Wednesday, 29 November 2017

గత సంవత్సరం గీతాజయంతి రోజున భగవద్గీత

గత సంవత్సరం గీతాజయంతి రోజున భగవద్గీత గురించి నేను రాసిన వ్యాసం:

లోకంలో మరే ఇతర గ్రంధాలకి లేని విశిష్టత ఒక్క ‘భగవద్గీత’ కు మాత్రమే ఉంది.

1) ఏమిటా విశిష్టత..?

అవతారమూర్తులు,మహర్షులు,మహానుభావులు జన్మించినప్పుడు వారివల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది.
ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞత గా వారి జన్మదినాన్ని ‘జయంతి’ గా జరుపుకుంటారు.
అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల ‘గీతాజయంతి’ ని జరుపుకుంటారు.
ప్రపంచం లో ఏ ఒక్క ఇతర గ్రంధానికి కూడా జయంతి లేదు.

2)ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం..?

సుమారు 5200 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుని మహానిర్వాణం సమీపిస్తున్న సమయంలో..
కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞనం తో ప్రవేశిస్తున్న తరుణంలో..
ఆ అజ్ఞనపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ..మానవజాతి పై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది.

3) ఏముంటుంది ఈ భగవద్గీత లో..?

ఏది తెలిస్తే మానవుడికి ఇంక మరేదీ తెలియాల్సిన అవసరం లేదో…
ఏది ఆత్మ, పరమాత్మ ల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో..
ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో..
అదే ఉంటుంది.

నూనె రాస్తే రోగాలు పోతాయి..దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు ఉండవు.
నన్ను నమ్మనివాన్ని చంపండి అనే ఉన్మాదం ఉండదు.
నన్ను దేవుడిగా ఒప్పుకోనివాన్ని నరకంలో వేసి కాలుస్తా అనే పైశాచికత్వం ఉండదు.

4) భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితం పై ఆసక్తి పోతుందా..?

భగవద్గీత విన్న అర్జునుడు అడవులకి పోలేదు..
గాంఢీవాన్ని ధరించి కదనక్షేత్రానికి వెళ్లాడు.
భగవద్గీత కర్తవ్య విముఖుడు ఐనవాడిని కర్తవ్యోన్ముఖుడిని చేస్తుంది.

5)భగవద్గీత శాస్త్రీయ గ్రంధమా..?

ప్రపంచం లో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీత ని కోట్ చేసినవాళ్ళే..
భగవద్గీత ని మొదటిసారి చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే..

6) ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీతే ప్రపంచం లో మొదటి స్థానం లో ఉండాలి కదా..
ఇతర మత గ్రంధాలు ముందు వరసలో ఉన్నాయని అంటున్నారు…?

కలియుగం లో అజ్ఞనానికి ఆదరణ ఎక్కువ ఉండటం సహజం.
విదేశీయుల్లా కత్తి పట్టుకుని,రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతని ప్రచారం చేయలేదు.

క్రైస్తవులు,మొహమ్మదీయులు మతవ్యాప్తి కోసం ప్రపంచం పై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విద్వంసం.. రక్తచరిత్రగా, సజీవ సాక్ష్యాలుగా ఇప్పటికీ నిలిచే ఉన్నాయి.
వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశం పై దాడులు చేసి, దురాక్రమణలు చేసి, ప్రలోభపెట్టినా చేయలేని పనిని..
ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీత ని ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్లమంది పాశ్చాత్యులని కృష్ణభక్తులుగా మార్చారు..

“ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగం తో పరుగులు తీస్తుందనడానికి ఇదే నిదర్శనం.”

కృష్ణం వందే జగద్గురుమ్..

భగవంతుడు_అనేవాడు_ఉన్నాడా

#భగవంతుడు_అనేవాడు_ఉన్నాడా? #ఉంటే_నిరూపించగలరా?

👉 ఈప్రశ్న నేటి కాలంలో మనకి ఎదురయ్యేదే!! ఎక్కడో ఎందుకు ఇక్కడే ఈ ప్రశ్న ఏదో ఒక రూపంలో ఎదురవుతూనే ఉంది.
  👉 ముఖ్యంగా ఈ ప్రశ్నలు కేవలం హిందువులో మాత్రమే ఎదురయితాయి!!  ఫెషన్ కూడా అయిపోయింది నేను దేవుడ్ని నమ్మను, నాస్తికుడ్ని అని చెప్పుకుంటారు...

👉 దీనికి సమాధానంగా ఒక "వేద పండితుడు" వివరణ:

అయ్యా!!! నీళ్లలో నిప్పు ఉన్నది, అసలు నీరే  నిప్పుగా ఉన్నది () మాకు వేదంలో ఉన్నది అని ఎవరైనా వేద పండితులు చెప్పారను కోండి, ఎవరూ నమ్మరు. నీళ్లలో నిప్పు వేస్తే ఆరిపోతుంది.
【అలాంటిది నీళ్లలో నిప్పు ఉండడమేమిటి? ఈయన ఎంత అమాయకుడో? ఇంకా ఇటువంటిఉపన్యాసాలు చెప్పి జనాలను నమ్మించాలని  చూస్తున్నారు అని మనసులోనేనవ్వుకుంటారు.】
 ఎందుకంటే చాలామందికి తెలిసి నీళ్ళలో నిప్పు అనేది
దాక్కొని ఉండడం అసంభవం. తమ నమ్మకం తప్పని అంత త్వరగా ఒప్పుకోడానికి ఎవరూ సిద్ధపడి లేరు.

అదే ఓ సైంటిస్టు అయ్యా  నీళ్లలో నిప్పు ఉన్నది అని చెప్పాడనుకోండి,
ఆశ్చర్య పోతారు. అయినా పూర్తిగానమ్మరు. ఏది ఎలాగ నిరూపణ చేయండి అంటారు. ఆయన చెప్తారు. నీటిని చేతితో తాకగలం, కంటితో చూడగలం. కానీ నీటిలో ఉండే నిప్పును తాకలేం, నేరుగా కంటితో చూడలేం. ఎందుకంటే దాని శక్తి అమోఘం.
 ఒక వస్తువుగుండా ప్రవహింపచేసినట్లేతే
కనుక దానిని అనేక పనులకు సాధనంగా ఉపయోగించవచ్చు. దీపంగా వాడుకోగలం, ఆ వెలుగును చూడగలం. భూమిలో నుండి నీటిని తోడగలం. అనేక పనులు చేయగలం. ఆ నీటిలో నుండి వెలికి వచ్చిన నిప్పునే మనం “విద్యుత్” అనిపిలుచుకుంటున్నాం...
ఇదంతా విని అవునౌను నిజమే నీటిలో విద్యుత్ శక్తి ఉంది. దానిని మనం వాడుకుంటున్నాం కదా!? అంటూ ఒప్పుకుంటారు.

【ఒక వేదపండితుడు చెప్పిన విషయాన్ని  నమ్మడానికి ఇష్టపడని మనం ఒక సైంటిష్టు చెప్పగానమ్ముతున్నాం. కారణం చాలా సమయా లలో మనం బుద్ధిని ఉపయోగించకపోవడమే!】

 #వేదపండితుడు - సైంటిష్టు ఇద్దరు ఒకే విషయాన్ని చెప్పారు. కానీ  వేదం అనగానే నేటి ఆధునికుల దృష్టిలో పెద్ద బూటకం. అది పాత చింతకాయ పచ్చడి వంటిది. ఎవరికీ పెద్ద ఆసక్తి ఉండదు. వేదం అంటే పూర్వకాలంలో కాలక్షేపానికి రాసుకున్న ఒక జీవన పద్ధతి. ఆ రోజులలో ప్రజలుబావిలో కప్పలు. వారికి ప్రపంచం తెలియదు. తమ చిన్న ప్రపంచంలోజీవించడానికి పెద్ద పనేమీ ఉండేది కాదు. అందుకే ఖాళీ ఎక్కువై రాసుకున్న గ్రంథాలు అవన్నీ. ఈ రోజులకు సరిపోవు. అయినా నిరూపణకు సరిపోని అంశాలు వేదంలో చాలా ఉన్నాయి. కనుక అవి అన్నీఅసమంజసమైనవే అనే వాదనలకు నిలువలేవు!! అని నేడుచాలామంది ఆధునికులయొక్క అభిప్రాయం...

చాలామంది గొర్రెలవలెనే ఆలోచించడానికి అలవాటుపడి నేటికీ అదే విధానంలోఉన్నారు. ఒక గొర్రె ఎటువెళితే వెనకాల గొర్రెలన్నీ అటే వెళతాయి. అలాగే నేటి కాలంలో పాప్ సాంగ్స్, ఫేస్ బుక్, వాట్సప్, సినిమాలు, డబ్బు మొ. వాటిలో కొట్టుకుపోతున్నారే కానీ మనమెటు వెళుతున్నాం అన్నది ఆలోచించడం లేదు. నూటికి ఎవరో ఒక్కరు మాత్రమే మనిషిలా తమ బుద్ధిని
ఉపయోగించగలరు. వారే నాయకులవుతున్నారు. మిగతావారు గొర్రెల వలె లోకాన్నిఅనుసరిస్తున్నారు.

కంటితో చూసినవి మాత్రమే నమ్ముతామంటే క్యారెట్ తింటే ఏ- విటమిన్ వస్తుంది అని డాక్టరు చెప్పినప్పుడు మీరు నమ్మకూడదు. కానీ నమ్ముతున్నారే!!   విద్యుత్ ను కంటితో చూడలేదు, చేతితో స్పర్శించ లేదు. కానీ విద్యుత్ అనేది ఉంది అని నమ్ముతున్నాము. విద్యుత్తు వలెనే భగవంతుడిని కూడా కంటితో చూడలేం, చేతితో స్పర్శించలేము.
   "ఎందుకంటే ఆయనను భరించ గలిగే శక్తి ఈ శరీరానికి లేదు. విద్యుత్ తగిలితే శరీరం ఎలా తట్టుకోలేదో అలాగే భగవంతుని స్పర్శనీ ఈశరీరం తట్టుకోలేదు."

 #ఒక పరిమితికి లోబడిన వస్తువులను మాత్రమే మనం కంటితోచూడగలం. ఆ పరిమితి కంటే తక్కువ ఉన్నా (అణువు),ఎక్కువ ఉన్నా (సూర్యుడు) మనం కంటితో చూడలేం. అలా చూడడానికి మనకి భూతద్దం వంటి ఓ సాధనం కావాలి. ఆలాగే
పరిమితికి లోబడిన శబ్దాలను మాత్రెమే మనం చెవులతో వినగలం. శబ్దం ఎక్కువ ఉన్నా వినలేం (చెవుడువస్తుంది), శబ్దం తక్కువ ఉన్నా మనకు వినబడదు. అంటే మనం చూడడానికి, వినడానికి, ముట్టుకోవాడనికి, వాసన చూడడానికి రుచి>చూడడానికి వీటన్నిటికీ పరిమితులు (Limitations) ఉన్నాయి.  "పాంచభౌతికమైన
మన శరీరమే పరిమిత మైనది అయినప్పుడు  అపరిమిత శక్తి కలిగిన భగవంతుని మనం ఈ శరీరంతో ఎలాచూడగలం, ఎలా మాట్లాడగలం?అలా చూడాలనుకోవడం మన అవివేకమే అవుతుంది."

విద్యుత్తును ఒక బల్బు ద్వారా ప్రసారం చేసి వెలుగుగా ఎలా
చూడగలుగుతున్నామో అలాగే మనసు అనే సాధనమునుఉపయోగించి మాత్రమే ఆ భగవంతుని దర్శించగలం.

【మనకు తెలియని విషయాలు అన్నీ అసత్యాలు కాదు. మన బుద్ధికి తెలియనంత మాత్రాన భగవంతుడు లేడనడం అవివేకం.】 జీర్ణప్రక్రియను మనకంటితో చూడలేము. కానీ ఎవరో ఒక సైంటిష్ట్ చెప్పాడని అది నమ్ముతున్నాం.
#మరి #మన పూర్వీకులు ఋషులు చెప్పిన విద్యను మాత్రం బూటకం అని కొట్టిపాడేయడం ఎంత వరకు సబబు?  【వేదం అంటే అది ఓ సైన్స్, ఋషులు సైంటిస్ట్ లు. వారు ఎంతో కఠోర శ్రమ చేసి సాధించిన ఫలాలను వేదం రూపంలో మనకు అందించారు. ప్రపంచం బట్టకట్టడం నేర్వక పూర్వమే ఇక్కడ మన వేదం-సైన్స్ లో ఎన్నో అద్భుతాలు చేసి చూపారు. వారు మనకు తెలిపిన పరమసత్యం ఒక్కటే!】

 #భగవంతుడనే వాడు ఉన్నాడు. ఎంత కష్టంలో ఉన్నా ఒక్కసారి #ఆర్తితో తండ్రీ రక్షించు అని పిలిస్తే నడి సముద్రంలో కూడా చేయందించికాపాడుతాడు.

Friday, 24 November 2017

రాణి పద్మిని

రాణి పద్మావతి యొక్క పరాక్రమ, యదార్ధ వాస్తవ చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం

భారతీయరాజుల ధర్మనీతిక, అనైక్యత్య కారణంగా విదేశీయుల పాక్షింకంగా విజయం సాధించారు.

సింహళ రాజ్య (శ్రీలంక ) రాజు సమ్మాన్ సింగ్ జి వారి కుమార్తె రాణి పద్మిని.
రాణి పద్మిణి ఒక వీర వణిత. ఆమె అందం వర్ణనాతీతం.
మహా యోధురాలు యుద్ధ నైపుణ్యరాలు.
ఆమెతో ఎవరైతే యుద్ధంలో గెలుస్తారో వారితో వివాహం చేసుకుంటాను అని వారి నాన్న గారి తో చెపుతుంది. స్వయంవరం లో ఎంతో మంది రాజులతో యుద్ధం చేసింది కానీ ఆమె ను ఎవరు ఓడించలేదు.
చివరకు రాణ రతన్ సింగ్ సమ వుజ్జిగా ఆమెతో నిలవడం తో వారి వివాహం జరిగింది.
మేవార్ రాజ్యం ను రాణా రతన్ సింగ్ పాలిం చేవాడు.
మేవార్ యొక్క కోట 7 వ శతాబ్దంలో నిర్మించిన శత్రు దుర్బేధ్యమైన రక్షణ కోట.
700 ఎకరాల ఈ కోటను భయంకరమైన దాడుల మరియు సుడిగాలులల నుండి కాపాడుట కోసం దృడంగా నిర్మించారు.

విదేశీ దురాక్రమణదారుడైన, అల్లాఉద్దీన్ ఖిల్జీ…

తన తండ్రి మరియు మామయ్య జలాల్-ఉద్-దిన్ ఖిల్జీని హతమార్చి ఢిల్లీ పీఠం ను ఆక్రమించిన కీచకుడు.
ఎందరో ధన మాన ప్రాణాలను హరించిన రాక్షసుడు. నవయువకులను సైతం లైంగిక బానిసలుగా మార్చుకున్నాడు అంటే వీడి చరిత్ర ఎంతటి దుర్మార్గమైనదో తెలుస్తుంది.
చారిత్రాత్మక ఆధారాల ప్రకారం, తన నివాసంలో అనేక వేల మంది నవ యువకులను అతని వద్ద ఉంచుకున్నాడు.
మాలిక్ కఫూర్ అనే ఒక అందమైన నపుంసకుడు ఉండేవాడు. గుజరాత్ దండయాత్ర సందర్భంగా ఖిల్జీ 1000 దీనార్లు చెల్లించి మాలిక్ కఫూర్ను కొనుగోలు చేశాడు. ఖిల్జీ యొక్క బలహీనతను సానుకూలంగా తీసుకొని, కఫూర్ ముఖ్య సలదారుగా అధికారం చెలాయించేవాడు. పూర్తి ప్రయోజనాన్ని పొందేవాడు. తన పుస్తకం తారిఖ్ -ఇ ఫిరుజ్ షాహిలో అళుద్దిన్ ఖిల్జీ మరియు మాలిక్ కఫూర్ల మధ్య శృంగార సంబంధం గురించి చరిత్రకారుడు "జియాదుద్దీన్ బరనీ" ప్రస్తావించారు. సూక్ష్మంగా ఇదీ ఖిల్జీ కధ.

రాణి పద్మావతి అందాల గురించి ఖిల్జీ చాలా విన్నాడు. ఆమె తన భార్య గా చే సుకోవాలని కోరుకున్నాడు. జనవరి 1303 లో అతను చితౌడ్ కోట సమీపంలో లక్షల భారీ సైన్యంతో కవాతు చేసాడు.
కోట చుట్టూ బలమైన రక్షణ ఏర్పాటు చూసి తన ఆత్మ స్థైర్యం సన్నగిలింది.
ఖిల్జీ సైన్యం యొక్క బలాన్ని గుర్తించిన రాణా రతన్ సింగ్, యుద్ధాన్ని ఎలా నివారించాలో ఆలోచిస్తున్నాడు.
ఈ లోపల ఖిల్జీ పన్నాగం పన్నాడు.

ఒకసారి రాణి పద్మిని చూసి నేను (ఖిల్జీ) సైన్యంతో ఢిల్లీకి తిరిగి వెల్తానని, చితౌడ్ కోటకు అనుమతించినట్లయితే అని ఒక దూతను పంపించాడు.

రాణి పద్మావతి ఆలోచన చేసింది. ఖిల్జీ తన రూపం ను ప్రతిబింబంలో ( అద్దంలో ) మాత్రమే చూడగలిగిన ఒక నిబంధన ను పెట్టిఅంగీకరించింది.

ఖిల్జీ ఆమె నిబంధనను ఒప్పుకున్నాడు. అతను తన విశ్వసనీయ సైన్యాధికారులతో వచ్చాడు. మహా అందమైన పద్మావతి యొక్క ప్రతిబింబం చూస్తూ, ఖిల్జీ నిశ్చేష్టుడయ్యాడు. ఆమెని ఎలాగైనా పొందాలని కోరిక ను
బలంగా పెంచుకున్నాడు.

