అమరనాథ్ గుహాలయము – అమరనాథ్
భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో అమరనాథ్ పర్వతంపై ఉన్న అమరనాథ్ గుహలు హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. పరమేశ్వరునికి అంకితమైన ఈ పుణ్యక్షేత్రం 5,000 సంవత్సరాలకు పూర్వందే అని తెలియుచున్నది. ఈ గుహ, శ్రీనగర్ కు సుమారు 141 కి.మీ., దూరంలో సముద్ర మట్టము నుండి 3,888 మీ., ఎత్తులో ఉంది. ఇది లిడ్జర్ వ్యాలీ పహల్ గాం నుండి 46 కి.మీ., దూరంలో, బాల్ తాల్ కు 14 కి.మీ., దూరంలో ఈ అమరనాథ్ గుహ ఉంది. చార్ ధాంలలో ఒకటి అయిన అమరనాథ్ యాత్ర శ్రీనగర్ నుండి ఆరంభం అవుతుంది. ఇది 96 కి.మీ., సుదీర్ఘమైన యాత్ర కనుక సాధారణంగా 16 కి.మీ., దూరంలో ఉన్న చందన్ బారి నుండి యాత్రకు బయలుదేరుతారు. జమ్మూ నుంచి అనంతనాగ్, మట్టాన్, పహల్ గాం, చందన్ బారీ, పంచతరణిల ద్వారా మొత్తం 47 కి.మీ., దూరాన్ని నాలుగు రోజుల్లో ప్రయాణించి ఈ ‘అమరనాథ్’ ని పూర్తిచేస్తారు.
జమ్మూ నుండి 315 కి.మీ., దూరంలో ఉన్న పహల్ గాం చేరడానికి టాక్సీ లేక బస్సులలో చేరుకోవచ్చును. పహల్ గాంలో ఆకాశాన్ని అంటే కొండ చరియలు, నదులు, ఉపనదులు ప్రవహిస్తున్న సుందరప్రదేశం. ఇక్కడ యాత్రీకులు బసచేడానికి వసతి గృహాలు ఉన్నాయి. ఈ అమరనాథ్ యాత్ర జమ్మూ- కాశ్మీర్ ప్రభుత్వం వారిచే నిర్వహించబడుతున్నది. శ్రావణమాసంలో శుక్ల ద్వాదశి నాడు కాశ్మీరు ధర్మార్ధ సంఘంవారు పహల్ గాంలోని గౌరీ శంకర దేవాలయం బలిపీఠం వద్ద ఉన్న 6 అడుగుల ఎత్తుగల త్రిశూలాన్ని చర్రీముబారక్ అంటారు. ఈ త్రిశూలాన్ని తీసుకొని అమరనాథ్ గుహకు బయలుదేరుతారు. ఈ విధంగా అమరనాథ్ యాత్ర ప్రారంభమవుతుంది.
అమరనాథుడు అంటే జరామరణములు లేనివాడు అని అర్థం. ఈ అమరనాథ్ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు “శివలింగం” ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివలింగం పెరగటం తరగటం జరుగుతుంది. మే నుంచి ఆగస్టు మధ్యలో ఈ మంచులింగం పెద్దదిగా ఉంటుంది. అమరనాథ్ గుహంతర్భాగం అంతా సున్నపురాయితో ఏర్పడినట్లు ఉంటుంది. ఆ గుహ ఉపరితలం నుండి జారిపడే హిమజాలం బిందువు బిందువుగా నెలకు రాలగా... వెలుపలి శీతల వాతావరణ పరిస్థితులకి ఘనీభవిస్తుంది. అలా బిందువు పై బిందువు జారిపడుతూ...ఘనీభావిస్తూ, పౌర్ణమి తిథి నాటికల్లా ఎనిమిదడుగుల ఎత్తులో మంచు శివలింగం ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలోనే ఒక వింతగా కొనియాడబడుతుంది. గణేశునికి, పార్వతీదేవికి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి.
