Tuesday, 12 September 2017

గోవు

గోవు మాంసం తింటే తప్పేంటి?తల్లేనా అత్తకాదా లాంటి చెత్తవాగుడు వాగే వెదవల్లారా!మీరు ఈనాడు స్వాతంత్ర్య స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే దాని కారణం మా తల్లి గోమాత పెట్టిన భిక్షే...అది మీకు తెలుసా??
ఇప్పటి మీ ఈ భావజాలానికి ఊపిరైన ఇంగ్లీషువాడి గుండెలో మోదటి బుల్లెట్ దించటానికి కారణం గోవధ ...అది మీకు తెలుసా..అంతటి పూర్వీకుల వారసులై ఉండి..స్వదర్మ రక్షనకై వారు చేసిన త్యాగాలను మరచి దేశ స్వాతంత్ర్య పోరాటానికి మూలకారణాన్ని మరచి నిస్సిగ్గుగా విమర్శిస్తూ వెటకారాలు చేస్తూ మానసికరోగివై బతుకీడుస్తున్నారని మీకు అనిపించటం లేదా?
..మంగల్ పాండే ...వేయి వీరుల సమతూకం అతడు..మోదటి అడుగు..అది ఎప్పుడూ ఓంటరే
..ఇది చరత్ర
తెలీకుంటే చదవండి

బ్రిటిష్ వారిని ఎదిరించిన మొట్ట మొదటి సిపాయి, మొనగాడు మన మంగళ్ పాండే

గాంధీజీ లేకుండా స్వాతంత్ర్య సంగ్రామం లేనట్లే... పాండే లేకుండా ఆ సంగ్రామానికి ఉప్పు, ఊపిరి రెండూ లేవన్న వాస్తవాన్ని గ్రహించగలమా ? ఇది వాస్తవం
 
కోల్కతా దగ్గర బారక్ పూర్ వద్ద మార్చి 29, 1857, మద్యాహ్నం, ల్యూటినెంట్ బాగ్ వద్ద, బ్రిటిష్ అధికారిని కాల్చి చంపాడు. కారణం బ్రిటిషు వారు సిపాయిలకు తుపాకులకు ఆవు కొవ్వు పూసిన తయారు చేసిన తూటాలు (cartridges) ఇచ్చేవారు. ఆ తూటాలని నోటితో కొరికి తొక్క తొలిగిస్తేనే పేలుతాయి. హిందువులకు ఇవి నచ్చలేదు. ఇదే మొదటి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి పోరాటానికి నాంది పలికిన రోజుగా చెప్పుకోవచ్చు.

మంగళ్ పాండే ఈస్ట్ ఇండియా కంపెనీ లో  34వ బెంగాల్ రెజిమెంట్ యందు ఒక సిపాయి గా పని చేసారు.  సిపాయిల తిరుగుబాటు ప్రధాన కారణం సరళి 1853 లో enfield rifle భుజాన వేసుకోని వెళ్ళే తుపాకిఉండేది. ఒక కొత్త rifle లోడ్ చేయడానికి, సైనికులు గుళిక కొరుకి మరియు రైఫిల్ యొక్క లోపలకి తుపాకీమందు పోసుకోవడం వల్ల పనిచేస్తుంది. ఈ గుళికలు పంది క్రోవ్వు తోgrease చేయబడ్డాయి.  అని పుకారు ఉంది. పంది క్రోవ్వు ముస్లింలు అపరిశుభ్రమైనదిగా  చెప్పబడుతుంది. హిందువులు పవిత్రముగా భావించే ఆవు మాంసము కొవ్వు మరియు పంది కొవ్వు ఈ బుల్లెట్స్ల లో ఉపయోగిస్తారు. బ్రిటిష్ సైన్యంలో భారతీయులు 96% గా మరియు కాబట్టి హిందువులు మరియు ముస్లింలు రెండు ఈ గుళికలును అంగీకరించలేదు.

ఇక్కడ ఎక్కువ  హిందూమతం మతవిశ్వాసంగల కలవాడు మంగళ్ పాండే, ఈయన జీవితం చరిత్ర గురించి తెలుసుకుంటే మరింత బాగుంటుంది. బ్రిటీష్వారు ఉద్దేశపూర్వకంగా భారతీయుల మనోభావాలు బాధించింపదలచి ఈ ప్రయోగం చేసారు. పాండే కు కోపం అత్యంత స్తాయికి చేరటానికి మూల కారణం ఇదే.

1857 నుంచి 2014 వరకు ఈ 157 ఏళ్లలో ఒక్కనాడూ పాండేకు భరతజాతి ఘనంగా నివాళులు అర్పించలేదు.

పాండే అంటే  వందలు, వేలుగా ఎక్కుపెట్టిన సిపాయిలందరి తుపాకుల శక్తి. కంకాళాలు, కపాలాలు, విరిగిన కాళ్లూ చేతులు, పగిలిన పుర్రెలు... ఎప్పటికీ ఇవి మాత్రమేనా పాండే ! స్మారక చిహ్నాలు? జాతిపితలా గాంధీని గౌరవించినట్లు, తొలి తిరుగుబాటు వీరుడిగా పాండేని మనం గుర్తించలేమా?  గాంధీజీ లేకుండా స్వాతంత్య్ర సంగ్రామం లేనట్లే... పాండే లేకుండా ఆ సంగ్రామానికి ఉప్పు, ఊపిరి రెండూ లేవన్న వాస్తవాన్ని గ్రహించలేమా?

బ్రిటిష్ వారిపై యుద్ధాన్ని ప్రకటించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు#మంగళ్_పాండే. అప్పటి వరకూ బ్రిటిష్ వారి పెత్తనానికి తలవొగ్గి వాళ్ళు చేస్తున్న అరాచకాలు, అవమానాలు మౌనంగా భరించిన భారతీయుల ఆలోచనలను స్వేచ్ఛా స్వాతంత్ర్యాల సాధన వైపు మళ్లించిన ఘనత మంగళ్ పాండేదే..! మనకు కులాలలొ ఉన్న ఐక్యత దేశం కొసం లేకపొవడంతొ మంగల్ పాండే తిరుగుబాటు విఫలమయింది, ఆయనను 1857 ఏప్రిల్ 8న ఉరి తీసి చంపారు.ఈ రొజు మంగల్ పాండే జయంతి సంధర్భంగా స్మరించుకుందాం..

No comments:

Post a Comment