శివాజీ_కథ 🚩
జాతికి స్ఫూర్తి – శివాజి
జూన్ 7, జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి – హిందూ సామ్రాజ్యదినోత్సవ ప్రత్యేకం
ఆనందనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, స్వాభిమాన స్ఫూర్తి నిండిన హిందూ జన మానసాలు ఆనందోత్సాహాలతో పరవశించిన వేళ..
వందల సంవత్సరాల ‘బానిస భావాల’ గ్రహణం వీడి స్వరాజ్య భానుడు ప్రచంఢంగా ప్రకాశించిన వేళ..
హిందూ స్వరాజ్య విజయ పతాక విను వీధులలో సగర్వంగా తలెత్తుకు నిలిచిన వేళ..
హిందూ ధర్మ ధ్వజ ఛాయ అందరికీ సుఖశాంతులు ప్రసాదిస్తుందని స్వదేశీయులందరూ ఆనంద నాట్య మాడిన వేళ..
నేటికి 323 సంవత్సరాల క్రితం 1674 జూన్ 6న ‘హిందూ సామ్రాజ్య’ సంరక్షకుడిగా ఛత్రపతి శివాజీ మహారాజు తన రాజధాని రాయగఢ్‌లో పట్టాభిషిక్తుడయ్యాడు. మహాయోగి శ్రీ సమర్థ రామదాసు ‘దేశ ధర్మాల ఉద్ధరణ జరిగింది, తీర్థ క్షేత్రాలు పావనమయ్యాయి, స్నాన సంధ్యలకు (ప్రదాచారాల ఆచరణకు) అనుకూలత ఏర్పడింది’ అని ఆనందంతో గానం చేశారు.
హిందూ సమాజపు ఐదు శతాబ్దాల బానిసత్వ సమస్యకు శివాజీ మహారాజు పట్టాభిషేకంతో పరిష్కారం లభించింది. హిందూ సమాజాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకుపోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది శివాజీయేనని అందరికీ విశ్వాసం ఏర్పడింది.
సంధి పేరుతో ఆగ్రాకు రమ్మని, దారి పొడుగునా స్వాగత సత్కారాలు జరిపి, మొగలు దర్బారులో, ఔరంగజేబు చూసీ చూడనట్లు చులకన చేసినప్పుడు, సహ్యాద్రి సింహం ధిక్కార స్వరంతో గర్జించింది. మీర్జా రాజా జయసింగ్ కుమారుడితో ‘రాంసింగ్ – నీకు, నీ తండ్రికి, పాదుషాకు అందరికీ నేనెవరో చక్కగా తెలుసు. స్వాగతించి అవమా నిస్తారా. నేను చనిపోవడానికైనా ఇష్టపడతాను కానీ, పాదుషాను కలిసేందుకు ఎంత మాత్రమూ రాను’ అని పిడుగులు కురిపించి, మొగలు సింహాసం వైపు వీపు మళ్లించి కూర్చున్న మొదటి పురుషుడు శివాజీ మహారాజు. మొగలు దర్బారు చరిత్రలో ముందెన్నడూ జరగని సంఘటన ఇది. శివాజీ నిర్భీతి జాతిలో స్వాభిమాన జ్వాల రగిలించింది.
కుయుక్తితో శివాజీని ఆగ్రాలో గృహ నిర్బంధానికి గురిచేసి, మట్టుబెట్టాలని చూసిన ఔరంగజేబుకు నిరాశ మిగిల్చి, పండ్ల గంపలో శివాజీ తప్పించు కున్న తీరు ప్రపంచ ప్రసిద్ధి పొందింది.
ఛత్రపతి పట్టాభిషేకంతో స్ఫూర్తి పొందిన రాజస్థాన్‌లోని రాజపుత్రులందరూ తమ అంతఃకలహాలను విడిచి ఏకమై దుర్గాదాసు రాథోడ్ నాయకత్వంలో విదేశీ దురాక్రమణ దారులందరినీ తరిమి కొట్టారు. అప్పటికే ఛత్రపతి శివాజీ ప్రేరణతో బుందేల్‌ఖండ్‌లో ప్రభాశోభితమైన సామ్రాజ్యం నిర్మాణమైంది.