రతన్ సింగ్ అతన్ని కోట యొక్క గేటు వరకు మర్యాదకు పూర్వకంగా వెళ్ళాడు ఖిల్జీ తన శిబిరానికి క్షేమంగా వెళ్ళాడు. కాని ఇక్కడ ధర్మనీతి చుడండి. అయితే ఈ సమయంలోనే ఖిల్జీ కపటంగా, మోసంగా, అధర్మంగా రతన్ సింగ్ ను ఖైదీగా చేసాడు. మరియు అతని శిబిరంలో ఖైదుగా బందించాడు. రాజుకు బదులుగా రాణి పద్మావతిని పంపించాలని ఆజ్ఞాపించాడు చితౌడ్ కోటకు ఒక సందేశం పంపాడు. యుద్ధ నీతి తెలిసిన, ధైర్యవంతురాలైన చమత్కారమైన పద్మావతి ఒక ప్రణాళికను రూపొందించింది.
ఆమె ఖిల్జీ కి ఒక వర్తమానం పంపారు, ఉదయం ఆమె శిబిరానికి పల్లకిలో వస్తాను అని కబురు పంపించింది. రాణి ఉదయం ఖిల్జీ యొక్క శిబిరానికి ఆయుధాలతో సహా పలువురు సైనికులతో పాటుగా గోర మరియు బాదల్ అను ఇద్దరు ప్రముఖ సైన్యాధికారుల తో బయలు దేరింది .(80 ఏళ్ల గోర ,బాదల్, మరియు జలాల చౌహాన్ వంశీయుడికి చెందిన చచా-భాటియా ఈ సమూహంలో  ఉన్నారు. రాజస్థాన్ చరిత్రలో, వారి పేర్లు స్వర్ణ అక్షరాలలో రాయబడ్డాయి. పండిట్ నరేంద్ర మిశ్రా ఒక పద్యం ద్వారా గోర మరియు బాదల్ కు అద్భుతమైన నివాళి అర్పించారు)

సైనికులు మహిళల మారువేషంలో, కొన్ని పల్లకిలలోకూర్చుని మిగిలిన 200పల్లకిలలో బోయవారు పాత్రలో వెళ్లటం జరిగింది. ఈ శిబిరాన్ని చేరుకున్నప్పుడు, గోర స్వయంగా రతన్ సింగ్ గుడారానికి వెళ్లారు మరియు ఖిల్జీ సైన్యాన్ని నివారించటానికి మరియు రాజుని రక్షించడానికి బాదల్ ను కోరాడు.

ఖిల్జీ యొక్క గుడారం వద్ద గోర పల్లకిల డోరాల ను తొలగించారు. గోరా ఖిల్జీ చంపడానికి వెళ్ళాడు, కానీ విఫలమయ్యాడు. ఖిల్జీ ఒక పిరికిపందలా ఆడవాళ్ళ వెనుక దాక్కున్నాడు. భారతీయ యోధులు ఎప్పుడూ మహిళలపై దాడి చేయరు.(ఇక్కడ ధర్మనీతి చుడండి) ఖిల్జీ తప్పించుకున్నాడు. ఇంతలో, ఖిల్జీ సైన్యం అక్కడికి చేరుకుంది మరియు భీకర పోరాటం ప్రారంభమైంది. రాణ రతన్ సింగ్ రక్తపు మడుగులో ఉన్నాడు. రణ రతన్ సింగ్ ను రక్షించారు. గోర మరియు బాదల్ మరియు దాదాపు అంత రాణ సైన్యం వారి జీవితాలను త్యాగం చేశారు. చితౌడ్ కోటకు కొద్ది మంది సైన్యం తో చేరుకున్నారు.
ఖిల్జీ మరింత రెచ్చిపోయాడు
ఖిల్జీ అన్ని వైపులా చితౌడ్ కోటను ముట్టడి చేశాడు. అన్ని గేట్లు మూసివేయబడ్డాయి. ఇది ఆగస్టు వరకు కొనసాగింది (జనవరిలో ప్రారంభమైంది). నిల్వ చేయబడిన ఆహార పదార్థాలు పూర్తిగా క్షీణించబడ్డాయి. ఆగష్టు 26 న, 1303, రతన్ సింగ్ తన సైన్యంతో, కాషాయ తలపాగాలను ధరించి, శత్రువులపై ఆత్మ ఆహుతి దాడి చేసాడు. వారి లక్ష్యం కోటను రక్షించడం లేదా చనిపోవడం. తరువాత జరిగిన యుద్ధంలో, వారు అందరు వీర మరణం పొందారు.
"రాణి పద్మావతి" యొక్క ఉత్తర్వుల ప్రకారం కోటలో భారీ చితి ని ఏర్పాటు చేసింది. రాణి పద్మావతి మరియు ఆమె సహచరులు, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడటానికి, క్రూరమైన శత్రువుల చేతుల్లో అగౌరవంగా ఉండకుండా, జౌహర్ ను (సతి సహగమనం చేసుకున్నారు) ప్రదర్శిస్తూ, చితిలోకి ప్రవేశించారు. దాదాపు 30,000 వేల మంది రాజ్ పుత్ మహిళలు మంటల్లో మరణించారు.
ఖిల్జీ మరియు అతని దళాలు ఈ కోటలోకి ప్రవేశించాయి, ధైర్యంగల రాజపుత్రికల మృతదేహాలు యొక్క బూడిదతో మాత్రమేఎదుర్కోవలసి వచ్చింది. జౌహర్( సతి సహగమనం చేసుకున్నారు) ప్రదర్శన, వారు మరణించారు కానీ వారికి చరిత్ర మరియు జానపదాలలో అమరత్వం ఉంది. ఇది చరిత్ర. స్వాభిమాన దేశభక్త భారతీయునికి ఆంగ్లేయ బుద్దిజీవులకు మధ్య పోరాటమే పద్మావతి సినిమా. అయితే నిజాన్ని నిజంలా కాకుండా జాతిని, చరిత్రను అవమానపరిస్తే అది క్షమించరాని నేరం.
రాజ్ పుత్ వంశీయులు సినిమా పట్ల తమ నిరసనను గట్టిగా వినిపిస్తున్న తరుణంలో సినిమాలో పద్మావతి చరిత్రను వక్రీకరించడం లేదని తెలుపటానికి వారిరి ఒక ప్రివ్యూ షో వేసి వివాదాన్ని సరిచేయొచ్చు.
"ఏ దేశమేగినా ఎందు కాలడిన పొగడరా ని తల్లి భూమి భారతి నిలపర ని జాతి నిండు గౌరవం" అనే మాటను మరువకుండా డైరక్టర్ లు తమ సినిమాలు తీయాలి.
#SwamiParipoornanandaPatriotism
#RaniPadmavathiRealStory

Thursday, 23 November 2017

నుదుట బొట్టు ఎందుకు పెట్టుకొంటాము

🔥 *నుదుట బొట్టు ఎందుకు పెట్టుకొంటాము. ?* 🔥

🔴  *బొట్టు* అని వాడుకభాషలో   పిలిచే ఈ పదానికి శాస్త్రీయమైన పేరు *తిలకం*

🔴 నా వరకు అయితే ....తిలకం ధరించడం అంటే...నిజాయతీగా ఉండడానికి మరియు హిందుత్వానికి  అది ఒక చిహ్నం
అంతేకాదు ....!

🔴 నుదుటి  పైన బొట్టు - ధరించిన వారిలోనూ, ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది.  దైవ చిహ్నము గా గుర్తించ బడుతుంది. 

🔴 మునుపటి  కాలములో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు.  పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు.  క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించే వాడు.  వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు.   శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించెవాడు.

🔴 విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్నీ, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్నీ, దేవీ భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు.

🔴 భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుట పెట్టబడుతుంది.   జ్ఞాపక శక్తికి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశములో తిలకము పెడతాము.  యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞా చక్రముగా చెప్పబడుతుంది.  నేను భగవంతుని గుర్తున్చుకొండును గాక! ఈ భక్తీ భావన నా అన్ని కార్య కలాపాలలోనూ వ్యాపించుగాక! నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక! అనే ప్రార్ధనతో తిలకము పెట్టుకోబడుతుంది.  మనము ఈ ప్రార్ధనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మరచిపోయినా, ఇతరుల నుదుటి పైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్ధనను గుర్తుకు చేస్తుంది.   అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవ్రుత్తులనుంచి, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది.

🔴 మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము  విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది.  అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది.  తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది.  శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది.  కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది.  బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందీ లు అలంకార ప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు.

🔴 భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది.   మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది.కనుకనే తిలకం హిందూ మతంలో ఒక సంస్కృతి అయినది.

🔴 ఏదేశంలో ఉన్నా మన  సంస్కృతిని      మరువకుండా   ప్రతి స్త్రీ పురుషుడు తిలకంను తప్పకుండా ధరించినప్పుడే మన మతాన్నీ సంస్కృతిని గౌరవించినవారు అవుతారు.

🔴 నేటి ఆధునిక   మహిళలలో చాలా మంది  వివాహమయిన స్త్రీలు కూడా నుదుట తిలకమును ధరించడం మానేశారు.
బొట్టు పెట్టుకోవడం అనేది ఒక అనాగరికంగా , పెట్టుకోకపోవడం ఫాషన్ గా భావిస్తున్నారు.    కొంతమంది అయితే మోడరన్ దుస్తులు వేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకుంటే  అందంగా కనిపించము అనే భావనలో కూడా ఉన్నారు.

🔴 ఎంతోమంది విదేశీ మహిళలు భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులు అవుతుంటే మనవాళ్ళు వదిలేస్తున్నారు

🔴 ఈ ఆర్టికల్ ద్వారా ఒక్కరిలోనైనా మార్పువస్తే నా ప్రయత్నం సఫలం అయినట్టే అని భావిస్తాను.

🔴 *ధర్మస్య విజయోస్తూ* 

అరుంధతి నక్షత్రం

*అరుంధతి నక్షత్రం:*

అరుంధతి జన్మవృత్తాంతం శివపురాణంలోనూ, భాగవత పురాణంలోనూ కనిపిస్తుంది.

అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసతి
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం

అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది – ఈ అయిదుగురు స్త్రీలు సదా వందనీయులని పై శ్లోకానికి అర్థం.

అరుంధతి జన్మవృత్తాంతాన్ని సూత మహర్షి శౌనకాది మహర్షి గణాలకు ఇలా వివరించాడు.

ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత రూపవతియైన కన్యను, వర్ణింపనలవికాని సుందరాకారుడిని సృష్టించాడు. ఆ కన్యపేరు సంధ్యా. ఆ యువకుని పేరు మన్మథుడు. సృష్టికార్యంలో తనకు సహాయపడమని ఆ యువకుడికి చెబుతూ బ్రహ్మ అతడికి

అరవింద మశోకంచ చూతంచ నవమల్లికా
నీలోత్పలంచ పంచైతే పంచబాణాశ్చసాయకా

అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలమనే అయిదు బాణాలను ఇచ్చాడు.

మన్మథుడు బాణ శక్తిని పరీక్షింపదలచి వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టాడు. అప్పుడు బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ సంధ్యాను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి ఈశ్వరుడిని ప్రార్థించగా, ఈశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, పరిస్థితిని చక్కదిద్దాడు.

రెప్పపాటు కాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపంతో ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని మన్మథుడికి శాపం ఇచ్చాడు. తన వల్ల ఇంతమంది నిగ్రహం కోల్పోయారని సంధ్య చంద్రభాగా నదీ తీరంలో తపస్సు పేరిట తనువు చాలించేందుకు పయనమైపోయింది. అప్పుడు బ్రహ్మ వశిష్ట మహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించాలిందిగా కోరాడు.

వశిష్టుడు ఆమెకు శివా మంత్రానుష్టానం వివరించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. సంధ్య తదేక నిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మన్నాడు.

‘ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాద’నే వరాన్ని ఆమె కోరుకుంది. శివుడు ఆమెను మరొక వరాన్ని కూడా కోరుకోమన్నాడు. అపుడు సంధ్య ‘నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృష్టితో చూచినట్లయితే వారు పుంసత్వాన్ని కోల్పోవాలనీ, అంతేకాక, తాను పుట్టగానే అనేకమందికి కామ వికారం కలిగించాను కనుక ఈ దేహం నశించిపోవాల’ని కోరుకుంది. శివుడు తథాస్తు అంటూ, ‘మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యరాలివై శరీరాన్ని దగ్ధం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండంనుంచి నీవు జన్మిస్తావు.

నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో అతడే నీ భర్త అవుతాడ’ని చెప్పి అంతర్థానమయ్యాడు. శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్త వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండంనుంచి తిరిగి జన్మించింది.

సంస్కృత భాషలో ‘అరుం’ అంటే అగ్ని, తేజము, బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ’ అంటే ధరించినదనే అర్థం ఉంది. అగ్నినుంచి తిరిగి పుట్టింది కనుక ఆమె ‘అరుంధతి’ అయింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి, వశిష్టునికి ఇచ్చి వివాహం చేశాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వల్ల త్రిలోకపూజ్యురాలైంది.

అరుంధతి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని, మహా పతివ్రత అని ఆకాశం వంక పెళ్ళి సమయంలో చూపించి చెబుతా రు బ్రాహ్మణులు. అలా చేస్తే మీ సంసారిక జీవనం నల్లేరు మీద నడకలా సాగుతుందని పండితులు వధూవరుల కు చెబుతారు. మాఘ మాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రవేళ కానరాదు.

రాత్రి పూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతంది. అరుంధతి నక్షత్రం నుంచి వచ్చే కిరణాల వల్ల కంటి శక్తి మరింత పెరుగుతుంది. అరుంధతి నక్షత్రం సప్తర్షిమండలంలో వుండే చిన్న నక్షత్రం. శిశిర, వసంత, గ్రీష్మఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారు జామున కనిపిస్తుంది.

అరుంధతి నక్షత్రాన్ని చూడాలనుకుంటే జాగ్రత్తగా ఆకాశం వంక చూడండి.? మార్కు ఆకారంలో నక్షత్రాలు ఉంటాయి. ఖచ్చితంగా కాకపోయినా దాదాపుగా ఆ ఆకారంలో ఉంటుంది. చిన్నపిల్లాడిని? మార్కు గీయమంటే ఎలా గీస్తాడో అలా ఉండే సప్తర్షి మండలంలో పక్కపక్కనే ఉండే నక్షత్రాలే అరుంధతి, వశిష్ఠులవారివి. అరుంధతి నక్షత్రం చిన్నగా ఉంటుంది.

Wednesday, 22 November 2017

మహారాణా ప్రతాప రాథోడ్

ఇలాంటి ఒక చరిత్ర మనం ఎన్ని సార్లు తెలుసుకున్నా తనివితీరదు
వీరుడుమహారాణా ప్రతాప రాథోడ్ గాధ… !
గిరిజనుల చరిత్ర

