషలిజం, లిబరలిజం, ప్రజాతంత్రం అనే మాటలను పదే పదే వింటుంటాము. శివాజీ పాలనలో ఇవి అన్ని సర్వసమావేశమై ఉండేవి. అన్ని మత, పూజా పద్ధతులను పాటించేవారికి సమాన హోదా ఉండేది.

శివాజీ – పళ్ళ బుట్ట

అవసరమైనప్పడు శివాజీ మొఘలురాజులకు లొంగినట్లు నటించి వారి శతృ సైన్యం సాయంతోనే బిజాపూర్, గోల్కొండ సుల్తానులను ఓడించాడు శివాజి. ఈ క్రమంలో 1666లో ఔరంగజేబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, శంభాజీని ఆగ్రాకు అహ్వానించాడు. శివాజిస తన ఆరేళ్ళ కొడుకుతో ఔరంగజేబు కలవడానికి వచ్చాడు. వంచించడమే తెలిసిన  ఔరంగజేబు శివజీనీ, శంబాజీని చంపేస్తే మరాఠాల విద్రోహన్ని తట్టుకోవడం కష్టమని తలంచి వారిద్దిరిని చెఱసాలలో వేసాడు. శివాజీ ఆగ్రాలోని ఆపన్నులకు పళ్ళను పంపండానికి అనుమతి పొందాడు. కొన్ని నెలల తరువాత, ఎమరుపాటుగా ఉన్న ఔరంగజేబు బటుల కళ్ళుగప్పి,  మారువేషంలో శివాజీ, తన కొడుకుతో సహా పళ్ళ బుట్టలు దాగుని తప్పించుకున్నాడు. ఇలాంటి సమయస్ఫుర్తితో ఎప్పటికప్పుడు నూతన పథకాలతో తని పనిని పూర్తి చేసాడు శివాజి.

శివాజీ - రొడ్ల విస్తరణ, భవన నిర్మాణం

శివాజి పెద్ద పెద్ద రొడ్ల నిర్మాణం చేయించి, వ్యవసాయ, వర్తక వ్యాపారానికి పెద్ద పీట వేసి సర్వాంగీణ వికాశానికి తొడ్పడ్డాడు. సమాజంలోని అన్ని వర్గాలు సుఖంగా, సమృద్దిని సాధించాయి.

శివాజీ - స్వదేశీ విజ్ఞానం

ఐరోపా నుండి ముద్రణ యంత్రాలను తెప్పించి, ఆ యంత్రాల అధ్యయనం చేసి స్వదేశీ అవసరాల కనుగుణంగా నూత యంత్రాల అవిష్కరణని ప్రోత్సహించాడు.

యుద్ధం నెగ్గడంలో అస్త్ర-శస్త్రాల ప్రాముఖ్యతని గుర్తించిన శివాజి, విభిన్న దేశాల నుండి అత్యాధునిక అస్త్ర-శస్త్రాల తెప్పించి, స్వదేశీ విజ్ఞానాన్ని జొడించి వాటిని మరింత మెరగు పరిచి యుద్ధాలలో వాడుకలోకి తీసుకవచ్చాడు.

అదే విధంగా అప్పటికే ప్రవంచంలో ఉన్న పెద్ద ఓడలను కొనుగోలు చేసి, స్వదేశంలో ఉన్న నౌకా శాస్త్ర గ్రంథాల అధ్యయనంతో వాటిని మరింత మెరుగపరిచి ప్రపంచంలో అత్యంత పెద్ద ఔడల నిర్మాణం చేయించాడు. వ్యాపారానికి, యుద్ధానికి ప్రత్యేకమైన నౌకల నిర్మాణం చేపట్టాడు. ఆనాడు శివాజి దగ్గర ఉన్న ఓడలు విదేశీయులను ఆశ్చర్యంలో ముంచెత్తేవి.

ఈ విధంగా శివాజీ శాస్త్ర-సాంకేతికతకి పెద్ద పీట వేసీ ఉత్తమ ఫలితాలను సాధించాడు.

శివాజి – భాష

ప్రతి దేశానికి తన సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకు పోవడానికి భాష చాలా అవసరం. ఆయా ప్రదేశాలలో జన్మించిన భాష మాత్రమే ఈ పని చేయగలదు. కాని విదేశీ ఆక్రమణ దారులు, దౌర్జన్యపూరితంగా ఫారసీని స్థానీయ రాజ్య భాషగా, స్థానీయ భాషగా పాదుకొల్పారు. శివాజి ఈ విదేశీ భాషని తీసి వేసి స్థానీయ భాషని పాలనా భాషగా, ప్రజా భాషగా అభివృధ్ధి చేసాడు.

శివాజి – హిరకణి (గోబాల)

హిరకణి అనే గో బాలిక, శివాజీ కోటలో పాలు అమ్ముకునేది. ఒక సారి అమ్మకం ముగించుకుని ఇంటికి పోదామనుకునేసరికి రాత్రి కావడంతో కోట ముఖద్వారం మూసివేయబడింది. తన పసి బిడ్డడికి పాలు పట్టించవలసి ఉండటంవలన ఒక బండరాయపైకి ఎక్కి కొట దాటి, ఇల్లు చేరుకుని బిడ్డడికి స్తన్యాన్నిచ్చింది ఆ తల్లి.

ప్రముఖద్వారం మూసిఉన్నప్పటికి కొట దాటే మార్గాంతరాన్ని బయట పెట్టినందుకు ఆమెని సన్మానించాడు శివాజి. ఏ బండరాయిని ఎక్కి ఆమె బయట పడిందో దానిని కొట్టించి కొటని మరింత కట్టుదిట్టం చేసాడు శివాజి. ఈ నాటికి ఈ స్థలాన్ని హిరకణి దుర్గం అని పిలిస్తారు.

ఈ ఉదంతం తన కోట యొక్క పటిష్టత, సంరక్షణకి శివాజీ ఎంతటి ప్రాధాన్యతని ఇచ్చాడో తెలియజేస్తుంది. అదే విధంగా ఈ రోజు సైబర్  పటిష్టతకోసం హేకర్లను నియమించుకుని అంతర్జాల పటిష్టతని మరింత మెరుగుపరుచుకుంటున్నామా, శివాజీ ఆ గోబాలకి సన్మానం చేసి పారితోషకాన్ని ఇచ్చి అలాంటి పనినే సాధించాడు.

శివాజి – న్యాయమూ, చట్టమూ

రాంఝా గ్రామం పటేలు ఒక స్త్రీని బలత్కరించినట్లుగా తెలిసింది. విచారణలో అది నిజమని కూడా నిర్థారించబడింది. శివాజీ ఆ పటేలుకి కాళ్ళూ చేతులు నరికివేసే శిక్ష విధించి అమలు పరిచాడు.

శిక్షలను అమలు పరచడంలో ఎంత మాత్రం చాప్యం చెయ్యని కారణంగా శివాజి పరిపాలనలో నేరాల సంఖ్య బహుకొద్దిగా ఉండేవి.

శివాజీ – స్త్రీ గౌరవం

శివాజీ సైనికులు ఒక అత్యంత సుందరమైన ముస్లిము యువతిని బలవంతంగా తీసుకు వచ్చి శివాజీ ముందు హాజరు పరిచి శివాజీ వారి చర్యని అభినందించి బహుమానం ఇస్తాడనుకున్నారు. సైనికులను హెచ్చరించిన శివాజీ ఆమె కాళ్ళపై బడి – తల్లి నా సైనికులు చేసిన పనికి క్షమించు. నా తల్లి కూడా ఇంత అందంగా ఉండి ఉంటే నేను ఇంకేంత అందంగా పుట్టి ఉండేవాడినో అని,. ఆ ముస్లిము యువతిని సకల రాజలాంచనాలతో ఆమె ఇంటికి పంపించాడు శివాజి.

ముస్లుములు, అన్య మతస్తులు, ప్రముఖంగా మహిళలకి ఎన లేని గౌరవాన్ని ఇచ్చాడు శివాజి. ఎవరికి భయం పడకుండా సంచరించే ఉత్తమ పరిపాలనని అందించాడు శివాజి. ఈ రోజు మైనారిటీ వాదమని, మహిళా అధికారాలని, సెక్యూలరిజం అని అంటున్న ఎన్నింటినో శివాజి వాస్తవంగా సాధించి చూపించాడు.

