సంస్కృతం అంటే బూతు మాట అయిపోయిన సెక్యులర్ దేశంలో జననిభారతికి నిలువ నీడ లేకుండా పోతోంది. భారతదేశంలో ఎందుకు పుట్టించావు? ఏ జర్మనీలోనో పుట్టిస్తే నిన్ను సేవించుకునే పుణ్యం కలిగేది కదా అని బాధపడే రోజులు 15 ఏళ్ల క్రితం ప్రారంభం అయ్యాయని మీకు తెలుసా? ఎందుకంటే జర్మనీ వారు వచ్చి మన దేశంలో సంస్కృతం బోధిస్తున్నారండీ. సిగ్గుతో తలలు ఎక్కడపెట్టుకోవాలో మన లౌకికవాదనేతలు నిర్ణయించుకంటే మంచిది.
జర్మనీలోని హైడెల్స్ బర్గ్ విశ్వవిద్యాలయం సంస్కృత ప్రచారంలో ప్రపంచంలో దూసుకుపోతోంది. దానికి సెక్యులరిజం అడ్డంకి కాలేదు. విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా విద్యాశాఖ సంస్కృత ప్రచారాన్ని చేస్తోంది. వీరు ప్రపంచంలోని ఏ దేశం వారైనా సరే తమకు సంస్కృతం నేర్చుకోవాలని ఉందీ అని దరఖాస్తు చేసుకుంటే ఆదేశానికి వెళ్లి సంస్కృతం నేర్పుతున్నారు. స్విట్జర్లాండ్, ఇటలీ వంటి పలు దేశాలతో పాటు ఇండియాలో కూడా సంస్కృత బోధనలను చేస్తున్నారు. సంస్కృత భాషను నేర్పే విభాగాన్ని కేవలం కొద్దిరోజులు మాత్రమే నడుపుదామని విశ్వవిద్యాలయం భావించింది. కానీ, ఐరోపాతో పాటు పలు దేశాలనుంచీ సంస్కృతం నేర్పండని ఆహ్వానాలు రావడంతో గత 15 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భారతి సేవలు చేస్తోంది. ప్రస్తుతం భారీగా వస్తున్న డిమాండ్ కారణంగా బోధనా సిబ్బందిని గణనీయంగా పెంచుకుంది.
సంస్కృతం అంటే కాషాయీకరణమే అనే కుహనా వాదులకు మద్దతిస్తున్న మన పాలకులు సిగ్గుపడాల్సిన మరో విషయం ఏమిటంటే జర్మనీలో 14 విశ్వవిద్యాలయాలు సంస్కృతం బోధిస్తున్నాయి. ఇవన్నీ జర్మనీలో మొదటి 15 ర్యాంకింగులలో ఉన్న విశ్వవిద్యాలయాలు కావడం గమనార్హం. చదువులతల్లిని గౌరవిస్తే విశ్వవిద్యాలయానికి ఎంతటి గౌరవం వస్తుందో వారికి బాగా తెలిసివచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వెల్లువలా వస్తున్న దరఖాస్తును వడపోతపోయలేక విశ్వవిద్యాలయ అధికారులు తలలు బాదుకుంటున్నారట. ఎంతో మంది దరఖాస్తులను తిరస్కరిస్తున్నారట. ప్రతీ ఏడాది ఆగస్టులో ఈ తరగతులు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారట. అమెరికా, లండన్, ఇటలీ, ఐరోపా మొదలైన 34 దేశాల నుంచీ ఇక్కడికి వచ్చి వందల సంఖ్యలో విద్యార్థులు సంస్కృతం నేర్చుకుంటున్నారట.
సంస్కృత భాషా ప్రాభవాన్ని గుర్తించి, ఈ తరగతులు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ డాక్టర్ ఏక్సెల్ మైఖేల్స్ భారతదేశంలో సంస్కృతానికి పట్టిన చీడను చూసి అసహ్యించుకుంటూ సంస్కృతం నేర్చుకోవడాన్ని వ్యతిరేకించే రాజకీయవాదుల ఆలోచనా సరళిని మూర్ఖత్వానికి పరాకాష్ఠగా, ఒక గొప్ప సంస్కృతికి గొడ్డలిపెట్టుగా వర్ణించి మన కుహనా లౌకికవాదులకు ఎండు గడ్డిపెడుతున్నారు. మనవాళ్లు దాన్ని కూడా మోపులు, మోపులు పంపండి తింటామంటూ ముందుకు వచ్చి, దాంట్లో కూడా స్కాములు చేసే రకాలని పాపం ఆయనకు తెలియదు.
బౌద్ధధర్మంలోని కీలక భాగం సంస్కృతం నుంచీ గ్రహించినదే అని మనవాళ్ల నెత్తిన కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. ఎక్సెల్గా కనిపిస్తే ఆయన కాళ్లకు నమస్కారం చేస్తే పది జన్మలపాపాలు పోతాయి.
అయిపోయింది. ఇప్పటి వరకూ ఒంగోలు గిత్తల పేటెంట్ రైట్ మాత్రమే మనది కాదని అనుకుంటున్నాము. ఇక మీదట సంస్కృతం కూడా మీది కాదు మాదే అని ఎవరైనా అంటే ఎవ్వరం బాధపడొద్దు. కనీసం అక్కడైనా తల్లిని బతకనిద్దాం. అంతవరకూ ఎందుకూ జర్మనీలోనే సంస్కృతం పుట్టింది అనేసేద్దాం. ఎవ్వరికీ ఏబాధా ఉండదు. కుహనా సెక్యులరిజమా జోహార్

No comments:
Post a Comment