అస్సాం రాజు ఛక్ర ధ్వజ సింహుడు ‘అక్కడ శివాజీ అనుసరించిన నీతినే అనుసరించి మన అస్సాంలో కూడ ఏ దురాక్రమణ దారుడు అడుగు పెట్టకుండా చూస్తాను’ అని ప్రతిజ్ఞ చేశాడు. అస్సాం శివాజీగా కీర్తించబడిన ‘లాచిత్ బడ్ ఫుకన్’ సాగించిన పోరు విదేశీయులందరినీ బ్రహ్మపుత్ర తీరం నుంచి తరిమి కొట్టింది.
తదనంతర కాలంలో పంజాబ్‌లో గురుగోవింద్ సింగ్ నాయకత్వాన సిక్కు సైన్యం మొగలు కెదురు నిలిచి పోరు సలిపింది.
శివాజీ పట్టాభిషేకం ‘ఇది విజయానికి దారి. దాని మీద నడవండి’ అని హిందూ రాష్ట్రమంతటికీ సందేశం ఇచ్చింది. అందువల్లనే దానికి అంత ప్రాముఖ్యం.
శివాజీకి విజయం అంత సులభంగా దక్కిందా? సామాన్యుడు సైతం ఆ వీరుని బాటలో నిష్ఠగా ఎలా నిలిచాడు ? ఈ పరిశీలన మన జాతికి జవ జీవాలను ప్రసాదిస్తుంది.
నాటి గోవా గవర్నరు లేఖ ఒకటి ఇప్పటికీ లిస్బన్‌లోని పోరుగ్రీసు ఆర్కైవ్స్‌లో భద్రంగా ఉంది. అతి చిన్న పూనా జాగీరును విశాల రాజ్యంగా విస్తరించిన శివాజీ యుద్ధాలు మాని సుఖంగా ఉండి ఉండవచ్చు గదా? అన్నప్పుడు శివాజీ సమాధానం ఇలా ఉంది – ‘సింధునది పుట్టిన చోటు నుండి కావేరి నది దక్షిణ తీరం వరకు ఉన్నదంతా మన భూమి. ఈ భూమి మొత్తం నుంచి విదేశీయులను గెంటి వెయ్యడం, వాళ్ళు ధ్వంసం చేసిన పుణ్య స్థలాలను తిరిగి శుద్ధి చేయడం. ఇందుకే మన ఉద్యమం’. శివాజీది ఎంతటి విశాల దృష్టి.
జాతి గెలుపు శాశ్వతం కావాలంటే సమాజంలో గెలుపు సాధించాలనే ప్రవృత్తిని జాగృతం చేయాలి. ఆత్మ విశ్వాసాన్ని నిర్మాణం చేయాలి. సమాజాన్ని ఒక్కటిగా కలిపి నిలపాలి. హృదయంలో నిర్భీతిని నింపుకుని దేశ ధర్మాల గౌరవం కోసం మదపు టేనుగుల నైనా ఢీకొనే వీరుల సైన్యాన్ని శివాజీ నిర్మాణం చేశాడు. కనుకనే శివాజీ కన్ను మూశాక హిందూ స్వరాజ్యాన్ని కూల్చటానికి వచ్చిన ఔరంగజేబు తన బలగమంతటితో ఇక్కడే చచ్చి సమాధి కావలసిన గతి పట్టింది.
శివాజీ మహారాజు హిందువుల రణనీతిని మార్చివేశాడు. శత్రువు కపట ఎత్తుగడలకు విరుగుడుగా ధర్మ విజయం కోసం మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏమి చేశాడో మనం అదే చేయాలను కున్నాడు.
మన దేవాలయాలను కూల్చి, మన స్త్రీలను అవమానించిన అధర్మ విధ్వంసకునితో ఎలా ఉండాలి? సంధికి పిలిచి, ఊపిరాడకుండా బంధించిన ద్రోహ బుద్ధి గల అఫ్జల్‌ఖాన్‌ను పులిగోళ్లతో ప్రేగులు పెకలించి చంపి, మోసాన్ని మోసంతో జయించాడు.
లక్షలాది సైనికుల మధ్య పునాలో తిష్ఠ వేసిన ఔరంగజేబు మేనమామ షయిస్థఖాన్ పడక గదిలోకి సాహసంతో అతికొద్దిమందితో తానే ప్రవేశించి సవాలు విసిరి తరిమి కొట్టాడు. మొగలుల దమనకాండ వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి మొగలు రాజ్యంలోని సూరత్ రేవు పట్టణంపై మెరుపు దాడి చేసి అపార సంపద కైవసం చేసుకున్నాడు.