చరిత్ర:- ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరునితో “నాథా మీరు కంఠంలో ధరించిన కపాలమాల గురించి వినాలని ఉంది” అడిగింది. అందుకు పరమేశ్వరుడు “దేవీ! ఈ కపాలములన్నీ నీ పూర్వజన్మల అవతార విశేషాలకు గుర్తులు. నీవు జన్మించినపుడల్లా నేను ఈ కపాలమాలలో అదనంగా ఒక కపాలంను చేర్చి ధరిస్తుంటాను” అని బదులిచ్చాడు. పార్వతీదేవి “నాథా! నేను తిరిగి జన్మిస్తుంటాను. మీరు మాత్రం అలాగే శాశ్వతుడుగా ఉంటున్నారు. ఇది ఎలా సాధ్యం?” అని అడిగింది. అందుకు ఈశ్వరుడు “పార్వతీ ఇది పరమ రహస్యం. కనుక ప్రాణకోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి’ అని ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతికి చివరకు ఈశ్వరుడు ఈ అమరనాథ్ గుహను ఎంచుకున్నాడు. శివుడు ఈ గుహను ఎన్నుకొనటానికి ముందు తనతోపాటు ఉన్న వారందరినీ వదిలి పెట్టి వెళ్ళాడు. తర్వాత తన తలపై ఉన్న చంద్రుని చందన్వారి వద్ద వదిలి వెళ్ళాడు. ఆ తర్వాత తనతో ఉన్న సర్పాలను పిషాంగ్ సరోవర తీరానా శేష నాగ్ వద్ద వదిలి వెళ్ళాడు. ఆ తరువాత తన కిమారుడైన గణేషుడ్ని మహాగుణ పర్వతం వద్ద వడిచి పెట్టాడు. ఆ తర్వాత మహాశివుడు పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను పంచ్ తర్ణి వద్ద వదిలి పార్వతీదేవితో అమరనాథ్ లోని అమరలింగం ఉన్న గుహలోపలికి వెళ్ళారు. తన డమరుకంతో పెద్ద పెద్ద భయంకరనాధాలు చేశాడు. ఆ గుహలో ఉన్నపక్షులు, పావురాళ్ళు ఆ శబ్దాలకి భయపడి దూరంగా ఎగిరిపోయాయి. ఆ తర్వాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వ రహస్యం మరియు జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు. గుహలో పావురాళ్ళు శివుడు పార్వతితో చెప్పిన అమరగాథను వినినవి. ఈ విషయం తెలిసికొనిన శివుడు జీవధర్మమైన జనన మరణములు ఈ పావురములు జంటకు ఉండదు. మన ఇద్దరము ఈ పావురముల రూపమున ఈ గుహలోనే ఉండి, మన దర్శనానికి వచ్చే భక్తులకు కైవల్యం ప్రసాదిద్దాము అని తెలియజేశాడు. ఇప్పటికీ పావురాళ్ళ జంట అజరామరమై ఈ గుహకు వచ్చి శివుని అర్చించిన వారికి దర్శనమిచ్చుచూ ముక్తిని ప్రసాదిస్తున్నవి అని చెబుతారు.
గుజ్జర్ జాతికి చెందిన బూటా మాలిక్ అనే గొర్రెల కాపరికి ఒకరోజున ఒక సాధువు కనపడి ఒక సంచి నిండా బొగ్గులను ఇచ్చాడు. బూటా మాలిక్ వాటిని తీసుకొని ఇంటికి వచ్చి చూడగా, ఆ సాధువు ఇచ్చిన బొగ్గులు బంగారు నాణేలుగా మారాయి. మరునాడు బూటా మాలిక్ సాధువుకు కృతజ్ఞతలు చెప్పడానికి అక్కడికివెళ్ళి చూస్తే అతడికి అక్కడ ఆ సాధువు కనిపించలేదు. కాని అక్కడ ఒక అద్భుతమైన మంచుతో కూడిన అమరలింగం కనిపించింది. ఆ విధంగా ఈ గుహాలయం కనుగొనబడింది. కాలక్రమేణా అది అమరనాథ్ యాత్రాస్థలంగా ప్రసిద్ధిచెందినది. మంచు లింగాకారంలో పరమేశ్వరుడు ప్రజలకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తున్నాడు. ఈ గుహ పాషాణ నిర్మితము. ఆ గుహలోగల రాతి పొడినే విభూదిగా భక్తులు ధరిస్తారు.