మహా రాణా ప్రతాప్ గురించి మనకెంతవరకు తెలుసు. ఒక్క సారి చదవండి.
ప్రపంచంలోని చిన్న దేశాలలో వియత్నాం ఒకటి.
విచిత్రంగా ప్రపంచంలోనే అత్యంత బలశాలి అయిన అమెరికా మెడలు వంచింది ఈ చిన్ని దేశం.
ఈ రెండు దేశాల నడుమ కనీసం 20 సంవత్సరాలు సాగిన యుద్దంలో ఆఖరికి అమెరికాని ఓడించింది వియత్నాం. అమెరికా మీద విజయం తరువాత వియత్నాం అద్యక్షుడిని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు.
విలేకరి: ఇప్పటికీ అర్ధం కాని విషయమేమిటంటే, అమెరికాని ఓడించి యుద్దంలో ఎలా గెలవగలిగారు.?
విలేకరి అడిగిన ఆ ప్రశ్నకి వియత్నాం అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం…
అన్ని దేశాలలోకెల్ల అత్యంత శక్తివంతం అయిన అమెరికాని ఓడించడానికి నేను మహామహుడు, శ్రేష్టుడు అయిన గొప్ప దేశభక్తిగల ఒక భారతీయ రాజు చరిత్రను చదివాను. అతని వీరోచితగాథల నుండి, అతని జీవితం నుండి ప్రేరణ పొంది యుద్దనీతి, ఇతరత్రా ప్రయోగాలతో మేము యుద్దంలో గెలిచాము.
విలేకరి అడిగాడు: ఎవరా భారతీయ మహారాజు?
విలేఖరి ఇలా అడగగానే వియత్నాం అద్యక్షుడు వెంటనే నిలబడి గర్వంతో ఇలా సమాధానం చెప్పాడు.
అతడే… రాజస్తాన్లోని మేవాడ్ మహారాజు రాణా ప్రతాప్ సింహ్
మహారణా ప్రతాప్ సింహ్ పేరు చెప్పేటప్పుడు అతని కళ్ళు వీరత్వంతో వెలిగిపోయాయి.
అంతే కాదు అతను ఇంకా ఇలా అన్నాడు
“ఒకవేళ అలాంటి రాజు మా దేశంలో జన్మించి ఉంటే మేము ఈ ప్రపంచాన్నే జయించేవారం.”
అని.
కొన్ని రోజుల తరువాత వియత్నాం అధ్యక్షుడు చనిపోయాడు.
అయితే అతని సమాధి మీద ఇలా వ్రాసారు “ఇది మహారణా ప్రతాప్ యొక్క శిష్యుని సమాధి” అని.
కాల క్రమేణా కొద్ది సంవత్సరాల తర్వాత వియత్నాం విదేశాంగమంత్రి భారత పర్యటనకి వచ్చాడు. మహామహులకు శ్రద్ధాంజలి ఘటించడానికి మొదట గాంధీ సమాధి అతనికి చూపించారు. ఆ తరువాత ఎర్రకోట, ఇంకా ఇంకా ఇలా చూపిస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూపించేటప్పుడు ఆ విదేశాంగమంత్రి ఇలా అన్నాడు “ మహారణా ప్రతాప్ సమాధి ఎక్కడ?”.
అప్పుడు ఇవన్నీ చూపిస్తున్న భారత అధికారి అతని ప్రశ్నకి ఆశ్చర్యపోయి ఉదయపూర్లో ఉన్నదని చెప్పాడు. విదేశాంగమంత్రి అక్కడనుండి ఉదయ్ పూర్ వెళ్ళి సమాధిని దర్శించి అక్కడనుండి పిడికెడు మట్టిని తీసుకొని అతని బ్యాగ్ లో పెట్టుకున్నాడు. ఇది చూసిన భారత అధికారి మట్టిని బ్యాగ్ లో పెట్టుకోవడానికి కారణం అడిగాడు….” ఇదే మట్టి దేశభక్తులైన వీరపుత్రులను కన్నది, ఈ మట్టిని తీసుకెళ్లి మాదేశం మట్టిలో కలుపుతా. మా దేశంలో కూడా ఇలాంటి రాజు ప్రేరణతో దేశభక్తులు జన్మిస్తారు. మహారణా ఈ దేశమే కాదు ప్రపంచమే గర్వించదగ్గ రాజు” అని అన్నాడు
మహారణా ప్రతాప్ సింహ్ గురించి మరి కొన్ని వివరాలు..
అతని పూర్తి పేరు..-కుంవర్ ప్రతాప్ జి(శ్రీ మహారాణా ప్రతాప్ సింహ్)
జన్మదినం-9 మే,1540
జన్మభూమి-రాజస్థాన్ కుంబల్ ఘడ్
పుణ్యతిది-29 జనవరి,1597
తండ్రి – మహారాణా ఉదయ్ సింహ్ జి
తల్లి-రాణి జీవత్ కాంవర్ జి
రాజ్య సీమా-మేవాడ్
శాశన కాలం -1568-1597(29 సంవత్సరాలు)
వంశం –సూర్యవంశం
రాజవంశం-సిసోడియ రాజపుత్రులు
ధార్మికం-హిందూధర్మం
ప్రసిద్ధ యుద్దం- హల్ది ఘాట్ యుద్దం
రాజధాని-ఉదయ్ పూర్
శ్రీ మహారణా ప్రతాప్ దగ్గర అతనికి అత్యంత ఇష్టమైన గుర్రం ఉండేది. దాని పేరు “చేతక్”.
అబ్రహం లింకన్ భారతపర్యటన నిమిత్తం భారత్ కి రావాల్సి ఉంది. అతను భారత్ కి బయలుదేరుతూ తన తల్లిని భారత్ నుండి ఏమి తీసుకొనిరావాలి అని అడిగాడట. దానికి అతని తల్లి “రాజస్థాన్లోని మేవాడ్ నుండి పిడికెడు మట్టి తీసుకొనిరా , అక్కడి రాజు ఎంత విశ్వాస పాత్రుడుగా ఉండేవాడు అంటే సగం భారత్ ను ఇస్తా అని ప్రలోభ పెట్టినా తన రాజ్య సుఖ శాంతి ప్రయోజనాలనే కోరుకొని తన మాతృభూమినే కోరుకున్నాడు” అని చెప్పిందట. కానీ కొన్ని కారణాల రీత్యా అతని పర్యటన రద్దు అయింది. ఈ విషయాలు “బుక్ ఆఫ్ ప్రెసిడెంట్ యు ఎస్ ఏ” లో చదువవచ్చు.
మహారణా ప్రతాప సింహ్ యొక్క ఈటె 80 కిలోలు బరువు ఉంటుంది. చేతి కవచం, శరీర కవచం కలిసి మరొక 80 కిలోలు ఉంటాయి. అతని చేతిలోని కత్తితో కలిపి మొత్తం 207 కిలోలు ఉంటాయి. ఇప్పటికీ ఇవన్నీ ఉదయ్ పూర్ రాజవంశస్తుల సంగ్రహణాలయంలో ఉన్నాయి.
డిల్లీ బాద్షాహ్ అయినటువంటి అక్బర్ మహా రాణా ప్రతాప్ ని ఒకసారి తల దించి నా కాళ్ళ మీద పడితే సగం హిందూస్థాన్ కి రాజుని చేస్తా  అని ప్రలోభపెట్టాడు. కానీ మహారణా ప్రతాప్ దాన్ని తుచ్ఛమైనదిగా భావించి తిరస్కరించాడు..
హల్దిఘాట్ యుద్దంలో మేవాడ్ సైన్యం 20000 సైనికులతో ఉంటే అక్బర్ సైన్యం 85000 సైనికులతో సమీకరించబడాయి
మహారాణా ప్రతాప్ ఇష్టమైన గుర్రంకి తన త్యాగానికి గుర్తుగా ఒక గుడిని కూడా కట్టారు , ఆ గుడి ఇప్పటికీ సురక్షితంగా ఉంది.
మహారాణా యుద్దంలో తన అభేద్యమైన దుర్గం లను వదులుకున్నప్పటినుండి కంసాలి వాళ్ళు వేల సంఖ్యలో వాళ్ల వాళ్ళ ఇళ్లను వదిలి రాణా కోసం ఆయుధాలు తయారు చేసేవారు. వాళ్ల దేశ భక్తికి నా తల వంచి ప్రణమిల్లుతున్నాను.
హల్ది ఘాట్ యుద్దం జరిగి 300 సంవత్సరాల తరువాత కూడా అక్కడి నేలలో కత్తులు లభించాయి. చివరి సారిగా 1985 లో ఒక ఆయుదం దొరికింది.
మహారణా ప్రతాప్ సింహ్ దగ్గర యుద్ద శిక్షణ శ్రీ జైమల్ మేడతీయ ఇచ్చేవాడు. 8000 మంది రాజపుత్ర వీరులతో కలిసి 60000 మంది మొఘలులతో యుద్దం చేశారు. ఆ ఆయుద్దంలో 48000 మంది చనిపోయారు. ఇందులో 8000 మంది రాజపుత్రులు 40000 మంది మొఘలులు
మహారాణా ప్రతాప్ సింహ్ చనిపోయాక అక్బర్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడట.
హల్ది ఘాట్ యుద్దంలో మేవాడ్ భీల్ అనే ఆదివాసీలు వారి యొక్క అభేద్యమైన బాణాలతో మొఘలులతో పోరాడారు.  వాళ్ళు మహారాణాను వారి పుత్రుడిగా భావించేవారు. మహారాణా కూడా వారిపట్ల భేదభావం చూపించేవారు కాదు. ఇప్పటికీ మేవాడ్ రాజచిహ్నం లో ఒకపక్క రాజపుత్ మరొక పక్క భీల్ ఉంటారు.
రాణా గుర్రం అయిన చేతక్ మహారాణాను 26 అడుగుల కందకం మీద నుంచి దూకి అది దాటిన తరువాత చనిపోయింది. అంతకంటే ముందే దానికి ముందు కాలు విరిగి ఉన్నప్పటికి ఆ కందకాన్ని దుమికింది. అది ఎక్కడైతే చనిపోయిందో అక్కడే ఒక చింత చెట్టు పెరిగింది. అదే ప్రదేశంలో దాని గౌరవార్దం చేతక్ మందిరం కట్టారు.
చేతక్ ఎంత బలమైనదంటే తన ఎదుట ఏనుగుమీద ఉన్న సైనికుణ్ణి అందుకోవటానికి అంత ఎత్తులో గాలిలో ఎగిరేది. అది కూడా మహారాణాతో పాటుగా
మహారాణా చనిపోవడానికి ముందు తాను కోల్పోయిన వాటిలో 85% తిరిగి గెల్చుకున్నాడు.
శ్రీ మహారాణా ప్రతాప్ యొక్క బరువు 110 కిలోలు మరియు అతని పొడవు 7’5’’. ఇరువైపుల పదును ఉన్నటువంటి కత్తి, 80 కిలోల ఈటె తన వద్ద ఉంచుకునే వాడు.
మహారణా ప్రతాప్ కు గుర్రం మాత్రమే కాదు అతనికి ఒక ఏనుగు కూడా ఉండేది. దాని పేరు రాంప్రసాద్.
అల్ బదౌని అనే రచయిత రాంప్రసాద్ ఏనుగు గురించి తన గ్రంధంలో రాసుకున్నాడు.
అక్బర్ బాద్షాహ్ మేవాడ్ మీద యుద్దం చేసేటప్పుడు తన సైన్యానికి ఏమని ఆదేశించాడంటే… మహారాణా ప్రతాప్ తో పాటుగా రాంప్రసాద్ ఏనుగుని కూడా బందీగా పట్టుకుంటే సరిపోద్ది అని చెప్పాడట.
రాంప్రసాద్ ఎంత బలం కలిగినదంటే ఒక్కత్తే మొఘలుల 13 ఏనుగులని చంపిందట. అలాగే దాన్ని పట్టుకోవడానికి 7 పెద్ద ఏనుగులమీద 14 మంది నైపుణ్యం కలిగిన మావటిలు కూర్చుని ఒక చక్రవ్యూహం ప్రకారంగా దాన్ని బందీ చేశారట ఈ విషయాన్ని బదౌని తన రచనల్లో పేర్కొన్నాడు.
బందీని చేసిన రాంప్రసాద్ ని అక్బర్ ముందు నిలబెట్టగ దానికి పీర్ ప్రసాద్ అని నామకరణం చేశాడు. ఆ ఏనుగు ఎంత స్వామి భక్తి కలదంటే 18 రోజులవరకు దాణా తినకుండా, నీళ్ళు తాగకుండా తన ప్రాణాలు కోల్పోయింది. తరువాత ఈ దృశ్యాన్ని చూసిన అక్బర్  ఈ ఏనుగుని వంచ లేకపోయాను మహారాణాను ఎలా వంచగలుగుతాను… అని అన్నాడట.
మన దేశంలో ఇలాంటి దేశభక్తుల్లో చేతక్,రాంప్రసాద్ లాంటి జంతువులు కూడా ఉన్నాయి.
ఇలా చెప్పుకుంటూ పోతే మహారాణా ప్రతాప్ చరిత్ర ఒక ఉత్తేజాన్ని అందించే అసలు సిసలైన వీర గాధ
మన భరతమాత గడ్డపై వీరులెందరో వారి చరిత్ర తెలుసుకోవడమే కాదు అంతే త్యాగ నిరతితో మనమూ మన జీవనాన్ని సాగించాలి అనే విషయాన్ని గుర్తించుకో

✍🏻 *thefirstfourpeople.org*

Monday, 20 November 2017

ఝాన్సీ లక్ష్మీబాయి

ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19, 1828 ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్యసంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డు వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారతదేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.[1]లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది[2]. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తతతీసుకున్నారు. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణించాడుఆక్రమణసవరించు

వివాహం తరువాత ఆమె పేరు లక్ష్మిబాయిగా మార్చబడింది. సభలో ఆమె తండ్రికున్న ప్రాభల్యం వలన, మిగిలినిన యువతులు, ఎవరైతే జెనన కి నిర్బంధం చేయబడి ఉంటారో, వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఈమెకు వుండేది.ఆమె సాయుధ దళం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది, అంతే కాకుండా తన స్నేహితురాల్లందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారుచేసిందిyyyy.

1851 లో రాణి లక్ష్మిబాయి తన కుమారుడికి జన్మనిచ్చింది, కాని అతను తన నాలుగు నెలల వయస్సులోనే చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయిన తరువాత, ఝాన్సీ యొక్క రాజు మరియు రాణి దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకొన్నారు. కాని రాజు అయిన ఆమె భర్త తన కుమారుడి మరణం నుంచి తేరుకోలేక, 1853 నవంబర్ 21 లో పగిలిన హృదయముతో చాలా బాధ పడుతూ చనిపోయాడని చెప్పబడింది. వీరు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదర్ రావు రాజా కు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున, ఈస్ట్ ఇండియా కంపనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డెల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది

గొప్ప తిరుగుబాటుసవరించు

రాణి ఝాన్సీ ని ఇవ్వకూడదని నిశ్చయించుకొన్నది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి మరియు తమకు తాముగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సేనను తయారుచేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడింది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భు బక్షి, మోతీ బాయి, సుందర్-ముందర్, ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్రాణి బలగంలో ఉన్నారు

ఝాన్సీలో ఇవన్నీ జరుగుతున్నపుడు, మే 10,1857లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసినా కాని,వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి,ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంప బడిన వాళ్ళలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొన్నారు.

ఇంతలో, మే 1857,లో భారతదేశంలో కలవరం ప్రాకడం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంమొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో,బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించవలసినదిగా నిర్భందం రావడంతో,ఝాన్సీ ని లక్ష్మిబాయి పరిపాలించవలసిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ తన సమర్థత కారణం వలన లక్ష్మిబాయి మధ్య కాలంలో వచ్చిన సామ్రాట్ల కలవర సమయములో కూడా ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

అప్పటి వరకు, బ్రిటిష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సంశయించిన కాని,జూన్ 8 1857 జోఖన్ బాఘ్ లో బ్రిటిష్ HEICఅధికారుల, వాళ్ళ భార్య, పిల్లల "జన సంహారం"లో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదము గానే నిలిచిపోయింది.చివరికి మార్చి 23 1858 లో బ్రిటిష్ బలగాలు సర్ హుఘ్ రోజ్ వశములో ఝాన్సీ ని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది. ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగ కూడదని ఆమె నిర్ణయించుకొంది. యుద్ధము సుమారు రెండు వారాలు జరిగింది. ఝాన్సీ నిర్మూలన చాలా భయంకరమైనది. ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు తిను భండరములను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.

ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీ కి స్వేచ్ఛ కలిగించి లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది. మార్చి 31లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర లెక్కకి 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నాకాని, "ఏ శిక్షణ లేని వాళ్ళ కంటే" వీళ్ళు చాలా శిక్షణ పొందినవాళ్ళు, మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో,బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది,ఆ రక్షకులలో చాలా మంది తన మహిళా సైన్యం నుండి ఉన్నవారే.

1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్ఛంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబరు మరియు అక్టోబరు 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా మరియు ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.

జనవరి 1858లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకుని తాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.

ఆమె, చిన్నవాడు అయిన దామోదర్ రావు, మరియు తన బలగాలతో కల్పి కి పారిపోయి తాత్యా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి మరియు తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. కాని,1858 జూన్ 17,లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది[3].ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.

“తనతో పాటు ఆమెను తీసుకు వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెన ను తెమ్మని పురమాయించింది. దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి వామి పైకి ఎక్కి దాన్ని తగుల బెట్టమని చెప్పింది. ఆమె అనుచరులు అలాగే చేశారు. ఇది ఫూల్ భాగ్ వద్దనున్న గుసైన్ బాగ్ వద్ద జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూశాను.[4]”

తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
....... జోహార్ రాణీ ఝాన్సీ లక్ష్మీ భాయ్... జోహార్...
                       ....భారత్ మాతాకీ జై!!....

Sunday, 19 November 2017

సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు

మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి  మూల శ్లోకాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా!
          అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశారు. చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 *ధర్మో రక్షతి రక్షిత:*

👉 *సత్య మేవ జయతే*

👉 *అహింసా పరమో2ధర్మ:*

👉 *ధనం మూలమిదం జగత్*

👉 *జననీ జన్మ భూమిశ్చ*
*స్వర్గాదపి గరీయసి*

👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*

👉 *బ్రాహ్మణానా మనేకత్వం*

👉 *యథా రాజా తథా ప్రజా*

👉 *పుస్తకం వనితా విత్తం*
 *పర హస్తం గతం గత:*

👉 *శత శ్లోకేన పండిత:*

👉 *శతం విహాయ భోక్తవ్యం*

👉 *అతి సర్వత్ర వర్జయేత్*

👉 *బుద్ధి: కర్మానుసారిణీ*

👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*

👉 *భార్యా రూప వతీ శత్రు:*

👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*

👉 *వృద్ధ నారీ పతి వ్రతా*

👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*

👉 *ఆలస్యం అమృతం విషమ్*

👉 *దండం దశ గుణం భవేత్*

👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*

*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !🔥

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.🔥

అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన🔥

ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.🔥

అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !🔥

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

 🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.🔥

గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

 🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !🔥

రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.🔥

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)🔥

శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.🔥

విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.🔥

శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.🔥

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.🔥

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !🔥

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.🔥

ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥. అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.🔥

ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !🔥

అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.🔥

ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 🔥

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.🔥

విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.
 పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు కనుక , యథాతథంగా ఇచ్చారు.
✨✨✨✨✨✨✨✨

చరిత్రలో ఎక్కడా మగాడు తన మొదటి భార్యని అమితంగా ప్రేమించిన దాఖలాలు లేవు

విశ్వ హిందూ పరిషత్ వారి పోస్ట్ నుండి సేకరణ. ..
.. ..-------------------------------------------------------
😍మస్తానీ బాజీరావుకి రెండవ భార్య ఆమెను అమితంగా ప్రేమించాడు..
😍ముంతాజ్ షాజహాన్ కి ఎనిమిదవ భార్య ఆమెని ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించాడు..
😍జోధా అక్బర్ కి మూడవ భార్య వారి అమరప్రేమ చరిత్రలో నిలిచింది.

అంటే, చరిత్రలో ఎక్కడా మగాడు తన మొదటి భార్యని అమితంగా ప్రేమించిన దాఖలాలు లేవు, ఇదేనా మనం చదువుకోవాల్సిన చరిత్ర..??🤔

ఇలానే విషబీజాలు నాటుతున్న చారిత్రక సినిమాలు.!

👉అక్బర్ భార్య జోధా అనే విషయాన్ని జోధా అక్బర్ సినిమా బలవంతంగా అందరి మెదళ్ళలోకి చొప్పించింది.

👉జోధా అక్బర్ - ఈ సినిమా చూస్తుంటే ఓ ప్రశ్న కలుగుతుంది. ఇప్పుడు, ఆక్బర్, జోధాల ప్రేమ గాథను సృష్టించి తెరకెక్కించాల్సిన అవసరం ఏముంది?
అసలు, మనకు చరిత్ర సినిమాలంటే మన దేశం పై దండెత్తిన ప్రేమ గాథలు తప్పించి మరొక కథలు లేవా?

👉షాజహాన్, తాజ్‌మహల్, అనార్కలి, బాబర్, చంఘేజ్‌ఖాన్, ముఘల్-ఏ-ఆజమ్, రుస్తుం, షోహరాబ్ ఇలా మన చరిత్ర సినిమాలు అన్నీ మన దేశం పై దండెత్తిన రాజుల గొప్పతనాన్ని చెప్పేవే. అన్నీ వారి ప్రేమ గాథలను తెలిపేవే.

👉నిజంగా జరిగిందో లేదో తెలియని “అనార్కలి” ప్రేమ గాథని మన కళాకారులు అమరం చేశారు. కానీ ఇప్పటికీ లాహోర్ దగ్గర “అనార్కలి” అని ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ప్రజలు అనార్కలిని దేవతలా పూజిస్తారు. ఎందుకంటే సలీమ్ ప్రేమలో ఆమే సర్వం కోల్పోయింది. ఆమెను అనుభవించి రాజ్యకోసం ఆమెని వదిలేసాడు సలీమ్. న్యాయం కోరిన ఆమెను అక్బర్, సజీవ సమాధి చేశాడు. అందుకే ఆ ప్రాంతంలో కొన్నాళ్ళు నివసించిన కీ.శే. తిరుమల రామచంద్రగారు తన జీవిత కథ హంపీ నుంచి హరప్పాదాకా లో దుర్మాగ్గుడైన సలీమ్, అక్బరులకు శాశ్వత రౌరవాది నరకకాలని నా విశ్వం అని అంటారు.