పోర్చుగీసు సైనిక బలగంతో అత్యాచారాలు సాగిస్తూ బలవంతపు మత మార్పిడులు సాగిస్తూ, మారని వారిని వధిస్తున్న నలుగురు ఫాదరీలను పట్టి తెప్పించి ‘మీరు మా మతాన్ని స్వీకరిస్తారా? లేదా?’ అన్నాడు. అంగీకరించనప్పుడు ‘మరి మీరు క్రైస్తవేతరులను ఎందుకు చంపేస్తున్నారు? ఆ పాపానికి ఫలితం అనుభవించండి’ అని ఆ క్రూరులకు శిరచ్ఛేదం విధించారు. పోర్చుగీసు ప్రతినిధికి ఆ భాష అర్థమై, తన మత మౌఢ్యపు ఆజ్ఞలు వెనుకకు తీసుకొన్నాడు.
చిత్రహింసల పాలై బలవంతంగా మహమ్మ దీయులుగా మార్చబడిన హిందూసేనాని నేతాజీ ఫాల్కర్, బజాజ్ నింబాల్కర్‌లను శుద్ధి జరిపించి తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకొవచ్చాడు. వారికి సగౌరవమైన స్థానం కల్పించటానికి తన బంధువర్గంలోని ఆడపిల్లలను వారి బిడ్డలకిచ్చి పెళ్లి జరిపించాడు. అలా మన బంధువులను తిరిగి తెచ్చుకొనే ప్రక్రియ ప్రారంభించిన సంస్కర్త శివాజీ.
ధర్మ యుద్ధాలకు మాత్రమే అలవాటు పడిన హిందూ రాజులను మోసపూరితంగా గెలుస్తూ వస్తున్న విదేశీ ఆక్రమణ దారులకు వారి భాషలో జవాబు చెప్పి చెమటలు వట్టించి, వెన్నులో వణుకు పుట్టించిన ‘గెరిల్లా యుద్ధతంత్రం’ శివాజీ సొంతం.
విదేశీయుల నుంచి మంచి ఫిరంగులు, ఖడ్గాలు తెప్పించి, అలాంటివి మన వద్దే తయారు చేయించే ఏర్పాటు చేశారు.
విశ్వమంతా విహరించిన హిందూ నౌకా బలం, 12వ శతాబ్ది తర్వాత ‘సముద్ర యానం నిషిద్ధం’ అన్న మిథ్యా ప్రచారంతో కుప్పకూలింది. కానీ శివాజీ ఆ మూఢాచార బంధాలను సాహసంతో తెగగొట్టి, సముద్రాన్ని హిందూ వీరులతో కూడిన నౌకలతో నింపాడు.
దేశీయుల నౌకా నిర్మాణాన్ని, మన గ్రంథాలలో గల నౌకా నిర్మాణాలను సరిపోల్చి, అధ్యయనం చేసి మన దేశానికి అనుకూలమైన నౌకా నిర్మాణం తీరుని విద్వాంసులచే రూపొందించి తనదైన శత్రు విధ్వంసక నౌకదళాన్ని నిర్మించాడు. దూరదృష్టితో సింధు దుర్గం, సువర్ణ దుర్గం, పద్మ దుర్గం, విజయ దుర్గం వంటి జల దుర్గాలను రాజ్యానికి రక్షణగా నిర్మించాడు. ముంబాయి ఓడరేవు దక్షిణ ద్వారం దగ్గర ‘ఖండేరి’ జలదుర్గ నిర్మాణం గావించి 1678లో ఉమ్మడిగా దాడి చేసిన జంజీరా సిద్ధీ, ఇంగ్లీషు వారిని ఓడించి సాటిలేని విజయాన్ని సాధించాడు. నౌకాదళాన్ని, అశ్వదళాన్ని, పదాతి దళాన్ని ఒకేసారి ఉపయోగించే వ్యూహ రచన చేసిన నాటి భారతీయ రాజులలో శివాజీయే ప్రథముడు.
