వైదిక ధర్మంలో అంటరానితనమా?
పురాణాలు, ఇతిహాసాల కాలం నాటికైనా అంటరానితనం అనే సామాజికమైన ఆచరణ ఉన్నట్లు ఆధారాలు వివరించ గలరా ఎవరైనా? ఆధునిక కాలపు వేదఋషి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని ఇందుకు ఆధారం ఎక్కడా లేదని, ఉంటే చూపవలసిందనీ సవాలు చేశారు కదా!
మరి ఎట్లా ప్రవేశించింది భారతీయ సామాజిక జీవన వ్యవస్థలో? ఇందుకు కార్యకారణ సంబంధా లేమిటి? ఎవరైనా ఇది ఎట్లా జరిగిందని చెప్పగలరా? పురాతన, ప్రాచీన మానవ నాగరకతలలో, పౌర జీవన వ్యవస్థలలో బానిసత్వం నిరాక్షేపణీయంగా చెల్లుబాటులో ఉండేదని ఆయా దేశ చరిత్రలు, ఆయా కాలాల్లో నెలకొన్న సాంఘికాచా రాలు వెల్లడి చేస్తున్నాయి. కాని అంటరానితనానికి ఆమోదం పాటించేవారా? రామాయణ, భారత, భాగవతాలలో చాతుర్వర్ణ బాహ్యమైన ఒక సాంఘిక వ్యవస్థ ఆనవాళ్ళున్నాయేమో కాని, అంటరానితనమనే అస్పృశ్యత ఉండేదనటానికి ఆధారాలూహించగలమా!
వేదంలో కూడా హరిశ్చంద్రుడి కథ ఉంది. కావ్యాలలో కవులు దానిని తమ కథకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకుని ఉండవచ్చు. విశ్వా మిత్రుడు ఆయనను ఎన్నో పరీక్షలకు గురిచేస్తూ, ఇద్దరు మాతంగ కన్యలను వివాహాం చేసుకోవలసిందనే వృత్తాంతం ఉంది. అంటే అప్పటికి అంటరానితనం లేదనే కదా అనుకోవాలి. త్రిశంకుడు శాపోహతుడై తమోగుణం చెంది చండాలుడైనట్లు రామాయణంలో ప్రస్తావన ఉంది కాని, అంటరానితనం ప్రస్తావన ఎక్కడుంది? కవులు, కల్పనలు, ఇష్టాయిష్టాలు, ప్రక్షిప్తాలు సామాజిక జీవన ప్రతిఫలనాలు కావు.
యజుర్వేదంలో శతరుద్రీయమని ఒక స్తోత్ర పాఠం ఉంది.
రుద్రాభిషేకంలో దీనినే పఠిస్తారు. వడ్రంగం చేసేవాడివి నీవే, రథకారుడివి నీవే, కుండలు చేసేవాడివి నీవే, వృత్తి విద్యలు ప్రవర్తింపచేసేవాడివి నీవే, బాణకారివి నీవే, ధనుస్సు నిర్మించేవాడివి నీవే, వేటకాడివి నీవే, చర్మకారుడివి నీవే, కర్మకారుడివి నీవే, కోనవాడివి నీవే, కానలో తిరిగేవాడివి నీవే’ అని ఈ అనువాకన తాత్పర్యం. అటువంటప్పుడు వేద ప్రమాణంలో అంటరానితనం ఎక్కడ ప్రబోధ మైంది? ‘సమస్త వృత్తుల, సమస్త చిహ్నాల్ నాకు ప్రేరణనిస్తాయి’ అన్నాడు కదా శ్రీశ్రీ. వేదం కూడా ఇదే అనటం లేదా!
అయితే ఇందులో ఒక చిక్కు ఎదురవుతున్నది? ఆచరణలో లేని సూక్తులెందుకు? హితోక్తుల విలువ ఏమిటి? అని రాజ్యాంగాన్ని భ్రష్ఠు పట్టిస్తూ ఉంటే అది రాజ్యాంగం తప్పు కాదు కదా? ఇప్పుడు మన రాజ్యాంగంలో సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం నిబంధితమై ఉండగా, నాగరిక సమాజ జీవనంలోనైనా, కనీసం న్యాయ రాజ్యాంగంలోనైనా రాజ్యాంగబద్ధత కనపడుతున్నదా?
