Tuesday, 12 September 2017

కృష్ణుని భక్తురాలు మీరాబాయి

కృష్ణుని భక్తురాలు మీరాబాయి:-
       మీరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సాధువుని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన కృష్ణుడి విగ్రహాన్ని గాఢంగా మోహించింది, దీనిని ఆమె జీవితాంతం ఆమె దగ్గరే ఉంచుకుంది. ఆమె తల్లి ఆమె ఆధ్యాత్మిక భావనలకు మద్ధతునిచ్చేది కానీ ఆమె త్వరగా చనిపోయారు. మీరా వివాహం ఆమె చిన్న వయస్సులోనే చిత్తోడ్ రాణా సంగా పెద్ద కొడుకు భోజ్ రాజ్ యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది. ఏమైనా ఆమె క్రొత్త కుటుంబం ఆమె వారి కులదైవాన్ని ప్రార్థించడానికి ఒప్పుకోకపోవడాన్ని, ఆమె భక్తిని, కృష్ణుణ్ణి మాత్రమే నిజంగా పెళ్ళి చేసుకున్నానన్న భావనని ఒప్పుకోలేదు. యుద్ధంలో ఆమె భర్త మరణం, మీరా తన ఇరవైలలో ఆమె తల్లి మరణంతోపాటు ఎదుర్కొన్న నష్టాలలో ఇది ఒకటి. ఆమె అశాశ్వతం నుంచి శాశ్వతాన్ని ప్రేమించడం నేర్చుకుంది. తన బాధని ఆధ్యాత్మిక భక్తిగా మలుచుకొని ఆ స్ఫూర్తితో లెక్కలేనన్ని పాటలని శృంగారం, విరహాల మేళవింపుతో 12-1300 ప్రార్థనా గీతాలు రాసింది.
        కృష్ణుడి మీద మీరా ప్రేమ మొదట వ్యక్తిగత విషయంగానే ఉండేది కానీ కొంత కాలం తరువాత అది ఎక్కువయిపోయి ఆమెని పుర వీధులలో నాట్యం చేసేలా చేసింది. చిత్తోడ్ ఘడ్ క్రొత్త రాజు, ఆమె బావ విక్రమాదిత్య దుస్స్వభావం గల యువకుడు, ఇతను మీరా పేరుని, ఆమె సామాన్యులతో కలవడాన్ని, స్త్రీ అణకువ పైన గల నిర్లక్ష్యాన్ని బలంగా వ్యతిరేకించేవాడు. ఆమెకి విషమివ్వడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఆమె మరదలు ఉడాబాయి ఉత్తుత్తి పుకార్లను పుట్టించేదని చెప్తారు. ఒకానొక సమయంలో మీరా తనకితాను గురు రవిదాస్ ("గురు మిలియా రాయ్ దాస్ జీ") అనుయాయురాలిగా ప్రకటించుకొని కృష్ణాయిజానికి కేంద్రమైన బృందావనానికి వెళ్ళిపోయింది. ఆమె తననితాను కృష్ణుడి ప్రేమలో పిచ్చిదైన గోపిక లలిత పునర్జన్మగా భావించేది. జానపద గాథని బట్టి మనకి ఈ సంఘటన గురించిన ఖచ్చిత వివరాలు తెలుస్తాయి, ఇందులో ఒకచోట ఆమె ఆ సమయంలో బృందావనంలో గురు సాధువు చైతన్య ప్రత్యక్ష అనుయాయి రూపా గోస్వామితో ఆధ్యాత్మిక విషయాలను గురించిన చర్చ జరపాలన్న కోరిక వెలిబుచ్చింది, ఘోటక బ్రహ్మచారి అయిన ఆయన ఒక స్త్రీని కలవడానికి నిరాకరించారు. దీనికి మీరా ఈ విశ్వంలో నిజమైన పురుషుడు కేవలం కృష్ణుడు మాత్రమే అని బదులిచ్చింది. ఆమె తన తీర్థయాత్రను కొనసాగిస్తూ "ఒక గ్రామంనుంచి ఇంకొక గ్రామానికి నాట్యం చేస్తూ వెళుతూ దాదాపు మొత్తం ఉత్తర భారతాన్నంతా చుట్టింది". ఒక కథలో ఆమె కాశీలో కబీర్తో కనిపిస్తుంది, ఇది మరలా సామజిక ఇబ్బందులని కలిగిస్తుంది. ఆమె తన జీవిత చరమాంకాన్న భక్తురాలిగా గుజరాత్ లోని ద్వారకలో గడిపింది.

No comments:

Post a Comment