ఈ చక్కని సంస్కృతగీతం మన జన్మభూమి భరత మాతను సంబోధిస్తూ, ఆతల్లి గుణగణాలను కీర్తిస్తూ వ్రాసిన గీతం.
"సాధు సుజన తోషిణీ సకల శత్రు శోషిణీ
శరణాగత ధరణీతల జనగణ పరిపోషిణీ"
భావం: అమ్మా! భరతమాతా! నీవు సజ్జనులను తృప్తిపరచే దానివమ్మా..శత్రుమూకను నిర్మూలించే దానవు.ఈ భూతలం మీద శరణు కోరిన జనులంద రినీ పోషించే తల్లివి నీవేనమ్మా...
వికసిత విజ్ఞానశాస్త్ర విపులకీర్తి ధారిణీ
వికసిత పరమార్థతత్వ విమలసార రూపిణీ
సకలజీవ హితరత మహితాశయ సంశోభినీ
ఆది ధరణి వేద జనని ముని జన సమ్మానినీ
భావం: బాగా వృద్ధి పొందింపబడిన విజ్ఞానశాస్త్రము వలన వ్యాప్తమైన కీర్తిని ధరించినావమ్మా..స్ఫుటమై న ఆధ్యాత్మికతత్వము యొక్క విమలసారమును పెంపొందించి, సకల జీవులకు మేలు కలిగించే ఆశయము కలదానవు నీవే...ఈప్రపంచములో మొట్టమొదటగా ఏర్పడిన భూమివి నువ్వే.వేదము లకు పుట్టినిల్లు నీవే.మునులయొక్క సమూహము చేత గౌరవింపబడేది నీవేతల్లీ!.
ప్రపంచములో మనదేశంలోనే అనేక విజ్ఞాన శాస్త్రాలు వృద్ధిపొందాయి.సర్వ మానవాళికీ మేలు కలిగించే ఆధ్యాత్మకత ఈదేశంలోనిదే.ప్రపంచదేశాలలో మొదట ఏర్పడిన దేశం మన భారతదేశమే. చతు ర్వేదాలు ఈదేశంలోనే జన్మించాయి.ఆదినుంచీ ఋషిపీఠమైన ఈదేశంలో ఎందరో మునిపుంగవులు ఈ భరతమాత వైభవాన్ని కీర్తించారు
నీ గళ నిశ్రుతమై భువి ప్రసరించె సరస్వతీ
నీ హృదయ వినిర్గతమై ప్రభవించె సుసంస్కృతి
జడమూఢ జనాళికెల్ల జాగృతి సంధాయినీ
విజ్ఞానద విభవప్రద విశ్వధాత్రి గుణఖనీ
భావం: తల్లీ! విద్యాదాయిని సరస్వతి నీ గళము నుండే వినపడి ఈ భూమిపై వ్యాపించింది.నీ హృదయము నుండి బయలు వెడలి సంస్కృతి ఈ భూమిపై అవతరించింది.సోమరులై మూర్ఖులైన జనులందరినీ మేలుకొలిపింది నీవేకదమ్మా..విజ్ఞాన వైభవమును ఇచ్చి ఈ ప్రపంచమునకే తల్లివైనావమ్మా..సద్గుణ నిలయవు నీవే కద...
ఈ జగత్తుకు విజ్ఞానభిక్ష పెట్టింది మన దేశమే. కుటుంబ వ్యవస్థ మొదలుగాగల చక్కటి జీవన విధానాన్ని నెలకొల్పింది భారతదేశం.మూర్ఖులు, సోమరులు , అలసత్వం నిండిన జనులందరినీ తట్టిలేపి ఉత్తేజపరచింది మన దేశమే. విద్యా సంపదనిచ్చి విశ్వమాతయైనది మనదేశం.సద్గుణా లకి నిలయం మన భారతదేశం.
దశవిధ శస్త్రాస్త్ర హస్త దనుజజన భయంకరీ
అభయ వరద ముద్రాంకిత ఆర్యజన శివంకరీ
లోచన యుగళాంత అరుణ కరుణ రాగ రంజితా
జయమాతా, జయభారతి, జయజయఅపరాజితా.
భావం: పది చేతులలో వివిధ అస్త్రశస్త్రములు ధరించి, దనుజులకు భయం కలిగించే భయము కలిగించే తల్లివమ్మా నీవు అభయాన్నీ, వరాలను ఇచ్చు ముద్రతో ఆర్యజనులకు శుభమును కలిగించు తల్లివి నీవు నీ చూపులు కరుణామయములమ్మా . దుష్టశిక్షణ-- శిష్టరక్షణ ఈదేశపు సంప్రదాయం. తల్లీ ! భారతీ! నీకు జయమగుగాక.పరాజయమే ఎరుగని తల్లీ! నీకు జయమగుగాక.

No comments:
Post a Comment