Tuesday, 12 September 2017

వర్ణ వ్యవస్థ

వర్ణ వ్యవస్థ
హంపీనగర శిథిలాలను చూస్తూ శ్రీక్రిష్ణదేవరాయల కాలంనాటి విజయనగర సామ్రాజ్య ప్రాభవాన్ని ఊహించి ఎలా చెప్పలేమో....

సందుగొందుల్లో మసీదులు,దర్గాల మధ్య ఉన్న విశ్వనాథుని గర్భాలయాన్ని చూచి వ్యాసుల కాలంనాటి వారణాసి వైభవాన్ని ఊహించి చెప్పడం ఎంత క్లిష్టమో....

    అదేవిధంగా కుల వివక్ష,అంటరానితనం లాంటి జాడ్యాలతో భ్రస్టుపట్టబడి ఉన్న  ప్రస్తుత భారతీయసమాజాన్ని చూస్తూ భారతీయ ప్రాచీనవైభవ కాలంనాటి అత్యద్భుతమైన వర్ణ వ్యవస్థను పోల్చి ఊహించటం కూడా అంతకంటే కష్ఠం.(అలా చేయటం పిచ్చి పని).
 
   ఆనాటి వర్ణాశ్రమవ్యవస్థ ఆచరణ అద్భుతమైనది.మానవసమాజంలోని లోపాలన్నింటినీ సవరించి శాఖావైషమ్యాలు తలెత్తకుండా సర్వజనుల సర్వతోముఖాభివ్రుద్దికై ,పరమ శాస్ర్తీయ విధానంలో నాటి విభజన జరిగింది.నాటి సమాజం యొక్క ఆధ్యాత్మికాశయాలు దాని బాహ్యసంఘనిర్మాణంలో ప్రతిఫలించేవి.ఆ సంఘ నిర్మాణనికీ,వర్ణాశ్రమ విభజనకూ జాతీయక్షేమమే మూలలక్ష్యం.ప్రతివ్యక్తీ తన శక్తిసామర్ద్యాలను సంపూర్ణంగా వికసింపచేసుకుంటూ,వాటిని సమిస్టి ప్రయోజనాలకు వినియోగించటం ఆ విభజన లక్ష్యం.ఉత్పత్తి సంపద సమాజంలో అందరికీ సమానంగా అందేట్లూ,ఎవరికి ఏలోటూ రాకుండే విధంగా,ఒకరిని మరొకరు దోపిడీ చేసే అవకాశం లేకుండా నాటి వర్ణ వ్యవస్థ నిర్మాణమైంది.నేడు ప్రచారానికి వాడుకుంటున్న సామ్యవాద భావన వేల సంవత్సరాల పూర్వమే వర్ణవిభజన ద్వారా ఆచరణయందు ఉండేవనుటకు అనేక ఆధారాలున్నాయి.
ఇంగ్లండ్ ఫ్రాన్స్....ఇలా ఏదైశాలలోనైనా మేధావులు,వైద్యులు,సైనికులు,న్యాయవాదులు....ఇలా విభజన సర్వసాధారణమే...కానీ ప్రాచీన భారతదేశంలోని వర్ణవ్యవస్థ ఒక వారసత్వ సంపదగానీ,హక్కు గానీ కాదు.పుట్టుకతో ఎవ్వడూ బ్రహ్మణుడూ కాడు ,శూద్రుడూ కాడు.వారి వారి యోగ్యతలననుసరించో వారి వర్ణము నిర్దారితమయ్యేది.
   "జన్మనా జాయతే శూద్రః,సంస్కారాద్ది్విజ ఉచ్యతే!
     వేదపాఠీ భవేద్వ్దిప్రః,బ్రహ్మ జానాతి బ్రాహ్మణః!!
         ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్దవిద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు.ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.
Col.Olcott ఇలా అన్నాడు-"నాటి భారతీయ సమాజం నేటి కాలంలో వలె కులాల ఇనుపచట్రాల్లో బంధింపబడలేదు.వారు తమతమ యోగ్యతను బట్టి సమాజంలో అత్యున్నతస్థాయి పొందడానికి పూర్తి స్వాతంత్ర్యం ఉండేది.అలాగే అతి తక్కువస్థాయికి దిగజారే అవకాశాలూ ఉండేవి.అదంతా వారి వారి వ్యక్తిత్వ ప్రతిభపై ఆధారపడి ఉండేది".అని వ్యాఖ్యానించాడు.మహాభారతం అరణ్యపర్వంలో ఈ విషయం మరింత స్పష్ఠంగా ఉంది.
"కవష ఐలుషుడు"అనునతడు శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తితో ఋగ్వేదంనందలి కొన్ని ఋక్కులకు కర్తయై బ్రాహ్మణత్వం పొందాడు...యజర్వేదం అందలి కొంతభాగానికి కర్తయైన జాబాలి కూడా అంతే..ఇలాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి.
  అలెగ్జాండర్ దండయాత్ర సమయానికి కూడా వర్ణవ్యవస్థ ప్రస్థుత అద్వాన్న స్థితిలో లేదు.మెగస్తనీస్ భారతజాతి వర్ణ వ్యవస్థ గురించీ వివరిస్తూ"ఏ వర్ణం వాడైనా జ్ఞాణియై బ్రాహ్మణత్వం పొందే అవకాశం ఉంది" అని వ్రాశాడు.
కర్నల్ టాడ్ పరిశీలన ప్రకారం,"సూర్య,చంద్ర వంశరాజుల పరిపాలనలో  బ్రాహ్మణ కర్మలు నిర్వహించే వంశపారంపర్య హక్కలేదు."భారత సంఘ నిర్మాణం పై అనేక పరిశోధనలు చేసిన కొందరు పాశ్చాత్య మేధావుల చరిత్రకారుల పరిశీలనల సారాంశం-"ఈ వర్ణవ్యవస్థే ఈ సమాజానికి వెన్నుముక.ప్రపంచమందలి ఇతరసమాజాల కంటే ఈ విభజన శ్రేష్ఠమైనది.దీనివలన మిగిలిన దేశ సమాజాలలో కనిపించే నిరుద్యోగ నిర్వ్యాపార సమూహాలు ఇక్కడ కనిపించవు.గత వేయి సంవత్సరాల కాలంలో వర్ణవ్యవస్థ మార్పులకు గురి అయినప్పటికీ దీనివల్లే హిందూసమాజం నిలబడగలిగింది."

