Wednesday, 13 September 2017

*నేను హిందూవుగా గర్విస్తున్నా...*

 ఎందుకంటే దేవుడు లేడు అని వాదించే నాస్థికులు సైతమ్ ... మోకాలు మీద నిలబడి ఒప్పుకునే నిజాలు..

      👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

    *దేవుని పేరుతో హిందూవులు చేసే అన్నదానాలు పేదవాడి కడుపు నింపుతున్నందుకు.*

  *దేవుని పేరుతో ఆలయాలలో కొన్ని లక్షల మందికి జీవనోపాది దొరుకుతున్నందుకు.*

  *దేవుని పేరుతో ఆడవాల్లను అమ్మవారి గా భావిస్తున్నందుకు.*

  *దేవుని పేరుతో మూగజీవాలను సైతమ్ దైవంగా భావిస్తున్నందుకు.*
 
   *దేవుని పేరు తో ప్రకృతిని పూజిస్తూ ప్రకృతిని కాపాడుతున్నందుకు.*

   *నిజంగా మనిషిగా హిందూ గా గర్విస్తున్నా...*

*మట్టి ఎంత గొప్పదైనా కావచ్చు...* *దానిని దేవుడిగా మలిచి, ఆరాధించడం ఎంతవరకు సమంజసం???*
 అని హిందూ హేతువాదులు, మరియూ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో  అడిగిన ప్రశ్నకు.

  *🙏🏻పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద చెప్పిన సమా ధానం చదవండి.*

 అందమైన, అర్థవంతమైన ఈ సృష్టి వెనుక ఏదో కారణం ఉండి తీరాలి.
 ఆ తత్త్వాన్నే భగవంతుడు అని శాస్త్రాలు వివరించాయి...
  భగవంతుడికంటూ ప్రత్యేకమైన రూపంలేదు. కాని, ఏ రూపంతోనైనా ఆరాధించవచ్చు.
 *ఉదాహరణకు:-*  మూడు రంగుల జెండాను మన దేశానికి గుర్తుగా భావించి గౌరవిస్తాం. నమస్కరిస్తాం కూడా అయితే నిజానికి ఆ గుడ్డముక్కలో మనదేశం ఉందా అని ఎప్పుడైనా
  ప్రశ్నించుకున్నామా???
లేదంటే, దేశానికి ఈ మూడు రంగుల గుడ్డకూ సంబంధమేంటని ఎప్పుడైనా అపహాస్యం చేశామా???

 సువిశాలమైన ఇంతటి దేశం వాస్తవానికి ఆ చిన్నవస్త్రంలో ఉండదు.. ఉండలేదు కూడా కానీ మన దేశభక్తితో ఈ మూడు రంగుల పతాకాన్ని దేశంగా భావించి గౌరవించి నమస్కరించటం మన బాధ్యతకు నిదర్శనం. అలాగే... అనంతమైన పరమాత్మతత్వం పట్ల కృతజ్ఞతాభావనతో, ప్రతిమలో దైవాన్ని దర్శించి ఆరాధన చేయడం ఏ మాత్రం దోషంకాదు. ఇది దైవభక్తికి నిదర్శనం. సమస్తాన్ని మనకు సమర్పించి నిరంతరం కాపాడే నేల తల్లిని సాక్షాత్తూ భగవంతుడిగా భావించడంలో తప్పేముంది. సకల ప్రాణికోటి జన్మించాలన్నా, *ఈ భూమిపై జీవించాలన్నా అందుకు కారణం మట్టి. చివరకు సమస్తమూ ఈ మట్టిలోనే విలీనమవుతాయి...*
  *అందుకే మట్టికి మనిషికే కాదు... ప్రాణులన్నింటి మనుగడకు కారణమైన ఈ నేల తల్లిని భగవంతుడిగా భావించి ఆరాధించడం మన ప్రాచీనులు మనకు అందించిన సంస్కృతి.* అని చెపేసరికి తెల్ల మొహం వేసుకున్నారు హిందూ హేతువాదులు.🇮🇳

No comments:

Post a Comment