శివాజీ – మతసరసత

శివాజీ తన పాలన లో ఎక్కడ ఎవరికి ప్రత్యేకతలను ఇవ్వకుండా అందరికి సమాన హోదా కల్పించి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించి, అందరికి బద్రత కల్పించాడు. గుళ్ళు గోపురాలతో పాటు ఎన్నో మసీదులు కట్టించాడు. శివాజీ సైన్యంలో మూడొంతులు ముస్లిములు ఉండడమే కాక,  ప్రముఖ విభాగాలైన ఆయుధాల విభాగానికి - హైదర్ ఆలీ, నావికాదళానికి - ఇబ్రహీం ఖాన్, మందుగుండు విభాగానికి - సిద్ది ఇబ్రహీం అధ్యక్షత పదవీ బాధ్యతలును నిర్వహించారు. దౌలత్‌ ఖాన్‌, సిద్ధిక్ లు సర్వ సైన్యాధ్యక్షులుగా ఉండేవారు. విశేషమేమిటంటే, శివాజీ అంగ రక్షకులలో చాలా ప్రముఖ వ్యక్తి మదానీ మెహ్తర్‌. ఇతను శివాజీనీ అగ్రా కోట నుండి తప్పించడంలో ప్రముఖ పాత్ర నిర్వహించాడు.

మత ప్రాతిపధిక కాక, యోగ్యతకి పెద్ద పీట వేసి, మైనారిటీ, మెజారిటీ అనే నేటి కుహాన విభజనకి అతీతంగా అందరూ సమానమే అనే భావనని నెలకొల్పిన హిందూ రాజు శివాజి. అందుకే శివాజి గొప్ప హిందువు. మరియు నేటి భాషలో గొప్ప సెక్యూలరిస్టు.

శివాజి - అఫ్జల్ ఖాన్

శివాజీ పరాక్రమం, మెరుపుదాడులు, గెరిల్లా యుద్ద పద్దతులను ఎదుర్కోలేనని అఫ్జల్ ఖాన్ శివాజీనీ ప్రత్యక్షంగా యుద్దభూమికి రప్పించి ఓడింద్దామని అనుకున్నాడు. శివాజీ ఇష్ట దైవమయిన భవానీదేవి దేవాలయాలను కూల్చేసి, శివాజీని రెచ్చకొట్టాడు అఫ్జల్ ఖాన్. మొగలుల వ్యవహారశైని బలాబలాలను, పరిస్థితులను అంచనా వేయడంలో దిట్ట అయిన శివాజీ, యుద్దానికి దిగకుండా సంధికి దిగాడు. ప్రతాప్‌ఘడ్ కోటలో సమావేశానికి ముందు ఇనుప కవచాన్ని ధరించి, పులిగోర్లు పెట్టుకుని బయలుదేరాడు. శివాజి. అఫ్జల్ ఖాన్ శివాజీనీ రా భాయీరా అని కౌగలించుకుని కత్తితో పొడిచి హత్య చేద్దామని ప్రయత్నించాడు. ఇనుప కవచం శివాజీని రక్షించింది. శివాజి మోరుపు వేగంతో తన ముందే తెచ్చుకున్న పులి గోర్లతో అఫ్జల్ ఖాన్ పై దాడి చేసి వధించాడు శివాజి.

పదే పదే దేశం మీద తెగపడుతున్న నేటి పొరుగుతో శిఖరాగ్ర చర్చలు జరుపుతున్న మన ప్రభుత్వాల వ్యవహార శైలికి భిన్నంగా, ఈ ఉదంతం, శివాజీ అంటే నిరంతర అప్పమత్తత, సరియైన సమయంలో సరియైన ఆక్రమణ. స్నేహితిడికి స్నేహితుడు. శత్రువుకి శత్రువు. మంచికి మంచి. చెడుకి చెడు అనే శివాజీ వ్యవహార శైలిని తెలియ జేస్తుంది.

శివాజి - ఔరంగ జేబు

శివాజీ ఔరంగ జేబుకి ఒక లేఖ రాసారు. అందులో ఎన్నో విషయాలు చర్చిస్తూ అంతిమంగా ఇలా రాసారు –

“చక్రవరీ! ఖురాన్ దేవుడిని రబ్బుల్ అలమీన్ గా వర్ణించింది. అంటే విశ్వానికి అంతటికి దేముడు. కేవలం ముసల్మానులకు దేముడని కాదు. ఇస్లాము. హైందవము రెండూ అతీత శక్తులకు సుందరమైన భాష్యం చెప్పాయి. మసీదులో ప్రార్థనకి పిలుపునిస్తే, గుడిలో గంట కొడతారు. మతోన్మాదం, మత విద్వేషం కలవారెవరైనా దేవుడి ఆదేశాలకు వ్యతిరేకంగా నడుస్తున్నట్లే అర్థం. ఇలాంటి పనులు చేసేవారు దేవుడనే కళాకారుడి సృష్టిని ఎదిరిస్తున్నట్లే అర్థం. ఏ రకమైన సృష్టిలో లోపాలు వెదికినట్లైతే దానికర్థం మీరు ఆ కళాకారుడుని వ్యతిరేకిస్తున్నట్లే కదా. అలా చేయకండి.”

ఇలా స్పష్టంగా చెప్పడమే శివాజీ సెక్యూలరిజం. అంతే కాని బుజ్జగింపు ధోరణితో అన్నీ సమానమంటు ఊక దంపడు ఉట్టికింపులివ్వడం శివాజీ నైజం కాదు.

శివాజి-వియత్నాం

వియత్నామ్ అప్పటి రక్షణ శాఖ మంత్రి అయిన మేడమ్ బిన్ 1977 లో భారత పర్యటించినపుడు, శివాజి మా ఆదర్శం అని చెపుతూ, శివాజి విగ్రహాన్ని పూలమాలతో అలంకరించారు. వియత్నమ్-అమెరికా లాంటి పెద్ద దేశంతో తలపడినపుడు, వియత్నామ్ కి శివాజీ గోరిల్లా వార్ ఫేర్ వ్యూహం చాలా సహకరించింది.

అటువంటి శివాజీ గురించి మన ఎన్.సి.ఆర్.టి.సీ. చరిత్ర పుస్తకాలు ఒక పేజీలో నాలుగు వాక్యాలు రాసి చాలు అని పించాయి.

శివాజి – హిందూ రాజుల తప్పలు

శత్రువుని క్షమించని శివాజి – ఫృథ్విరాజ్ జౌహాన్ గజనీ ని 16 సార్లు క్షమించి వదిలాడు. చేసిన తప్పునే పదే పదే చేసాడు. గజనీ ఒక్కసారి ఫృథ్విరాజ్ ని ఓడించగానే అతడి కళ్ళు పీకించి చెఱసాల పాలు చేసి, తరువాత హత్య చేసాడు. శివాజీ శత్రువుకి క్షమాబిక్ష పెట్టడం, వదిలివేయడంలాంటి తప్పిదాలను చేయకుండా శత్రువుని శత్రువుగానే చూసి తగిన శిక్ష వేసిని కారణంగా శత్రువు ఆక్రమణ చేయడానికి కూడా భయపడేలా చేయగలిగాడు శివాజి.

శివాజీ తన యుద్ధ పంథాని కాలానుగుణంగా మార్చుకున్నాడు. ధర్మ బద్ధమైన యుద్ధం చేయని శత్రువు దగ్గర ధర్మం గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. అందుకే శివాజి ఎప్పటి, కప్పుడు విజయానికి ఏది ఉత్తమమో అదే చేసాడు.

అర్హలైన అందరిని సైన్యం చేర్చుకున్న శివాజి –  జన్మతః క్షత్రియుడు మాత్రమే పోరాటానికి అర్హుడనే అనుచానంగా వస్తున్న ఆచారాన్ని పక్కన పెట్టి, సమాజంలోని అన్ని వర్గాలలోని బలమైన వారి ఎన్నుకుని ఒక ధృడమైన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని, అన్ని యుద్దాలలోనే విజయాన్ని సాధించాడు శివాజి.