మాతృత్వం ఈ భూమి యొక్క పవిత్ర మాన బిందువు. దానిపట్ల అపచారాన్ని స్వరాజ్యం సహించదు. దీనిలో తరమత బేధాలు లేవు. తన రాజ్యంలో రాంఝా గ్రామ పాటిల్ ఒక వితంతు స్త్రీ పై అత్యాచారం జరుపగా అతనిని పట్టి ‘తెప్పించి కాళ్లు, చేతులు నరకమని’ శిక్ష విధించిన వాడు బాల శివాజీ. తర్వాత రోజులలో బీజాపూరుకు చెందిన కళ్యాణ్ దుర్గం సుబేదారు కోడలిని, తన సేనాని బంధించి తీసుకురాగా, అతనిని మందలించి, ఆమెను తన సోదరిగా, తల్లిగా ఆదరించి సగౌరవంగా చీర, సారెతో సాగనంపిన ధర్మాత్ముడు శివాజి.
భయానక పోరాటాలలో కూడ నిగ్రహాన్ని కోల్పోక స్త్రీ, బాల, వృద్ధులను, మౌల్వీలను, ఫాదరీలను తాకవద్దని, చర్చిలకు కాని, మసీదులకు గాని హాని చేయవద్దని సైనికులకు ఆదేశించిన న్యాయశీలి.
కనుకనే హిందూ స్వరాజ్య స్థాపనకు నడుం బిగించిన శివాజీ మహారాజును స్వదేశ నిష్ఠ కలిగిన వారై మహమ్మదీయులు సైతం అంకిత భావంతో సేవించి తరించారు.
దక్షిణ భారత దిగ్విజయ యాత్రకు బయలు దేరిన శివాజీకి భాగ్యనగర్‌లో తానీషా భవ్యమైన స్వాగత సత్కారాలు జరిపి, సోదర సమానంగా గౌరవించి ‘శివాజీ మహారాజు చాలా విశ్వసనీయుడు. ఆయన వద్ద కాస్త కూడా మోసం లేదు. ఆయన మాట ఎంతో చేత అంతే’ అని ఎంతో అభిమానంగా స్వజనులతో చెప్పాడు. తానీషా సేనను కలుపుకుని ముందుకు సాగిన శివాజీ, తిరువణ్ణామలై, సమోత్తర పెరుమాళ్‌లలో ధ్వంసం చేసి మసీదులుగా మార్చబడ్డ దేవాలయాలను తిరిగి నిర్మించి ‘శివలింగ’ ప్రతిష్ఠ గావించాడు.
కాశీ విశ్వేశ్వరాలయాన్ని కూలగొట్టించిన ఔరంగజేబుకు ‘ఈశ్వరుని దృష్టిలో అందరూ సమానులే. హిందువులు – ముస్లింలు అనే తేడా లేదు. హిందూ దేవాలయాలు కూల్చడం లాంటి చెడు కార్యాలు నీవు మానకపోతే నేను ఖడ్గ ధారినై నీకు సమాధానం చెప్పవలసి వస్తుంది’ అని లేఖ వ్రాశాడు.
మహమ్మదీయులుగా మారకుండా నిలబడిన తన రాజ్యంలోని హిందువులపై ఔరంగజేబు జిజియా పన్ను విధించినప్పుడు ‘హిందువులను పీడించటమే ధర్మమనుకోవటం తప్పు. నీకు చేతనైతే రాణా రాజా సింగ్ నుంచి, నా నుంచి జిజియా పన్ను వసూలు చేయి. సామాన్య ప్రజలను పీడించటంలో పురుషార్థం ఏముంది’ అని సవాలు విసిరిన యోధాగ్రేసరుడు.
అలెగ్జాండర్, జూలియస్ సీజర్ లాంటి విశ్వవిఖ్యాత సేనాధిపతులతో శివాజీని పోల్చి చూశారు పాశ్చాత్య చరిత్ర కారులు. వారికి ముందు నుంచే ఉన్నట్లుగా విశాల సైన్యాలు, సైన్యాధికారులు, స్వతంత్ర రాజ్యాలు, ఖజానాలు శివాజీకి లేక పోయినా, వారు కూడ ఎదుర్కొన లేని అతి భయంకర ప్రతికూల పరిస్థితులలో పూర్తిగా విజయశీలియైన ఎకైక పురుష పుంగవుడు శివాజీ అని కీర్తించారు.
ఇంగ్లండుకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ వివిధ దేశాల ప్రజలను ప్రశ్నించి ‘ప్రపంచ చరిత్రలో సర్వశ్రేష్ఠుడు, వీర పురుషుడు, లోకోత్తరుడు శివాజీయే’ అని నిర్ణయించింది.