భారతీయ సైన్యం, భారతీయ పారామిలటరీ దళాలు, సి.ఆర్.పి.ఎఫ్, ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటారు. అందువల్ల, అమరనాథ్ గుహను సందర్శించాలంటే ఉన్నత అధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి. పహల్ గాం నుండి 16 కి.మీ., దూరంలో చంద్రన్వారి ఉంది. పహల్ గాం నుండి చంద్రన్వారి వరకు మిని బస్సులు ఉంటాయి. లిడ్జర్ నదీ తీరం వెంట ఈ బస్సు మార్గం ఉంటుంది. శేష్ నాగ్ ఏడు పర్వత శిఖరాలు కల్గిన పర్వత ప్రాంతం. ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుడి ఏడుపడగలకి గుర్తుగా భావించబడుతుంది. ఇది అమరనాథ్ యాత్రలో రెండవ రోజు మజిలీ. శేష్ నాగ్ నుంచి యాత్రీకులు మహాగుణా మార్గంలో పయనించి సముద్రమట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న పాంచ్ తర్ణి చేరుకుంటారు. యాత్రీకులు వాతావరణ పరిస్థతులు తట్టుకోడానికి ఉన్ని వస్త్రాలు ధరించడం తప్పనిసరి. మహాగుణ మార్గంలో అనేక ఉపనదులూ, జలపాతాలు, సెలయేళ్ళతో ఈ మార్గంలో పయనించడం ఎంతో మనోహరంగా ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి పులకించిపోతాము. భైరవపర్వతం పాదభాగంలో ఉన్న పాంచ్ తర్ణి వద్ద పరమశివుడి తల మీద నుండి ఐదు నదులు ప్రవహిస్తుంటాయి. యాత్రీకులు పాంచ్ తర్ణి వద్ద మూడవరోజు మజిలీ చేస్తారు. పాంచ్ తర్ణి నుండి అమరనాథ్ గుహలు చేరుకునే మార్గంలో యాత్రీకులు అమరావతీ పంచ్ తర్ణి సంగమప్రాంతాన్ని దర్శించవచ్చు. గుహాలయంలో ప్రవేశించేముందు కొంతమంది యాత్రీకులు అమరావతీ నదిలో పుణ్యస్నానం చేస్తారు. తరువాత అక్కడ ఉన్న శివపార్వతులను, గణేశుడుని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు.
జమ్మూ నుండి రహదారి మార్గంలో శ్రీనగర్ చేరుకొని అక్కడి నుండి సోనామార్గ్ ద్వారా “బాల్ తల్” చేరుకొని అక్కడి నుండి అమరనాథ్ చేరుకోవచ్చు. బాల్ తల్ నుండి 14 కి.మీ., కొండ మార్గం నిటారుగా ఉంటుంది. కనుక శరీరదారుఢ్యం ఉన్నవారిని మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు. బాల్ తల్ నుండి యాత్రీకుల ప్రయాణానికి పోనిస్ లేక డోలీ (పల్లకీలు) లభిస్తాయి. అమరనాథ్ చేరుకోవడానికి ఇది దగ్గరి మార్గము. జూలై నెలలో జరిగే ఈ పర్యటన కోసం అనేకవేలమంది భక్తులు ముందుగానే తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటారు.

No comments:
Post a Comment