Thursday, 23 November 2017

నుదుట బొట్టు ఎందుకు పెట్టుకొంటాము

🔥 *నుదుట బొట్టు ఎందుకు పెట్టుకొంటాము. ?* 🔥

🔴  *బొట్టు* అని వాడుకభాషలో   పిలిచే ఈ పదానికి శాస్త్రీయమైన పేరు *తిలకం*

🔴 నా వరకు అయితే ....తిలకం ధరించడం అంటే...నిజాయతీగా ఉండడానికి మరియు హిందుత్వానికి  అది ఒక చిహ్నం
అంతేకాదు ....!

🔴 నుదుటి  పైన బొట్టు - ధరించిన వారిలోనూ, ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది.  దైవ చిహ్నము గా గుర్తించ బడుతుంది. 

🔴 మునుపటి  కాలములో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు.  పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు.  క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించే వాడు.  వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు.   శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించెవాడు.

🔴 విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్నీ, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్నీ, దేవీ భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు.

🔴 భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుట పెట్టబడుతుంది.   జ్ఞాపక శక్తికి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశములో తిలకము పెడతాము.  యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞా చక్రముగా చెప్పబడుతుంది.  నేను భగవంతుని గుర్తున్చుకొండును గాక! ఈ భక్తీ భావన నా అన్ని కార్య కలాపాలలోనూ వ్యాపించుగాక! నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక! అనే ప్రార్ధనతో తిలకము పెట్టుకోబడుతుంది.  మనము ఈ ప్రార్ధనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మరచిపోయినా, ఇతరుల నుదుటి పైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్ధనను గుర్తుకు చేస్తుంది.   అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవ్రుత్తులనుంచి, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది.

🔴 మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము  విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది.  అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది.  తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది.  శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది.  కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది.  బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందీ లు అలంకార ప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు.

🔴 భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది.   మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది.కనుకనే తిలకం హిందూ మతంలో ఒక సంస్కృతి అయినది.

🔴 ఏదేశంలో ఉన్నా మన  సంస్కృతిని      మరువకుండా   ప్రతి స్త్రీ పురుషుడు తిలకంను తప్పకుండా ధరించినప్పుడే మన మతాన్నీ సంస్కృతిని గౌరవించినవారు అవుతారు.

🔴 నేటి ఆధునిక   మహిళలలో చాలా మంది  వివాహమయిన స్త్రీలు కూడా నుదుట తిలకమును ధరించడం మానేశారు.
బొట్టు పెట్టుకోవడం అనేది ఒక అనాగరికంగా , పెట్టుకోకపోవడం ఫాషన్ గా భావిస్తున్నారు.    కొంతమంది అయితే మోడరన్ దుస్తులు వేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకుంటే  అందంగా కనిపించము అనే భావనలో కూడా ఉన్నారు.

🔴 ఎంతోమంది విదేశీ మహిళలు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులు అవుతుంటే మనవాళ్ళు వదిలేస్తున్నారు

🔴 ఈ ఆర్టికల్ ద్వారా ఒక్కరిలోనైనా మార్పువస్తే నా ప్రయత్నం సఫలం అయినట్టే అని భావిస్తాను.

🔴 *ధర్మస్య విజయోస్తూ* 

No comments:

Post a Comment