Tuesday, 12 September 2017

నేతాజీ

దేశం స్వతంత్ర మయ్యే సమయానికి నేతాజీ దేశమ్ లో లేరు.  ఒకప్పుడు గాంధీజి బలపరిచిన రాజగోపాలాచారి ని ఓడించి కాంగ్రెస్ కి జాతీయాధ్యక్షులయిన సుభాష్ చంద్ర బోస్ దేశం విడిచి జర్మనీ సహాయంతో ఆజాద్ హింద్ ఫోజు చలో ఢిల్లి నినాదం  తో సింగపూర్ నుండి సేనలు తరలించి బర్మా, అస్సాం వరకు నడిపి, వాతావరణం బాగు లేక వేను తిరగాల్సి వచ్చింది.  స్వతంత్ర వీర సావర్కర్ ని రత్నపూర్ జిల్లాకే సీమితం చేస్తూ శిక్షలు, ఆజాద్, భగత్ సింగ్, సీతారామ రాజు, కట్ట బ్రహ్మన్న, అనేక హిందూ రాజుల కొట్లాటలు అన్నీ పక్కన పెట్టి బాపూజీ,నెహ్రూల కాంగ్రెస్ ద్వారా మాత్రమె స్వతంత్రం వచ్చిందని విస్తృత ప్రచారం జరిగింది.  ఆనంద సమయాన్ని నెహ్రు ప్రధాని కావడానికి వాడుకున్నాడు.  1857 నుండి 1947 వరకు సాగిన యుద్ధం లో లక్షలాది మంది ప్రాణాలు పోయాయి.  కాని అహింసా, సత్యాగ్రహమే సాధనాలు అని ప్రచారం చేయబడ్డాయి. బర్మా జైలు లో తిలక్ కారాగారవాసం, సావర్కర్ కఠిన కారాగార శిక్ష , వాసుదేవ్ బల్వంత్ ఫడ్ గే బలిదానం, చంపేకార్ సోదరులు, అస్ఫాకుల్లాఖాన్ అందరూ తెర వెనక్కి.

స్వతంత్ర భారత జాతి 1947 లొనే ప్రారంభం అన్నట్లుగా జాతికి ఒక పిత, జాతికి ఒక చాచ పుట్టుకొచ్చారు.  కొత్త భారత జాతి అని ప్రచారం.  కుటుంబం పొలం పంచుకున్నట్లుగా దేశాన్ని ఇంగ్లిష్ వాడు విడగొట్టిన  జాతులు పంచుకున్నాయి. సంఘం ప్రశ్నించినందున సంఘం కాంగ్రెస్ కి, తద్వారా దేశం మొత్తని శత్రువు అని ప్రచారం.

మనం చెప్పిందే  చరిత్ర, మనం పాటించేదే సంస్కృతి, మనమే ఈ కొత్త జాతి ప్రారంభకులం గా వ్యవహరించే నెహ్రు కి పటేల్ బాధపడ్డా నెహ్రూను వ్యతిరేకించలేదు. సమయానికి మహాత్ముడి హత్య ను సంఘం పై రుద్ది సంఘాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి  నిషేధం విధించాడు.  సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణాన్ని కూడా నెహ్రు వ్యతిరేకించాడు.  పటేల్ పక్కన పెట్టి పూర్తి చేసాడు.  మెల్ల మెల్లగ హిందుత్వం అంటే మతతత్వమ్ అని ప్రచారం చేయబడింది. ఇప్పటికీ కాంగ్రెస్, కమ్యూనిస్టుల, సోషలిస్టుల,మిగతా కాంగ్రెస్ నుండి వచ్చిన పార్టీల ప్రచారం అదే.  కారణం గాంధీ గారిని చంపినా వాడు హిందువు.  ఎప్పుడో ఒక సారి సంఘానికి వెళ్లాడనే సోడ్లు చూపి సంఘాన్ని నిషేధం చేయడం అన్యాయమని ప్రజలు గొణుక్కున్నారు.  కాని వీధిన పది అడిగిన వాడు లేడు.