ప్రజలందరూ విద్యావంతులైతే, ప్రజాస్వామ్య మంటే వాళ్ళు నిజమైన అవగాహనకు వస్తే, జీవన సంస్కారం ప్రజా సామాన్యంలో పెంపొందితే అప్పుడు మన ప్రతినిధుల, చట్టసభల, న్యాయసభల, కార్యనిర్వాహకవర్గ అధికార గణాలలో రాజ్యాంగ నిబద్ధత నెలకొనటానికి ఆస్కారముంటుంది. అంతే కాని ఈ అరాచకానికంతా రాజ్యాంగం ఉత్తర వాదత్వం వహించదు. మన శాసన సభ ప్రతినిధులు, మన రక్షకభట వ్యవస్థ, మన సారా కంట్రాక్టరులు (గుత్తేదారులు), మన విద్యారంగం, మన ఆసుపత్రులు, మన సమస్త ప్రజా సౌకర్య పరికల్పన పథకాలు నాలుగు వంతులలో మూడు వంతులైనా అవినీతి, అక్రమ ధన లాలసలతో పని చేయటం, మన పత్రికలు కూడా సమాజ హితం, ప్రజాహితాలకైకాక, స్వహితం, స్వకులం, స్వలాభం, స్వప్రయోజనాలను వదులుకుంటు న్నాయా! దీనికంతా రాజ్యాంగాన్ని తప్పు పట్టవచ్చా?!
చట్టంకన్నా విద్యాసంస్కారం, మానవత్వం, పాపపుణ్య విచికిత్స, దేశాభిమానం, మానవ సౌకర్యం సమాజం అన్ని రంగాలలో ఎక్కువ సత్ఫలితాలను తేగలవు. చట్ట భయానికి దొంగదారులు, అసత్య ప్రమాణాలు అన్వేషిస్తారు సాంఘికులు. అది ఇప్పుడు మనదేశంలో సర్వేసర్వత్రా కనపడుతూనే ఉన్నది. ఆదిశంకర భగవత్పాదులు, భగవద్రామానుజులు ఇంకా శతాధిక మతాచార్యులు, సంఘ సంస్కర్తలు, భక్తులు, వేదాంతులు అంటరానితనం ఉండకూడదని ప్రబోధించారు కదా!
బసవ పురాణంలో అగ్రవర్ణాల డాంబికత్వాన్ని, అహంకార జ్ఞానాన్ని, ఛాందస అతిశయాన్ని, ముఖ్యంగా అట్టడుగు కులాల వారి అచ్చ స్వచ్ఛ భక్తి తాదాత్మ్యాన్ని, మహిమలను, భగవద్విభూతి సామీప్యాన్ని వర్ణించారు కదా! సుందరమూర్తి నాయ నారు ఇల్లాలు ఒక దళిత వనిత. ఉద్భటారాధ్యుల వారు శైవ మత పంచాచార్యులలో ప్రసిద్ధులు. ఆయన ప్రియురాలు ఒక అట్టడుగు కుల వనిత కావటంతో ఆయనను సాంఘికులు వెలివేశారు. కాని ఆయన శివైక్యం చెందగా, ఆయన చితిధూమం సోకి, ఎందరో పిశాచ జన్మలు పాప విమ్తుమైనట్లు బసవ పురాణంలో ఆయన కథ చెప్తున్నది. అరవై ముగ్గురు నాయనారులలో, పన్నెండు మంది ఆళ్వారులలో సమాజ బహిష్కృతులనుకుంటున్న వర్గాలకు పూజార్హత మన వారు నిరాకరించలేదు కదా!
మనుస్మృతిని దగ్ధం చేస్తే మనుషులలో సమానత్వం సిద్ధిస్తుందా? మను స్మృతిలో ఉన్న మంచి విషయాలు అభిమానించవచ్చు కదా! కోడలును కూతురు కన్నా ఎక్కువగా చూసుకోవాలి. ప్రేమగా లాలనగా, బహుమాన పురస్సరంగా ఆదరించాలి అని చెప్పారు కదా మనువు (స్నుషా! అధిక పాల నీయా!). నారాయణగురు పూజ్యపాదులకు బ్రాహ్మణులు శిష్యులయ్యారు. రోమారోలా, గాంధీ, రవీంద్రనాథ టాగూర్ ఆయనను ప్రస్తుతించారు. ఆయన అంతా నిన్న మొన్నటివాడు.
స్వామి వివేకానంద అంటరానితనాన్ని ఎంత కంటగించుకున్నాడు? ఆయన సఫాయి కర్మాచారుల ఇంట ఆతిథ్యం పొందాడు. హిందూమత పరిభ్రష్టతను చూసి కన్నీరు కార్చాడు. వెనుకబడిన వర్గాలకు, కులాలకు, పరిత్యక్తులకు విద్యా సౌకర్యాలు, ఆరక్షణలు అత్యంతావశ్యకమని ఆయన ఎంతగానో ప్రబోధించాడు. నూట పధ్నాలుగేళ్ల కిందట ఆయన నవీన భారతదేశ పునరుజ్జీవనానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు ఆయన భవిష్య భారత దర్శనాన్ని ఎందుకు బోధించరు? అప్పుడు సమాజ వర్గాలలో ఎవరూ దళితలు కారు.
– డా|| అక్కిరాజు రమాపతిరావు
(జాగ్రుతి-సాహిత్యం)

No comments:
Post a Comment