👉కానీ సలీమ్ అద్భుత ప్రేమికుడని అక్బరు దయార్థ్ర హృదయుడని మన సినీ కళాకారులకు విమ్శకులకు చరిత్ర కారులకు హిందూ రాజుల చర్మం ఒలిపించి, క్రూరంగా హించడం, రాణులతో ఘోరంగా వ్యవహరించడం జరగనట్లే ప్రవర్తిస్తుంటారు.

👉జోధా-అక్బర్ సినిమాలో అక్బరును జాలి గుండే కలవాడిలా చూపించాలని ప్రయత్నించారు. మొదటి దృశ్యంలోనే ఓడిన శత్రువు తలను ఖండిచేందుకు అక్బర్ ఇష్టపడడు*. కానీ అక్బర్ ఆరంభ దినాలలో ఇతర ముస్లిము రాజులలలాగానే క్రూరంగా వ్యవహరించాడు.

👉లేకపోతే 13 ఏళ్ళ వయస్సులో రాజ్యం నిలుపుకోగలిగే వాడు కాదు. హల్దీఘాటీ యుద్దంలో 30,000 మంది రాజపుత్ర వీరులను ఊచకోత కోయించాడు అక్బర్.

👉అక్బర్ కనక ఈ సినిమాలో చూపినట్టు రక్తపాత వ్యతిరేకి అయి ఉంటే, జీవితాంతం అక్బర్‌కి వ్యతిరేక పోరాటం సాగించిన రాణా ప్రతాప్ పోరాటం అర్థ విహీనం అవుతుంది. చిత్తోడ్‌లో “జౌహర్” జరిపిన రాణుల బలిదానం వ్యర్థం అవుతుంది.

👎అంటే మన దేశాన్ని కాపాడుకునే ఛత్రపతి శివాజీ, మహారణా ప్రతాప్, వంటి కొన్ని వందల మంది వీరుల పోరాటాలు వ్యర్థం అని సందేశమా..??🤔

👉చరిత్ర బాగా గమనిస్తే, బదౌనీ అనే ముస్లిం రచయిత, అక్బర్, రాణా ప్రతాప్‌కు వ్యతిరేకంగా యుద్దానికి వెళ్తున్నప్పుడు తనని కూడా అక్బర్‌తో యుద్దానికి రావడానికి అనుమతి అడిగాడు. ఎందుకంటే తన ఇస్లామిక్ గడ్డాన్ని, హిందూ రక్తంలో తడుపుకోనెందుకట. “జిహాద్” పట్ల అతనికి ఉన్న విశ్వాసాన్ని మెచ్చిన అక్బర్ అతడికి బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు.

👉హిందూస్థాన రాజుల పట్ల తన క్రోధాన్ని ప్రదర్శించి తన శక్తిని నిరూపించకున్న తరువాత కానీ ముస్లిం ఉలేమాలను ఎదుర్కోనే ధైర్యం అక్బర్‌కు రాలేదు. అందుకే 1579 నుండి అక్బర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది.

👉రాణా ప్రతాప్‌తో యుద్ధం, మోహార్‌లో పరారజయం తరువాత, రాజపుత్రులతో యుద్దం కన్నా రాజీ మేలు అనే నిశ్చయానికి వచ్చి ఉంటాడు అక్బర్.

👉కానీ మన కళాకారులకు మాత్రం చరిత్ర అంటే మనపై దండెత్తిన రాజుల గొప్పతనాలు, హిందూ స్త్రీలతో ప్రేమ కలాపాలు జరిపిన ముస్లిము రాజుల పరమత సహనాలే. అంతే తప్ప, ముస్లిముల చేతికి చిక్కకూడదని చితిని పేర్చుకుని సజీవ దహనానికి సిద్దమైన రాణుల మానసిక సంఘర్షణలు మన సీనీ వస్తువులు కావు. అందుకే అపోహలకు ద్వంద ప్రవృత్తులకు, భావదాస్యానికి చేతకానితనానికి ఆత్మ గౌరవరాహిత్యానికి దర్పణం పడతాయి జోధా-అక్బర్‌తో సహా మన చారిత్రక సినిమాలన్నీ.

సౌజన్యం – దివ్య ధాత్రి, ఏప్రిల్ 2008

*పి.ఎన్.ఓక్ గారు రాసిన భారతీయ్ ఇతిహాస్ కీ భయంకర్ భూలే పుస్తకంలో అక్బర్ పానీపట్టు యుద్దంలో అనుకోకుండా విజయం సాధించిన తరువాత 06.11.1553న గాయపడి అర్థచేతనావస్థలో తీసుకురాబడిన హేమూనీ అక్బర్ తన కత్తితో అతడి మెడను తీసివేసాడని, అప్పటికి అక్బర్ వయస్సు కేవలం 14 సంవత్సరాలని స్మిత్ తన పుస్తకంలో తెలిపినట్లు చెప్పారు. అంటే 14 సం. వయస్సులో ఇలా ప్రాణాలు తీసిన వ్యక్తి ఏ విధంగా దయార్థ్ర హృదయుడో సినీ జనానికే తెలియాలి. పైగా అతడిని దయార్థ్ర హృదయుడిగా చూపించడంకోసం చరిత్రనే మార్చేసి శత్రువు తలను ఖండిచకుండా వదిలేసినట్లు చూపించడం ద్రోహం.

👉అసలు అక్బర్ కి ఉన్న ఐదువేల మంది ఉంపుడు గత్తెలలో జోదా ఎవరు?? అసలు జోదా అనే పెళ్ళాం అక్బర్ కి ఉందా ?? మనకి ఇవేమీ  పట్టవు.జోదా అక్బర్ అని ఒకడు సినిమా తీయగానే పరిగేతుకుని వెళ్లి సినిమా చూసాము.అసలు చరిత్రలో ఇది జరిగిందో లేదో కుడా కనుక్కోము. సలీం అనార్కలి లేదా ముఘుల్ ఏ అజాం  లాంటి సినిమాలు తీస్తే "ప్యార్ కియాతో డర్ నా క్యా" అని పాటలు పాడుకుంటూ ఇప్పటికి ఆ సినిమాలు చూస్తున్నాం.

👉ఇది కల్పిత కధ అని ఎంతమందికి తెలుసు??
కడుపున పుట్టిన కన్న కూతురిని కూడా వదలని జంతు కామం షాజహాన్ ది. అలాంటి షాజహాన్ తన భార్యకి తాజ్మాహల్ కట్టాడని నమ్మి దానిని దేశానికే ప్రేమ సింబల్ అని నమ్మ్యుతున్నాం. షాజహాన్ భార్య 14 వ కానుపులో చనిపోతే ఎక్కడో ఆగ్రకి దురం గా పాతేసి, ఆరునెలల తర్వాత, ఆక్రమించిన తెజోమహల్, అదేనండి మన తాజ్మల్ లో పాతి, మన శివుని ఆలయాన్ని సమాదిచేస్తే సిగ్గులేక, సిగ్గుపడక ప్రేమకి చిహ్నంగా తాజ్మహల్ ని చెప్పుకుంటున్నాం.

👉అసలు కామంతో పనిమనుషులను, కన్న కూతురునే వదలని షాజహాన్  ఎవరినైనా ప్రేమించగలడు అని ఎవరైనా అనుకోగాలరా??అలాంటివాడు ప్రేమచిహ్నాన్ని కట్టాడు అంటే ఎవడైనా నమ్మగలడా మనలాంటి ముర్కులు తప్పా ?? ఇప్పుడీ ఉపోద్గాతం ఎందుకంటె, సంజయ్ లీలా భన్సాలి "పద్మా వతి " అనే సినిమా తీస్తున్నాడు. ఆ కాలం లో పద్మావతి అత్యద్బుత అందగత్తే. ఆమెని ఎలా అయినా పొందాలి అని అల్లాహ్ ఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ పై యుద్ధానికి  రాగా రాజపుత్ వారు ఎదిరించారు. ఆమెని ఒకసారైనా కనీసం చూస్తాను అని ఖిల్జీ బ్రతిమిలాడగా డైరెక్ట్ గా కుదరదు కావాలంటే నీటి లో ఆమె బింబం చూడొచ్చు అని చెప్పగా, వచ్చి నీటిలో ఆమె బింబాన్ని చూసి మైమరిచిపోయి కుయుక్తికో ఎత్తుకుని వెళ్ళిపోగా, రాజపుత్రులు యుక్తితో యువరాణి పరిచారకులు పద్మావతిని చూడడానికి వస్తున్నారు అని ఖిల్జీ స్థావరం లోకి వచ్చి ఆ ఎడ్ల బళ్ళు నుండి రాజపుత్ర సైనికులు అత్యంత సాహసం తో పద్మావతిని అందునుండి తప్పించి మొత్తం రాజపుత్ర వీరులు  ఆ యుద్ధం లో చనిపోయారు.

👉చేతికి చిక్కినట్లే చిక్కి ధూరమైపోయిన పద్మావతి కోసం రాజపుట్ల పై యుద్ధం ప్రకటించాడు ఖిల్జీ. దురదృష్టం రాజ్పుట్లను వహించి  యుద్ధం వోడిపోగా, పద్మావతి రాణి తో కలిపి అందరు ఆడవాళ్ళు అగ్ని లో దూకి ప్రాణత్యాగం చేసుకునారు. ఖిల్జీ రాణి గృహం లోకి వెళ్లేసరికి అక్కడ బూడిద కుప్ప మిగిలింది. ప్రాణాలతో ఖిల్జీకి లొంగని పద్మావతి ఖిల్జీ పై, పై చేయి ఇలా సాదించింది.

👉ఇంతటి పతివ్రత అయిన పద్మావతిని భన్సాలి ఖిల్జీని ప్రేమించినట్లుగా చూపిస్తున్నాడు అని వార్త వచ్చింది. అందుకే హిందువులు సినిమాని అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సినిమా రిలీజ్ అయ్యాక ఇదే నిజం అయితే సినిమా అడ్డుకోవడం లో నేను కూడా పాల్గొంటాను.

👉ఈ రోజు పద్మావతి అయ్యింది రేపు సతి సావిత్రిని కుడా పతిత సావిత్రి అని సినిమా తీస్తారు ఈ దుర్మార్గులు.
నిశ్చితార్ధం జరిగిన తర్వాతా కుడా సైనికుడితో పిల్లాడిని కన్న పతిత లను కుడా "కన్యలు " గా చెప్పుకుంటున్నారు విదేశీ మతాలవారు. మన ధర్మం లో ఉన్న పతివ్రతలను పతితలుగా చిత్రించడానికి కుట్రలు పన్నుతున్నారు.
దానికి మన ధర్మ ద్రోహులైన హిందువులే తోడ్పడుతున్నారు. భన్సాలి ఆ లిస్టులో చేరకూడదని నేను కోరుకుంటున్నాను.. .

👍చరిత్ర సినిమా గా తీయాలంటే, ఉన్నది వున్నట్లుగా తీయండి, మీ సొంత పైత్యం జోడిస్తే, మేము మా పాత జోడు తో మీ తాట తీస్తాం..!🤛
భారత్ మాత కి జై..జై హింద్..!🇮🇳

బార్బరికుడు

మహాభారత యుద్ధాన్ని కొన్ని క్షణాలలో ముగించే యోధుడు గురించి మీకు తెలుసా!!!!

మహాభారత యుద్ధం గురించి అందరికి తెలిసే ఉంటుంది,18 రోజులపాటు భయంకరంగా జరిగిన ఆ యుద్ధంలో అనేక మంది వీరులు పాల్గొని మరణించారు. కానీ మహాభారత యుద్దానికి ముందే మరణించిన ఈ యోధుడు గురించి చాలా తక్కువ మందికే తెలిసిఉంటది.    మహాభారత యుద్ధాన్ని కొన్ని క్షణాలు లో ముగించగల ఆ యోధుడు ఎవరో కాదు పంచపాండవులలో ఒకడు అయిన భీముడి మనుమడు,ఘటోత్కజుడు మౌరి ల కుమారుడు,ఘటోత్కజుడు ఒక రాక్షసుడు మౌరి ఒక రాజకన్య వీరికి జన్మించిన వాడే  బార్బరికుడు. ఇతడు మహాశివుడిని మెప్పించి మూడు బాణాలు వరంగా పొందాడు.మహాభారత యుద్దానికి బయలుదేరిన బార్బరికుడికి అతని తల్లి అయిన మౌరి ఓడిపోయే వారి తరుపున యుద్ధం చేయమని వాగ్దానం తీసుకుంటుంది,అయితే అందుకు కారణమేంటి అంటే మహాభారత యుద్ధం లో కౌరవుల పక్షాన బిష్ముడు, ద్రోణుడు,కర్ణుడు లాంటి అతిరథ మహారధులతో పాటు 12 అక్షౌహిణుల సైన్యంతో బలంగా ఉంది, పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది కనుక పాండవుల పక్షాన యుద్ధం చేయమని అన్నట్లుగా చెపుతుంది. యుద్దానికి బయలుదేరిన బార్బరికుడు ను పరీక్షించాలనుకున్న శ్రీ కృష్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్లి ఎక్కడకు వెళుతున్నవని అడుగగా బార్బరికుడు యుద్దనికి వెళుతున్న అని సమాధానం ఇస్తాడు దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఫక్కున నవ్వి యుద్దానికి వెళుతున్నాడు వీరుడు 3 బాణాలతో అని అంటాడు.

  దానికి బార్బరికుడు తను పరమశివుని వద్ద నుండి 3 బాణాలను వరంగా పొందానని వాటిలో మొదటి బాణం తను నాశనం చేయాలనుకున్న వాటిని గుర్తిస్తుంది అని రెండవ బాణం తను కాపాడాలి అనుకొనే వాటిని  గుర్తిస్తుందని ఇక  మూడవ బాణం మొదట గుర్తించిన వాటిని నాశనం చేస్తుందని వివరిస్తాడు.అది నమ్మని శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్న  రావి చెట్టు మీద ప్రయోగించమని కోరతాడు. అందుకు అంగీకరించిన బార్బరికుడు తన మొదటి బాణాన్ని రావి చెట్టు ఆకుల మీదకు ప్రయోగించాడు.శ్రీకృష్ణుడు ఒక రావి ఆకును తన పాదలకింద దాచి ఉంచుతాడు,ఆ బాణం ఆ రావి ఆకులు అన్నింటిని గుర్తుపెట్టి చివరగా శ్రీకృష్ణుని పాదాల వద్దకు వచ్చి తిరగ సాగింది అది గమనించిన శ్రీకృష్ణుడు యుద్ధం జరిగే కొద్దీ కౌరవుల సైన్యం బలహీనపడుతుందని అప్పుడు బార్బరికుడు వారి వైపు యుద్ధం చేస్తే పాండవులను రక్షించడం అసాధ్యమని భావించ తనని పాండవుల వైపు యుద్ధం చేయమని కోరతాడు అందుకు బార్బరికుడు తనతల్లి కి మాట ఇచ్చానని ఆ మాట తప్పును అని సెలవివ్వగా మరొక ఉపాయాన్ని ఆలోచించి శ్రీకృష్ణుడు బార్బరికుడు ని తనకు ఒక వరం ఇవ్వమని కోరతాడు అందుకు అంగీకరించిన బార్బరికుడు ఎం  వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ని తల నరికి ఇవ్వమని కోరతాడు.

 బార్బరికుడు బ్రాహ్మణ రూపంలోఉంది సామాన్యమైన వ్యక్తి కాదు అని తలిచి తనతలను నరికి ఇచ్చేముందు తన యొక్క నిజ రూపం చూపించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపం వదిలి మాములు రూపానికి వస్తాడు
బార్బరికుడు నాది ఒక కోరిక అని అడుగగా కోరుకోమంటాడు శ్రీకృష్ణుడు, ఈ యుద్ధం మొత్తాన్ని నేను చూడాలి అని అడుగుతాడు దానికి అంగీకరించిన శ్రీకృష్ణుడు           బార్బరికుడు తలను ఒక ఎత్తయిన కొండమీద ఉంచుతాడు. 18 రోజుల మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు యుద్ధంలో మహావీరుడు ఎవరు అని వారిలో వారు వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో  శ్రీకృష్ణుడు బార్బరికుడని అడగమని చెప్తాడు,అప్పుడు పాండవులు బార్బరికుడి అడగగా శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో యుద్ధం చేసినత్కుగా కనిపించింది అని చెప్తాడు,ఆ తరువాత శ్రీకృష్ణుడు బార్బరికుడు తలను రూపవతి అనే నదిలో విడిచిపెడతాడు. అది కకియుగంలో రాజస్థాన్ లోని కాటు అనేగ్రామంలో లభించింది, అప్పటి రాజు రూప్ సింగ్ చహన్ గుడి కట్టించాడు. రాజస్థాన్ లోని ఆ గుడిని కాటు శ్యాం బాబా గా పూజిస్తారు.

.విష్ణువు అవతారాలు 21(ఏక విశాంతి అవతారాలు)అందులో ముఖ్యమైనవి 10(దశవతారాలు)

#వరహావతరం

1.విష్ణువు అవతారాలు 21(ఏక విశాంతి అవతారాలు)అందులో ముఖ్యమైనవి 10(దశవతారాలు)..అందులో మూడవది #వరహావతరం
2.దేవుడంటే ఎక్కడో ఆకాశం లో కూర్చొని ఏమి పట్టనట్టుగా #bachelor_life లా బ్రతికేవాడు కాదు.
3.దేవుడంటే #సర్వాంతర్యామి అయ్యి కష్టాలు వచ్చినప్పుడు వాటిని తీర్చేవాడు.
__________________________________________

ఇపుడు అసలు విషయానికి వద్దాం.

1.#హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర
""నాకు దేవతలతో,రక్షసులతో,మనుషులతో,ఈ భూమి మీద ఉన్న జంతువులతో,పంచభూతాలతో ఇలా దేనితోనూ చావు ఉండకూడదని వరం కోరుకుంటాడు""

2.ఆ వర గర్వం తోని నాకు చావు లేదు నన్ను ఎవ్వడు చంపలేడు, నాకన్నా గొప్పవాడు లేడు అని భూమిని అల్లకల్లోలం చేస్తాడు.

3.తర్వాత #విష్ణువు వాడి కంటే గొప్ప అని తెలుసుకొని విష్ణువు ని ఎలాగైనా రప్పించి యుద్ధం చేసి ఓడించి విజయం పొందాలి అనుకోని భూమి ని సముద్రం లో ముంచి వేస్తాడు...
__________________________________________

(ఇక్కడ అందరికి ఒక అనుమానం వస్తుంది సముద్రం భూమి మీద కదా ఉండేది.భూమి ని సముద్రం లో ముంచడం ఏంటీ? అని)

1.అయితే ఇతర dimension ని లిఖిత పూర్వకంగా చెప్పడం సంక్లిష్టమైన విషయం.