కాల బాహ్యమైన ఆచారాలను, పద్దతులను తుంగలోకి తొక్కి నేటి అవసరాలకు అనుగుణంగా ప్రవర్తించడం కారణంగా శివాజీ హైందవానికి పూర్వ వైభవాన్ని తీసుకురాగలిగాడు. పూర్వం జరిగిన తప్పిదాలను కూడా సవరించగలిగాడు.

అనర్థ హైతువైన ఢాంభికానికి పోని శివాజి – పొగరుబోతుగా వ్యవహరించి, అనవసరమైన ఢాంభికానికి పోయి, శత్రువు యొక్క బలా-బలాల అంచనా వేయకుండా శత్రువు ఎంత బలాడ్యుడైనా ఎదురేగి పోరాడే అనర్థ హేతువైన వీరత్వాన్ని ప్రదర్శించని శివాజి. దానికి బదులుగా, అదును చూసి, శత్రువుని తమ చిన్న సైన్యంతో జయించగలమని అనుకున్నప్పడు మాత్రమే ఎదురించి, విజయాన్ని సాధించిన శివాజి.

నేనే హీరోని. రండి చంపండి అని ఊరికే తన ప్రాణాన్ని తీసుకు పోయి శత్రువు చేతిలో పెట్టలేదు శివాజి. శత్రువు బలమైన వాడైతే, తెలివితో యుద్దం చేసాడు. శత్రువుని ప్రత్యక్షంగా ఎదుర్కోగలనని అనిపించినప్పుడు మాత్రమే ప్రత్యక్ష యుద్ధం చేసాడు. యుద్ధ తంత్రాన్ని బహు గొప్పగా ఉపయోగించిన వాజు శివాజి.

పొరుగు రాజ్యాలతో స్నేహ సంబంధాలు ఆశించిన శివాజి –హిందూ రాజులలో సఖ్యత లేని కారణంగా ఎక్కడ నుంచో వచ్చిన, ఇక్కడి సంస్కృతి, పరిస్థితులు తెలియని విదేశీ రాజు హిందూ రాజులపై పైచేయి సాధించి తమ రాజ్య విస్తరణ చేసుకున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలు గల దేశ చరిత్రని క్షుణంగా అధ్యయనం చేసిన శివాజి పొరుగు రాజ్యాలతో సఖ్యత సాధించి దండయాత్రలు చేసిన ముస్లిము, మొగలు రాజులకు సింహస్వపంగా మారాడు.

ఈ నాడు ప్రభుత్వ తలపెట్టిన “సబ్ కా సాథ్ సబ్ కా వికాస్” అనేదే ఆ నాడు శివాజీ ప్రారంభించి విధానమే.

ఇది శివాజీ సంక్షిప్త చరిత్ర. ప్రతి భారతీయ పౌరుడు తెలుసుకోవలసిన హైందవ సామ్రాజ్యాధిపతి కథ. మనందరికి నిత్య స్మరణీయుడు. మన జాతి రత్నం శివాజి.

శివాజీ మహారాజ్ కీ జై.

అంతిమంగా

ఇది మన సత్తా

సా.శ. 7వ శతాబ్ధంలో ప్రారంభంమయిన వేరు వేరు ముస్లిము తెగల దండయాత్రలు మహమ్మద్ గజనీ (11వ శతాబ్ధం), మహ్మమ్మద్ ఘోరీ (12వ శతాబ్ధం)లతో తారాస్థాయికి చేరుకున్నాయి. తురుఘ్కలూ, అరబ్బులూ, ఇరానీలు, మొగలులూ, అప్గనులూ భారత్ పై మీదికి మిడతల దండుల్లా వచ్చి పడ్డారు. దేశమంతటా విస్తరించి దారుణమైన మారణకాండ చేసి, వినాశనం సృష్టించారు. పవిత్ర స్థలాలను అపవిత్రం చేశారు. హిందూస్థాన్ దీనికి వ్యతిరేకంగా 800 ఏళ్ళపాటు విరామమెరుగని స్వాతంత్ర్య సమరం సాగించింది. బహుశా ప్రపంచ చరిత్రలోనే జాతి స్వేచ్ఛ కోసం ఇంతగా కదిలించిన సమరగాథ మరొకటి కానరాకపోవచ్చు. రాజస్థాన్ లో మహారాణా, కుంభ్ నుంచి మహారాణా ప్రతాప సింహ్, రాజసింహ్లు వరకూ, దక్షిణాన బుక్క సోదరుల నుంచి శ్రీ కృష్ణ దేవరాయల వరకూ, మహారాష్ట్రలో శివాజి నుంచి పీష్వాల వరకూ, పంజాబులో గురుగోవింద్ సింహ్ వంటి అమరవీరులూ, గురువుల నుండి బందా బైరాగీ, రంజీత్ సింహ్ ల వరకూ, బుందేల్ ఖండ్ లోని ఛత్రసాల్ మొదలుకొని అస్సాములోని లాచిత్ బాస్కర్ బడ్ ఫుకన్ వరకూ లెక్కకు మించి యోధాగ్రేసరులు స్వాతంత్ర్య నౌకని అనేక తుఫానుల్లోంచి భధ్రంగా ముందుకు నడిపారు. వారి విడుపులేని పోరాటం కారణంగా, తిరుగులేని దెబ్బల మూలాన ఇస్లాము విజయ ఖడ్గం ముక్కలై మట్టి కరిచింది. మౌలానా హాలీ విలపించినట్లు- “సప్త సముద్రాల మీద ఎదురులేకుండా, ఓటమి ఎరుగ కుండా వీరవిహారం చేసిన ఇస్లాము అనే నౌకాదళం హిందూస్తాన్ చేరుకునే సరికి గంగలో మునిగిపోయింది”.
#Leader Of The earth
వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేఛ్ఛనివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. విద్యార్ధుల పాఠశాల చదువుల్లో, ఐఏఎస్ అభ్యర్ధులకు, ఇతర ఉద్యోగార్ధులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కనిపిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమని చెప్పుకునే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. అసలు వేదాలు స్త్రీల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాం.

*స్త్రీలు ధైర్యవంతులుగా ఉండాలి - యజుర్వేదం 10.03*

*స్త్రీలు మంచి కీర్తి గడించాలి - అధర్వణవేదం 14.1.20*

*స్త్రీలు పండితులవ్వాలి - అధర్వణవేదం 11.5.18 (స్త్రీలు కూడా విద్యాబోధన చేయాలని చెప్తోంది)*

*స్త్రీ అందరిని జ్ఞానవంతుల్ని చేయాలి - అధర్వణవేదం 14.2.74*

*స్త్రీ ఎప్పుడూ సంపదలతో సుఖంగా ఉండాలి - అధర్వణవేదం 7.47.2*

*స్త్రీలు ఎప్పుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై ఉండాలి - అధర్వణవేదం 7.47.1*

*పరిపాలన విషయంలో స్త్రీలు*
పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్త్రీలు కూడా పాల్గినాలి - *అధర్వణవేదం 7.38.4*

దేశపరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలను స్త్రీలు ముందుండి నడిపించాలి-  *ఋగ్వేదం 10.85.46*

ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది.

ఆస్తిహక్కు
పిత్రార్జితం (తండ్రి కూడబెట్టిన ఆస్తి) లో కుమారుడితో కుమార్తెకు కూడా సమానమైన హక్కు ఉంది-
*ఋగ్వేదం 3.31.1*

కుటుంబం
సమాజానికి, కుటుంబానికి స్త్రీ రక్షకురాలిగా వ్యవహరించాలి- *అధర్వణవేదం 14.1.20*

స్త్రీ సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కలిగించేదై ఉండాలి- *అధర్వణవేదం 11.1.17*
(స్త్రీకి సంపాదన ఉన్నప్పుడే ఆమె కుటుంబానికి సంపదను చేకూర్చగలుగుతుంది)
నీ భర్తకు సంపాదించే మార్గాలు నేర్పించు- *అధర్వణవేదం 7.46.3*

ఉద్యోగాల్లో
*స్త్రీలు కూడా రధాలను నడపాలి- అధర్వణవేదం 9.9.2*

*స్త్రీలు యుద్ధంలో పాల్గొనాలి-యజుర్వేదం 16.44*(ఈ విషయంలో దుర్గాదేవియే స్త్రీలకు ఆదర్శం.

