Wednesday, 13 September 2017

అన్య మతాల వారు మ్లేచ్చులు శ్రీ రాముడిని కూడా వదలడం లేదు.దూషించడం మానడం లేదు.అందుకని రాముని గొప్పతనం గురుంచి నాకు తోచినంతలో వివరించాలనుకుంటున్నాను.రామాయణం గురుంచి వ్యాఖ్యానించేంత గొప్పవాడిని కాదు.కానీ రాముడు ఏ విధం గా మిగతావారికంటే గొప్ప అని చెప్పే చిన్న ప్రయత్నమే ఇది.

మనకందరికీ తెలుసు రామాయాణాన్ని వాల్మీకి రచించాడు.రచించాక లవ,కుసులకు బుర్ర కధలుగా రామ చరితని ప్రపంచానికి చెప్పమని పురమాయించాడు.అది మొదలు రామ కధ ప్రజలందరి నోళ్ళలో నానుతూనే ఉంది. రాముడు ప్రధమం గా మానవుడు.ఆయన చేసిన కార్యాలే ఆయనను దేవుడిని చేశాయి.మిగతావారికంటే ఆయనను అల్లంత ఎత్తులో నిలిపాయి.మానవులలో ఆయన ఉన్నతుడు,మహాత్ముడు.ఈ రోజుకి కూడా ప్రతి ఊరిలో రాముల వారి ఆలయం ఉంది అంటే అది అతిశయోక్తి కాదు.
రామాయణం మొత్తం కాకుండా రాముడి గుణగణాలను,రాముడితో ఉన్నవారి గుణగణాలను కొంచెం చెప్పు కుందాం.
రాముడు ప్రప్రధమంగా క్షత్రియుడు.క్షత్రియుడు చేసే పనులన్నీ రాముడు చేసాడు.రాముడు మాసం తిన్నాడు అని చెప్పడం పిల్లి పాలు త్రాగింది అని చెప్పేంత హాస్యాస్పదం.మాంసం తినడం తప్పు కాదు కదా.ఇకపోతే రాముడు తన కన్నా తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవికి వెళ్ళాడు వనవాసం చేసాడు.కావాలి అంటే మాట తప్పొచ్చు
కానీ అలా చేయలేదు.సీత కూడా తన పతి తన సర్వస్వం అని రామునితో వచ్చేసింది.లక్ష్మణుడు తన అన్న తోడిదే లోకమనుకుని అన్న వెంట వచ్చేసాడు.నిద్ర కూడా మాని అన్న వదినలను చూసుకున్నాడు.అక్కడ భరతుడు అన్న తన నిజమైన రాజని అన్న చెప్పులు సింహాసనం పైన ఉంచి తాను అన్న అనుచరునిగా మాత్రమే రాజ్యం చేసాడు.
రావణుడు ఎంతో భక్తి పరుడై ఉంది కూడా ఆడదాని పట్ల కామ
వశుడై తన చావుని తానే కొని తెచ్చుకున్నాడు.సూర్పనఖ ముక్కు చెవులు కోయడం తప్పు అని విమర్శిస్తున్నారు .తప్పు చేస్తే ఆడది అని వదిలేయాలా?అప్పటికి తాను వివాహితుడని చెబుతున్న సూర్పనఖ మోహపరవశురాలై రాముని వెంట తిరిగింది ఫలితం అనుభవించింది.ఇక్కడ రావణునికి,సూర్పనఖకి దండన పడింది.ఇంకొక విషయం వాలీని రాముడు చంపిన విధానం ను చాలా మంది విమర్శిస్తారు.నేను చెప్పేది ఒక్కటే ఇక్కడ.వాలి మంచి వాడా కాదా?అన్న రాజ్యం తీసుకుని.అన్న భార్యలను బలవంతం గా వస పరచుకున్నవాడు మంచివాడేలా అవుతాడు?వాడిని చంపడం లో విమర్శలెందుకు?ఒక చెడ్డవాడిని ఎలా అయినా చంపొచ్చు అందులో ఎటువంటి తప్పు లేదు.అయినా శాస్త్ర ప్రకారం గా చెప్పాలి అంటే వాలి మనిషి కాదు మృగము.మృగాన్ని వేటాడడానికి మనిషి పొంచి వెనుక నుండే చంపుతాడు.మృగము వంటి వాలిని కూడా రాముడు అలానే చంపాడు.అదీ కాక వాలీ కి ముందు గుండా పోరాడితే ఓడించలేరని వరం కూడా ఉంది.ఇక్కడ శక్తి తో కాక యుక్తి తో చంపాడు రాముడు.చెడ్డ వాడిని చంపాడు కనుక ఇక్కడ విమర్శలు అనవసరం.
