సంధ్యావందనం
==========
ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనం ముఖ్యమైనది. సంధి కాలం (పగలు రాత్రి కలసియున్న కాలం) చేయడంవల్ల దీనికి ఈ పేరు వచ్చింది. పైన పేర్కొన్నవారు సంధ్యావందనం చేయకుండా ఇతర కర్మలను చేయకూడాదు. సంధికాలంలో గాయత్రి, సావిత్రి, సరస్వతి దేవతలను ధ్యానించాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం... ఈ మూడు సంధ్యాకాలాల్లోనూ సంధ్యావందనం చేయాలి. ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేస్తాయి. మధ్యాహ్నసంధ్యలో ప్రకృతి నిశ్శబ్ధంగా ఉంటుంది. సాయం సంధ్యలో ఇల్లుచేరి ప్రశాంతతను పొందుతాయి. ఉదయం విష్ణుస్వరూపిణిగా, మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగా, సాయంత్రం శివస్వరూపిణిగా గాయత్రిని ధ్యానించాలి. గాయత్రిని అనుష్ఠానం చేయకుండా ఏ ఇతర మంత్రాలను జపించినా అవి ఫలితాన్ని ఇవ్వవు. సూర్యుని అర్ఘ్యం ఇవ్వడం, మరియు గాయత్రీ జపం సంధ్యావందనంలో ప్రధాన అంశాలు.సంధ్యావందనం ద్విజాతులకెంతో ముఖ్యమైంది. సంధ్యావందనం చేయని బ్రాహ్మణుడు ప్రాణం లేని దేహంతో సమానం. ఇలా ఆలోచిస్తే, బహుశా, ఈ రోజుల్లో బ్రాహ్మణ జాతి సంధ్యావందనం చేయని స్థితికి చేరుకుని, ఒక విధంగా పతనమై పోతున్నదనాలి. బ్రాహ్మణులమని అనుకునేవారు తమ స్వరూపాన్నే మరచి, భ్రష్టులై పోవడానికి, వారి భోగలాలసయే కారణమనాలి.
ఎన్నిసార్లు, ఎలా చేయాలి?
సంధ్యా వందనం రోజుకు మూడుసార్లు చేయాలి. రోజులో మొదటిసారి సంధ్యా వందనం రాత్రి చివరిభాగం నక్షత్రములు ఉండగా చేయాలి. నక్షత్రాలు లేకుండా చేయటంమధ్యమం. సూర్యోదయమైన తర్వాత చేయడం మంచిదికాదు. కాని మనం సూర్యోదయమైన తరువాత చేయడం ఆచారంగా వస్తోంది. ఇక రెండోసారి మధ్యాహ్న సంధ్యా వందనాన్ని సూర్యోదయమైన 12 ఘడియలు తర్వాత చేయడం మంచిది. సాయం సంధ్యవందనం సూర్యుడు అస్తమిస్తుండగా చేయడం ఉత్తమం. నక్షత్ర దర్శనం అయిన తర్వాత చేయడం మంచిది కాదు. పురుడు, మైల సమయాల్లో అర్ఘ్యప్రదానం చేస్తేచాలు. ప్రయాణాల్లో వీలుపడకపోతే మానసికంగా చేయవచ్చు. రోజూ క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేయాలి. సంధ్యావందనానికి మొదటగా కావాల్సింది యజ్ఞోపవీత ధారణ. ఆచమనం, సంకల్పం చేసి "యజ్ఞోపవీతం పరమం పవిత్రం, ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్, ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః" అని జపిస్తూ మొదటి జంధ్యం వేసుకోవాలి. తరువాత తిరిగి ఆచమించి రెండవ జంధ్యం వేసుకోవాలి. మరల ఆచమించి మూడోది వేసుకోవాలి. అలానే పాతది తేసి వేయడానికీ మంత్రం వుంటుంది. ద్విజులకు తప్ప ఇతరులకు సంధ్యావందనం చేయడానికి అధికారం లేదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులంటారు. వీరికే వేదోక్త కర్మాధికారం వుంది. ప్రాత స్నానం చేసిన తరువాతే సంధ్య వార్చాలి. సూర్య బింబం ఎర్ర్తబారే సమయంలో సాయం సంధ్య చేయాలి. ఇక మధ్యాహ్న సంధ్య మధ్యాహ్నం చేయాలి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వున్న సమయాన్ని ఐదు భాగాలు చేయాలి. మొదటిది, అంటే, ఆరు గంటల నుంచి సుమారు రెండున్నర గంటల సమయం ప్రాతః కాలం. ఒంటి గంట సమయంలో మధ్యాహ్న కాలం. సాయంత్రం ఆరు గంటలకు సాయంకాలం. సాయం సంధ్యల కాలంలో, ప్రాతః సంధ్యా కాలంలో, మూడేసి అర్ఘ్యాలను విడవాలి. ఉదయం అర్ఘ్యం విడిచేటప్పుడు సూర్యుడికి ఎదురుగా నిలబడి, వంగి విడవాలి. మధ్యాహ్నం చక్కగా నిలబడి, సాయంత్రం కూర్చుండి సంధ్య చేయాలి. జపం కూడా అలానే చేయాలి. ఉదయం ఈశాన్య దిక్కుగా, సాయంకాలం వాయువ్య దిశగా, మధ్యాహ్నం తూర్పు దిక్కుగా తిరిగి సంధ్య వార్చాలి. సరైన కాలంలో సంధ్య వార్చితే 10 మార్లు గాయత్రి జపం చేస్తే చాలు. సమయం తప్పితే 108 మార్లు చేయాలి.
