సంప్రదాయం వెనకదాగున్న సైన్స్
ఆడవారు గాజులు ధరించడం వెనుక:-
పురాతన కాలంలో కేవలం మగవారే బయటికి వెళ్లి శారీరక శ్రమ చేసేవారు. దీంతో వారు ఆరోగ్యంగా ఉండేవారు. అయితే మహిళలు ఎప్పుడూ ఇంటి పట్టునే ఉండి తక్కువగా శ్రమిస్తారు కాబట్టి వారికి గాజులను ధరింపజేసే వారు. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుందట. అంతే కాకుండా ఆడ వారి శరీరం నుంచి విడుదలయ్యే నెగెటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపజేసే వారట.
కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం:-
హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట. దీంతో వారి రుతు క్రమం సరిగ్గా ఉంటుందట. అయితే వెండి మెట్టెలు ధరిస్తే ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశిస్తుందట.
నుదుటన కుంకుమ బొట్టు ధరించడం:-
నుదుటన కుంకుమ బొట్టును ధరిస్తే అక్కడి నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయట. దీంతో బీపీ, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయట. లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుందట.
ఎదుటి వారికి రెండు చేతులతో నమస్కరించడం:-
ఎదురుగా ఉన్న వారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామట. ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి మన జ్ఞాపకశక్తిని పెంచుతాయట. దీంతోపాటు మెదడు పనితీరు కూడా మెరుగు పడుతుందట.
గోరింటాకు పెట్టుకోవడం:-
చేతులకు, కాళ్లకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల అక్కడ చివర్లో ఉండే నరాలు రిలాక్స్ అవుతాయట. దీంతో శరీరానికి హాయి లభించి చల్లదనం ఇస్తుందట. అంతేకాదు గోరింటాకు పెట్టుకోవడం వల్ల తలనొప్పి, జ్వరం, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గుతాయట.
నేలపై కూర్చుని భోజనం చేయడం:-
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట.
పిల్లలకు చెవులు కుట్టించడం:-
చిన్నారులకు చెవులు కుట్టించడం సహజమే. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మాటకొస్తే కొంత మంది మగ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట.

No comments:
Post a Comment