స్త్రీలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కానీ వేదం స్త్రీలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందిగా చెప్పింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా!
(శ్రీ రామాయణంలో కైకేయి అడిగిన వరం వల్లనే రాముడు వనవాసానికి వెళతాడు. దశరధుడితో కలిసి శత్రువులపై యుద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ).

కమాండర్ తరహాలో స్త్రీ సభలను ఉద్ద్యేశించి ప్రసంగించాలి-
*ఋగ్వేదం 10.85.26*

విద్యా విషయాల్లో
ఓ స్త్రీలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం ఉండుగాక!  మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికి జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను (ఋషి) పురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను-

*ఋగ్వేదం 10-191-3*

వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన స్త్రీ ఋషుల గురించి చెప్ప బడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్త్రీదేవతలు ఉండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్త్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినట్టుగా లేదు.

*వివాహం -విద్యాభ్యాసం*
ఓ వధువా! (వధువు అంటే పెళ్ళికూతురు) వైదికజ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తరువాతనే నీవు జీవితానికి సంబంధించిన విషయాల మీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తి గడించి, నీకు భర్తకు శుభాలను కలుగచేసేదానివిగా ఉండు. నీ అత్తవారింట్లో గౌరవప్రదమైన జీవితం గడుపు, నీ జ్ఞానంతో వారి ఇంటిని వృద్ధిపరుచు - *అధర్వణవేదం 14-1-64* (ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్త్రీలకు ఈ మంత్రంలో భగవంతుడు నిర్దేశించాడు).

స్మృతి ఇరానీ

Courtesy: Puranam Srisaa

పుట్టగానే చంపేయమన్నారు!
(ఈనాడు పత్రిక)