2.ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే
""భూమిని దాని కక్ష నుండి వేరు చేసి పాతలం లోకి తీసుకువెళ్లడం.దీన్ని ఇతర dimension లో ఎలా చెప్పాలో తెలీక అగాధం, అంటే లోతు,శూన్యం,పాతలం,సముద్రం అనే అర్ధాలు వస్తాయి..
కావున సామాన్యులకు అర్ధం అయ్యే విధంగా సముద్రం లోతులో ముంచబడింది అని చెప్పబడింది.
#సైన్స్ ప్రకారం #cosmic_ocean (DARK MATTER) లోకి తీసుకువెళ్లడం జరిగింది
__________________________________________

(అలా గతి తప్పిన భూమి ని రక్షించడానికి భగవానుడు అయిన విష్ణువు ఎం చేసాడో అది చూద్దాం)

1.విష్ణువు ఒక అవతారాన్ని తీసుకోవాలి.ఆ తీసుకునే అవతారం ఎలా ఉండాలి అంటే
#""ఒకే సమయం లో భూమి ని రక్షిస్తూ రాక్షసుడితో  యుద్ధం చేసే లాగా ఉండాలి"""#

2.అప్పటి వరకు భూమి మీద #వరహం అనే జీవి లేదు.
అందుకే విష్ణు అవతారాన్ని #ఆది_వరహస్వామి అంటారు.

3.అలా వరాహ అవతారంలో #మూతి_మోపురం మీద భూమిని నిలిపి అది అటు ఇటు పడకుండా దాని #పంటికోరలు SUPPORT గా నిలుస్తాయి..
ఇలా ఏ జంతువు అవతారం లో చేయడం కుదరదు ఒక వరహం తప్పా..

4.భూమి #గుండ్రంగా_గోళాకారంగా ఉంటేనే అలా FIX అవ్వడం సాధ్యం.బైబిల్, ఖురాన్ ప్రకారం భూమి బల్లపరుపుగా ఉన్నదని భావిస్తే ఇది సాధ్యం కాదు..

5.అలా భూమిని ఎత్తుకొని, గథ తో హిరణ్యాక్షుడిని వధించి, భూమిని యధా స్థానం లో #దాని_కక్ష లో నిలిపి భూమి ని రక్షిస్తాడు..

ఇది అసలు విషయం.
__________________________________________

(ఇప్పుడు #SCIENCE విషయాలు చూద్దాం)

1.భూమి బైబిల్, ఖురాన్ లో చెప్పినట్టు బల్లపరుపుగా లేదని #భూగోళము అంటే భూమి గోళాకారంగా ఉందని లక్షల సంవత్సరాల ముందే తెలిసింది.

2.#జగత్తు- అంటే గతిని కలిగియున్నది(కదిలేది) అని అర్ధం.కానీ బైబిల్ ఖురాన్ లో భూమి 4 స్తంభాల పై నిశ్చలంగా నిలిపి ఉంచారని ఉంటుంది.

3.ఇది #DARWIN_సిద్ధాంతాన్ని నిరూపిస్తుంది కూడా

4.మనిషి DNA పంది DNA 90%+ SAME ఉంటాయి..
అందుకే ఏదైనా కొత్త మందు కనుక్కున్నప్పుడు చివరగా పంది కి ఇచ్చి పరీక్ష చేసాకనే మనిషికి ఇస్తారు.

5.ఈ సంఘటన TIME మరియు భూ ఉపరితలం 7 ఖండాలుగా విడిపోయిన TIME దాదాపు ఒకే TIME ని సూచిస్తున్నాయి అని విశ్లేషకుల అభిప్రాయం..
===================================

"ఇది భగవంతుడు అనే వాడు ఎలాగైనా రక్షిస్తాడు అనే దానికి సూచన."
అంతే కానీ ఎక్కడో ఆకాశం లో #NEELKAMAL కుర్చీ వేసుకొని కూర్చొని చూస్తూ ఉంటాడు వేల సంవత్సరాలు.. అనే చెప్పడం అజ్ఞానం


Saturday, 18 November 2017

గాయత్రీ మంత్రము

గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు

చాలా మందికి గాయత్రీ మంత్రమనేది ఒకటి వుందని తెలిసినా, అదేమిటో అసలు ఎలా జపించాలో తెలియదు. కొందరికి మంత్రము తెలిసినా కాలంతోపాటు పరిగెడుతూ హడావిడిగా జీవితాలను గడపాల్సిరావటం వల్ల ఈ మంత్రాన్ని గబగబ బట్టీయం పట్టినట్టు మొక్కుబడిగా దేవుని ముందు అప్పగించేసి హమ్మయ్య ఈ రోజుకి చదివేసాను అనుకుంటారు.

నిజానికి గాయత్రీ మంత్రాన్ని అలా చదవకూడదు. అసలు గాయత్రీ మంత్రమేమిటో అది ఎలా జపించాలో తెలుపవలెనని నాయొక్క చిన్న ప్రయత్నం.
గాయత్రీ మంత్రము అంటే…

“ఓం, భూర్భువస్సువః, తత్ సవితుర్వరేణ్యం,
భర్గోదేవస్య ధీమహి, ధియో యో నః ప్రచోదయాత్”

ఇది మంత్రము. ఈ మంత్రాన్ని ఏకధాటిగా చదవకుండా మంత్రన్ని నాలుగు చోట్ల ఆపి చదవాలి. అది ఎలాగంటే…

ఓం
భూర్భువస్సువః
తత్సవితుర్వరేణ్యం
భర్గోదేవస్య ధీమహి
ధియో యోనః ప్రచోదయాత్

ఇలా మంత్రం మద్యలో నాలుగు సార్లు ఆపి చదవాలి.

ఈ మంత్రములో “ఓం” అనేది “ప్రణవము”, “భూర్భువస్సువః” లోని భూ, భువః, సువః అనేవి “వ్యాహృతులు”. వ్యాహృతులు అనేవి దివ్యశక్తిని కలిగిన పదాలు. ఇవి మూడు లోకాలను సూచిస్తాయి. “తత్” నుంచి మిగిలిన భాగాన్ని “సావిత్రి” అని అంటారు.

గాయత్రి మంత్రం లో 24 బీజాక్షరాలున్నాయి. వాటిని ఆధారం చేసుకుని నిర్మితమైన కొన్ని గొప్ప ఆలయాలను ఒకసారి అవలోకించుకుందాం.

1. కంచి కామాక్షి మందిరం లో అమ్మవారు మూలవిరాట్టుగా కూర్చుని ఉన్న మంటపాన్ని గాయత్రి మంటపం అంటారు. ఆ ప్రాక్రారంలో 24 స్తంభాలున్నాయి. అవి 24 బీజాక్షరాలకు ప్రతీకలు.

2. కోణార్క్ లోని సూర్య దేవాలయ సముదాయం ఒక పెద్ద రధం మీద వున్నట్టు నిర్మించబడి వున్నది. ఆ రధానికి గాయత్రీ మంత్రానికి ప్రతీకగా 24 చక్రాలు వున్నాయి. వాటిని ఆంగ్లేయులు 24 గంటలని చెప్పారు. మనవాళ్ళు దానినే పట్టుకుని వేల్లాడుతున్నారు.

3. పురాణ కధనం ప్రకారం 24 ఋషులు వారి మంత్రశక్తిని ఈ 24 బీజాక్షరాలలో నిక్షిప్తం చేసారు. ధర్మచక్రం లో వున్నా 24 చువ్వలు (spokes ) వాటికి ప్రతీకలు. దాన్నే మనం సమయచక్రం అని కూడా అంటున్నాము.

4. జైన సిద్ధాంతంలో 24 తీర్ధంకరులు – ఇది అవైధిక మతమైనా వాటికి మూలం మన వేదమే.

5. 24 కేశవ నామాలు

6. 24 తత్వాలు : ఐదు జ్ఞానేన్ద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, 5 మహాద్భూతాలు, బుద్ధి, ప్రకృతి, అహంకారం, మనస్సు

7. ఛందస్సులలో ఒకానొక గొప్ప ఛందస్సు గాయత్రి పేరు మీద వున్నది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఇలా చెబుతాడు : “ బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ చందసామాహం”

8. రామాయణం లో 24 సహస్ర శ్లోకాలు.

9. రామాయణం గాయత్రి మంత్రాన్నే ప్రతిపాదిస్తోంది. కావాలంటే మీరే ఒకసారి తరచి చూడండి. 1, 1001, 2001, 3001, 4001, …..23001 శ్లోకాలను గనుక మీరు చూస్తె మీకు గాయత్రి మంత్రమే కనబడుతుంది. దీన్ని గాయత్రి రామాయణం అని కూడా అంటారు

10. ఒక వీణలో 24 చిర్రలు వుంటాయి. సంగీత శాస్త్రం తెలిసినవాళ్ళు దీన్నే గాయత్రి ఉపాసన అని అంటారు.

11. మన వేనుబాములో 24 మ్రుదులాస్తులు ( Cartilage )వుంటాయి. వాటికి అధి దేవతలే గాయత్రి మంత్రాక్షరాలు.

“న గాయత్రీ త్రాహ్య పరం మంత్రం .. నమాతా: పర దైవతం” అన్నారు పెద్దలు . 24 బీజాక్షరాలతో కూడిన గాయత్రీ మాతను ఒక్కసారి జపిస్తే చాలు, సర్వ పాపాలు హరిస్తాయంటారు. సకల దోషాలు తొలగి పోతాయంటారు. సకల దేవతా స్వరూపం గాయత్రీ. రామాయణ సారం గాయత్రీ . కోర్కెలు తీర్చే మంత్ర రాజం గాయత్రీ. విశ్వశాంతికి పరిష్కారం గాయత్రీ .. సకల కోర్కెలు ఈడేర్చే మహా మంత్రం గాయత్రీ .. 24 బీజాక్షర సంపుటి గాయత్రీ.. అలాంటి గాయత్రి మాతను స్మరణం చేసుకోవడం అంటే నిజంగా పూర్వ జన్మ సుకృతమే అని చెప్పాలి.

!! గాయత్రి రక్ష సర్వ జగద్రక్ష !!

Friday, 17 November 2017

గొబ్బూరి వెంకటానంద రాఘవరావం

మొన్న ఈమధ్య నేను "అంతరిక్షం,గ్రహాలు,నక్షత్రాలు గురించి చర్చించిన తొలి మానవులు భారతీయులు"అని ISRO ప్రయోగం గురించి చెబుతూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది..దానిని చూసి కొందరు మిత్రులు నాతో మెసేంజర్ ద్వారా చర్చించారు.వీరి వాదన చూసిన తరువాత మన తప్పుడు చరిత్ర నేర్పిన భావదారిద్ర్య ప్రభావం మనపై ఎంతలా పనిచేస్తోందనేది స్పష్టంగా తెలిసింది.వీరిలో కొంతమందికి భారతీయ పురాతన సాహిత్యం మీద కనీస అవగాహన,గౌరవం ఏమాత్రం లేవు..
వీరి ఉద్దేశ్యంలో నేను సమాజాన్ని భారతీయ పురాతన సాహిత్యాన్ని పరిశోధించమనటం ద్వారా రేపటితరం భారతీయూలను అభివ్రుద్ధికి దూరం చేస్తున్నానని.దీనిని సమర్దించుకోటానికి వారు చెప్పే ఉదాహరణలు రంగనాయకమ్మ విషవ్రుక్షం,ఐలయ్య హిందువునెట్లైతా లాంటి...ఇంకా కొన్ని వామపక్ష ప్రభావిత రచయితల పుస్తకాలలోనివి..
ఇటువంటి పుస్తకాలను మాత్రమే వీరు ఎందుకు చదువుతున్నారా అని గమనిస్తే ......కళాశాలలో,విశ్వవిద్యాలయాలలో వామపక్ష పార్టీల యూనియన్ లు వల్ల విద్యార్థులు ఇటువంటి పుస్తకాలు ఎక్కవ చదవటం ఒక ఫ్యాషన్ అని..అవి చదివి సాధారణ విద్యార్థులతో వాదులాడి మేధావులలా ఫోజ్ కొట్టడం కోసం...
పరిశోధించటం కంటే నిందించటం సులభం కదా!వీరికి తెలీదు వజ్రాన్ని రాయిలా భావించి హేళన చేస్తున్నారని.
వారిని నేనడిగింది"గొబ్బూరి వెంకటానంద రాఘవరావం" గారు తెలుసా?అని..
వారిచ్చిన సమాధానం "ఆయనెవరు?ఆయనొక పురాణం రాశాడా"?అని..
ఇక వాదన అనవసరం అని నా next post చూడమని end చేశాను..
......గొబ్బూరి వెంకటానంద రాఘవరావు....
జనణం 1892
మరణం 1958
మన తెలుగువారవటం మనకు గర్వకారణం..
ఆధునిక భారతీయ ఖగోళ శాస్ర్థవేత్త..మనకెంతమందికి తెలుసు ఈయన గురించి??
ఆకాశం మీద ఎనిమిదివేళ నక్షత్రాలను టెలిస్కోప్ సహాయం లేకుండానే ఆయన గుర్తుపట్టగలిగేవారు.
"ఋగ్వేదం"లోని ఖగోళ విజ్ఞానాన్ని పరిశోధించి ఎన్నో గొప్పవిషయాలు తెలుసుకున్నారు.వరాహమిహిరుడి సిద్ధాంతాలలో కొన్నింటిని సరిదిద్ధిన ఘనాపాటి..."స్ర్కిప్ట్సర్ ఆఫ్ ది హెవెన్" అను ఆంగ్లపుస్తకం ద్వారా ఎన్నో ఖగోళ విషయాలను తెలియచేశారు.1940 లో ఈ పుస్తకం ప్రపంచ ద్రుష్ఠిని ఆకర్షించింది..ఎందరో ప్రపంచ శాస్ర్తవేత్తలు ప్రశంసలు కురిపించారు..ఈ పుస్తకాన్ని తెలుగులో "జ్యోతిర్వేదం" పేరుతో ముద్రించారు...గ్రీకులు ఖగోళ జ్ఞాణం భారతీయుల నుంచి నేర్చుకున్నదే అని వీరు నిరూపించారు..ఆ నిదర్శనాలను చూపించారు...తనకు పూర్వులైన ప్రపంచ ఖగోళ శాస్ర్థవేత్తల అభిప్రాయాలన్నీ సమీక్షించారు..
సూర్యునికన్నా రోహిణి నక్షత్రం 74రెట్లు పెద్దది.అది భూమికి 67 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
13 లక్షల భూగోళాలు సూర్యగోళంలో అమరుతాయి.
ఆర్ద్ర నక్షత్రంలో 2కోట్ల50లక్షల సూర్యగోళాలు అమరుతాయి......ఇలాంటి విషయాలెన్నో ఎన్నెన్నో...
బాల్డియన్ లు,అసీరియన్ లు,బాబిలోనియన్ లు ఆకాశనక్షత్ర రాశులలో 3వ రాశిని "శివమ్" అని ఎందుకు అన్నారో...లాంటి విషయాలు....
అగస్త్య,ఆరుద్ర,జ్యేష్టాది మహాకాయ నక్షత్రాల ఎదుట సూర్యుడు మినుగురు పురుగు అంటారు ఈయన..
శతాబ్దాల నాటి ప్రాచీనులందించిన శాస్త్రవిజ్ఞానంతో ఎన్నెన్నో నూతన అంశాలను ఆవిష్కరించారు. ఖగోళంలోని అంశాలను పౌరాణిక పాత్రలలో ముడిపెట్టి చెప్పిన ప్రాచీన శాస్త్రవేత్తలు, కవులను తన పరిశోధనలకు ఆదర్శంగా ఎంచారు. వారు పాలపుంతను పాలసముద్రమని అభివర్ణిస్తూ, విష్ణువు పాదాల దగ్గర పుట్టిన దివిజగంగ ఆకాశంలో పయనించి శివుని తలమీద వర్షించిందని చెప్పారు. పాలపుంత ఎగువభాగంలో ఒక మూలన ఉన్న ప్రధాన నక్షత్రం విష్ణువు అనే దేముడి నామం కలిగినది. పాలపుంత దిగువభాగంలో చివరలో ఉన్న ప్రధాన నక్షత్రం ఆరుద్ర. ఇది శివుడి పేరు కలిగిఉన్నది. ఈ రెండు సక్షత్రాల నడుమ "హంస" పేరు కలిగిన నక్షత్రం ఒకటి ఉన్నది. హంసకు ఎడమ భాగమున ఉన్నది క్షీరసముద్రమనీ, రెండవ వైపున ఉన్నది దివినుండి భువికి చేరిన గంగ అనీ చెప్పారు. ఈ అంశాలన్నిటినీ రాఘవరావు పరిశీలించి, అధ్యయనం చేసి, ఆ పాలనూ, నీళ్ళను వేరుచేసే హంసతో సహా ఖగోళ చిత్రపటాన్ని తయారుచేసి "భారతి" సాహిత్య మాసపత్రిక (1920 దశకం) లో ప్రచురించారు. ఖగోళ శాస్త్రాన్ని గురించి చిరకాలం పరిశోధనలు చేసి కనుగొన్న వాటిని వేదాల్లోనూ, తైత్తరీయ సంహిత లోనూ, పురాణాలలోనూ , మహాభారతంలోనూ నర్మగర్భితంగా ఉన్న అంశాలతో సమన్వయం చేసి, అధ్భుతమైన విషయాలను ఆవిష్కరింపజేస్తూ "జ్యోతిర్వేదం" పేరుతో తొలి తెలుగు ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని ప్రచురించారు. ఇది కేవలం శాస్త్ర గ్రంధమే గాని, జ్యోతిష గ్రంథం కాదు.

.వీలైతే వీరిని ఆదర్శంగా తీసుకుందాం... లేదంటే మూసుకుందాం....ఎక్కువ వాగకుండా..

గొబ్బూరి వెంకటానంద రాఘవరావు గారాది విజయనగరం జిల్లా , పార్వతీపురం
భారత్ మాతా కీ జై!!
Source:wikipedia,jagruthi,google....

రామ్ కనుపూరి

Wednesday, 15 November 2017

విశ్వ విజ్ఞాన ‘తొలి’ వేదిక

విశ్వ విజ్ఞాన ‘తొలి’ వేదిక..

ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయాల్లో నలంద విశ్వవిద్యాలయం ఒకటి. నాగరికత పురుడుపోసుకుంటున్న ప్రాచీన కాలంలోనే ఈ విశ్వవిద్యాలయంలో.. గణిత, విజ్ఞాన, వైద్య, తర్క శాస్త్రాలు ఎనలేని ఆదరణ చూరగొన్నాయి. వివిధ దేశాల నుండి ఎందరో విద్యార్థులు 11వ శతాబ్దంలోనే ఇక్కడ విద్యనభ్యసించారు. నేడు ప్రపంచంలోనే పేరెన్నికగన్న.. ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలకంటే ముందే భారతదేశంలో.. ‘నలంద’ విజ్ఞాన ఖనిగా నిలిచింది. క్రీస్తుశకం 427 నుండే నలంద బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా వెలుగొందింది. బీహార్‌ రాష్ట్రంలో ఉన్న ఈ విశ్వవిద్యాలయ శిథిలాలు.. దే శంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్నాయి.

nalanda-university-complexనేటి ఆధునిక గణిత, వైద్యశాస్త్ర పరిశోధనాలయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆనాడే.. నలంద విశ్వవిద్యాలయం శస్త్ర విద్యలో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కంటి పొరలు, గర్భకోశం నుంచి మృతపిండాన్ని తీయడం వంటి శస్త్ర చికిత్సలు చేసేవారంటే అతిశయోక్తి కాదు. మానవులతోపాటు ఇక్కడ జంతువు లకు కూడా పరిపూర్ణమైన వైద్య సౌకర్యం ఉండేది. ఇక్కడ పొరుగు దేశాలైన చైనా, టిబెట్‌, జావా, సమత్రా, కొరియా, గ్రీసు, ఇరాన్‌, అరేబియాలనుంచి విద్య నేర్చుకోవడానికి విద్యార్ధులు నలందకు వచ్చేవారు. 10 సంవత్సరాలకు పైగా ఉండి తర్క, వైద్య, ఖగోళ శాస్త్ర సంబంధమైన విషయాలు నేర్చుకునేవారు. బిహార్‌ రాజధానికి పాట్నాకు ఆగ్నేయంగా 55 మైళ్ళ దూరం లో ఉన్న నలంద విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యంత ప్రాచీన విశ్వవిద్యాలయం.

నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అ ని అర్ధం. నలంద అనే సంస్కృత పదం ‘నలం’ అనగా కమలం అని అర్ధం (కమలం జ్ఞానికి చిహ్నం). ‘ద’ అంటే ఇవ్వడం అనే రెందు పదాల కలయుక ద్వారా పుట్టిం దే ‘నలంద’. అనగా జ్ఞానప్రదా యిని అని అర్థం. చైనా తీర్థయాత్రికుడు హ్యూయన్‌ త్సాంగ్‌ నలంద పదానికి వివిధ వివరణలు ఇచ్చాడు. ఒక వివరణ ప్రకారం నలందకు ఆ పేరు మామిడి తోపు మధ్యన ఉన్న చెరువులో నివసించే నాగుని వలన వచ్చింది. హ్యూయన్‌ త్సాంగ్‌ సమ్మతించిన రెండవ వివరణ ప్రకారం ఒకప్పుడు బోధిసత్వుని రాజధాని ఇక్కడ ఉండేదని, ఆయన నిరంతర దానాలు చేసేవాడని అందుకే ‘నలంద’ అన్న పేరు వచ్చిందని వివరించాడు.

గౌతమ బుద్ధుని కాలములో నలంద...
Nalanda-sariputtaనలంద విశ్వవిద్యాలయం క్రీశ.427 నుంచి క్రీ.శ.1197 వరకూ బౌద్ధ విజ్ఞాన కేంద్రంగా ఉండేది. పాక్షికంగా పాల వంశ పాలనలో ఉన్నది. ఇది లిఖిత చరిత్రలో ప్రపంచంలోని తొలి విశ్వ విద్యాలయాలలో ఒకటి. అలెగ్జాండర్‌ కన్నింగ్‌హాం నలందను బారాగావ్‌ గ్రామంగా గుర్తించాడు. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టు పక్కల ప్రాంతంలో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని అంటారు. బుద్ధుడు అనేక పర్యాయములు నలందలో ఉన్నాడని చరిత్ర చెబుతోంది. ఆయన నలందను సందర్శించినప్పుడు అక్కడ ఉన్న మామిడితోపులో బస చేసేవాడట.

అక్కడ ఉండగా ఉపాళీ-గహపతి, దీఘాతపస్సీలతో చర్చలు జరిపేవాడు. కేవత్త, అసిబంధకపుత్తతో కూడా అనేక చర్చలు జరిపినట్టు తెలుస్తున్నది. బుద్ధుడు మగధ గుండా తన చివరి యాత్రలో నలందను సందర్శించాడు. సారిపుత్త, తను చనిపోయే కొద్దికాలం ముందు ఇక్కడే బుద్ధుని యెడల తన విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ సింహగర్జన చేశాడు. రాజగృహ నుండి నలందకు వెళ్ళే మార్గం అంబలత్తికా గుండా వెలుతుంది. అక్కడి నుండి ఆ మార్గం పాతాలీగామా వరకు వెళ్ళేది. రాజగృహకు, నలందకు మధ్యన బహుపుత్త చేతియ ఉన్నది.

Nalanda_Universityకేవత్త సుత్త ప్రకారం... బుద్ధుని కాలానికే నలంద ప్రాముఖ్యత కలిగి నిండు జ నాభాతో వృద్ధి చెందుతున్న నగరం. అయితే ఆ తరువాత చాలాకాలానికి గానీ విద్యాకేంద్రంగా అభివృద్ధి చెందలేదు. సమ్యుత్త నికాయలోని, ఒక రికార్డులో న లంద బుద్ధునికాలంలో తీవ్ర క్షామానికి గురైనదని నమోదు చేయబడినది. బు ద్ధుని కుడిభుజం వంటి ఆయన శిష్యుడైన సారిపుత్త నలందలోనే పుట్టి, ఇక్కడే మరణించాడు. నలంద, సొన్నదిన్న యొక్క నివాసస్థలం.

ఒకప్పుడు జైనమత కార్యకలాపాలకు కేంద్రమైన నలం ద లో మహావీరుడు అనేక పర్యాయములు బసచే సి నాడని పేర్కొనబడినది. మహావీరుడు నలం దలో ఉన్నపవపురిలో మోక్షాన్ని పొం దినట్టుగా భావిస్తారు. (అదేకాక జైనమ తంలోని ఒక తెగ ప్రకారం, మహా వీరుడు నలంద సమీపాన ఉన్న కుందల్‌పూర్‌లో జన్మించాడు). అ శోకుడు క్రీస్తుపూర్వం 250లో ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించా డని చెబుతారు. టిబెట్‌ మూలాల ప్రకారం, నాగార్జునుడు నలంద వి శ్వవిద్యాలయములో బో దించాడు. చరిత్రకారుల ప్రకారం ఈ విశ్వవిద్యా లయం క్రీశ 1193 వరకు ఉన్నతస్థా యిలో వర్థిల్లింది. దీనికి ప్రధాన కారణం బౌద్ధచక్రవర్తులైన హర్షవర్ధనుడు వంటివారు. పాలివంశానికి చెందిన రాజుల ఆదరణే కారణం.

విశ్వవిద్యాలయ చరిత్ర...
Nalanda_Universitచారిత్రక ఆధారాల ప్రకారం నలంద విశ్వ విద్యాలయము గుప్తరాజుల, ముఖ్యంగా కుమార గుప్త, సహాయంతో క్రీస్తుశకం 450లో నిర్మించబడినది. నలంద ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆవాస విశ్వవిద్యాలయం. అంటే ఈ విద్యాలయంలో విద్యార్థుల కొరకు వసతి గృహాలు ఉండేవి. ఇందులో షుమారుగా పదివేల మంది విద్యర్థులు, రెండువేల మంది బోధకులు ఉండేవారు. పెను గోడ ద్వారాలతో ఈ విశ్వ విద్యాలయము ‘అతి ఘనమైన కట్టడం’ గా గుర్తించబడినది.

నలందలో ఎనిమిది ప్రత్యేక ఆవరణలు, పది గుళ్లు, లెక్కకు మించిన ధ్యాన మందిరాలు, తరగతి గదులు ఉండేవి. ఆవరణలో కొలనులు, ఉద్యానవనాలు ఉండేవి. గ్రంధాలయం ఒక తొమ్మిది అంతస్తుల భవనంలో ఉండేది. ఇందులో ఎన్నో గ్రంధాల ములాలు ఉన్నవి. నలంద విశ్వ విద్యాలయంలో బోధింపబడే విషయాలు ప్రతి విజ్ఞాన శాఖనూ స్పర్శించాయు. నలంద విద్యార్ధులను, బొధకులను కొరియా, జపాన్‌, చైనా, టిబెట్‌, ఇండోనేషియా, పర్షియా, టర్కి వంటి దేశాల నుండి ఆకర్షించింది. తాంగ్‌ వంశానికిచెందిన చైనా తీర్థ యత్రికుడు హ్యుయాన్‌ త్సాంగ్‌ 7వ శతాబ్ధపు నలంద విశ్వ విద్యాలయం గురించి వివరాలు సంగ్రహపరిచాడు.

బౌద్ధమతంపై నలంద ప్రభావం...
9 - 12 వ శతాబ్దం మధ్యకాలంలో ప్రజ్వరిల్లిన టిబెటన్‌ బౌద్ధత్వం (వజ్రాయన) నలంద బోధకుల నుండి, సంప్రదాయాల నుండే ఉద్భవించింది. వియత్నాం, చైనా, కొరియా, మరియు జపాన్‌లలో అనుసరించే మహాయాన బౌద్ధం పుట్టుక కూడా ఈ విశ్వ విద్యలయ ప్రాంగణంలోనే జరిగిందంటే అతిశయోక్తి కాదు. థెరవాడ బౌద్ధం కూడా నలందలో బోధించబడినది. కానీ థెరవాడ బౌద్ధానికి నలంద గట్టి కేంద్రం కాకపొవడం వల్ల, తరవాతి అభివృద్ధి ఇక్కడ జరగలేదు.

పతనావస్థ...
Nalanda_seal1193లో నలంద విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్‌ ఖిల్జీ నాయకత్వంలో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశంలో బౌద్ధమత క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టే ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్‌ ప్రతి ఉందా అని వాకబు చేశాడని చెబుతారు. 1235లో టిబెట్‌ అనువాదకుడు ఛాగ్‌ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉన్నది. గణితం, ఖగోళశాస్త్రం, రసాయన శాస్త్రం, స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానం అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనం, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు. దండయాత్రల ప్రధాన మార్గంలో ఉన్న ఇక్కడి సన్యాసాశ్రమాలన్నీ కూలగొట్టబడినవి. ప్రధాన మార్గంలో లేకపోవడం నలంద, బుద్ధగయ మిగిలాయని చెబుతారు. ప్రధాన మార్గంలో లేని, ఉత్తర బెంగాల్‌ లోని జగద్దలా ఆశ్రమం వంటి అనేక ఆశ్రమాలు ఏ మాత్రం హానిలేకుండా ఉండి వృద్ధి చెందినవి.

భారత విజ్ఞాన వినాశనం...
పర్షియన్‌ చరిత్రకారుడు మిన్నాజ్‌-ఈ-సిరాజ్‌ తన తబాకత్‌ - ఇ - నసిరీన్‌ అనే రచనలో నలంద విశ్వవిద్యాలయ నాశనాన్ని ఇలా వర్ణించాడు. ‘‘విశ్వవిద్యాలయంపై దాడి సందర్భంలో వేలాదిమంది బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు సజీవదహనం చేయబడ్డారు. మరికొన్ని వేలమంది తలలు తెగ నరకబడ్డాయి. బ్రహ్మాండమైన గ్రంథాలయం తగలబెట్టబడింది. అది కొన్ని నెలలు పాటు తగలబడింది. తగలబడుతున్న పుస్తకాల నుండి చెలరేగిన పొగ ఆకాశంలో కొన్ని వారాల పాటు నల్లగా, చిక్కగా కమ్ముకుంది’’ అని వివరించాడు. సందంట్లో సడేమియా అన్నట్లుగా ఈ విశ్వవిద్యాలయం వినాశనంలో హిందూ మతోన్మాదులు కూడా ఒక చేయి వేశారు.

శర్మ స్వామి అనే టిబెట్‌ యాత్రికుడు భక్తియార్‌ ఖిల్‌జీ దాడి తర్వాత మూడు దశాబ్దాలకు నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడ జరిగిన దుర్మార్గాన్ని వర్ణించాడు. దీని ప్రకారం ఖిల్‌జీ దాడి అనంతరం నెలకొని ఉన్న అరాచక వాతావరణంలో కొందరు హిందూ సన్యాసులు ఒక యజ్ఞాన్ని ఆ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తర్వాత యజ్ఞం తాలూకు నిప్పుల కట్టెలను వారు అన్నిచోట్లా విసిరేశారు. అవి మంటలను సృష్టించాయి. ఆ మంటల్లో అప్పటికీ మిగిలి ఉన్న రత్నబోధిలోని గ్రంథాలన్నీ తగలబడ్డాయి. ఆ తొమ్మిది అంతస్థుల భవనంలోని విజ్ఞాన భాండాగారం నాశనమైపోయింది. దీనితో నలంద విశ్వవిద్యాలయం, దానిలో విజ్ఞానశాస్త్ర భాండాగారం చరిత్రగర్భంలో కలిసిపోయాయి. ‘అహి’ అనే చరిత్రకారుని ప్రకారం, ‘‘నలంద విశ్వవిద్యాలయంలోని బోధనా ప్రదేశాలు, గ్రంథాలయాల వినాశనం, ఖగోళశాస్త్రం, లెక్కలు, రసాయనిక శాస్త్ర, వైద్యశాస్త్రంలో భారతీయ శాస్ర్తీయ ఆలోచనా విధానం యొక్క వినాశనానికి మూలమని అంగీకరించక తప్పదు.

అవశేషాలే.. నేటి పర్యాటక కేంద్రాలు...
జీర్ణావస్థలో ఉన్న కట్టడాలు.. ఆనాటి విజ్ఞానపు తాలూకు వాసనలు వెదజల్లుతూ.. ఇంకా మిగిలే ఉన్నాయి. దగ్గరలో ఒక హిందూ దేవాలయమైన సూర్య మందిరం ఉన్నది. పురాతత్వ శాఖ లెక్కల ప్రకారం.. అవశేషాలు 150,000 చదరపు మీటర్ల మేరకు విస్తరించి ఉన్నవి. హువాన్‌ త్సాంగ్‌ యొక్క వర్ణన ప్రకారం నలంద విస్తృతిని, ఇప్పటి వరకు త్రవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పోల్చి అంచనా వేస్తే, ఇంకా 90% శాతం దాకా అవశేషాలు బయల్పడనట్టే. నలంద ఇప్పుడు నిర్వాసితము. ప్రస్తుతం ఇక్కడికి అతి చేరువలోని జనవాస ప్రదేశం బార్‌గాఁవ్‌ అనే గ్రామం. 1951లో నవ నలంద మహావిహార అనే ఒక ఆధునిక పాళీ, థెరవాడ బౌద్ధ అధ్యయన కేంద్రాన్ని ఇక్కడికి దగ్గరలో స్థాపించబడినది. ప్రస్తుతం, ఆ కేంద్రం ఈ పరిసర ప్రాంతాన్ని మొత్తం ఉపగ్రహం ద్వారా శాటిలైట్‌ ఇమేజింగ్‌ పద్ధతిలో అధ్యయనం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నది. నలంద మ్యూజియంలో అనేక వ్రాతపత్రులు, త్రవ్వకాలలో దొరికిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.

పునరుద్ధరణ...
డిసెంబర్‌ 9, 2006న న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక 1 బిలయన్‌ డాలర్లు ఖర్చుచేసి ప్రాచీన విశ్వవిద్యాలయమున్న చోటను పునరుద్ధరించటానికి ఓ ప్రణాళికను వివరించింది. సింగపూర్‌ నేతృత్వంలో భారత్‌, జపాన్‌, ఇతర దేశాలతో కలసి ఒక కన్షార్షియంగా ఏర్పడి 500 మిలియన్‌ డాలర్లతో కొత్త విశ్వవిద్యాలయం నిర్మించటానికి, మరో 500 మిలియన్‌ డాలర్లు దానికి అవసరమయ్యే సదుపాలను అభివృద్ధి చేయటానికి నిధులు సేకరించడానికి ప్రయత్నిస్తున్నది