దేశంలో ఒకే పార్టీ కాంగ్రెస్.  అక్కడక్కడా కమ్యూనిస్టులు.  నిషేధం కాంగెస్ ప్రభుత్వం చేసింది.  కమ్యూనిస్టులు జాతీయ వాద సంస్థ అయిన సంఘానికి వ్యతిరేకులు.  పార్లమెంటులో అన్యాయం ప్రతిఘటించే వారు లేరు.

స్వచ్చంద సంస్థ పై అబద్ధపు ప్రచారాలు చేశారు.  గాంధీ హత్య తరువాత సంఘం మిఠాయి పంచుకుండనీ, సంఘం చాలా ప్రణాళిక తో గాంధీని హత్య చేశారని, ఇదొక మత తత్వ సంస్థ అని రకరకాలుగా ప్రచారం చేశారు. సంఘ స్వయంసేవకుల ఇళ్ల పై దాడులు, వీధుల్లో హేళన స్వయంసేవకులు గురూజీ మాట కొరకై శాంతి వహించారు.

పళ్ళు మనవే నాలుక మనదే.  పళ్ళు నాలుకను కరిచాయని పళ్ళు రాలగొడతామా? అని ప్రశ్నించారంటే వారి జాతీయతా హృదయం స్వయంసేవకులకు అర్థం అయ్యింది.  స్వాతంత్రం వచ్చి 6 నెలలు కాక ముందే ఈ ఆశనిపాతం.

కోర్టు లో వ్యాజ్యం నడిచింది.  గాంధీ హత్యకు, సంఘానికి సంబంధం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది.  నిషేధం తొలగింపబడలేదు.
ఇక ఆందోళనే శరణ్యం అని జైలు నుండే గురూజీ పిలుపునిచ్చారు.  శాఖలు ప్రారంభం చేయండి.  అరెస్టు చేస్తే జైలుకు వెళ్ళండి.

నిస్వార్థంగా సమాజం కై నిరంతరం పని చేసే కార్యకర్తా గణం  గురూజీ పిలుపు నందుకొని, కదిలింది.  వేల మంది అరెస్టు అయ్యారు.   సత్యాగ్రహాలు జరుగుతున్నాయి.  గురూజీ స్నేహితులి మద్రాస్ కి చెందినా శ్రీ వెంకటరామ శాస్త్రి నడుం కట్టారు.  పటేల్ కి గురూజీ కి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు.  నిషేధం కొనసాగించడానికి భారత ప్రభుత్వం వద్ద ఏ సరియైన  కారణం లేదు. ముఖం దాచుకోవడానికి, సంఘానికి రాజ్యాగం లిఖిత పూర్వకంగా లేదని అది వ్రాసిస్తే నిషేధం తలగిస్తామని చెప్పారు.

ఆ వ్రాత పతిని బయట ఉండే మన కార్యకర్తలు తయారు చేశారు.  గురూజీ దాన్ని చదువకుండానే సంతకం చేశారు.  తప్పులు ఉంటె చూడండి అన్నారు, మన కార్యకర్త.  మనమెవ్వరం వేరుగా ఆలోచించం అందరం డాక్టర్జీ ఆలోచనల తోనే పని చేస్తున్న సహచరులం అన్నారు గురూజీ.   కార్యకర్తల్లో  పరస్పరం ఎంత నమ్మకం ఉండాలున్నది  సంఘానె చూసి నేర్చు కోవాలి.

సంఘం పై నిషేధం ఎత్తివేయబడింది.  గురూజీ జైలు నుండి బయటకు వచ్చారు. స్వయసంసేవకుల ఆనందానికి అంతులేదు.  దేశమంతా విజయోత్సవాలు జరిగాయి.  గురూజీ దేశం అంతా పర్యటించారు.  నెహ్రు సభలకు పోటెత్తినట్లుగా గురూజీ సభలకు కుటుంబాలతో వచ్చారని బి బి సీ  ప్రకటన చేసింది.

ధర్మం విజయం సాధించింది. ప్రజా బాహుళ్యం లో సంఘానుకూల వాతావరణం గురూజీ పర్యటనలు సాధించాయి.

No comments:

Post a Comment