‘అమెరికాలో వంటవాడి మనవడు అధ్యక్షుడు అవ్వగలడు, భారత్‌లో టీ అమ్మిన వ్యక్తి ప్రధాని కాగలడు’ అని మొన్నీమధ్య ఒబామా అన్న మాటలు గుర్తున్నాయి కదా! కానీ స్మృతి ఇరానీ గురించి తెలిసుంటే ‘హోటల్లో కప్పులు కడిగిన అమ్మాయి క్యాబినెట్‌ మంత్రిగా మారగలదు’ అని కచ్చితంగా ఆమె గురించీ ప్రస్తావించి ఉండేవారేమో. దిల్లీ వీధుల్లో తిరుగుతూ సౌందర్య ఉత్పత్తులు అమ్మిన దశనుంచి అత్యంత పిన్న వయసు కేంద్ర మంత్రిగా ఎదిగే వరకూ స్మృతి వేసిన ప్రతి అడుగూ ఓ కొత్త చరిత్రకు పునాది.
2004లో ఓ రోజు... ‘పార్లమెంటు ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. అప్పటివరకూ నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’ అంటూ స్మృతి ఇరానీ రోœ్డేక్కింది. సరిగ్గా పదేళ్ల తరవాత, 2014లో ఓ రోజు... ‘స్మృతి ఇరానీ నా చిన్న చెల్లెలు. ప్రధాన మంత్రి చెల్లెలి గురించి కొంతైనా తెలుసుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది’ అంటూ మోదీ ప్రకటించారు. ఆయన అలా స్పందించడానికి కారణం ప్రియాంకా గాంధీ. స్మృతి ఇరానీ గురించి మీడియా ప్రస్తావించినప్పుడు ‘ఎవరావిడ? అలాంటి ఓ వ్యక్తి ఉన్నట్లు కూడా నాకు తెలీదు’ అని ప్రియాంకా గాంధీ చెప్పారు. దానికి జవాబుగా స్మృతిని తన చిన్న చెల్లెలుగా మోదీ పేర్కొన్నారు. ఒకప్పుడు తాను రాజీనామా చేయాలని దీక్ష చేసిన వ్యక్తినే తన చెల్లెలుగా పరిచయం చేయడానికి కారణం స్మృతి వ్యక్తిత్వమే. దేశ ప్రధానినే కాదు సామాన్య ప్రజానీకాన్ని కూడా ప్రభావితం చేసే శక్తి ఆమెది. ఆమె ఎక్కడ మొదలైందో తెలుసుకుంటే కసి ఉంటే ఓ మనిషి ఎక్కడిదాకా వెళ్లొచ్చో ఇట్టే తెలిసిపోతుంది.
బాల్యం పశువుల పాకలో
దక్షిణ దిల్లీ శివార్లలో ఓ పశువుల కొట్టం. దానికి ఆనుకునే ఓ రెండు గదుల పూరిల్లు. స్మృతి జీవితం మొదలైంది అందులోనే. స్మృతి తండ్రి ఓ పంజాబీ. ఓ బెంగాలీ అమ్మాయిని అతడు ప్రేమించాడు. రెండు వైపుల వాళ్లూ వారి ప్రేమను ఒప్పుకోలేదు. దాంతో బయటికొచ్చి పెళ్లి చేసుకొని ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఓ పశువుల కొట్టాన్ని చూసుకునే పనిలో చేరి అక్కడే ఉండేవారు. కొన్నాళ్లకు వాళ్లకు స్మృతి పుట్టింది. ‘అమ్మాయి ఇంటికి భారం, చంపేయండి’ అని వాళ్లమ్మకి ఎవరో సలహా ఇచ్చారట. అయినా ఆమె దానికి ఒప్పుకోలేదు. ఆ తరవాత ఆవిడకు మళ్లీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అసలే పేదరికం, దానికి తోడు ముగ్గురు ఆడపిల్లల్లోనూ పెద్ద... దాంతో చిన్న వయసులోనే స్మృతికి కుటుంబ భారం పంచుకోక తప్పలేదు. పదోతరగతిలో ఉన్నప్పుడే చిన్నచిన్న ఉద్యోగాలూ చేస్తుండేది. అరవై శాతానికి పైగా మార్కులతో టెన్త్‌, ఇంటర్‌ పాసైనా ఆపైన చదువుకోవడానికి కుటుంబ పరిస్థితి సహకరించలేదు. దాంతో కాలేజీ మానేసి దూరవిద్యలో చదవడం మొదలుపెట్టింది.
రహస్యంగా ‘మిస్‌ఇండియా’కి...
అమ్మానాన్నా ఇద్దరూ పనికి వెళ్తుండటంతో ఇంటిపనులన్నీ స్మృతి చేసేది.పదహారేళ్ల వయసులో ఇప్పుడు తన కార్యాలయం ఉన్న దిల్లీ జన్‌పథ్‌ వీధుల్లోనే రోజుకు రెండు వందల రూపాయల జీతానికి సౌందర్య సాధనాలను మార్కెటింగ్‌ చేసే ఉద్యోగం చేసేది. అందంగా ఉంటుంది కాబట్టి మిస్‌ ఇండియా పోటీలకు ప్రయత్నించమని స్నేహితురాలు స్మృతికి సలహా ఇచ్చింది. దాంతో ఎవరికీ తెలీకుండా తన ఫొటోలతో పోటీలకు అప్లికేషన్‌ పంపించింది. ఆశ్చర్యకరంగా వడపోతల తరవాత మిగిలిన అప్లికేషన్లలో ఆమెకూ చోటు దక్కింది. తరవాతి దశ పోటీల్లో పాల్గొనాలంటే ముంబై వెళ్లాలి. దాంతో ఇంట్లో విషయం చెప్పక తప్పలేదు. స్మృతి నిర్ణయానికి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ముంబై వెళ్లాలంటే రెండు లక్షల రూపాయలు కావాలి. తండ్రి దగ్గర డబ్బు లేదు. దాంతో ఎక్కడైనా అప్పు తెచ్చిమ్మనీ, ఆ డబ్బు తాను చెల్లిస్తాననీ ప్రమాణం చేసింది. అలా అప్పుగా తీసుకున్న డబ్బుతో ముంబై రైలెక్కింది.
మెక్‌ డొనాల్డ్స్‌లో ఉద్యోగం
పోటీలో ఉన్న వేరే అమ్మాయిల్లా స్మృతికి మోడలింగ్‌ గురువులూ, వ్యక్తిగత డిజైనర్లూ లేరు. తనకు తానే మేకప్‌ వేసుకోవాలి. తనను తానే ప్రోత్సహించుకోవాలి. అవసరం, పేదరికం ఆమెకు అన్ని పాఠాలూ నేర్పించాయి. పోటీల్లో అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ ‘ఫైనల్‌ ఫైవ్‌’కు చేరుకుంది. దురదృష్టవశాత్తూ త్రుటిలో మిస్‌ ఇండియా కిరీటం చేజారినా, ఆ పోటీల ద్వారా కొండంత ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. పోటీల నుంచి బయటకు రాగానే స్మృతికి కళ్లముందు రెండు లక్షల రూపాయల అప్పు కనిపించింది. దాన్ని ఎలాగైనా తీర్చేయాలని రకరకాల ఉద్యోగాలకు ప్రయత్నించేది. ముంబైలోనే ఉంటూ మోడలింగ్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తానని చెబితే తండ్రి ఒప్పుకోలేదు. ‘మోసపోతావు, ఇంటికొచ్చి హాయిగా పెళ్లి చేసుకో’ అంటూ నచ్చజెప్పాడు. కానీ ‘నా జీవితం మీ నిర్ణయాల వల్ల కంటే నా నిర్ణయాల వల్ల పాడైతే సంతృప్తిగా ఉంటుంది’ అని చెప్పి ముంబైలోనే ఉండిపోయింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఎయిర్‌ హోస్టెస్‌ ఉద్యోగానికి ప్రయత్నిస్తే, తనతోపాటూ దరఖాస్తు చేసుకున్న చెల్లెలికి ఉద్యోగం వచ్చింది కానీ స్మృతికి రాలేదు. వేరే దారిలేక బతుకు తెరువు కోసం బాంద్రాలోని మెక్‌.డొనాల్డ్స్‌లో ఉద్యోగానికి చేరింది. టేబుళ్లూ, ఫ్లోర్లూ శుభ్రంచేయడం దగ్గర్నుంచి ఆర్డర్లను సప్లై చేయడం వరకూ అన్ని పనులూ చేసింది. ఓ పక్క పనిచేస్తూనే స్టూడియోల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అవకాశాల కోసం ప్రయత్నించేది.
ఆ అవార్డు ఐదుసార్లు...
అవకాశాలు ఆలస్యమయ్యే కొద్దీ స్మృతిలో పట్టుదల పెరుగుతూ వచ్చింది. కొన్ని నెలల ఎదురుచూపుల తరవాత ఓ శానిటరీ న్యాప్‌కిన్‌ల ప్రకటనలో కనిపించే అవకాశం ఆమెకు లభించింది. దాని ద్వారా టీవీలో ఓ రెండు సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్‌ చేసే ఛాన్స్‌ దొరికింది. ఆ తరవాత ‘వూ.. లలలా’ అనే కార్యక్రమంలో వరుస ఎపిసోడ్లలో కనిపించింది. వాటిని చూసిన శోభా కపూర్‌, స్మృతిని తన కూతురు ఏక్తా కపూర్‌కు పరిచయం చేసింది. స్మృతి జీవితాన్ని మలుపు తిప్పింది ఆ పరిచయమే. ‘క్యోకీ సాస్‌ బీ కభీ బహూ థీ’ సీరియల్‌ ఆడిషన్లకు రమ్మని ఏక్తా స్మృతిని పిలవడం, అందులో తులసి పాత్రకు స్మృతి ఎంపికవడం చకచకా జరిగిపోయాయి. ఇక ఆ తరవాత అంతా చరిత్రే. బుల్లితెర ప్రస్థానంలో ఆ సీరియల్‌ ఒక సంచలనం. తులసి విరాని పాత్రలో ఒదిగిపోయిన స్మృతి ప్రతి ఇంటికీ పరిచయమైంది. ‘కోడలంటే ఇలా ఉండాలి’ అనిపించేలా ఆ పాత్రతో పేరుతెచ్చుకుంది. ఎనిమిదేళ్లపాటూ తులసిగా కనిపించి బుల్లితెరపైన తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. టీవీ నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ‘ఇండియన్‌ టెలివిజన్‌ అకాడమీ అవార్డు’ను వరసగా ఐదుసార్లు అందుకున్న ఏకైక వ్యక్తి స్మృతి ఇరానీనే.
బాధ్యతలన్నీ పాతికేళ్లకే...
బుల్లితెర రామాయణంలో సీత పాత్రతో పాటూ మరెన్నో కార్యక్రమాల్లో స్మృతి నటించింది. సొంతంగా ‘ఉగ్రాన్య ప్రొడక్షన్స్‌’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి టీవీ సీరియల్స్‌ను నిర్మించింది. తనకంటే వయసులో చాలా పెద్దవాడైన చిన్ననాటి స్నేహితుడు జుబిన్‌ ఇరానీ అనే పార్శీని పెళ్లిచేసుకొని స్మృతి మల్హోత్రా కాస్తా స్మృతి ఇరానీగా మారింది. సీరియల్‌లో స్టార్‌ స్టేటస్‌, సొంత నిర్మాణ సంస్థ, పెళ్లి... ఇవన్నీ జరిగేనాటికి స్మృతి వయసు పాతికేళ్లే. ‘ఇంత చిన్న వయసులో ఇన్ని బాధ్యతలు అవసరమా’ అని అడిగితే ‘పాతికేళ్లకే జీవిత కాలానికి సరిపడా కష్టాలు చూశాను, కాబట్టి ఎన్ని బాధ్యతలనైనా మోయగలను’ అని చెప్పేది స్మృతి. చిన్నితెర నటి, నిర్మాతగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే రాజకీయాలపైన ఇష్టంతో ఆ రంగంలోకీ అడుగుపెట్టింది స్మృతి.
మిసెస్‌ ఫైర్‌బ్రాండ్‌
స్మృతి కుటుంబానికి రాజకీయాలు కొత్తకాదు. ఆమె తాతయ్య ఆరెస్సెస్‌లో పనిచేసేవారు.తల్లి జన్‌సంఘ్‌లో కార్యకర్తగా ఉండేది. స్మృతి కూడా చిన్నప్పట్నుంచే ఆరెస్సెస్‌లో సభ్యురాలు. ఆ ఇష్టంతోనే 2003లో బీజేపీలో చేరింది. 2004 ఎన్నికల్లో దిల్లీ చాంద్‌నీ చౌక్‌ నుంచి కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబల్‌కు పోటీగా బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి ఓటుబ్యాంకును సంపాదించిపెట్టింది. ఆ ప్రతిభకు మెచ్చి ఆమెను బీజేపీ మహారాష్ట్ర యూత్‌ వింగ్‌కు ఉపాధ్యక్షురాలిగా నియమించారు. కొన్నాళ్లకు బీజేపీ జాతీయ కార్యదర్శిగా, బీజేపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగింది. ఈ ప్రయాణంలో ప్రజల తరఫున ఆమె సాగించిన పోరాటాలు ఎన్నో. అత్యాచార బాధితులూ, మహిళా సమస్యల కోసం చేసిన పోరాటంలో అరెస్టయిన సందర్భాలూ ఉన్నాయి. తన వాగ్ధాటితో ప్రత్యర్థులను ఇరకాటంలో పడేసి ‘మిసెస్‌ ఫైర్‌బ్రాండ్‌’గానూ పేరుతెచ్చుకుంది.
మోదీ క్యాబినెట్‌కు...
‘నేను రాజీనామా చేసేవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని స్మృతి ప్రకటించినప్పుడు ఆమెకు నా పైన కోపం కంటే పార్టీ పైన ఉన్న ప్రేమే ఎక్కువగా కనిపించింది’ అంటారు మోదీ. సమస్యలను పరిష్కరించడంలో దిట్టగా పేరున్న స్మృతి తన కష్టపడేతత్వంతో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగింది. బీజేపీ గోవా విభాగానికి రాజకీయ సలహాదారుగానూ పనిచేసింది. 2011లో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికై తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టింది. ఇప్పుడు మోదీ క్యాబినెట్‌లో మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరచింది. పెద్దగా చదువుకోని మహిళకు అంత ఉన్నత పదవి ఏంటని ప్రత్యర్థులు విమర్శిస్తే ‘పెద్దగా చదువుకోలేదు కాబట్టే నాకు దాని విలువ తెలుసు. అవకాశాలు రాకపోతే కలిగే బాధను అనుభవించా. కాబట్టి విద్యార్థుల సమస్యలను నేను పరిష్కరించగలను. ఇంతకు ముందు ఈ పదవిలో ఐఐటీ, పీహెచ్‌డీ లాంటి ఉన్నత చదువులు చదివిన వాళ్లు పనిచేశారు. వాళ్ల పనితీరును చూశాక నేను పీహెచ్‌డీ చదవందే మంచిదైంది’ అంటూ విమర్శలను పదునైన మాటలతో తిప్పికొట్టింది.
చిన్నప్పట్నుంచీ స్మృతి ఇంట్లోవాళ్లు వద్దన్న పనులే చేసింది. కానీ అన్ని విషయాల్లోనూ విజయం సాధించింది. ‘ఎవరో చెప్పారని కాదు, మీ మనసుకి నచ్చింది చేయండి. వచ్చే ఫలితాలకు మీరే బాధ్యత తీసుకోండి. ఇంత ఉన్నత స్థానానికి చేరుకోగలనని మా ఇంట్లో వాళ్లు ఎప్పుడూ వూహించలేదు. కానీ నేను వూహించా. దాన్ని సాధించా. పశువుల పాకలో పెరిగి, వీధివీధి తిరిగే ఉద్యోగం చేసిన అమ్మాయి కేంద్రమంత్రి కాగలిగినప్పుడు, పట్టుదల ఉంటే సామాన్యులూ ఏదైనా సాధించగలరు. ఓసారి ప్రయత్నించి చూడండి’ అన్నది యువతకు స్మృతి ఇరానీ చెప్పే మాట. మరి ప్రయత్నిస్తారా..!
ఇంకొంత
స్మృతికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జోహ్ర్‌. అమ్మాయి జోయిష్‌. మంత్రి అయ్యాక కూడా అందరు తల్లుల్లానే పిల్లలను స్కూల్లో చేర్పించడానికి తానూ ఇంటర్వ్యూ ఎదుర్కొంది. ‘నా జీవితంలో అదే *కష్టమైన ఇంటర్వ్యూ’ అంటుంది స్మృతి.
ఉన్నత చదువులు చదవకపోయినా స్మృతికి ఆరు భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడుతుంది. పంజాబీ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ భాషలూ వచ్చు.
ఆమిర్‌ఖాన్‌కు ఆమె అభిమాని. ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ సినిమాని యాభైసార్లు చూసిందట. ‘మీ వల్ల నాకు చాలా డబ్బులు ఖర్చయ్యాయి’ అని ఆమిర్‌ను కలిస్తే చెప్పాలని అనుకునేదట. కానీ చాలాసార్లు అతడిని కలిసినా మొహమాటంతో చెప్పలేకపోయింది. వేరే వాళ్ల ద్వారా విషయం తెలుసుకున్న ఆమిర్‌, తన తరవాతి సినిమాల
టికెట్లను ఫ్రీగా పంపిస్తానని మాటిచ్చాడు.
జర్నలిస్టు కావాలని స్మృతికి కోరికగా ఉండేది. ఓసారి ఇంటర్వ్యూకి వెళ్తే ఆమెకు ఎలాంటి నైపుణ్యాలూ లేవని తిరస్కరించారట. అప్పట్నుంచీ మళ్లీ మరో అవకాశం కోసం ఆమె ప్రయత్నించలేదు.