సంధ్యావందనం బ్రాహ్మణ. క్షత్రియ, వైశ్యులకు ముఖ్యంగా బ్రాహ్మణులకు సంపాదించి ఇచ్చిన వంశ పరంపరాగతమైన నిక్షేపం. అంటే, బ్రాహ్మణుడనేవాడు, గాయత్రీ జపం ద్వారానే, నిస్సంశయంగా ముక్తి పొందుతాడు. ఇతర జపాలేవి చేసినా, చేయక పోయినా, గాయత్రి జపించిన వాడు భూతదయ గలవాడిగాను, బ్రాహ్మణుడి గాను పిలవడటానికి అర్హుడవుతాడు. బ్రాహ్మణుడు సంధ్య వార్చకపోతే, గొప్ప కీడు కలుగుతుందని అనేక స్మృతులలో ఉంది. కీడు కలుగుతుంది అంటే, ధన నష్టం-ధాన్య నష్టం అని మాత్రమే కాదు. . ఎన్ని జన్మాల పుణ్య ఫలంగానో సంపాదించిన బ్రాహ్మణ్యం, సోమరితనం వల్ల కోల్పోయి, హీన జాతులయందు పుట్టడానికి దారితీయడం కంటే మించిన కీడు ఏముంటుంది? సంధ్య వార్చని బ్రాహ్మణుడు శూద్రుడితో సమానమై, భ్రష్ట బ్రాహ్మణుడిగా లోకం దూషిస్తుంది. సంధ్యను ఉపాసించని ద్విజుడు సూర్యుడిని హింసించినట్లే!
సంధ్యావందనం ప్రయోజనం ఏమిటి?
సంధ్యావందనం ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. సూర్యభగవానుడిలో అద్వితీయమైన మూడు శక్తులు, ఏడు రంగుల కిరణాలు ఉన్నాయి."ధ్యేయస్సదా సవిత్రు మండల మధ్యవర్తీ నారాయణః సరసిజానన సన్నివిష్టః" అనేది మంత్రం. అంటే సూర్యుడు స్పష్టంగా కనిపించే ప్రత్యక్ష దైవం అన్నమాట. ఇందుకు వేదాల్లో అనేక ప్రమాణాలు ఉన్నాయి. సూర్యునిలో కనిపించే సప్త వర్ణాలే సప్త అశ్వాలు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వెలిగించే పరబ్రహ్మ తత్వం సూర్యుడు. త్రిమూర్తుల శక్తులను విడివిడిగా చూపించే దివ్య నారాయణ మూర్తి సూర్యుడు. సూర్యభగవానుడిలో సావిత్రి, గాయత్రి, సరస్వతి అనే మూడు మహా శక్తులు కేంద్రీకృతం అయ్యుంటాయి. అందుకే సూర్యునికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో మూడుసార్లు సంధ్యావందనం చేయాలి. మూడు సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల సూర్యునిలో దాగివున్న సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులు మన సొంతం అవుతాయి.
ఆయా శక్తులను
"గాయత్రీం ఆవాహయామి
సావిత్రీం ఆవాహయామి
సరస్వతీం ఆవాహయామి"
అనే మంత్ర సాయంతో ఆకర్షించి గ్రహించే సాధన సంధ్యావందనం. ఈ మంత్రాన్ని మూడుసార్లు భక్తిగా స్మరించి, నమస్కరించుకోవాలి. త్రి సంధ్యల్లోనూ క్రమం తప్పకుండా సంధ్యావందనం ఆచరించాలి. ఈ మూడు శక్తులూ ఘనీభవించిన మూర్తియే గాయత్రి. కనుకనే గాయత్రిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.
సంధ్యావందనంలో ఆచమనం, ప్రాణాయామం, అఘమర్షణం,అర్ఘ్యప్రదానం, గాయత్రి మంత్రజపం, ఉపస్థానం అనేవి అంగాలు. మూడు సంధ్యలూ ఒకే మాదిరిగా ఉండవు. సూర్య తాపము, ప్రభావం వేరువేరుగా ఉంటాయి. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయంత్ర సూర్యుని వృద్దార్క అని అంటారు. ఉదయానే ఏమంత ప్రభావం చూపడు. సాయంత్ర వేళలో సూర్యుడు గొప్ప ప్రభావాన్ని చూపుతాడు. ఇక మధ్యాహ్న సమయంలో సూర్యుని వేడిమి సహించలేనిదిగా ఉంటుంది. అయితే మూడు దశల్లోనూ సూర్యుని కిరణాలను చూడటం చాలా అవసరం. కనుకనే సంధ్యావందనం పేరుతో ఒక ఆచారాన్ని ప్రతిపాదించారు.దాన్ని కొనసాగించడంవల్లమనసుకు శాంతి అనుభూతమౌతుంది. శరీర ఆరోగ్యమూ బాగుంటుంది.

No comments:
Post a Comment