ఇంకొక ముఖ్య విషయం.రాముడు సీతని ఒక చాకలివాడు ఏదో అన్నాడు అని అడవులకు వదిలేసాడు అని చాలా మంది విమర్శిస్తారు.దానికి నేను ఇచ్చే జవాబు నిశితం గా గమనించండి.
రాముడు ఒక రాజు.రాజు అనేది ఒక పదవి మాత్రమే కాదు.ఒక బాధ్యత కూడా.ఈ రోజులులో మన నాయకులలా పదవి వలన సుఖ భోగాలు మాత్రమే అనుభవించి మన బాగోగులు చూసే భాద్యత విస్మరించినట్లు ఉండేవాడు కాదు శ్రీ రాముడు.శ్రీ రాముని జీవితం ప్రజలకి ముందు అంకితం తర్వాత మిగతావారికి చెందుతుంది.మనం అనుకున్నట్టు సీత గురుంచి ఒక చాకలి అనలేదు.అలాకి అని లవ కుశ సినిమా లో చూపెట్టారు.కానీ రామాయణం లో వీధి కూడలిలో ప్రజలు రావణుని దగ్గర ఉన్న సీత ని ఎలా రాముడు ఏలుకుంటున్నాడు అని మాట్లాడుకోవడం చారకుడు విని రాముడు కి చెబుతాడు.ప్రజల మాట మన్నించి వారి అనుమానాన్ని తీరిచే బాధ్యత రాముని పైనా ఉంది అలాగే రాణి గా సీత పైనా ఉంది.అందుకే రాముడు సీతని తనకి ఇష్టం లేకున్నా సీతని అడవులకు పంపించాడు.ఇష్టం లేకుండా అని ఎందుకు అన్నాను అంటే రాముడు ఏక పత్నీవృతుడు.జీవితాంతం రాముడు సీతని తప్ప ఎవరిని వివాహమాడలేదు.ఎవరివైపు కన్నెత్తి చూడలేదు.రావణుడు సీతని పట్టుకెళ్ళాక సీత అంటే ఇష్టం లేకపోతే రాముడు ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖం గా ఉండి ఉండేవాడు.కానీ ఆయన అలా చేయలేదు.సముద్రాన్ని ధాటి రావణుని చంపి సీతని తెచ్చుకున్నాడు.అలాంటి సీతని అడవులలో వదిలిపెట్టాడంటే ఎంత బాధ పది ఉండాలి?ప్రజల మాట మీద సీతని విడిచిపెట్టాడంటే ప్రజలకు ఎంత విలువిచ్చి ఉండాలి?ఇక్కడ తెలియడం లేదు రాముని గొప్పతనం?అగ్నిలో పునీతమయ్యకనే సీతని మల్లి తీసుకున్నాడు రాముడు.కానీ మహాతల్లి భూమి లోకి వెళ్ళిపోయింది.
రాముని కధలో అడుగడుగునా కష్టాలే కనపడతాయి.కానీ మాట తప్పని తీరు అమోఘం.రాముని చుట్టూ ఉండే ప్రతీవారి త్యాగాలు కనపడతాయి.అందుకే రాముని కద చిరస్థాయి గా నిలిచిపోయింది.తన సుఖాలు కన్నా ఇచ్చిన మాట,ప్రజా ధర్మం వీటికి విలువ నిచ్చాడు రామయ్య.
పర మతాల వారు చెప్పుకునే ప్రవక్తల కంటే ఏ విధం గా తక్కువాడు శ్రీ రాముడు?చంపేస్తారేమో అనే భయం తో పెళ్ళాన్ని చెల్లి అని పరులకు అప్పగించినవాడు ఒక ప్రవక్త అబ్రహాం.ఆయన దేవుని అత్యంత ఇష్టుడు. ఆరేళ్ళ పసిపిల్లను చిదిమేసినవాడు ఇంకొక ప్రవక్త మొహమ్మద్.తన సుఖాల కోసం చేయని అకృత్యం లేదు.ఈ మతాల వారా రాముని గురుంచి మాట్లాడేది?వీరు చెప్పే ప్రవక్తలలో ఏం గొప్ప లక్షణాలు ఉన్నాయో చెప్పమనండి?ఏం త్యాగాలు చేశారో చెప్పమనండి?నన్నడిగితే సాధారణ మానవుల కన్నా అవలక్షణాలు కొంచెం ఎక్కువే ఉన్నాయి ఈ ప్రవక్తలకు.మరి అలాంటి వారిని మొక్కే ఈ మతాల వారు రాముడి నా తిట్టేది?అసలు వీరికి ఆ అర్హత ఉందా??

No comments:

Post a Comment