Friday, 1 December 2017

విష్ణుపురాణ అంతర్గత ఖగోళ రహస్యాలు

విష్ణుపురాణ అంతర్గత ఖగోళ రహస్యాలు

విష్ణుపురాణం సూర్య మండలం గురించి కొంత వివరంగా చెబుతుంది. చాలా క్రిప్టిక్ (నిగూఢo) గా ఆ వివరణ వుంటుంది.
సూర్యుడు ఒక ఏడు గుర్రాలు పూన్చిన రధం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని, ఆ రధానికి రెండు ఇరుసులు ఉంటాయని, ఒక ఇరుసు 157 కోట్ల యోజనాల దూరం ఉంటుందని ఆ ఇరుసుకు మనకు సంబంధించిన కాల చక్రం బిగించబడి ఉంటుందని, ఆ చక్రానికి మూడు నాభులు ఉన్నాయని 12 అంచులు ఉన్నాయని, ఆ చక్రానికి 6 కడకమ్మలు ఉన్నాయని చెబుతుంది. సూర్యుడు ఎప్పుడూ మేరు పర్వతానికి దక్షిణం వైపుగానే ఉంటాడని చెబుతుంది.

ఒకసారి  దీనిమీద మరింత లోతుగా చర్చిద్దాము.

అసలు సూర్యుడు ఏమిటి రధం ఎక్కడం ఏమిటి? నేటి సాంకేతికత పరంగా పురాణం చెబుతోందా? దీని మీద ఋషులు ఎన్నడో వివరణ ఇచ్చారు. మిగిలిన మతాలు, శాస్త్రజ్ఞులు కనుగొనక మునుపు నుండే మనం మనం నివసిస్తున్న ధరను భూగోళం అని వ్యవహరిస్తున్నాం. భూమి గోళాకారంలో ఉందని వేదం చెబుతోంది. దానికి ఉదాహరణకు ఒక్కసారి వరాహ అవతార విగ్రహాలను పరికించండి. కొన్ని వేల ఏళ్ళ క్రితం నుండి శిల్పశాస్త్రంలో ఈ విషయమై చూపుతారు. వరాహ స్వామీ కోర మీద భూమి ఒక గోళంగా చిత్రిస్తారు. ఇది ఎవడో ఒక్కసారి మేలుకుని నెత్తిమీద ఒక పండుదెబ్బతో తెలిసినది కాదు. మనకు ఎన్నటినుండో తెలిసి ఉన్న పరమ సత్యం. అంతేకాక సప్తద్వీపా వసుంధరా అని సంబోదిస్తాము. సప్త ద్వీపములు ఉన్నాయని సప్త మహా సముద్రాలు  ఉన్నాయని మనకు ఉగ్గుతో నేర్పిన సత్యము.

మనం ఉదాహరణకు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నాము అనుకోండి. ఒక ఊరికి దగ్గర పడ్డప్పుడు ఆ ఊరొచ్చింది, ఆ ఊరు వెళ్ళిపోయింది అని అంటాము. వాస్తవానికి ఆ ఊరు ఎక్కడకీ పోదు, రాదు. కేవలం మనం ప్రయాణం చేస్తున్నప్పుడు relative (సంబంధిత) గమనాన్నే చెబుతాము. మనకు తెలుసు శాస్త్రాదారంతో సూర్యుడు అక్కడే ఉంటాడు అని. నక్షత్రాలు అక్కడే ఉంటాయని, కానీ మనకు సమయం లెక్క కట్టడానికి వ్యవహార పరంగా సౌర్య మానం, చంద్ర మానం, సాయణం, నక్షత్రమానం గా ఎన్నో పద్ధతులు ఉన్నాయి. భూమి తన పైనున్న ఆకాశంలో నక్షత్ర మండలాల పరిధులలో సూర్యుని చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటుంది. కానీ ఆ చేసే ప్రదక్షిణం ఒక 23.5 డిగ్రీల కోణంలో చేస్తుంది, అందువలననే మనకు దక్షిణాయానం, ఉత్తరాయణం లో వివిధ రకాలుగా దివారాత్రాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న బొమ్మను చూడండి. ఒక cone (శృంగం) న్ని ఒక కోణంలో కత్తిరించినట్టు అయితే ఒక దీర్ఘవృత్తము (ellipse) వస్తుంది. ఆ కోణం యొక్క కోనను మనం ధ్రువపదం అని చెబుతాము. ఆ ధ్రువపదం మనకు రిఫరెన్స్ అన్నమాట. ఆ ధ్రువ పదానికి ఎప్పుడూ దక్షిణంలోనే సూర్యుడు ఉంటాడు. భూమి కూడా సూర్యునికి దీర్ఘ వృత్త మార్గంలోనే ప్రదక్షిణం చేస్తుంది. అందుకే మన భూమి ఒకసారి సూర్యునికి దగ్గరగా, ఒకసారి అత్యంత దూరంగా ప్రయాణం చేస్తుంది. పైన ఉన్న నక్షత్ర మండలం స్థిరంగా ఉంది అని మనం అనుకున్నప్పుడు భూమి ఆయా నక్షత్ర మండల పరిధులలో తిరుగుతుంది. ఆ మండలాన్ని మన ఋషులు 12 భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనం భూమిని స్థిరంగా అనుకుని మిగిలినవన్నీ relative గా లెక్క కట్టినట్టు అయితే సూర్యుడు తిరుగుతాడు, పగలు ఉదయిస్తాడు, రాత్రికి అస్తమిస్తాడు. లెక్క కట్టడానికి మనకు సులువు, అందుకే మొట్ట మొదటి relativity గురించి ప్రస్తావన మన జ్యోతిష్య శాస్త్రమే చెబుతుంది.