అయితే నేటి కులవ్యవస్థ హిందూసమాజ విచ్ఛిన్నానికి కారణభూతం కావడం మన దురద్రుష్టం.ఈ సంకుచిత జాడ్యాలను వదిలించి పూర్వ వైభవ భారతాన్ని పునర్నిర్మించటానికి ఎందరో మహానుభావులు క్రుషిచేశారు.అయితే నాటి వీదేశీయుల పాలనలలో అవి కొంతవరకే విజయం సాధించాయి.
నేడు మన స్వపరిపాలనలో స్వరాజ్యాంగం ద్వారా ఈ దుస్థితిని పారద్రోలే అవకాశం వచ్చినప్పటికీ మెకాలే మానసపుత్రుల వింతవైఖరి వల్ల అది సాధ్యపడటం లేదు.వీరు కుల జాడ్యాన్ని వర్ణవ్యవస్థకు పర్యాయపదం గా చెబుతూ ప్రపంచమేధావులు ప్రశంశించిన హింధూధర్మాన్ని తూలనాడటం చేత ప్రజలనుండి వీరికి సహకారం కరువైంది...నేడు వామపక్ష ఉద్యమాలలో మతం మారిన వారు ,ముస్లింలు సైతం కమ్యూనిజం మాటున హింధూదర్మాన్ని కులబూచిగా చూబుతూ నిందిస్తుండటం అందరికీ తెలిసిందే...
ప్రజలు దీనిని గమనించి మనకు సరైన దిశా నిర్దేశం చేయగల చరిత్రను తెలుసుకుని కులవివక్ష సంకుచితత్వాన్ని పారద్రోలడానికి నాటి హైందవ వైభవం నుండే స్ఫూర్తి పొంది మన ఘన వారసత్వాన్ని స్మరించుకుంటూ ఐక్యత పొందే ఉద్ధేశ్యంతో ముందుకు సాగాలి.
ఆధారం:"భారత ప్రాతీన నాగరికత,వైశిష్ఠ్యము"అను గ్రంధం
By రామ్ కనుపూరి

No comments:

Post a Comment