స్త్రీ శక్తి దివాస్ nov-19



Tuesday, 14 November 2017

అశోక్‌గజపతిరాజు

దేశంలో మంత్రులు అందరికీ ఆదర్శం ఇది చదివి కొందరు సిగ్గుతెచ్చుకోవాలిఅశోక్‌గజపతిరాజు ఆగర్భ శ్రీమంతుడు అయినా అత్యంత నిరాడంబరంగా మెలగటం ఆయన గొప్పదనం. ఆఫ్టరాల్‌ ఎంపీపీ, ఎంపీటీసీలే కారు వెనుక నెంబర్‌ప్లేట్‌పై రెడ్‌ కలర్‌ స్ట్రిప్‌ వేసుకుని వీవీవీఐపీల్లా ఫోజులు కొడుతుంటారు. ఎక్కడన్నా సెక్యురిటీ లేదా చెక్‌పోస్టు ఆపితే నేను ఫలాన నాయకుడి కొడుకుని బామ్మర్దిని అంటూ టోల్‌గేట్లపైనా చెక్‌పోస్టులపైనా దాడులు చూశాం. అధికారం నషా నెత్తికెక్కి జనం నెత్తినెక్కి కూర్చున్న నాయకులు ఎందులో అయినా దూకి చావాలి పూసపాటి అశోక్‌గజపతిరాజు గారి గురించి తెలిస్తే. రాజుగారు ఈయన తన కుమార్తెను విజయనగరం నుంచి విశాఖకు బస్సులో పంపేవారు చదువు కోసం.
తన కారు తానే శుభ్రం చేసుకునేవారు. కేంద్ర విమానయాన మంత్రిగా ఉన్నా నిరాడంబరంగా పనిచేసుకుపోతారు. అందరితోపాటు వరుసలో నిల్చుని తనిఖీలకు వెళతారు. టికెట్‌ పంచ్‌ కొట్టి మరీ మెట్రో రైలులో ప్రయాణిస్తారు. విమానాశ్రయంలోనూ వరుసలో నిలబడతారు. కేంద్రమంత్రిగా అందులోనూ విమానయానం అంటే ప్రపంచంలోని ప్రముఖులు అందరు తమ ముందు వచ్చి నిలబడే శాఖ అది. అలాంటికి అధిపతి అయినా తాను ఓ సాధారణ ప్రయాణికుడిలా ఉండటం చూసి ప్రధాని నరేంద్రమోడీ అందరి వద్దా ఆయన గురించి చెబుతున్నారు. ఆయనను చూసి నేర్చుకోవాలని ప్రధాని సూచిస్తున్నారు. నిజానికి విమానయాన మంత్రి అనగానే ఎవరూ ఆపకుండానే నేరుగా కారు దిగి విమానం ఎక్కేయటమే. కానీ… ఆయన అలా చేయరు. అందరు ప్రయాణికులతోపాటు వరుసలో నిలబడతారు. రెండు చేతులు పైకెత్తి చెకింగ్‌ చేయించుకుంటారు. మంత్రిగారన్న భయంతో సెక్యూరిటీ అధికారులు చెకింగ్‌ చేయకుండా వదిలేస్తే ‘మీ డ్యూటీ మీరు చేయండి, తప్పులేదు’ అని వారికి సూచిస్తారు. ఇక… టెర్మినల్‌ నుంచి విమానం వరకు బస్సులో వెళ్లాల్సి వచ్చినా, మంత్రికి ఉండే ప్రత్యేక వాహనం ఉపయోగించరు. బస‌్సులో అందరితో కలిసే వెళతారు. ఇక… విమానాశ్రయానికి ఆయన కారులో కాకుండా మెట్రో రైలులో ప్రయాణిస్తారు.అక్కడా కూడా ‘నేను మంత్రి’ని అనే ఆర్భాటం చూపించరు. మిగిలిన ప్రయాణికులతోపాటు క్యూలో నిల్చుని… మెట్రో టికెట్‌ పంచ్‌ చేయించుకుని, గేటు దాటి వెళతారు. ఇతర కేంద్ర మంత్రులూ ఏరోసిటీలో ప్రయాణించినప్పటికీ… ఇలా క్యూలో నిలబడటం, టికెట్‌ పంచ్‌ చేయించుకోవడం ఉండదు. వారికోసం ముందుగానే గేట్లు తెరుచుకుంటాయి. ఇంకా చెప్పాలంటే… మెట్రో కార్డు ఉన్న ఏకైక కేంద్ర మంత్రి అశోక్‌. ఏ విమానంలోనైనా ఎగ్జిక్యూటివ్‌/బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించే అధికారం/అవకాశం అశోక్‌ గజపతికి ఉంటుంది. ఆయన దీనిని కూడా ఉపయోగించుకోరు. సాధారణ క్లాస్‌లోనే ప్రయాణిస్తారు. ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌లలో కాఫీ తాగటానికి రెస్టారెంటుకు వెళ్లినా ఓ మూల ప్లాస్లిక్‌ కుర్చీలో కూర్చుని తింటారు. ఆయన 7సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఎంపీ. దాదాపు రాష్ట్రంలో అన్ని ముఖ్యమైన మంత్రిత్వశాఖలు నిర్వహించిన ఓ సీనియర్‌ రాజకీయవేత్త కావటమేనా ఈయన గొప్పతనం అంటే అదీ కాదు. కోరుకొండ సైనిక్ స్కూల్ స్థాపన కోసం 1961-62లో కేంద్ర ప్రభుత్వానికి కోరుకొండ ప్యాలెస్‌తో సహా సుమారు వెయ్యి ఎకరాల స్థలం దానం చేసిన మహా దాత. విద్యావంతుడు. గుణవంతుడు. శీలవంతుడు. అలాంటి వ్యక్తి నిరాడంబరంగా ఉంటే ఏమీ లేని ఆకుల్లాంటి వాళ్లు ఎగిరెగిరి పడటం సిగ్గుచేటు.

ధ్వజస్థంభం పుట్టుక

ధ్వజస్థంభం పుట్టుక

మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

🙏🙏🙏

భీమ్ కుండ్ మిస్టరీ


భీమ్ కుండ్ మిస్టరీ !

ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి 3చెరువుల నీళ్ళు త్రాగించింది. చేసేదేమీలేక ఆ టీం వారు తోక ముడుచుకుని వెనుదిరిగారు.ఇంతకీ ఆ జలాశయం పేరు చెప్పలేదు కదూ. ఆ జలాశయం పేరు భీంకుండ్. ఏంటీ మధ్యలో భీముని పేరు ఎందుకొచ్చిందని ఆశ్చర్యపోతున్నారా?

 

భీమ్ కుండ్ మిస్టరీ !
ఈ జలాశయానికి భీంకుండ్ అని పేరు పెట్టడం వెనుక ఒక పురాణ గాథ వుంది. మహాభారతంలో పాండవులు జూదంలో ఓడిపోయి, రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపదీసమేతంగా వనవాసానికి వెళ్ళేటప్పుడు,మార్గ మధ్యంలో సూర్యునిదాటిని తట్టుకోలేక విపరీతమైన దాహంతో ద్రౌపదీ విల విలలాడి పోయింది. అది ఒక కొండ ప్రదేశం.
 

భీమ్ కుండ్ మిస్టరీ !
కను చూపు మేర ఎక్కడ నీటి ఆనవాళ్ళు కనిపించలేదు.దాంతో భీముడు తన గద తీసుకుని కోపంతో ఆ కొండపై ఒక్క వేటు వేసాడంతే. ఇంకేముంది.భీముడు ఎక్కడైతే గదతో మోదాడో ఆ కొండపైనున్న భూమి కిందికి కృంగి జలాశయం ఏర్పడినది.

 

భీమ్ కుండ్ మిస్టరీ !
ఆ నీటిని త్రాగి అందరూ తమ దాహాన్ని తీర్చుకున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటి వరకూ యుగయుగాలుగా ఆ జలాశయం ఎండిపోకుండా ఇంకా అలాగే వుంది.అందుకే ఈ జలాశయానికి భీంకుండ్ అని పేరు పెట్టారు.

 

భీమ్ కుండ్ మిస్టరీ !
ఎక్కడ వుంది?
ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్ పూర్ జిల్లాకి 80కిమీ ల దూరంలో వుంది. అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయంఏంటంటే ఎన్నో అడ్వాన్సెడ్ ఎక్విప్ మెంట్స్ అందుబాటులో వున్నప్పటికీఎన్నో ఈ జలాశయం లోతును మాత్రం ఖచ్చితంగా ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. సుప్రసిద్ధ భూగర్భశాస్త్రవేత్తలు సైతం మావల్ల కావట్లేదని చేతులెత్తేసారు.

భీమ్ కుండ్ మిస్టరీ !
అలాగే ఈ జలాశయం లోతును కనుక్కోవటానికి డిస్కవరీచానల్ టీంలోని వరల్డ్ ఫేమస్ స్విమ్మర్స్ కూడా చాలా ప్రయత్నం చేసారు.అయితే వారికి కొన్ని విచిత్రమైన ఇంతకుముందు ఎన్నడూచూడని కొన్ని జలప్రాణులు మాత్రం కనిపించాయట. అలాగే వారికి 80అడుగుల లోతులో సముద్రపు అలలు తగిలినప్పుడు కలిగే అనుభూతి కలిగిందట.దాంతో సైంటిస్ట్ లు ఈ జలాశయం సముద్రంతో లింక్ చేయబడివుందనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

 

భీమ్ కుండ్ మిస్టరీ !
అలాగే ఈ జలాశయానికి అండర్ గ్రౌండ్ లో వాటర్ రావటానికి ఒక ఇన్ పుట్, వాటర్ వెళ్ళటానికి ఒక ఔట్ పుట్ మార్గాలున్నాయని అందుకనే ఈ జలాశయం అడుగులో సముద్రగర్భం అంతర్భాగంలో వుండే భయానక లక్షణాలు కనిపిస్తున్నాయని చెప్పారు.ఇన్ని చెప్పారుకాని ఆ జలాశయం లోతెంతాఅని అడిగితే మాత్రం నీళ్ళు నమిలారు.

 

భీమ్ కుండ్ మిస్టరీ !
ఈ జలాశయానికి సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం సాధారణంగా చెరువుల్లో, బావుల్లో, జలాశయాలలో గనక ఎవరైనా మునిగి చనిపోతే కొన్ని రోజులకు వారి శరీరం ఉబ్బి పైకి తేలుతుంది. కానీ ఈ జలాశయంలో ఎవరైనా మునిగిచనిపోయారో ఇక వారి శవం అడ్రస్ ఆ దేవుడికే తెలియాలి.

 

భీమ్ కుండ్ మిస్టరీ !
ఈ జలాశయంలో మునిగి చాలా మంది చనిపోయినప్పటికి ఒక్కరంటే ఒక్కరి శవంకూడా ఇప్పటివరకూ పైకి తేలలేదు.వింటుంటే ఏదో మిస్టరీగా వుంది కదూ. ఈ జలాశయంలోని నీరు సముద్రపునీటిలాగా బ్లూకలర్ లో వుండి ట్రాన్సపరెంట్ గా క్లిస్టర్ క్లియర్ గా వుంటుంది.రోజూ ఎంతో మంది ఈ జలాశయంలో స్విమ్మింగ్ చేస్తూ స్నానం చేసినప్పటికీ ఈ జలాశయం మాత్రం ప్రతీరోజూ క్లీన్ చేసే లాగా స్విమ్మింగ్ పూల్ లాగా క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది.

 

భీమ్ కుండ్ మిస్టరీ !
అందుకే స్థానికులు ఈ జలాశయాన్ని నేచ్యురల్ స్విమ్మింగ్ పూల్ అని పిలుచుకుంటారు.అదేవిధంగా ఈ జలాశయంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తొలగిపోతాయని,సర్వపాపాలు నశిస్తాయని,ఈ నీరు హిమాలయాపర్వతప్రాంతాలలోని పవిత్రగంగా జలంతో సమానమని కొంతమంది బలంగా నమ్ముతున్నారు.

 

భీమ్ కుండ్ మిస్టరీ !
అందుకే సుదూరప్రాంతాల నుండి ఈ జలాశయంలో స్నానం చేయటానికి యాత్రికులు వస్తూ పోతూ వుంటారు. పై భాగంలో ఓ చిన్నరంధ్రం వుంటుంది. లోపల సువిశాల ప్రాంతం. చూస్తుంటే పురాణాలను నమ్మనివారు సైతం భీముడు నిజంగానే గదతో మోదటం వలన ఈ జలాశయం ఏర్పడిందని ఖచ్చితంగా నమ్మేలావుంది

 

భీమ్ కుండ్ మిస్టరీ !
ఈ జలాశయంలోని నీరు నీలంగా వుండటంవలన దీనిని నీల్ కుంట్ అని, నారద్ కుంట్ అని పిలుస్తుంటారు.మధ్యలో నారదుడు ఎందుకొచ్చాడు అని అనుకుంటున్నారా? దానికీ ఓ ఫేమస్ స్టోరీ ఇక్కడ ప్రచారంలో వుంది.
 

భీమ్ కుండ్ మిస్టరీ !
నారద మహర్షి శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ ప్రాంతంలో ఘోరతపస్సు చేసాడట. నారదుని గాంధర్వ గానంతో శ్రీమహా విష్ణువు పులకించిపోయాడట.నారదుడిభక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ జలాశయం నుండి బయటకువచ్చాడని అందుకే శ్రీ మహావిష్ణువు శరీరఛాయతగిలి ఈ జలాశయంలోని నీరు నీలిరంగులోకి మారిపోయాయని భక్తుల విశ్వాసం

శివలింగం గురించి వివరణ ఇవ్వండి

శివలింగం గురించి వివరణ ఇవ్వండి?

శివుడిని మనం అనేక రూపాల్లో ఆరాధన చేస్తాం .ఏ దేవతారాదనైనా శాస్త్రం రెండు రకాలుగా విభజించింది.సాకార రూపం ,నిరాకార రూపం అని.సాకారము కానీ,నిరాకారము కానీ ఏకైక స్వరూపం శివ లింగం.అందుకే శివ లింగాన్ని అరూప రూపి లేదా అవ్యక్త వ్యక్తం అన్నారు.శివ అనగా శాంతము(ఇంకా అనేక అర్థాలున్నాయ్ మంగలం, చతుర్దమ్,తాప ఉపశమనం,etc).లింగం అనగా గుర్తు.
శివ లిగం అంటే శాంతికి,మంగలమునకు గుర్తు.
శివ లింగం ఈ సకల సృష్టి కి గుర్తు.అందుకే లింగానికి అభిషేక సమయంలో పఠించే రుద్రాధ్యాయా నికి ముందు ""ఆపాతల నభాస్థలాన్త్ భువన బ్రహ్మాండ మావి స్ఫురత్
జ్యోతి స్పాటిక లింగ""అన్నారు.పాతలం నుండి ఆకాశం వరకు వ్యాపించివున్న జ్యోతి లింగాన్ని ధ్యానం చేస్తాము.అంటే ఈ సర్వ సృష్టి కి గుర్తు లింగం.అందుకే ఈ సృష్టిలో ఏదైనా లింగాకారంగా ఉంటుంది.భూమి,సూర్యుడు,చంద్రుడు,గ్రహాలు,వాటి కక్షలు,పాలపుంతలు,block hole కి ఆకారం కనుక్కుంటే అది,సమస్త సృష్టి లింగాకారంగానే ఉంటుంది.ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే మనలో వుండే జీవుడు కూడా లింగాకారంగా నే ఉంటాడు."అదో నిష్ట్యా వితస్థాన్తి నాభ్య ముపరి తిష్ఠతి జ్వాల మాలకులంబాతి".మన నాభి దగ్గర చిటకన వేలు పెట్టి జానెడు దూరం నాభి పై భాగాస్నా పెడితే మన బొటన వేలు ఎక్కడ తాకుతూ వుంతుందో అక్కడే వడ్ల గింజ కోన భాగంలో 10 వ వంతు , అంత చిన్నగా  జీవుడు దీపం రూపంలో  ఉంటాడు అని వేదం.ఆ జీవుడు కూడా లింగకారియే ఎందుకంటే దీపం లా అని చెప్పింది వేదం క్కబట్టి దీపం ఏ ఆకారంలో వెలుగుతుంది లింగాకారం.i.e jevudu కూడా లింగమే అందుకే వీర శైవ సంప్రదాయంలో అక్కడ (జీవుడు వుండే స్థానంలో)లింగం తాకే లాగా మెడలో వేసుకుంటారు.అలా వేసుకుంటే వారు శివమయం అయ్యారు అని గుర్తు.

శివలింగం అని మాములు గా అంటున్నాం కానీ ఇందులో మూడు భాగాలు నిక్షిప్తం అయి ఉన్నాయి అవి బ్రహ్మ పీఠం,పానవట్టం, లింగము అని.బ్రహ్మ పీఠం అనగా పానవట్టం నిలపడానికి ఉంచే పీఠం.లింగ రూపాన్ని బట్టి (మనకు చాలా రకాలైన లింగాలు ఉన్నాయి)దీనిని బయటకు గాని,లోపలికి గాని ఉంచటం జరుగుతుంది.ఉదహణకు సహస్ర లింగాన్ని పెడితే బ్రహ్మ పీఠం బయటకు ఉండాలి,ఉమ మహేశ్వర లింగం ,నగరేశ్వర లింగం అయితే బ్రహ్మ పీఠం లోపలికి ఉంటుంది.ఈ శివలింగం పెట్టె పీఠం బ్రహ్మకు ప్రతీక.
పానవట్టం విష్ణువు స్వరూపం అని చెప్తారు.కాబట్టే పరమ శివ భక్తుడు విష్ణు ద్వేషి అయిన రావణుడు విష్ణు స్వరూపమైన పానవట్టం లేకుండా ఆరాధన చేసేవాడు అని పురాణోక్తి.ఇప్పటికి కొన్ని పూర్వ వీర శైవ దేవాలయాలు చూస్తే పానవట్టం ఉండదు.ఇకపోతే లింగం సాక్షాత్ గా పరమ శివ స్వరూపం.అంటే మనం శివలింగం అంటే పరమేశ్వరుడు అని ఆరాధన చేస్తున్నాం కానీ ఇందులో బ్రహ్మ ,విష్ణు,మహేశ్వర ఆరాధన జరుగుతుంది.ఏ పూజలోనైన(అర్చకుడు బ్రహ్మ,శివార్చన ఐతే చేసేవాడు విష్ణువు,విష్ణూవు అర్చన అయితే చేసేవాడు శివుడు),ఏ గ్రంధములలో నైనా(రామాయణంలో చూస్తే రాముడు విష్ణువు,హనుమ శివుడు,జాంబవంతుడు బ్రహ్మ),వీరు ముగ్గురు లేకుండా వుండరు.

శివలింగం యొక్క ఇంకొక రహస్యం లింగం పరమేశ్వరుడు,పానవట్టం అమ్మవారు ఇద్దరి కలయిక శివలింగం.అనగా ప్రకృతి పురుషుల కలయిక.

శివలింగంలో లింగం  పదార్థం నకు.పానవట్టం శక్తి కి గుర్తు .పదార్థం శక్తి కలయిక శివలింగం.అంటే సృష్టి మొత్తం పదార్థం (matter)శక్తి(స్థితి శక్తి,గతి శక్తి)(energy)కలయిక.

ఇలా అనేక నిర్వచనాలు ఉన్నాయి.కానీ ఇప్పటికి ఇవి తెలుసుకున్నాం వీటిని బాగా ఆలోచన(తత్వం ఆలోచనామృతం) చేయండి ,ధ్యానం చేయండి ఇంకా అనేకమైన శాస్త్రీయవిషయాలు మీకు  తెలుస్తాయి అన్నింటిని ఇక్కడ పెట్టడం కష్టం.