ఇప్పుడు నిన్న 157 కోట్ల యోజనాలు సూర్యునికి భూమికి ఉన్న దూరం అని చెప్పుకున్నాము. అదే మనం గణించే కాల చక్రానికి ఆధారం. మూడు నాభులు పగలు, సాయం, నిశ(రాత్రి) కి సంకేతాలు, 6 కడకమ్మలు ఆరు ఋతువులకు నిగూఢనిరూపణ అయితే 12 అంచులు పన్నెండు నెలలకు సంకేతార్ధాలు. ఇదే కాక సూర్యుని రధం 36 లక్షల యోజనాల పొడవు అని చెబుతుంది.  అలాగే సూర్యుని ఒక ఇరుసుకు నాలుగు గుర్రాలు, మరొక దానికి 3 గుర్రాలు కట్టబద్దాయని, రెండవ ఇరుసు 145 కోట్ల యోజనాలు అని చెబుతుంది. ఒక ellipse కు రెండు focal పాయింట్స్ ఉంటాయి. అవి రెండు ఒకే విలువ వుంటే అది ఒక సర్కిల్ అవుతుంది. ఇక్కడ సూర్యునికి అతి దగ్గరగా వెళ్ళినప్పుడు 147 మిలియన్ కిలోమీటర్లు దూరం ఉంటుంది, దూరంగా వెళ్ళినప్పుడు 152 మిలియన్ కిలోమీటర్లు   దూరం. దానికి focal పాయింట్ గణిస్తే sqrt(a**2 – b**2) ఫార్ములా ప్రకారం అది సరిగ్గా 36 మిలియన్ కిలోమీటర్లు, సరిగ్గా వేదం చెప్పిన సూర్యుని రధం పొడవుకు సమానంగా.

సూర్యునికి, భూమికి ఉన్న దూరం 149.6million kms. ఈ దూరాన్ని  సూర్యుని చుట్టుకొలత 1391000kms  తో భాగిస్తే వచ్చే సంఖ్యా రమారమి 108 అలాగే చంద్రునికి, భూమికి ఉన్న దూరం 38లక్షల కిలోమీటర్లను చంద్రుని చుట్టుకొలత అయిన 3474 kms తో భాగిస్తే వచ్చే సంఖ్య 108. చంద్రుని చుట్టుకొలత తెలియకుండా ఈ calculations చేసారు అని బుర్రలో గుజ్జున్నవాడెవ్వడూ వాదించడు.

కాబట్టి relative స్పీడ్ ఆధారంగా మనకు సూర్యుడు సప్తాశ్వరాధ -ఏడు గుర్రాల (VIBGYOR – ఏడు రంగుల )  రధం మీద మేరువుకు ప్రదక్షిణగా తిరుగుతాడు అని చెబుతారు. చూసే దృష్టి మార్చి చూస్తె మనకు వారు చెప్పిన పరమ సత్యాలు బోధపడతాయి. నేడు మనం కాంతి సంవత్సరం పరంగా గణిస్తున్నాము , మనం మాట్లాడే అంకెలు మారతాయి కానీ ఆ అంకెల ఆవల ఉన్న సత్యం, లోకం మారదుగా.

!! ఓం  నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు !!

చాగంటి కోటేశ్వర రావు

చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు - 1

                                                   @@@ 

ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.  గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం.  అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు.  ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు.  సునాయాసంగా బయటపడ్డారు. 

చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు.  ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి.  ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి.  అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా.  కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు.  ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు.  ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు.  అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో.  ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు. 

చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు.  కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు.  ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు.  ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు.  ఇంతవరకు ఆయనకు కారు లేదు.  ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు.  ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు.  చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు.  సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు. 

(చాగంటి వారికి పీవీ నరసింహారావు ఇచ్చిన ఆఫర్, అయన మీద జరిగిన కుట్రలు తరువాయి భాగంలో ముచ్చటిద్దాం) చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలా  మందికి తెలియని కొన్ని సంగతులు - 2

@@@

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు.  ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.  తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు.  వారికి ఆస్తిపాస్తులు లేవు.  నిరుపేద కుటుంబం.  సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు.  పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి.  వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది.  ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు. 

ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు.  ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి.  ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు.  అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు.  ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం.  ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది.  ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.  వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం. 

 ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు.  అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె  తన సంపాదనతో వివాహాలు చేశారు.  కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.  తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా? 

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు.  ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు.  ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు.  ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి.  అభిమానులు పెరిగారు. 

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు.  "మీ గురించి ఎంతో విన్నాను.  మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి.  ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం.  ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను.  ఏమైనా అడగండి.  చేసిపెడతాను"  అన్నారు పీవీ. 

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు.  మీ సహృదయానికి కృతజ్ఞతలు.  నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు. 

ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!! 

 
చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు.  ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998  లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు.  ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది.  ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది.  ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు.

Wednesday, 29 November 2017

గత సంవత్సరం గీతాజయంతి రోజున భగవద్గీత

గత సంవత్సరం గీతాజయంతి రోజున భగవద్గీత గురించి నేను రాసిన వ్యాసం:

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది.

1) ఏమిటా విశిష్టత..?

అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది.
ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని ‘జయంతి’ గా జరుపుకుంటారు.
అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల ‘గీతాజయంతి’ ని జరుపుకుంటారు.
ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.

2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..?

సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో..
కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో..
ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది.

3) ఏముంటుంది ఈ భగవద్గీత లో..?

ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో…
ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..
ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో..
అదే ఉంటుంది.

నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు.
నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు.
నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.

4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?

భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..
గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.
భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.

5)భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..?

ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..
భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే..

6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..
ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు…?

కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.
విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.

క్రైస్తవులు,మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం.. రక్తచరిత్రగా, సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.
వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని..
ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు..

“ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం.”

కృష్ణం వందే జగద్గురుమ్..

భగవంతుడు_అనేవాడు_ఉన్నాడా

#భగవంతుడు_అనేవాడు_ఉన్నాడా? #ఉంటే_నిరూపించగలరా?

👉 ఈప్రశ్న నేటి కాలంలో మనకి ఎదురయ్యేదే!! ఎక్కడో ఎందుకు ఇక్కడే ఈ ప్రశ్న ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంది.
  👉 ముఖ్యంగా ఈ ప్రశ్నలు కేవలం హిందువులో మాత్రమే ఎదురయితాయి!!  ఫెషన్ కూడా అయిపోయింది నేను దేవుడ్ని నమ్మను, నాస్తికుడ్ని అని చెప్పుకుంటారు...