సోషలిజం, సామ్యవాదం అనే మాటలు ఎరుగని ఆ రోజుల్లోనే జమిందారీ వ్యవస్థను రద్దు చేసి, భూమిని పేద రైతులకు పంచిపెట్టి ‘సమాజపు ఆస్తికి మనం ధర్మకర్తలం మాత్రమే, సొంత దారులం కాదు, ఇది సమాజ సంపద’ అని సామాన్యులలో స్ఫూర్తిని నింపిన ఆత్మీయుడు.
శివాజీ ప్రజలతో వ్యవహరించిన తీరు, వారికి కష్టకాలంలో చూపిన సానుభూతి, చిత్తశుద్ధితో కూడిన ఆత్మీయత- వారు స్నేహంతో, విశ్వాసంతో ఆయన్ను అమితంగా ప్రేమించి, అన్ని వేళలా అండగా నిలిచేలా చేసింది.
తన 50 సంవత్సరాల ఒకే జీవన కాలంలో అద్భుతాలు సృష్టించిన వీరుడు శివాజీ. ఆయన నిర్మించిన జాతీయ ఉద్యమం ఆయనతో ఆగిపోక మునుముందుకు సాగి దేశంలో విదేశీయ పరిపాలనకు ముగింపు పలికింది.
స్వాతంత్య్రానంతరం 70 సంవత్సరాల తర్వాత దేశ, ధర్మ శ్రామికుల కలలు పండి, జాతి తనను తాను గుర్తెరిగి ప్రగతి పథంలో ముందుకు సాగాలనుకుంటున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ‘హిందుత్వం మనధర్మం – విద్య జీవన విధానం’ అనే సకారాత్మక భావన బలపడుతోంది.
‘మాలో ప్రవహిస్తున్నదీ హిందూ రక్తమే. ఆరాధనా పద్ధతి మారి ఉండవచ్చు, శ్రీరాముని భవ్య మందిర నిర్మాణంలో మేము ముందుంటాం’ అని; గోమాత మన సంస్కృతికి ప్రతీక. జాతీయ జంతువుగా ప్రకటించి ఆరాధించటం మన బాధ్యత’ అనీ అంటున్నారు జాతీయ భావాలు కల ముస్లింలు. విదేశీ ప్రేరిత మతోన్మాద తీవ్రవాదులకు, వారికి వంతపాడే రాజకీయ స్వార్థ శక్తులకు ఎదురు నిలుస్తున్నారు ఏక కంఠంతో.
తమ జీవన మూలాలను వెతుక్కుంటూ అసంఖ్యాకులు నేడు తిరిగి తమంత తాముగా హిందూ ధర్మ ప్రవాహంలో కలుస్తున్నారు. ముస్లిం మాతృమూర్తుల హనుమాన్ చాలీసా పారాయణ దీనికొక తార్కాణం.
సైనికులు, శాస్త్రవేత్తలు, క్రీడాకారుల విజయాలకు జాతి మొత్తం సమైక్యంగా స్పందిస్తోంది. స్వదేశీ విధానాలకు, సంప్రదాయాలకు, ఉత్పత్తులకు ఆదరణ అద్భుతంగా పెరుగుతోంది. దేశ దేశాల్లోని మనవారు మాతృభూమి సేవలో మేము సైతం అండగా ఉంటామని నడుం బిగిస్తున్నారు.
మన వనరులు గుర్తించి స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధ శక్తిని, ఆర్థిక శక్తిని పుష్ఠివంతం చేయటానికి శాస్త్రవేత్తలు అలుపెరుగక శ్రమిస్తున్నారు. అందరితో కలిసి, అందరినీ కలుపుని ముందుకు సాగాలనే తీరుకి సామాన్యుడు మతాతీతంగా మద్ధతు పలుకుతున్నాడు. ధర్మం ముందూ అందరూ సమానమే. ఎవరి పట్ల వివక్ష లేదు. ఎవ్వరికీ బుజ్జగింపు లేదు. ‘ఒకే దేశం-ఒకే ప్రజ-ఒకే చట్టం’ అనే దిశగా జాతి జనుల ఆలోచనలు సాగుతున్నాయి.
ఛత్రపతి శివాజీ రగిలించిన నవీన భారత జాతీయ స్ఫూర్తితో ఇలాగే ముందుకు సాగితే, భారత కీర్తి పతాక విశ్వగగన వీధులలో మరోసారి సగర్వంగా ఎగరటం ఖాయం.

No comments:
Post a Comment