శివలింగ నిర్మాణం:
శివ లింగ నిర్మాణము ను బట్టి అది ఏ లింగమో చెబుతారు. దాదాపు గా సామాన్య మునుష్యులు(తప శక్తి లేని వారు) ప్రతిష్ట చేసే లింగాలకు బ్రహ్మ పీఠం, పానవట్టం ,లింగం ఒకే ఎత్తులో ఉంటాయ్.
కానీ ఆగమాల్లో ఆ లింగ నిర్మాణాన్ని బట్టి ఆ లింగం ధ్యాన లింగమో, రుద్ర లింగమో,అఘోర లింగమో, అభయ లింగమో(నిల్చినీ అభయహస్తం ఇచ్చే లింగమో),భోగ లింగమో,..నిర్ణయం చేస్తారు.కొన్ని చోట్ల లింగము పానవట్టం కంటే రెండింతలు ఉంటుంది దానిని జ్ఞాన లింగంగా చెప్తారు ఇలా అనేక లింగాలు ఉన్నాయి.మీరు ప్రముఖ శైవ క్షేత్రాలకు వెళ్ళినపుడు ఉన్న అనేక లింగాలు గమనించండి.వాటి పేర్లు రాసుకోండి మీకు ఒక అవగాహన వస్తుంది.
ఇవి కాక చేసిన పాపముల ప్రాయశ్చిత్తమునకు ఏవేవీ ఎంత పరిమాణంలో ఉన్న లింగాలను ప్రతిష్ట చేయాలో చెబుతారు.ఇలా అనేక లింగముల నిర్మాణాన్ని శిల్పశాస్త్రం,ఆగమ శాస్త్రాలు నిర్ణయం చేస్తాయి.
ఇవి కాక పంచ భూత లింగలు(పృథ్వీ, జల,వాయు,ఆకాశ, అగ్ని లింగాలు) అని ఉన్నాయి.మాములుగా ఎత్తుగా గుండ్రంగా వుండే లింగాకారం  ,వెడల్పుగా ముక్కోణాకారంగా,పంచకోణాకారంగా,అష్ట కొనాకారంగా ,భగకారంగ(యోని అకృతిలో) అవి పంచ భూత లింగాలు.వీటిని శ్రీశైల దేవాలయం వెనుక భాగాన,శ్రీకాళహస్తి లో చూడవచ్చూ.ఇవి కాక ఇంకా 12 రకాల లింగాలు ఉన్నాయి సహస్ర లింగం,బాణా లింగం వంటివి యెన్నో ఉన్నాయి.
ఈ లింగకార నిర్మాణం అనేది గొప్ప శాస్త్రం మరియు వీటిని తప శక్తి  ద్వారా అర్థం చేసుకోగలం.
వీటి నిర్మాణం ఇలాగే ఎందుకు జరగాలి అనే దానికి కూడా శాస్త్రం సమాధానం చెబుతుంది.మనకు ఆ శాస్త్రీయ దృష్టి లేక తెలుసుకోలేక పోతున్నాము.

సరే శివ లింగ తత్వం, శివ లింగ నిర్మాణం ఎలా వున్నా మనం శివలింగారాధన ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి.ఇక్కడ ఆరాధన మొత్తం చెప్పకున్న ఆరాధనలో వచ్చే లోపాలు మాత్రం వివరిస్తాను.
1.ఇతర దేవతారధనకు లింగారాధనకు ప్రధాన బేధం ఉంది ఇతర ఆరాధన ల వల్ల సాలోక్య(ఎవరిని ఆరాధన చేస్తే వారి లోకం ప్రాప్తించటం ex:విష్ణువు-వైకుంఠం,కృష్ణుడు@రాధ-గోలోకం,సాకార శివుడు- కైలాసం),సారూప్య(ఎవరిని ఆరాధన చేస్తే వారి వంటి వేషం),సామీప్య( ఎవరిని ఆరాధన చేస్తే వారితో కలిసి దగ్గర గా తిరిగే అదృష్టం) స్థితులు లభిస్తాయి.కానీ లింగారాధన చేస్తే సాక్షాత్తుగా తానే శివుడు అవుతాడు .అంతే కాదు ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలి అంటే శివుడు కానీ వాడు శివుణ్ణి అర్చన చేయలేడు. వాడిలో శివ తేజస్సు ఉంటేనే , వాడు శివార్చన చేయగలడు అని శాస్త్రం"న రుద్రో రద్రమర్చయేత్".
అందుకే మన శాస్త్రం శివార్చన చేసే వారికి నియమోల్లంఘనాన్ని అంగీకరించింది.అంటే మన సంప్రదాయంలో ""కాషాయ దండ మాత్రేణ యతి పూజ్యో న సంశయ:"" అని సన్యాసి కనిపిస్తే ఎవరైనా నమస్కరించవలసిందే అని కానీ శామ్భవ దీక్షలు ,పాశుపత దీక్షలో ఉండి నిరంతర శివార్చన ,శివాభిషేకం చేసే వారు సన్యాసులకు నమస్కారం చేయరు.ఎందుకంటే వారు శివుడే అయి వుంటారు కాబట్టి.

2. మొదట పానవట్టం నకు పూజ చేసిన తర్వాతనే లింగ పూజ చేయాలి

3. శివలింగాభిషేకం చేసేటప్పుడు ఒక్క లింగాన్ని పెట్టి అభిషేకం చేయవద్దు(సాలగ్రామం తో కలిపి అభిషేకం చేయవచ్చూ)

4. శివ లింగం పై ఒక మారేడు దలన్నాయిన,పువ్వునైన,గంధము నైనా పెట్టి మాత్రమే అభిషేకం ప్రారంభిచాలి.
5. అభిషేక జలములకు అమృత ముద్ర ,గరుడ ముద్ర చూపినప్పుడే ఆ జలములు అభిషేకమునకు పనికి వస్తాయి.

6. అభిషేక జలములను మహాన్యాసం కానీ,లఘు న్యాసం కానీ,అర్చకులు మాత్రమే తొక్కవచ్చూ .మిగతా వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అభిషేక జలములకు గాని,ఈశ్వర నిర్మాల్యాన్ని గాని తొక్క కూడదు.

7.కనీసం లఘు న్యాసమైన చేసుకోకుండా శివ లింగాభిషేకం చేయకూడదు.

8. పంచామృత అభిషేకం లో ప్రతి ఒక్క పదార్థం తర్వాత శుద్ధ జలములతో అభిషేకం చేయాలి.

9.పానవట్టం నకు  కూడా అభిషేకం చేయాలి(కొందరు మొత్తం లింగం మీద మాత్రమే నీరు పోస్తారు.పానవట్టం పార్వతి అని గుర్తుంచుకోవాలి.

శివలింగం గూర్చి,శివ లింగ నిర్మాణం గురించి ఆగమాల్లో చాలా శాస్త్రీయంగా ,వైజ్ఞానికంగా చెప్పారు.వేదాలు ముఖ్యన్గా రుద్రము(నమక చమకం) శివ తత్వాన్ని వర్ణన చేశాయి.శివాభిషేకం అంటే ఏమిటి? ఎలా చేయాలి?రుద్రాధ్యాయ అంతరార్థం ఏమిటి?మనం తెలియక చేసే పొరపాట్లు ఏమిటి తర్వాత చూద్దాం.
ఇలా శివలింగ తత్వం గురుంచి ఎంతైనా చెప్పుకోవచ్చూ. ఎప్పుడైనా equipment సహకరిస్తే చక్కగా వీడియో చేసి పెడతాను.

శివోహం శివోహం శివోహం
                   సశేషం(ఇది ఎంత చెప్పినా పూర్తి అవదు)

Thursday, 9 November 2017

మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను చదివారా

*మీరు ఈ పాశ్చాత్య తత్వవేత్తల నమ్మకాలను    చదివారా?*
-----------------------------------------
 *లేకపొతే చదవండి*
అందరికి తెలియచేయండి

-----
1. *లియో టాల్స్టాయ్ (1828-1910)*
హిందువులు మరియు హిందుత్వo ఒకరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఎందుకంటే ఇది జ్ఞానం మరియు వివేకం యొక్కకలయిక.

2. *హెర్బర్ట్ వెల్స్ (1846 - 1946):*
హిందూత్వ ప్రభావాన్ని పునరుద్ధరించే వరకూ ఎన్నో తరాలు దురాక్రమణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒకరోజు ప్రపంచo ఆకర్షించబడుతుంది. ఆ రోజున ప్రపంచం ప్రశాంతంగా నివసించనుంది.

3. *ఆల్బర్ట్ ఐన్స్టీన్ (1879-1955):*
తన మేధస్సు మరియు అవగాహన ద్వారా యూదులు ఏమి చేయలేరనేది నేను గ్రహించాను. హిందూత్వంలో శాంతికి దారితీసే శక్తి ఉంది.

4. *హుస్టన్ స్మిత్ (1919):*
నాకు తెలుసు.. ఒక హిందువు తన తెలివి మరియు అవగాహన బయటపెడితే, హిందూత్వం లో ఉన్న శక్తి శాంతికి దారితీస్తుంది.

5. *మైఖేల్ నోస్ట్రాడమస్ (1503 - 1566):*
ఐరోపాలో హిందుత్వo.. పాలించే మతం అవుతుంది. మరియూ ఐరోపా ప్రసిద్ధ నగరం "హిందూ మతం" రాజధానిగా అవుతుంది.

6. *బెర్ట్రాండ్ రస్సెల్ (1872 - 1970):*
నేను హిందూత్వం గురించి చదివాక గ్రహించాను..  ప్రపంచమంతటి మరియు మొత్తం మానవాళి యొక్క మతం అని తెలుసుకున్నాను. హిందూత్వo ఐరోపా అంతటా మరియు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతుంది, హిందూ మతం యొక్క గొప్ప ఆలోచనాపరులు ఆవిర్భవిస్తారు. ఒకరోజు హిందువులు ప్రపంచం యొక్క నిజమైన ఉద్దీపనకు వస్తారు. .

7. *గోస్టా లోబోన్ (1841 - 1931):*
హిందువులు శాంతి మరియు సయోధ్య గురించి మాట్లాడతారు. వారి సంస్కరణల విశ్వాసాన్ని అభినందించడానికి నేను క్రైస్తవులను ఆహ్వానిస్తున్నాను.

8. *బెర్నార్డ్ షా (1856 - 1950):*
మొత్తం ప్రపంచం అంతా ఏదో ఒకరోజు  హిందూత్వాన్ని అంగీకరిస్తుంది. అసలు పేరును కూడా అంగీకరించకపోతే అది ఏ "పేరు"తో అయినా అంగీకరించబడుతుంది. హిందూత్వాన్ని పశ్చిమ దేశాలు అంగీకరించాలి, హిందూ మతం ప్రపంచంలో "అధ్యయనం" చేసుకునే వారి మతం.

9. *జోహన్ గీత్ (1749 - 1832):*
మనమందరం ఇప్పుడు లేదా తరువాత అయినా సరే హిందూమతాన్ని అంగీకరించాలి మరియు ఇదే నిజమైన మతం.

భారతదేశం లో పుట్టీ, పెరిగీ, ఈ గాలి పీలుస్తూ, ఈ మట్టి నుండి వస్తున్న అన్నo తింటూ కూడా మన గొప్పదనాన్ని మనమే గ్రహించక పనికి రాని చెత్త అంతా గొప్పదనుకుంటూ తిరుగుతున్నాం !!!

*జనులారా... ఇది మన "సనాతన ధర్మం" యొక్క గొప్పతనం.  ఏనాడో ఉన్న lఆంగ్లేయులు మన హైందవం గురించి ఎంత గొప్పగా చెప్పారో చూసారా! :)*

*అందరికీ తెలిసేలా గర్వంగా చెప్పండి*⛳⛳⛳🙏

మనం యోగా ఎందుకు నేర్చుకోవాలి

*మనం  యోగా  ఎందుకు  నేర్చుకోవాలి?*

మనం   యోగాను   “ఆరోగ్యం”  కోసం   నేర్చుకుందాము   అనుకుంటున్నాము  .   యోగా  యొక్క అంతిమ  లక్ష్యం    ఆరోగ్యం  కాదు   .  అంతిమ  లక్ష్యం    “భగవస్సాక్షాత్కారం”   .  అయితే   మనకు   ముందుగా  భగవంతుడు   గురించిన  ఆలోచన  కన్నా   మన  శరీరానికి   సంబంధించిన   ఆలోచనలూ   ,  మనమూ ..  మన  జీవిత  భాగస్వామి ..  మన  పిల్లలూ   ..  మన  కుటుంబం   ఇదే  రకమయిన  ఆలోచనలు   తో  సతమతం   అవుతూ  ఉంటాము   .  ఈ  ఆలోచనలనుండి   బయట  పడడం  చాలా  కష్ట  సాధ్యం  అయిన  పని   .  అందుకు  ఎంతో   సాధన  కావాలి  ,  ఎంతో  కాలం ,  పట్టుదల   కావాలి  .   ఆదిశగా    మనలను  నడిపించేదే   యోగం .  యోగా   ద్వారా   మనం  ముందుగా   మన  శారీరక  సమస్యలనుండి   బయట  పడడం  జరిగితే   మన   మనసులో   ఒక  పరివర్తన   వస్తుంది  .   ఆ  పరివర్తన   కలగడమే  “యోగం” 
.

*యోగం   అంటే   కలయిక*
మన  శరీరం   మన  మనసుతో   కలవాలి
మన  మనసు   మన  బుద్ధితో   కలవాలి
మన  బుద్ది   మన  ఆత్మతో   కలవాలి
మన  ఆత్మ  మన పరమాత్మ  తో  కలవాలి
ఇది   ఎలా   సాధ్యపడుతుంది ?  అందుకు  మనం  చెయ్యవలసినది “ప్రాణాయామం”

యోగం  అనేది   ఒక  ప్రక్రియ  కాదు  ఒక   జీవన  శైలి . మన  పూర్వీకులు యోగాకు  ఎనిమిది అంగములు  ఉన్నాయి అంటారు . 
అవి 1.  యమము 2.  నియమము  3. ఆసనము 4.
ప్రాణాయామము 5. ప్రత్యాహారం
6. ధారణ 7. ధ్యానం8.  సమాధి
ఇవి  అన్నీ   ఆచరించినవాడు   దైవసమానుడు .  దైవ  దర్శనం   చేసిన  అనుభూతిని   ప్రతి క్షణం  అనుభవించగలడు.  ఈ  విషయాలను  నేను  అధికంగా  ఇక్కడ     పేర్కొనడం  లేదు .


*1.యమము* అనగా ఇంద్రియ నిగ్రహము
అహింసా సత్యాస్తేయా బ్రహ్మచర్యా పరిగ్రహా  యమాః

 1. అహింస 2. సత్యము 3. అస్తేయము (మనో వాక్కాయ కర్మలచేత పర ద్రవ్యమునందు కోరిక లేకుండా ఉండుట) 4. దొంగిలింపకుండుట 5. బ్రహ్మ చర్యము
.

*2.  నియమము:*

శౌచ  సంతోష తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః
.

నియమము 1. శౌచం 2. సంతోషము 3. తపస్సు 4. స్వాధ్యాయము 5. ఈశ్వర ప్రణిధానము నియమములు
.

*3.ఆసనం:*

పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆత్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు.  ఇవి  ఎన్ని  అనే  విషయాన్ని   ఒక్కొక్కరు  ఒక్కొక్క  రకంగా  చెప్పారు .

*4. ప్రాణాయామం:*

శ్వాసను  క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. బాబా  రామ్  దేవ్  గారు   శరీర ఆరోగ్యం  దృష్ట్యా   ఎనిమిది  రకాల   ప్రాణాయామాలు  అందరూ  చెయ్యాలని  చెబుతున్నారు
.

*5. ప్రత్యాహారం:*

ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము.
.

*6. ధారణ:*

ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట.
.

*7. ధ్యానము:*

ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము.
.

*8. సమాధి*

అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.

 *యోగసాధనకు   ఉపక్రమించడం  ఎలాగో   తెలుసుకుందాం*

ప్రాణాయామం   ఖాళీ  కడుపుతో చెయ్యండి . ఉదయం  చాలా  మంచిది . అలా  కుదరని  వారు  భోజనం  చేసిన  నాలుగు  అయిదు  గంటల  తర్వాత  చెయ్యండి . మన  మనసు  ఎప్పుడో  ఎదో  ఒక  విషయం  ఆలోచిస్తూనే  ఉంటుంది .  మన  ఆలోచనల  ఫలితమే  మన  వ్యక్తిత్వం . ఒక  మనిషిని  మంచివాడుగా  , దొంగగా ఉగ్రవాదిగా ,  సాత్వికుడుగా , ఋషిగా  రూపొందించేవి అతని  ఆలోచనలే .  దీనికి  మూలకారణం  మనస్సు . దీనినే  చిత్తం  అంటారు . చిట్టా  వృత్తి నిరోధానికి  మనం  చేసేదే  ప్రాణాయామం  .  చిత్తాన్ని  మంచి  వైపుకు  మళ్ళించేది యోగం 
.

 మనం  జీవించి  ఉన్నంత  కాలం  జరిగే  ప్రకియ   శ్వాసక్రియ  .  శ్వాస  ఆగితే  ప్రాణం  పోయింది  అంటాము . అంటే  మనం  పీల్చే  గాలిలో  మన  ప్రాణం  ఉంది  అన్నమాట  .  ఈ  ప్రాణం  యొక్క  ఆయామమే   ప్రాణాయామం .
.

   ప్రాణాయామానికి ముందు  సంసిద్ధత
1.  స్థిర  సుఖమపి  ఆసనం (  స్థిరంగా ,  సుఖంగా  కూర్చోవాలి )
2. శరీరం  నెలకు  తగలకుండా  విద్యుద్వాహకం   కాని  దుప్పటి  గాని  ,  బొంత  కానీ  ,  రబ్బరు  మేట్ గానీ  వేసుకోండి
3. గాలి  ధారాళంగా  వీచే  చోటును  చూసుకోండి (కిటికీలు  తెరచి  ఉంచండి .  ఆరుబయట  చెయ్యండి )
4. ఒక్కరు  ఎక్కువ  సేపు  చెయ్యడం  కష్టం  కనుక  కనీసం  అయిదారుగురు  కలిసి  చెయ్యండి
5. ప్రశాంతమైన   మ్యూజిక్   వింటూ (  ఆధ్యాత్మిక   విషయాలు  గానీ  ,  భక్తి  పాటలు  గానీ వింటూ ) ప్రాణాయామం చెయ్యండి
6. శక్తికి  మించి  చెయ్యకండి .  రోజు  రోజుకూ  శక్తి  పెరుగుతుంది .
7. శ్వాస  క్రియను   ముక్కుతో  మాత్రమె  చెయ్యండి .
8. కళ్ళను  మూసుకుని  ప్రాణాయామం  చెయ్యండి
9. మనసును  చేస్తున్న  ప్రాణాయామం  మీద  పెట్టండి .  వేరే  ఆలోచనలను   వదిలివేస్తూ   ప్రాణాయామం  మీదకు   తిరిగి తిరిగి   తీసుకు  వస్తూ  ఉండండి .
.
ఇపుడు మనం స్థిరంగా  సుఖంగా  కూర్చోవాలి   అందుకు  అనుకూలమైన  ఆసనాలు పద్మాసనం , సిద్ధాసనం , వజ్రాసనం ,  స్వస్తికాసనం , సుఖాసనం .  ఈ  ఆసనాలు  ఏవీ   నా  వల్ల కాదు  అని  మీరు  అనుకుంటే కాళ్ళు  చాపుకుని   కూర్చోవచ్చు  .  అది  దండాసనం .  అది  కూడా  వీలు  కాదు   అనుకుంటే  కుర్చీలో  కూర్చుని   కూడా   మీరు “ప్రాణాయామం”  చేయవచ్చు.