👉 దీనికి సమాధానంగా ఒక "వేద పండితుడు" వివరణ:

అయ్యా!!! నీళ్లలో నిప్పు ఉన్నది, అసలు నీరే  నిప్పుగా ఉన్నది () మాకు వేదంలో ఉన్నది అని ఎవరైనా వేద పండితులు చెప్పారను కోండి, ఎవరూ నమ్మరు. నీళ్లలో నిప్పు వేస్తే ఆరిపోతుంది.
【అలాంటిది నీళ్లలో నిప్పు ఉండడమేమిటి? ఈయన ఎంత అమాయకుడో? ఇంకా ఇటువంటిఉపన్యాసాలు చెప్పి జనాలను నమ్మించాలని  చూస్తున్నారు అని మనసులోనేనవ్వుకుంటారు.】
 ఎందుకంటే చాలామందికి తెలిసి నీళ్ళలో నిప్పు అనేది
దాక్కొని ఉండడం అసంభవం. తమ నమ్మకం తప్పని అంత త్వరగా ఒప్పుకోడానికి ఎవరూ సిద్ధపడి లేరు.

అదే ఓ సైంటిస్టు అయ్యా  నీళ్లలో నిప్పు ఉన్నది అని చెప్పాడనుకోండి,
ఆశ్చర్య పోతారు. అయినా పూర్తిగానమ్మరు. ఏది ఎలాగ నిరూపణ చేయండి అంటారు. ఆయన చెప్తారు. నీటిని చేతితో తాకగలం, కంటితో చూడగలం. కానీ నీటిలో ఉండే నిప్పును తాకలేం, నేరుగా కంటితో చూడలేం. ఎందుకంటే దాని శక్తి అమోఘం.
 ఒక వస్తువుగుండా ప్రవహింపచేసినట్లేతే
కనుక దానిని అనేక పనులకు సాధనంగా ఉపయోగించవచ్చు. దీపంగా వాడుకోగలం, ఆ వెలుగును చూడగలం. భూమిలో నుండి నీటిని తోడగలం. అనేక పనులు చేయగలం. ఆ నీటిలో నుండి వెలికి వచ్చిన నిప్పునే మనం “విద్యుత్” అనిపిలుచుకుంటున్నాం...
ఇదంతా విని అవునౌను నిజమే నీటిలో విద్యుత్ శక్తి ఉంది. దానిని మనం వాడుకుంటున్నాం కదా!? అంటూ ఒప్పుకుంటారు.

【ఒక వేదపండితుడు చెప్పిన విషయాన్ని  నమ్మడానికి ఇష్టపడని మనం ఒక సైంటిష్టు చెప్పగానమ్ముతున్నాం. కారణం చాలా సమయా లలో మనం బుద్ధిని ఉపయోగించకపోవడమే!】

 #వేదపండితుడు - సైంటిష్టు ఇద్దరు ఒకే విషయాన్ని చెప్పారు. కానీ  వేదం అనగానే నేటి ఆధునికుల దృష్టిలో పెద్ద బూటకం. అది పాత చింతకాయ పచ్చడి వంటిది. ఎవరికీ పెద్ద ఆసక్తి ఉండదు. వేదం అంటే పూర్వకాలంలో కాలక్షేపానికి రాసుకున్న ఒక జీవన పద్ధతి. ఆ రోజులలో ప్రజలుబావిలో కప్పలు. వారికి ప్రపంచం తెలియదు. తమ చిన్న ప్రపంచంలోజీవించడానికి పెద్ద పనేమీ ఉండేది కాదు. అందుకే ఖాళీ ఎక్కువై రాసుకున్న గ్రంథాలు అవన్నీ. ఈ రోజులకు సరిపోవు. అయినా నిరూపణకు సరిపోని అంశాలు వేదంలో చాలా ఉన్నాయి. కనుక అవి అన్నీఅసమంజసమైనవే అనే వాదనలకు నిలువలేవు!! అని నేడుచాలామంది ఆధునికులయొక్క అభిప్రాయం...

చాలామంది గొర్రెలవలెనే ఆలోచించడానికి అలవాటుపడి నేటికీ అదే విధానంలోఉన్నారు. ఒక గొర్రె ఎటువెళితే వెనకాల గొర్రెలన్నీ అటే వెళతాయి. అలాగే నేటి కాలంలో పాప్ సాంగ్స్, ఫేస్ బుక్, వాట్సప్, సినిమాలు, డబ్బు మొ. వాటిలో కొట్టుకుపోతున్నారే కానీ మనమెటు వెళుతున్నాం అన్నది ఆలోచించడం లేదు. నూటికి ఎవరో ఒక్కరు మాత్రమే మనిషిలా తమ బుద్ధిని
ఉపయోగించగలరు. వారే నాయకులవుతున్నారు. మిగతావారు గొర్రెల వలె లోకాన్నిఅనుసరిస్తున్నారు.

కంటితో చూసినవి మాత్రమే నమ్ముతామంటే క్యారెట్ తింటే ఏ- విటమిన్ వస్తుంది అని డాక్టరు చెప్పినప్పుడు మీరు నమ్మకూడదు. కానీ నమ్ముతున్నారే!!   విద్యుత్ ను కంటితో చూడలేదు, చేతితో స్పర్శించ లేదు. కానీ విద్యుత్ అనేది ఉంది అని నమ్ముతున్నాము. విద్యుత్తు వలెనే భగవంతుడిని కూడా కంటితో చూడలేం, చేతితో స్పర్శించలేము.
   "ఎందుకంటే ఆయనను భరించ గలిగే శక్తి ఈ శరీరానికి లేదు. విద్యుత్ తగిలితే శరీరం ఎలా తట్టుకోలేదో అలాగే భగవంతుని స్పర్శనీ ఈశరీరం తట్టుకోలేదు."

 #ఒక పరిమితికి లోబడిన వస్తువులను మాత్రమే మనం కంటితోచూడగలం. ఆ పరిమితి కంటే తక్కువ ఉన్నా (అణువు),ఎక్కువ ఉన్నా (సూర్యుడు) మనం కంటితో చూడలేం. అలా చూడడానికి మనకి భూతద్దం వంటి ఓ సాధనం కావాలి. ఆలాగే
పరిమితికి లోబడిన శబ్దాలను మాత్రెమే మనం చెవులతో వినగలం. శబ్దం ఎక్కువ ఉన్నా వినలేం (చెవుడువస్తుంది), శబ్దం తక్కువ ఉన్నా మనకు వినబడదు. అంటే మనం చూడడానికి, వినడానికి, ముట్టుకోవాడనికి, వాసన చూడడానికి రుచి>చూడడానికి వీటన్నిటికీ పరిమితులు (Limitations) ఉన్నాయి.  "పాంచభౌతికమైన
మన శరీరమే పరిమిత మైనది అయినప్పుడు  అపరిమిత శక్తి కలిగిన భగవంతుని మనం ఈ శరీరంతో ఎలాచూడగలం, ఎలా మాట్లాడగలం?అలా చూడాలనుకోవడం మన అవివేకమే అవుతుంది."

విద్యుత్తును ఒక బల్బు ద్వారా ప్రసారం చేసి వెలుగుగా ఎలా
చూడగలుగుతున్నామో అలాగే మనసు అనే సాధనమునుఉపయోగించి మాత్రమే ఆ భగవంతుని దర్శించగలం.

【మనకు తెలియని విషయాలు అన్నీ అసత్యాలు కాదు. మన బుద్ధికి తెలియనంత మాత్రాన భగవంతుడు లేడనడం అవివేకం.】 జీర్ణప్రక్రియను మనకంటితో చూడలేము. కానీ ఎవరో ఒక సైంటిష్ట్ చెప్పాడని అది నమ్ముతున్నాం.
#మరి #మన పూర్వీకులు ఋషులు చెప్పిన విద్యను మాత్రం బూటకం అని కొట్టిపాడేయడం ఎంత వరకు సబబు?  【వేదం అంటే అది ఓ సైన్స్, ఋషులు సైంటిస్ట్ లు. వారు ఎంతో కఠోర శ్రమ చేసి సాధించిన ఫలాలను వేదం రూపంలో మనకు అందించారు. ప్రపంచం బట్టకట్టడం నేర్వక పూర్వమే ఇక్కడ మన వేదం-సైన్స్ లో ఎన్నో అద్భుతాలు చేసి చూపారు. వారు మనకు తెలిపిన పరమసత్యం ఒక్కటే!】

 #భగవంతుడనే వాడు ఉన్నాడు. ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి #ఆర్తితో తండ్రీ రక్షించు అని పిలిస్తే నడి సముద్రంలో కూడా చేయందించికాపాడుతాడు.