Tuesday, 12 September 2017

సుష్మా స్వరాజ్

సెక్యులరిజం పేరుతో" హిందూమతోన్మాదం"అనే కల్పిత పదాన్ని స్రుష్టించి విషం కక్కే రాజకీయాలపై
పార్లమెంట్ లో సుష్మా స్వరాజ్ గారి ఓ ప్రచండ సమాధానం..
ఇలాంటి నాయకత్వం ధీరులు కదా మనకి కావలసింది.
హిందీ వచ్చిన యెడల తప్పక వినండి. లేదా నా తర్జుమా చదవండి.

అవును మేము మతోన్మాదులం. అవును. అవును మేము మతోన్మాదులమే. ఎందుకంటే......
మేము వందేమాతరం పాడతాం, దేశమంతా పాడాలని పట్టుబడతాం.........
మేము రాష్ట్రీయ ధ్వజానికోసం, ధ్వజం యొక్క భవిత కాపాడటం కోసం పోరాడతాం.
370 తీసివేసి దేశమంతా ఒకే చట్టం ఉండాలని కోరుకుంటున్నాం.......

అవును మేము మతోన్మాదులం. అవును. అవును మేము మతోన్మాదులమే. ఎందుకంటే......

దేశమంతటా, కులరాహిత, వర్గ రహిత సమాజ నిర్మాణం కోసం, సమ సమాజ నిర్మాణం ఏర్పాటు చేయడానికి పాటుబడుతున్నాం........
దేశ నాగరికుల సమానత్వం తోడ్పాటుకు శ్రమిస్తున్నాం.....
కాశ్మీర్ శరణార్ధుల మనోవ్యధ మేమొక్కరమే అర్ధం చేసుకున్నాం.....

కాబట్టి మేము మతోన్మాదులం అయిపోయాం.

మీరు చూస్తున్న అటువైపు పక్షపు భాగమంతా మాయ, ఒక కల ఒక సెక్యూలర్ అనే ముసుగేసుకున్న తోడేళ్ళ మంద.

ఢిల్లీ రోడ్లల్లో 1984 లో 3,000 సిక్కుల ప్రాణాలను అవలీలగా తీసేసిన ఈ కాంగ్రెస్ వాళ్లు సెక్యూలర్లే.

ముస్లిం, యాదవ్ అని పంచుకుని క్షుద్ర రాజకీయం చేసిన ఈ జనతా దళ్ వాళ్ళు సెక్యూలర్లే.

తమ ఓటు బాంకుల తృప్తీకరణ కోసం అమాయకులైన రామభక్తులపై గుళ్ళ వర్షం కురిపించి హత్య చేసిన ఈ సమాజ్ వాదీ పార్టీ వాళ్ళు సెక్యూలర్లే.

అమాయక చక్మా శరణార్ధులని తన్ని తరిమేసి అక్రమంగా మన దేశంలో తిష్ట వేయాలని చూసే బంగ్లాదేశ్ శరణార్ధులకు ఆశ్రయమివ్వాలని గుండెలు బాదుకునే ఈ వామపక్ష ఎర్రినాయాళ్ళు సెక్యూలర్లే.

నిజమేమిటంటే....అధ్యక్షా....
మేము హిందువులం అని చెప్పుకోవడానికి సిగ్గుపడము భయంతో వణికిపోము కాబట్టి....
కాబట్టే మేము మతోన్మాదులం.....
మేము హిందువులమని గర్వాంగా తలెత్తుకు చెప్పుకుంటాం
కాబట్టే మేము కమ్యూనల్ మతోన్మాదులం.....

ఈ దేశంలో ఏ రోజువరకూ మీరు హిందువులం అని గర్వాంగా చెప్పుకోడానికి సిగ్గుపడుతూ లజ్జతో కొంకర్లు తిరుగుతూ ఉంటారో....
అప్పటి వరకూ ఈ మేతావులు అనబడే నపుంసకులతో మీరు "సెక్యూలర్లు" అనే సర్టిఫికెట్ మీకు లభించదు.

అధ్యక్షా....

సెక్యూలరిజం అనే పదానికి మేము చెప్పే అసలైన అర్ధం ఇది.

ఒక హిందూ మంచి హిందువుగా,
ఒక కిరాస్తానీ మంచి కిరాస్తానీగా,
ఒక ముస్లిం మంచి ముస్లిం గా,
ఒక సిక్కు మంచి సిక్కుగా ఉంటూ,
అందరూ మంచితనంతో మెసలుతూ, పరధర్మ అనుసరణని ఆదరిస్తూ సమాజ శ్రేయస్సుకై పాటుబడాలి.

ఇదీ సెక్యూలరిజం కి మేము చెప్పే అర్ధం. కానీ,  వీళ్ళ సెక్యూలరిజం హిందువులను కుళ్ళబొడుస్తూ తిట్లతో మొదలెట్టే శాపనార్ధాలతో మొదలవుతుంది.
ఇక మీరు గానీ ఈ శాపనార్ధాల మందల్లో భాగస్వాములై హిందువులను ఏకబిగిన తిట్టే వారిలో జేరకపోతే మీరు సెక్యూలర్లు కారు, కాబోరు, కాలేరు.

నేను ఒక్క విషయం కుండబద్దలుగొట్టి చెప్పదలచుకున్నాను. మాకు అధికారం దక్కినా దక్కక పోయినా మాకేం పర్లేదు. మా నిర్ణయం మా పరిభాష (అర్ధం) మారదు.

No comments:

Post a Comment